
సెలవు 🙏🧘 ✨
@all_r_passing_clouds_haha
✨ఓం నమఃశివాయ 🙏
ఓం నమో వెంకటేశాయ 🙏
జై శ్రీరామ్🙏✨
#🐂జల్లికట్టు🔥 #🐕జంతు ప్రపంచం #✨సంక్రాంతి స్టేటస్🌾 #🌞సంక్రాంతి శుభాకాంక్షలు🪁
🌹శ్రీ చక్ర విజ్ఞానం 🌹 (1 భాగం)
శ్రీ చక్రం - నిర్మాణము, ఆవరణలు, అధిదేవతలు.
సాధారనంగా శ్రీ చక్రం అంటే అమ్మవారి స్వరూపం అని అందరికి తెలుసు నవర్ణావ పూజ చేస్తారు అని తెలుసు, అయితే ఈ ఆవరణ నిర్మాణ పద్దతులు అందులోని దేవతలు అర్చన విధానాలు గురించి చాల మందికి అవగాహన ఉండదు.. తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నా వివరంగా తెలిపే వారు తక్కువ మంది ఉన్నారు చెప్పే వాళ్ళు ఉన్నా నేర్చుకునే సమయం ఈ రోజుల్లో అందరికి లేదు..మనిషి ఆయువు కాలం కలియగంలో తక్కువ కనుక ఉన్న సమయంలోనే అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక పయనం కొనసాగించాలి అలా మనము శ్రీ చక్ర నిర్మాణ ము , అందులో శక్తి రూపాలు , ఆవరణలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము..
శ్రీ చక్ర నిర్మాణం, అందులోని ఆవరణలు, అధిదేవతలు గురించి తెలియటమే కాక అందులోని కేంద్ర బిందుమండల స్థానంలో తేజోమయ రూపంలో విరాజిల్లే అమ్మవారిని ఉపాసిస్తారు. ఇప్పుడు మనవంటి వారికోసం, శ్రీ చక్రం గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
"బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్ర నాగదళ షోడశ పత్రయుక్తం
వృత్త త్రయంచ ధరణీ సదన త్రయంచ శ్రీ చక్ర రాజ ఉదితః పరదేవతాయాః"
గోపురము వలే కనబడు శ్రీ చక్రము చూడటానికి పైనుండి క్రిందకు క్రమముగా;
1. బిందువు
2. త్రికోణము
3. వసుకోణం
4. అంతర్దశారము
5. బహిర్దశారం
6. చతుర్దశారం
7. అష్టదళపద్మం
8. షోడశదళపద్మం, దాని చుట్టూ మూడు వృత్త రేఖలు
9. మూడు రేఖలతో ధరణీ సదనం (భూపురం)
బిందువు వద్ద పరదేవత అయిన శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారు ఆశీనురాలై ఉంటుంది.
నవావరణములు:
శ్రీ చక్రం లో తొమ్మిది ఆవరణలు ఉంటాయి. వాటినే నవావరణలు అంటారు.
బయటనుండి కేంద్రం వైపు పోయే వరసలో వాటి పేర్లు ఈవిధంగా వుంటాయి.
1. ధరణీ సదనం లేదా భూపురం
2. పదహారు దళ పద్మం
3. నాగ(అష్ట) దళ పద్మం
4. చతుర్దశారం
5. బహిర్దశారం
6. అంతర్దశారము
7. వసుకోణం
8. త్రికోణము
9. బిందువు
(సశేషం).
🌹శ్రీ మాత్రే నమః🌹
🌹శ్రీ చక్రం విజ్ఞానం🌹 (2 వ భాగం)
🌹మొదటి ఆవరణం - ధరణీ సదనం (భూపురం)🌹
శ్రీ చక్రానికి వెలుపల నాలుగు వైపులా గోడలాగా ఉండే దాన్ని భూపురం అంటారు. అది ఈ క్రింది విధం గా ఉంటుంది:
ఈ ప్రధమ ఆవరణలో అణిమాది దేవతలు 28 మంది ఉంటారు. వీరందరూ మందార పువ్వు రంగు గల దేహచ్చాయ తో ఉంటారు. ఒక్కొక్కరికి నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో చింతామణి, కపాలం, త్రిశూలం, అంజనం లేదా కాటుక ఆయుధాలుగా ధరించి వుంటారు. ఆ 28 దేవతల పేర్లు క్రింద ఇవ్వబడ్డాయి:
అష్ట సిద్దులు:
1. అణిమా
2. మహిమా
3. గరిమ
4. లఘిమా
5. ప్రాప్తి
6. ప్రాకామ్య
7. ఈశిత్వ
8. వశిత్వ
9. ఇచ్ఛా
10. సర్వకామ
సప్త మాతృకలు:
11. బ్రాహ్మి
12. మాహేశ్వరి
13. కౌమారి
14. వైష్ణవి,
15. వారాహి
16. మహేన్ద్రి
17. చాముండా
18. మహాలక్ష్మి
19. సర్వసంక్షోభిని
20. సర్వ విద్రావిణీ
21. సర్వాకర్షణీ
22. సర్వవశంకరీ
23. సర్వోన్మాదినీ
24. సర్వ మహంకుశా
25. సర్వ ఖేచరీ
26. సర్వ బీజా
27. సర్వ యోని
28. సర్వ త్రిఖండా
శ్రీ విద్య ఉపాసకుడు సాధించే మొదటి మెట్టు ప్రధమ ఆవరణ. ఈ ఆవరణలో అష్ట సిద్ధులు, సప్త మాతృకలు, మరి ఎన్నో ఇతర శక్తులు ఉన్నాయి. ఈ ఆవరణ సాధించినవారికి వీరి అనుగ్రహం కలుగుతుంది. (సశేషం)
🌹శ్రీ మాత్రే నమః🌹
🌹శ్రీ చక్ర విజ్ఞానం🌹(3 వ భాగం)
🌹రెండవ ఆవరణ - షోడశ దళ పద్మం 🌹
ఇది 16 దళాల పద్మాకారం లో ఉంటుంది. ఈ క్రింది పటం లో చూడవచ్చు.
ఈ ఆవరణలో 16 మంది గుప్త దేవతలు పైన చూపిన సంఖ్యల క్రమంలో ఉంటారు. ఒకొక్కరికి నాలుగు చేతులు ఉంటాయి. మూడు నేత్రాలు ఉంటాయి. చంద్ర వంక ను ధరించి ఉంటారు. ధనుస్సు , బాణం, డాలు, ఖడ్గం ఆయుధాలుగా దరించి ఉంటారు. వారి పేర్లు వరుసగా;
1. కామాకర్షిణీ (మనసు) (Conscious mind)
2. బుద్హ్యాకర్షిణీ (బుద్ధి) (Intellect)
3. అహంకారాకర్షిణీ (అహంకారం) (I or Ego)
(పంచ తన్మాత్రలు) (The 5 Sensory Perceptions of Ears, Skin, Eyes, Tongue, Nose)
4. శబ్దాకర్షిణీ (Hearing)
5. స్పర్శాకర్షిణీ (Touch)
6. రూపాకర్షిణీ (Seeing)
7. రసాకర్షిణీ (Taste)
8. గంధాకర్షిణీ (Smell)
9. చిత్తాకర్షిణీ (Sub-conscious mind)
10. ధైర్యాకర్షిణీ
11. స్మృత్యా కర్షిణీ
12. నామాకర్షిణీ
13. బీజాకర్షిణీ
14. ఆత్మాకర్షిణీ
15. అమృతాకర్షిణీ
16. శరీరాకర్షిణీ
ఈ రెండవ ఆవరణ లోకి ప్రవేశించిన సాధకునకు అమ్మవారి అనుగ్రహం వలన ఈ ఆకర్షణ శక్తుల పట్ల సంయమనం లభిస్తుంది.
ఈ ఉన్నతి ని సాధించి శ్రీ విద్యోపాసకుడు మరింత ముందుకు సాగుతాడు.
🌹శ్రీ చక్ర విజ్ఞానం🌹(4 వ భాగం)
🌹3.తృతీయ ఆవరణం - అష్ట దళ పద్మం🌹
శ్రీ చక్రంలోని మూడవ ఆవరణం 8 దళాల పద్మాకారంలో ఇక్కడ చూపిన విధంగా ఉంటుంది.
ఆ మూడవ ఆవరణలో 8 మంది 'గుప్తతర దేవతలు' ఉంటారు. మందార పువ్వు రంగు దేహకాంతి తో ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. చెరుకు విల్లు, పుష్ప శరం, పుష్ప గుచ్చం, ఉత్పలం ధరించి ఉంటారు. వీరి పేర్లు వరుసగా;
1. అనంగ కుసుమ
2. అనంగ మేఖల
3. అనంగ మదన
4. అనంగ మదనాతుర
5. అనంగ రేఖా
6. అనంగ వేగినీ
7. అనంగాంకుశ
8. అనంగ మాలినీ
సాధకుడు ఈ ఆవరణ ప్రవేశించి మరింత ముందుకు వెళతాడు.
🌹శ్రీచక్ర విజ్ఞానం🌹(5 వ భాగం)
🌹4 -నాలుగవ ఆవరణ - మన్వస్రం🌹
శ్రీ చక్రం లోని నాలుగవ ఆవరణ ఇక్కడ క్రింది పటం లో చూపిన విధంగా 14 కోణాలు కలిగిన ఆకారంతో ఉంటుంది. ఇక్కడ 'సంప్రదాయ యోగినిలు' 14 మంది పటం లో సూచించిన సంఖ్యల క్రమం లో ఉంటారు.
వీరు కాలానల శరీర కాంతి తో ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో వహ్ని చాపం, వహ్ని బాణం, వహ్ని రూప ఖడ్గం, వహ్ని రూప చక్రం ధరించి ఉంటారు. వీరి పేర్లు;
1. సర్వ సంక్షోభిణీ
2. సర్వ విద్రావణీ
3. సర్వ ఆకర్షిణీ
4. సర్వ ఆహ్లాదినీ
5. సర్వ సమ్మోహినీ
6. సర్వ స్తంభినీ
7. సర్వ జ్రుమ్భిణీ
8. సర్వ వశంకరీ
9. సర్వ రంజనీ
10.సర్వోన్మాదినీ
11.సర్వార్ధ సాధినీ
12. సర్వ సంపత్తి పూరిణీ
13. సర్వ మంత్రమయీ
14. సర్వ ద్వంద్వక్షయంకరీ
ఈ ఆవరణలో సాధకుడు ఈ యోగినీ శక్తులను ప్రాప్తించుకుని తన సాధనలో ముందుకు సాగుతాడు. (సశేషం)..
🌹శ్రీ మాత్రే నమః🌹
🌹శ్రీ చక్ర విజ్ఞానం🌹 (6 వ భాగం)
🌹5-ఐదవ ఆవరణ - బహిర్దశారం🌹
ఈ ఆవరణ ఈ క్రింది పటంలో చూపిన విధంగా 10 కోణాలు కలిగిన ఆకారంలో ఉంటుంది:
ఈ ఆవరణలో పది 'శక్తులు' పటంలో చూపిన వరుస క్రమంలో ఉంటారు. స్ఫటిక మణి కాంతి కలిగిన శరీర కాంతి తో ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో వరుసగా పరశువు, పాశము, గద, ఘంటామణి ధరించి ఉంటారు. ఈ పదిమంది శక్తుల పేర్లు ఇవి;
1. సర్వ సిద్ధిప్రద
2. సర్వ సంపత్ప్రద
3. సర్వ ప్రియంకరీ
4. సర్వ మంగళకారిణీ
5. సర్వ కామప్రద
6. సర్వ దుఃఖవిమోచినీ
7. సర్వ మృత్యుప్రశమనీ
8. సర్వ విఘ్ననివారిణీ
9. సర్వాంగ సుందరీ
10.సర్వ సౌభాగ్యదాయినీ
సాధకుడు ఈ ఆవరణలో ఈ శక్తులను ప్రాప్తించుకుని, సాధనలో ముందుకు సాగుతాడు. (సశేషం)
🌹శ్రీ మాత్రే నమః🌹
🌹శ్రీచక్ర విజ్ఞానం🌹 (7 వ భాగం)
🌹6 -ఆరవ ఆవరణ - అంతర్దశారం🌹
శ్రీ చక్రం ఆరవ ఆవరణ ఈ క్రింది పటంలో చూపిన విధంగా 10 కోణాలు కలిగిన ఆకారం లో ఉంటుంది.
ఈ ఆవరణలో 10 మంది 'నిగర్భ యోగినులు' ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. నాలుగు చేతులలోనూ వజ్రము, శక్తి, తామరం, చక్రం ధరించి ఉంటారు. వీరి పేర్లు;
1. సర్వజ్ఞా
2. సర్వ శక్తి
3. సర్వ ఐశ్వర్య ప్రద
4. సర్వ జ్ఞానమయీ
5. సర్వ వ్యాధి వినాశిని
6. సర్వాధార స్వరూపా
7. సర్వపాపహరా
8. సర్వానందమయీ
9. సర్వ రక్షాస్వరూపిణీ
10. సర్వేప్సితార్ధప్రదా
సాధకుడు ఈ ఆవరణలో ఈ యోగ శక్తులను ప్రాప్తిన్చుకుని సాధనలో ముందుకు సాగుతాడు. (సశేషం)
🌹శ్రీ మాత్రే నమః🌹
🌹శ్రీచక్ర విజ్ఞానం🌹 (8 వ భాగం)
🌹7-సప్తమావరణం - వసుకోణం🌹
శ్రీ చక్రం లో ఏడవ ఆవరణ ఈ క్రింది పటంలో చూపిన విధంగా 8 కోణాలు కలిగిన ఆకారం లో ఉంటుంది.
ఈ ఆవరణలో ఎనిమిదిమంది 'వాగ్దేవతలు' ఉంటారు. వీరు రక్తాశోక కాంతి గల శరీర కాంతిలో ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో బాణం, విల్లు, వీణ, పుస్తకం ధరించి ఉంటారు. వీరి పేర్లు;
1. వశినీ
2. కామేశ్వరీ
3. మోదినీ
4. విమలా
5. అరుణా
6. జయినీ
7. సర్వేశ్వరీ
8. కౌళినీ
వాగ్దేవతల అనుగ్రహాన్ని సాధించి సాధకుడు ముందుకు వెళతాడు. (సశేషం)
🌹శ్రీ మాత్రే నమః🌹
🌹శ్రీచక్ర విజ్ఞానం🌹 (9 వ భాగం)
🌹8-ఎనిమిదవ ఆవరణ : త్రికోణం🌹
శ్రీ చక్రం లో ఎనిమిదవ ఆవరణ మూడు కోణాలు కలిగిన త్రిభుజాకారం లో ఉంటుంది.
ఈ ఆవరణలో ముగ్గురు 'అతి రహస్య శక్తులు' పటం లో చూపించిన వరుస క్రమంలో ఉంటారు. వీరికి ఒకొక్కరికీ ఎనిమిది చేతులు ఉంటాయి. వాటిలో వరుసగా, బాణం, చాపం, పాన పాత్ర, మాతులుంగ , ఖడ్గం, డాలు, నాగపాశం, ఘంటాయుధం ధరించి వుంటారు. వీరి పేర్లు;
❇️కామేశ్వరీ
⚜️భగమాలినీ
🔯వజ్రేశ్వరీ
సాధకుని తరువాత గమ్యం బిందు మండలం . (సశేషం)
🌹శ్రీ మాత్రే నమః🌹
🌹శ్రీచక్ర విజ్ఞానం🌹 10 వ భాగం
🌹9-నవమ ఆవరణం - బిందు మండలం🌹
ఇది శ్రీ చక్ర కేంద్రం వద్ద బిందు పరిమాణంలో ఉంటుంది. ఈ ఆవరణలో పదహారు నిత్యా దేవతలు ఉంటారు. వీరందరూ లలితాదేవి తో సమానమైన తేజస్సు, పరాక్రమం తో ఉంటారు. వీళ్ళందరూ కాల రూపులు, విశ్వమంతా వ్యాపించి వుంటారు.
🔱నిత్యాదేవతల పేర్లు..🔱
1. కామేశ్వరీ
2. భగమాలినీ
3. నిత్యక్లిన్నా
4. భేరుండా
5. వహ్నివాసినీ
6. మహావజ్రేశ్వరీ
7. శివదూతీ
8. త్వరితా
9. కులసుందరీ
10. నిత్యా
11. నీలపతాకా
12. విజయా
13. సర్వమంగాళా
14. జ్వాలామాలినీ
15. చిత్రా
16. మహా నిత్యా
బిందు మండలం చేరిన సాధకుడు అమ్మవారి సన్నిధి చేరినట్లే..
🌹శ్రీ మాత అనుగ్రహ ప్రాప్తిరస్తు శుభమస్తు🌹
🌹శ్రీ మాత్రే నమః🌹
ప్రతి నామ వివరణ లో ఎదో ఒక సాధన రహ్యాన్ని మీకు అందిస్తూనే ఉన్నాను అది అర్తం చేసుకుంటే మీకు ధ్యానం లో సాధన అమ్మవారి ఉపాసన చాలా సులభంగా అర్థం అవుతుంది, ఎక్కువగా నిన్న ఇచ్చిన వివరాలు చదివి స్పందించిన వారిలో కొన్ని సంవత్సరాలుగా శ్రీ చక్రానికి నవర్ణావ పూజ చేస్తున్న వాళ్ళు కానీ నిన్న అన్ని అవరణలలో ఆహుతులు ఇస్తున్న దేవతా స్వరూపం మాకు అనుభూతి కలుగుతుంది అని సంతోషం గా చెప్పుకుంటున్నారు..నిన్న ఇచ్చిన శ్రీ చక్ర వివరణ కన్నా రోజూ ఇస్తున్న నామ వివరణలో ఇంకా ఎన్నో సాధన రహస్యాలు ఉన్నాయి అది అర్థం చేసుకుంటే లలితాసహస్త్ర నామం చదివే టప్పుడే ఆ శక్తి ప్రకంపనలు #🔱శక్తీ సాధన🙏 #🙏ఓం నమః శివాయ🙏ૐ మీలో మీకు తెలుస్తుంది సహస్త్రరం పూర్తి ఐఏ సమయానికి మీ చుట్టూ శ్రీచక్రం ఏర్పడటం గమనించ గలుగుతారు, లలిత చదవటం అంటే ఆ స్థితికి రావాలి..
#💔PAIN OF TRUE LOVE #💔 బ్రేకప్ ఫీలింగ్స్ #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #😢Sad Feelings💔
#👆🏻మై ఫస్ట్ పోస్ట్💥 #😢Sad Feelings💔 #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #💔 బ్రేకప్ ఫీలింగ్స్ #💔PAIN OF TRUE LOVE






