🙏🙏Praise the Lord 🙏🙏
ఎలాంటి రోజుల్లో మనం ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనలను విడచిపెట్టని దేవుడు మన దేవుడు. ఆమెన్..!!🙌🏻🙌🏻
సహాయంకొరకు ఎదురుచూస్తూ ఏమిచేయాలో, ఎవరిని అడగాలో తెలియని దిక్కుతోచని, దీన పరిస్థితుల్లో ఉంటూ ఉండొచ్చు..🤷🏻♂️🤷🏻♂️, మనవారే మనలను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండవచ్చు. జీవితమంతా వేదనతోనే ఉండవచ్చు, ఎంతోమంది ఎన్నో వేదనలు, కష్టములు, నిందలు, హింసలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు ఉండవచ్చు..🤷🏻♂️🤷🏻♂️
ఒక్క విషయం మనము గుర్తుపెట్టుకోవాలి నేస్తమా..🧏🏻
మనము దీన దశలో ఉన్నప్పటికీ ఆయన మనలను విడచిపెట్టక మనలను నడిపించాడు./ నడిపిస్తున్నాడు/ నడిపిస్తాడు. హల్లెలూయా.
కీర్తనలు(Psalms):136:23
అవును.✅
ఎన్నో కష్ట పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు, వేదనలు, అయినప్పటికీ దేవుడు మనలను నడిపిస్తూనే వచ్చాడు. ఇకముందుకు నడిపించగలడు. ఆమెన్..!
♂️ ఎందరో గొప్పవారు, పేరుగాంచిన వారు, ధనమున్న వారు నేడు కనిపించి రేపటి దినమున కళ్ళముందే మాయమైపోతుంటే, సమాధుల్లోకి వెళ్లిపోతుంటుంటే....🧏🏻
సమాధిలోనికి పోకుండా ఆయన మన ప్రాణమును విమోచించియున్నాడు. ఆమెన్. హల్లెలూయా.
కీర్తనలు(Psalms):103:4
మనచుట్టూ ఉన్నవారే, నిన్న చూచినవారే నేటికి కనబడని స్థితిలో ఉన్నారు, కుటుంబాలకు ఎంతో వేదన మిగిల్చి వెళ్లిపోతున్నారు.
ఒక్క విషయం మనము ఒకసారి ఆలోచించగలిగితే...🧏🏻🧏🏻
మనం ఇలా ఉండడానికి కారణం మన భక్తి, శక్తి కాదు.. కానీ...🧏🏻
దేవుని వాక్యము ఈలాగు సెలవిస్తుంది.📖📖
మనము నమ్మదిగినవారముగా లేకపోయినప్పటికీ ఆయన మనయెడల నమ్మదగినవాడుగా ఉన్నాడు.
2తిమోతి(2 Timothy):2:13
నిజమే...✅✅
చాలా విషయాల్లో మనము తప్పిపోతూ జీవిస్తూ ఉంటాము, దేవునికి పలుమార్లు కోపము పుట్టించినవారివలె ప్రవర్తించి జీవిస్తూ ఉంటాము. అయినప్పటికీ మనం ఈ దినమున ఇలా ఉన్నాం అంటే కేవలం దేవుని కృప మాత్రమే. హల్లెలూయా..🙌🏻🙌🏻🙌🏻
ఒక్కసారి ఆలోచించు..🙏🏻
ఇంతగా నీపట్ల శ్రద్ధచూపి, నీ యెడల ఆయన చేసిన మేలులనుబట్టి ఆయనను ఆరాధించగలవా?🤔🤔
తప్పక ఆరాధించాలి.🙏🏻
దేవుని వాక్యం ఈలాగు సెలవిస్తుంది..📖📖
ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి,నిష్కపటులై పూర్ణహృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము.
1Samuel(మొదటి సమూయేలు):12:24
ఒక్కటి గుర్తుపెట్టుకో..🧏🏻🙏🏻
మనలను ఎవరు మరచినా, ఎవరు విడచినా..🤷🏻♂️🤷🏻♂️
దేవుడు మనలను మరచిపోలేదు, విడచిపోలేదు.
ఇదే గొప్ప మేలు.ఆమెన్.🙌🏻🙌🏻
కాబట్టి... ఆ గొప్ప దేవునిని ఆరాధించడానికి సిద్ధంగా ఉన్న నీవు నేను ఆయన చేసిన మేలులను తలంచుకుంటూ ప్రభువును ఘనపరచుదాం, స్తుతించుదాం, ఆరాధించుదాం.
అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్..!! ఆమెన్..!!
God Bless you. #✝జీసస్ #✝యేసయ్య ఆదరణ📿 #📕బైబిల్ వాక్యాలు #యేసయ్య దీవెనలు #🔱దేవుళ్ళు