*TGHC: తెలంగాణ జిల్లా కోర్టుల్లో 859 ఉద్యోగాలు*
తెలంగాణ జిల్లా కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 859 ఉద్యోగాల భర్తీకి టీజీహెచ్‌సీ (TGHC) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు 2026 జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
*పోస్టు పేరు - ఖాళీలు*
1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3: 35
2. జూనియర్ అసిస్టెంట్: 159
3. టైపిస్ట్: 42
4. ఫీల్డ్ అసిస్టెంట్: 61
5. ఎగ్జామినర్: 49
6. కాపిస్ట్: 63
7. రికార్డ్ అసిస్టెంట్: 36
8. ప్రాసెస్ సర్వర్: 95
9. ఆఫీస్ సబార్డినేట్: 319
మొత్తం ఖాళీల సంఖ్య - 859
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 7వ తరగతి, ఇంటర్, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
*వయోపరిమితి:* 18 నుంచి 46 ఏళ్లు.
*జీతం:* నెలకు స్టెనోగ్రాఫర్‌కు రూ.32,810 - రూ.96,890, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్‌కు రూ.24,280 - రూ.72,850, ఎగ్జామినర్, కాపిస్ట్, ప్రాసెస్ సర్వర్‌కు రూ.22,900 - రూ.69,150, రికార్డ్ అసిస్టెంట్‌కు రూ. 22,240 - రూ.67,300, ఆఫీస్ సబార్డినేట్‌కు రూ.19,000 - రూ.58,850.
*దరఖాస్తు ప్రక్రియ:* ఆన్‌లైన్ ఆధారంగా.
*దరఖాస్తు ఫీజు:* జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.400.
*దరఖాస్తు ప్రారంభ తేదీ:* 2026 జనవరి 24.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 13.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష(సీబీటీ), స్కిల్ టెస్ట్ ఆధారంగా. #✌️నేటి నా స్టేటస్