@baghavanchicken
@baghavanchicken

H. పరమేశ్వర రావు (H.PARAMESWARA RAO)

ఐ లవ్ షేర్ చాట్

#🌹 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి 💐 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పుణ్యతిథి సందర్భంగా నివాళి అర్పిస్తూ...🙏🌼🌹🌺🌸🌷💐 (1875, అక్టోబరు 31 - 1950 డిసెంబరు 15) ★ భారత స్వాతంత్ర్య పొరాటంలో కీలక పాత్ర పోషించారు, స్వాతంత్ర్యం తర్వాత మరింత కీలకమయ్యారు. ★ తొలి హోంశాఖ మంత్రిగా, తొలి ఉప ప్రధానిగా దేశం మొత్తం పర్యటించి ఎన్నో సంస్థనాలని భారత్లో విలీనమయ్యేట్టు చేశారు. ★ రాజ్యాంగంలో ప్రాధమిక హక్కుల కమీటీ ఛైర్మన్ గా వ్యవహరించారు. ★ స్వంత పార్టీనీ ప్రధానిని కూడా కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో తీవ్రంగా వ్యతిరేకించారు. ★ దేశ ప్రయోజనాలకోసం అస్సలు వెనక్కు తగ్గేవారు కాదు, భారత దేశ ఉక్కుమనిషిగా పెరుగాంచారు. ★ భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించింది.
#

🌹 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి 💐

🌹 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి 💐 - Credits : Sainadh Reddy Leaders for tomorrow భారతమాత సేవలో నేమ సత్యాన్ని తప్ప మరొకటి చెప్పలేను . ఎవరినో సంతృప్తి పరచటంకోసం నావిధి నిర్వహణకు వెన్ను చూపలేము . - సర్దార్ వల్లభాయి పటేల్ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యతిథి . 1 . పరమేశ్వర రావు kPataneouvata Rao - ShareChat
95 వీక్షించారు
15 గంటల క్రితం
#☕అంతర్జాతీయ టీ దినోత్సవం తేనీరు (ఆంగ్లం Tea) ఒక పానీయం. తేయాకును నీటిలో మరిగించి వచ్చిన ద్రావకాన్ని తేనీరు(టీ) అంటారు. మానవ దేహానికి ఉత్తేజాన్ని కల్గించే ఆహార పదార్ధాలలో టీ ప్రథమ స్థానంలో ఉంటుంది. దీనిలో పంచదార, పాలు కలుపుకొని త్రాగుతారు. #InternationalTeaDay ☕#TeaDay 🥃 4వ శతాబ్దంలో ఒక చైనా వైద్యుడు ఆకులను త్రుంచి, ఎండబెట్టి, ఒక ప్రత్యేక ఉష్ణోగ్రతకు వేడి చేసి, వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు డికాక్షను వైద్య పరీక్షకు త్రాగాడు. ఈ టీ డికాక్షను త్రాగినందువల్ల ఇతడు ఉత్తేజాన్ని పొందాడు. టీ సేవన ద్వారా మొట్టమొదటగా ఉత్సాహాన్నీ, ఆనందాన్నీ పొందిన వ్యక్తి ఇతనే. 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచంలో టీ త్రాగడం ప్రారంభమయ్యింది. 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వినిమయ పద్ధతిలో బట్టలు, వెండికి మరియు అనధికారికంగా నల్లమందుకు బదులుగా టీని చైనా నుండి దిగుమతి చేసుకునేది. చాలాకాలం తర్వాత 1823 లో బ్రిటన్‌కు చెందిన బ్రూస్ సోదరులు అస్సాంలో దేశీయంగా తేయాకును కనిపెట్టినప్పుడు భారతదేశంలో టీ ఉత్పాదన ప్రారంభమయ్యింది. విస్తారంగా టీ వృద్ధి చెందే ప్రాంతాలను వీరు కనుగొన్నారు. ఇవి సింగ్‌ఫో జాతులు తోటల పెంపకంలో మిగిలినవై ఉండవచ్చు. ఈ కొండ ప్రదేశాలలో జనులు టీ ఆకులతో చేసిన నాటు సారాను త్రాగుతూ ఉండేవారు. మొట్టమొదట 1838 లో దిబ్రుఘర్ నుంచి 8 పెట్టెలు ఎగుమతి చేయబడ్డాయి. ఈ బ్లాక్ టీ సౌచోంగ్ మరియు పీకో అని రెండు గ్రేడులుగా చాలా ప్రసిద్ధి పొందింది. చైనాతో 1833 లో ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్య వ్యాపార సంబంధాలు చెడిపోయినప్పుడు, ఇంగ్లాండు భారతదేశంలో టీ ఉత్పాదనకు తీవ్ర మైన ప్రయత్నాలు ప్రారంభించింది. 1860 నాటికి భారతదేశంలో టీ ప్లాంటేషన్ తోటలు బాగా అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడే టీ ఉత్పాదన సుమారు పది లక్షల కేజీలు ఉండేది. చైనా నుండి బ్లాక్ మరియు గ్రీన్ టీ రకాల విత్తనాలను లార్డ్ మెకార్డెనీ తెప్పించి, భారతదేశంలో 1793 లో కలకత్తా బొటానికల్ గార్డెన్స్‌లో ప్రవేశపెట్టాడు. ఇవి పశ్చిమ బెంగాల్, కచార్ మరియు నీలగిరి ప్రదేశాలలో నాటబడ్డాయి. నేడు భారతదేశంలో సగానికి సగం టీ మొక్కలు ఆ తోటల పెంపకానికి చెందినవే. ఆ తరువాత అనతికాలంలో 1860 కి చైనా టీ ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వృద్ధిపొందింది. నేడు అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ప్రాంతాలు భారతదేశంలో టీని అధికంగా ఉత్పాదించే రాష్ట్రాలుగా ప్రసిద్ధిపొందాయి. ఇవి మొత్తం సుమారు 98 శాతం టీని ఉత్పాదిస్తున్నాయి. భారతదేశపు టీ ఉత్పాదక ప్రదేశాలలో త్రిపుర, కర్ణాటక, మణిపూర్, సిక్కిం, మరియు అరుణాచలప్రదేశ్ ముఖ్య పాత్రను వహిస్తున్నాయి. నీలగిరి కొండలలో భారతదేశపు ఉత్తమ రకం టీ ఉత్పాదించబడుతుంది. సతతహరితపు మొక్క అయిన టీకి వర్షపాతం అధికంగా ఉండాలి. అప్పుడే అది పుష్కలంగా, సమృద్ధిగా పెరుగుతుంది. దిగుబడి అధికంగా ఉంటుంది. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండే ప్రదేశాలలో పెరిగే టీ ఉత్తమమైనది. కానీ మైదానాలలో పెరిగే టీ వల్ల అధిక ఫలసాయం వస్తుంది. చైనా మరియు జపాన్‌లలో టీ త్రాగడం విస్తారమైన తంతుతో కూడిన ఒక గొప్ప ఉత్సవం (Tea Ceremony)గా పరిణమించింది. అక్కడ టీ డికాక్షను కాచి పంచదార, పాలు కలపకుండా త్రాగుతారు. ఒక్కొక్కప్పుడు నిమ్మరసం, పంచదార కలిపి త్రాగుతారు. అమెరికాలో సామాన్యంగా టీలో ఐస్ వేసి, పంచదారతో త్రాగుతారు. భారతదేశం మరియు బ్రిటన్‌లలో పాలు, పంచదార కలిపి త్రాగుతారు. టిబెటియన్‌లు గ్రీన్ టీని ఉప్పు మరియు యాక్ వెన్నతో కొయ్య కప్పులలో త్రాగుతారు. ఆఫ్రికాలో డికాక్షనును చిలికి నురగగా తయారు చేసి త్రాగుతారు. పశ్చిమ ఆసియాలో టీని యాలకులతో కలిపిన డికాక్షన్‌తో త్రాగితే, భారతదేశంలో గుజరాతీలు మసాలా టీ త్రాగుతారు. బ్లాక్ లేక గ్రీన్ టీని ఏలకులు, కొట్టిన బాదంపప్పు కలిపి కహ్వా అని కాశ్మీరీలు త్రాగుతారు. ఇది చాల పుష్టికరమైన, రుచికరమైన పానీయం. దాదాపు ప్రతి దేశంలోనూ టీ వినియోగంలో ఉన్నా భారతదేశం ఉత్పాదించే టీ వైవిధ్యానికీ, విశిష్టతకూ ప్రసిద్ధి పొందింది. పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ టీ మిక్కిలి నాణ్యమైనది. ఇది సువాసనభరితమైనది. ముఖ్యంగా ఇక్కడి మంచుతో కూడిన హిమాలయ పర్వత వాతావరణ పరిస్థితుల వల్ల మరియు ఈ ప్రదేశంలో భూసార రచనా విధానం వల్ల ఇక్కడ ఉత్పత్తి కాబడే టీకి ప్రత్యేక రుచి, సువాసన సిద్ధిస్తుంది. భారతదేశంలో తేయాకు సాగు ప్రాతిపదికగా అనేక మందికి జీవనోపాధి కలుగుతోంది. ఈ రంగంలో సుమారు 20 లక్షల మంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ శ్రామికులు ఉన్నారు. వీరిలో 50 శాతం స్త్రీలు. నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే వరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. నిస్సత్తువగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ త్రాగడానికి అత్యంత ఉత్సాహాన్ని చూపడం జీవితంలో ఓ అంతర్భాగమైపోయింది. సగటు భారతీయుల్లో దాదాపు సగం మందికిపైగా టీ సేవిస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితం మానసిక విశ్రాంతి కోసం కాఫీ సేవించడం అలవాటుగా ఉండేది. ఇళ్ళలో కూడా కాఫీ మాత్రమే వాడుకలో ఉండేది. ఫిల్టర్ కాఫీ బాగా వాడుకలో ఉన్న రోజుల్లో ఇన్‌స్టంట్ కాఫీలు రావడం, వాటితోపాటు పలు రకాల టీ పౌడర్లు మార్కెట్‌లోకి విడుదల కావడం, టీకి జనసామాన్యంలో అధిక వినియోగం ఏర్పడడం, పైగా అది సామాన్య మానవుడికి అందుబాటు ధరలలో లభించడం టీకి మరింత ప్రాధాన్యత పెరగడానికి దోహదపడింది.
#

☕అంతర్జాతీయ టీ దినోత్సవం

☕అంతర్జాతీయ టీ దినోత్సవం - TEA DAY అంతర్జాతీయ తేనీరు ( టీ ) దినోత్సవం H . పరమేశ్వర రావు H . PARAMESWARA RAO - ShareChat
125 వీక్షించారు
15 గంటల క్రితం
#💡 జాతీయ శక్తి సంరక్షణ దినం 🌳 🌀జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం , (National Energy Conservation Day) (డిసెంబర్‌ 14) సందర్బం గా 🌀 🌀ఇంధనాన్ని పొదుపు చేయమని చాటి చెప్పడానికే డిసెంబర్‌ 14వ తేదీని జాతీయ ఇంధన పొదుపు దినోత్సవంగా గుర్తించి, ఇంధన పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎనర్జీ కన్‌సర్వేషన్‌ అంశంపై వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. 🌀2001వ సంవత్సరంలో భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంధన పొదుపు చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని అనుసరించి ఎనర్జీ మ్యానేజర్లు, ఆడిటర్లను ఎవరో ఒకర్ని నియమించకూడదు. ఎనర్జీ మేనేజ్‌మెంట్‌, ప్రోజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్సింగ్‌, ఇంప్లిమెంటేషన్లలో నిపుణులైనవారిని, క్వాలిఫైడ్‌ ప్రొఫెషనల్స్‌ను ఆయా ఉద్యోగాలకు నియమించాలి. ఇలా చేయడంవల్ల ఇంధనం దుబారా కాదు, సంస్థలూ నష్టపోవు. 🌀ఇంతకీ ఇంధన పొదుపు అంటే వీలైనంత తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తూ యథావిధిగా పని కొనసాగేలా చూడటమే! ఎక్కడా ఇంధనం వృథా కాకుండా జాగ్రత్తపడాలి. సమర్థతను బట్టి తక్కువ ఇంధనంతో పని పూర్తి చేయొచ్చని ఎందరో రుజువు చేసి చూపుతున్నారు. 🌀ఎక్కువమందితో తక్కువ పని రాబట్టడం కంటే తక్కువమందితో ఎక్కువ పని రాబట్టడం ఉత్తమ పద్ధతి. పది వేల చొప్పున జీతం చెల్లిస్తూ పదిమందిని తీసుకోవడం కంటే రెట్టింపు జీతంతో ఇద్దరు పనిమంతులను నియమించుకోవడం తెలివైన పని. అవసరమైనచోట మ్యాన్‌పవర్‌ ముఖ్యమే. చేతినిండా పని లేకపోతే మొత్తం వాతావరణమే కాలుష్యం అవుతుంది. 🌀సరే, అసలు విషయానికొస్తే, ఫాక్టరీల్లో వీలైనంతగా ఇంధనాన్ని పొదుపుచేస్తూ, ఉత్పాదన పెంచుకునేందుకు ప్రయత్నించాలి. అనేక సంస్థలు నష్టాల్లో ఉన్నాయంటే, ఏకంగా మూత పడ్తున్నాయంటే ఇంధన దుర్వినియోగం, ఎక్కువైన సిబ్బం దే ప్రధాన కారణం. ఖర్చు విష యంలో సరైన ప్రణాళిక లేకపో వడం, ఇంధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టడం అనేది పెద్ద డ్రాబ్యాక్‌. ఒక్క ఫాక్టరీలనే కాదు, మనచుట్టూ ఎందరో పెట్రోల్‌ వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తుంటారు. 🌀ముఖ్యంగా ప్రభు త్వ రంగ సంస్థల్లో ఈ దుబారా మరీ ఎక్కువ. ప్రభుత్వ కార్యాలయాల్లో వందమంది చేసే పనిని ప్రైవేట్‌ ఆఫీసుల్లో పదిమంది ఇట్టే పూర్తిచేస్తారంటే అతిశయోక్తి కాదు. ఇది ఇంధనానికీ వర్తిస్తుంది. దూర ప్రయాణం వెళ్ళే ఆర్టీసీ బస్సులు కొన్నిసార్లు సగం సీట్లు కూడా నిండకుండానే ప్రయాణిస్తుం టాయి. 🌀ఎంత డీజిల్‌ దండగ? పావుగంట, పది నిమిషాలు, అర్ధగంట సమయం తేడాతో బస్సులు వెళ్తుంటాయి కదా! బస్సు నిండని పక్షంలో ఇటువారిని అటు సర్దితే ఎంత ఇంధనం సేవ్‌ అవుతుంది?! ఎటూ ట్రాఫిక్‌ జామ్‌ లేదా సాంకేతిక కారణాలతో ఎన్నోసార్లు బస్సులు రెండు మూడు గంటలు ఆలస్యంగానే వెళ్తాయి. అలాంటప్పుడు ఈపాటి ఎడ్జస్ట్‌మెంట్‌ అంత కష్టమైన విషయమా? ఇక నిత్యం రోడ్లమీద బస్సులు, ఇతర వాహనాలు సిగ్నల్‌ పాయింట్ల వద్ద, ఇతరత్రా ఆగినప్పుడు కూడా ఇంజన్‌ ఆఫ్‌ చేయకపోవడం చూస్తుంటాం 🌀దానివల్ల ఎంత డీజిల్‌ లేదా పెట్రోల్‌ దండగ? పైగా అదనపు పొల్యూషన్‌. ఇళ్ళల్లోనూ ఎంతో గ్యాస్‌ వేస్టవుతుంటుంది. మనం గదిలో లేకున్నా ఫాన్లు, లైట్లు, ఏసీ ఆన్‌లో వుంటుంది. 🌀ఇంధనం వృథా అవడానికి మరో ముఖ్య కారణం చవకబారు యంత్రాలు, నైపుణ్యం లేని ఉద్యోగులు. కొంత ఖరీదు ఎక్కువైనప్పటికీ మంచి మెషినరీ అమర్చుకోవడంవల్ల తక్కువ ఇంధనంతో పని పూర్తవుతుంది. 🌀అలాగే స్కిల్స్‌ లేని ఉద్యోగులవల్ల లేదా పనిధ్యాస లేనివారి కారణంగా అనేకసార్లు ఇంధనం వ్యర్థమౌతుంది. 🌀కనుక తాడు చాల్లేదని నుయ్యి పూడ్చుకున్న చందంగా తక్కువ ఖర్చుతో పనైపోతుంది కదాని కక్కుర్తి పడినట్లయితే ఆనక తడిసి మోపెడు ఖర్చవుతుంది. 🌀ఇంధనాలు అమూల్యమైనవి. ఆ వనరులను కాపాడుకోవడం మన బాధ్యత. వృథా చేసినందువల్ల అటు డబ్బు దండగ, ఇటు ఇంధనానికే షార్టేజ్‌ వచ్చే ప్రమాదం. ఈ రెండింటిని మించిన మరో జటిల సమస్య పొంచి వుంది. అదే వాతావరణ కాలుష్యం. 🌀ఇంధనాలను అతిగా ఖర్చుపెట్టడంవల్ల మొక్కలు, జంతువులు, ఇతర సహజ వనరులన్నీ దెబ్బతింటాయి. చెట్లు, జంతువులే లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. 🌀నదీనదాలు ఎండిపోవడం, ఓజోన్‌ పొరకు మరింత చిల్లులు పడటం లాంటి అనర్థాలతో కష్టాల ఊబిలో కూరుకుపోయి నట్లవుతుంది మన పని. వాతావరణ కాలుష్యం అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, మితిమీరిన ఎండలు లాంటి ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ కారణమౌతుంది. కనుక, ఎలా చూసినా ఇంధనాన్ని పొదుపు చేయడం మన కనీస కర్తవ్యం. 🌀1991 డిసెంబర్‌ 14న జాతీయ ఇంధన పొదుపు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంధనం పొదుపు చేయడంలో చాతుర్యం చూపిన సంస్థలను ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేశారు. 🌀అప్పట్నుంచీ ఏటా పుర స్కారాలు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్‌ పవర్‌ తరపున జాతీయ గుర్తిం పును ఇవ్వాలనే ఉద్దేశంతో ఇండస్ట్రియల్‌ యూనిట్లకు, హోటళ్ళకు, ఆసుపత్రి భవనాలకు, కార్యాలయాలకు, షాపింగ్‌ మాల్‌ బిల్డింగులకు, జోనల్‌ రైల్వే, రాష్ట్ర సంబంధ ఏజెన్సీలు, మున్సిపాలిటీలు, థర్మల్‌ పవర్‌ స్టేషన్లు - ఇలా కుటీర పరిశ్రమలతో సహా అనేక సంస్థలకు అవార్డులు ఇస్తున్నారు. 🌀ఆయా ఆర్గనైజేషన్లు తమ లాభం పొందుతూనే, సమాజానికి సేవలు అందిస్తూనే, ఇంధనాన్ని ఎంత వరకూ పొదుపు చేస్తున్నాయి, వాతారణాన్ని ఎలా సంరక్షిస్తున్నాయి అనే అంశాలను దృష్టిలో వుంచుకుని బహుమతులను నిర్ణయిస్తారు. 🌀ఈ ప్రత్యేక దినాన ఇంధనాన్ని పొదుపు చేయడానికి మనమూ సంసిద్దమౌదాం ☘Save fuel...☘ ☘save Nature ...☘
#

💡 జాతీయ శక్తి సంరక్షణ దినం 🌳

💡 జాతీయ శక్తి సంరక్షణ దినం 🌳 - ఇంధన పరిరక్షణ దినోత్సవం DDD DDD ENERGY CONSERVATION DAY The National Energy Conservation Day is being celebrated every year on December 14 since 1991 . The Bureau of Energy Efficiency ( BEE ) , under Ministry of Power spearheads the celebra tions every year . The objective to celebrate the National Energy Conservation Day is to drive mass awareness about the importance of energy efficiency and conservation H . co Busso dºs Pahanel Ghanae - ShareChat
114 వీక్షించారు
1 రోజుల క్రితం
#🐒 మంకీ (కోతుల) దినోత్సవం🐵 కోతులు (ఆంగ్లం Monkeys) ఒక పరిణతి చెందిన జంతువులు. ఇవి చేష్టలలో మానవులను పోలి ఉంటాయి. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం ప్రకారం, మానవులు కోతులనుండి రూపాంతరము చెందారని అంటారు. వీటి పేరున ఆంధ్రదేశంలో కోతికొమ్మచ్చి అనే ఆట ఉంది.#MonkeyDay 🐒 సినిమా లలో కోతులను ఉపయోగించుట చాలా సర్వసాధారణం, వాటికి శిక్షణనిచ్చి సినిమాలకు కావలసిన విధంగా నటింప చేయటం జరుగుతుంది. మిగిలిన భాషలతో పోల్చి చూస్తే భారతీయ సినిమాలో కోతుల పాత్ర అధికం. భారతీయ సినిమాలలో కోతులను దైవ రూపాలుగా నాయకి, నాయకులకు ఆపద సమయంలో సహాయం చేసే వాటిగా ఇప్పటికీ వాడుతున్నారు. ప్రతి సర్కసులో ఇవి చేసే విన్యాసాలు అనేకం. పిల్లలకు వినోదం ఇవ్వడంలో ఇవే ముందుంటాయి. దేవాలయాలలో భారతీయ హిందూ దేవాలయాలలో అధికంగా పెంచు జంతువులు ఇవే. ఏ క్షేత్రమునందైనా ఇవి యాత్రికులకు ముందుగా స్వాగతం చెపుతాయి. తినేందుకు ఎవరయినా ఏదైనా ఇస్తే ఇచ్చినవి తీసుకొంటాయి, ఇవ్వనివి లాక్కుంటాయి. కొన్ని క్షేత్రాలలో వీటిని దేవాలయ యాజమాన్యం పోషిస్తుంటాయి. హిందూ ఇతిహాసమైన రామాయణంలో కోతి రూపం కలిగిన వానరులు, రామ రావణ యుద్ధంగా రామునికి సహాయంగా పోరాడి విజయం చేకూరుస్తారు. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే ఆంజనేయుడు వానర రూపంలోనే వర్ణించబడ్డాడు. ప్రయోగాలలో కోతులు కోతుల శరీరములోని అవయువ నిర్మాణము మానవశరీరమునకు దగ్గరగా ఉండుట వలన ప్రయోగశాలల్లో వ్యాధి సంబంధ పరీక్షలను మొదట కోతులపై చేస్తుంటారు. వాటిపై విజయవంతము అయిన తరువాత మనుషులపై ప్రయోగిస్తారు.
#

🐒 మంకీ (కోతుల) దినోత్సవం🐵

🐒 మంకీ (కోతుల) దినోత్సవం🐵 - Monkey Day కోతుల ( వానర ) దినోత్సవం ( IVATI Speak K . పరమేశ్వర రావు NoEvil SEE NO EVIL HEAR NO EVIL HParameswara Rao - ShareChat
107 వీక్షించారు
1 రోజుల క్రితం
#🍦నేషనల్ఐస్ క్రీమ్ డే🍧 ఐస్ క్రీం (ఆంగ్లం: Ice Cream) లేదా హిమగుల్మం అనగా పాలు, ఐసు (మంచు), చక్కెర మొదలైన పదార్థాలతో తయారు చేసిన ఒక నోరూరించే తినుబండారం.#IceCreamDay 🍦🍨🍧❄️ ఐస్ క్రీం ప్రపంచ వ్యాప్తంగా చాలామందికి ఇష్టమైన ఆహారం. ముఖ్యంగా వేసవి కాలంలో ఐస్ క్రీం దుకాణాల వైపు మొగ్గుచూపడం సాధారణంగా జరుగుతుంటుంది. తీవ్రమైన ఎండల ప్రభావం వల్ల కలిగిన అలసటనుండి విముక్తి పొందడానికి జనం ఆశ్రయించే ఈ హిమగుల్మాలు నేడు సర్వకాల సర్వావస్థలయందు మానవుడి ఆహార అంతర్భాగాలలో ఒకటి కావడం విచిత్రమైన పరిణామం. ఇతర వంటలలాగా, ఇతర తినుబండారాలాగా హిమగుల్మం ఒకరి చేత తయారుచేయబడింది కాదు. దీని సృష్టికర్త ప్రత్యేకమైన వంటగాడేమీ కాదు. ఇది తనకు తానుగా ఏర్పడింది. ప్రాచీన కాలంలో రాజులు, జమీందారులు, ధనికులు, ఇతర సంపన్న వర్గాలవారు సాధారణంగా వైన్ లాంటి మత్తు పానీయాలు సేవించేవారు. వైన్ గానీ, సారా గానీ చల్లబడినప్పుడు, ఇతర నాజూకు పదార్ధాలను ఐస్‌తో చల్లబరచినప్పుడు పరిణామాత్మకంగా ఇది ఏర్పడింది. క్రీ.శ. 62లో రోమన్ చక్రవర్తి నీరో తన వైను గదిని చల్లబరుచుకోవడానికి హిమము కోసం తన సేవకులను అపినైన్ పర్వతాలకు పంపించాడు. హిమము కోసం సుదూర ప్రాంతాలకు వ్యయ ప్రయాలకు ఓర్చడం ఆ కాలంలో ఉండేది. హిమము నకు ఆ కాలంలోనే అంత ప్రాధాన్యత ఉండేది. 13వ శతాబ్దంలో దూర ప్రాచ్య దిశ నుండి మర్కోపోలో వచ్చినప్పుడు అనేక అమూల్య వస్తువులతోపాటు ఆనాడు ఆసియాలో బహుళ ప్రచారంలో ఉన్న పాల ఐస్ చేసే విధానాన్ని కూడా తీసుకువచ్చాడు. ఈ రుచికర పదార్థం ఇటలీలో అనతి కాలం లోనే ప్రచారం పొందింది.ఆ దేశంలో భాగ్యవంతులకు జెలాటో భోగ్య వస్తువు అయ్యింది. 14 సంవత్సరాలు వయసుగల కాథరీన్ డి మెడిసి 1533లో రెండవ వివాహం చేసుకుంది. ఆమెకు పెళ్ళి కానుకగా అమూల్యమైన ఇటాలియన్ షర్బత్ తయారీ రహస్యం ఇవ్వబడింది. ఆమె కుమారుడు మూడవ హెన్రీ ఈ ఐస్ షర్బత్తును త్రాగుతుండేవాడు. 1వ చార్లెస్ మొదటిసారి ఐస్ క్రీం తీసుకున్నప్పుడు ఎంతో సంతోషించి ఐస్ క్రీం రహస్యాన్ని ఎవరికీ చెప్పవద్దని వంటవాని వద్ద వాగ్దానం తీసుకుని సంవత్సరానికి 500 పౌండ్లు పెన్షన్ ఇస్తుండేవాడు. 1649లో చార్లెస్ మరణించినప్పుడు అతడి వంటవాడు ఆ ఐస్ క్రీం రహస్యాన్ని డబ్బుకు ఆశపడి వెల్లడి చేశాడు. అమెరికాలో ఈ ఐస్ క్రీం తయారీ రహస్యాన్ని యూరోపియన్ వలసగాళ్ళు ప్రవేశపెట్టారు. 1774 నాటికి యు.యస్.లోని న్యూయార్క్ వార్తాపత్రికలలో ఐస్ క్రీంకి ప్రకటనలు ప్రకటించబడ్డాయి. మంచి రుచులకు మోజుపడే ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్‌టన్ మౌంట్నెర్నాస్‌లో ఎప్పుడూ రెండు ఐస్ క్రీం కుండలను సిద్ధంగా ఉంచుకునేవాడు. ఫిలడెల్ఫియాలోని సిన్సిన్నాటి సొసైటీ మీటింగ్‌కు ఐస్ క్రీంతయారీకి ఐస్ క్రీం మిషన్‌ను కనుగొన్నాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో దక్షిణ పసిఫిక్ నౌకాశాఖకు చెందిన బుర్టన్ బుచ్ బాస్కిన్ తన జీపును అమ్మగా వచ్చిన డబ్బుతో ఒక ఐస్ క్రీం ఫ్రీజర్‌ను కొని మొట్టమొదటిసారి 31 రకాల ఐస్ క్రీములను తయారుచేశాడు. ఇర్విన్ రాబిన్స్ 1945లో ఇతడితో చేరాడు. ఇప్పుడు ప్రపంచమంతటా బాస్కిన్-రాబిన్స్ ఐస్ క్రీం స్టోరులున్నాయి. ప్రపంచంలో మొట్టమొదటిసారి చాక్లెట్, వెనీలా, స్ట్రా బెరీ ఐస్క్రీములు ప్రారంచించినవారు వీరే. ఈనాడు ఐస్ క్రీమును వినియోగించని దేశమే లేదు. ధ్రువ ప్రాంత దేశాల్లో కూడా వీటి వినియోగం ఉన్నదంటే ఈ ఫుడ్ పట్ల మానవుడు ఎంతగా ప్రభావితుడు అయ్యాడో అర్ధం చేసుకోవచ్చు. అమెరికాలో 98 శాతం ప్రజలు ఐస్ క్రీం తింటారు. అలాగే ఆస్ట్రేలియా ప్రపంచ ఐస్ క్రీము ఉత్పత్తిలోనూ మరియు వినియోగంలోనూ ద్వితీయ స్థానంలో ఉంది. పోటీ పెడితే ఐస్ క్రీము వినియోగంలో ప్రతి దేశం పాల్గొంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఐస్ క్రీం🍦🍨 - ఆరోగ్యం🏥 రుచిలో ఇతర ఫాస్ట్ ఫుడ్స్‌తో పోటీ పడుతూ ముందుండడానికే ప్రయత్నించే ఐస్ క్రీము దీన్ని ఇష్టంగా తినేవారికి స్థూలకాయాన్ని కూడా అంతే వేగంగా ప్రసాదిస్తుందనేది జగమెరిగిన సత్యం. దీని మీద ఎంత మోజున్నా ఆరోగ్యంపట్ల జాగ్రత్త అవసరం కాబట్టి దీనికి దూరంగా ఉండడమే శ్రేయస్కరం అంటున్నారు వైద్య రంగ ప్రముఖులు. ముఖ్యంగా అతిగా ఐస్ క్రీములను తీసుకోవడంవలన ఊబకాయంతోపాటు రక్తంలో కొలెస్టెరాల్ కూడా పెరిగే ప్రమాదముండడంతో వైద్యులు దీన్ని నివారించండి అని ప్రచారం చేస్తున్నారు. పెళ్ళి భోజనాలలో తాంబూలాన్ని అందించే రోజులు పోయి ఐస్ క్రీములు అందించే రోజులు వచ్చేయడంతో వీటిని నియంత్రించడం కష్టసాధ్యమే అనిపిస్తుంది.
#

🍦నేషనల్ఐస్ క్రీమ్ డే🍧

🍦నేషనల్ఐస్ క్రీమ్ డే🍧 - ww . shamispasana . com Photographed by Sharmila ICE CREAM DAY ఐస్ ( హిమ ) క్రీమ్ దినోత్సవం Semiya Paal Ice H . పరమేశ్వర రావు H . PARAMESWARA RAO - ShareChat
115 వీక్షించారు
2 రోజుల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..