
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
@deerajreddy
ఐ లవ్ షేర్ చాట్ నా హాబీలు: డాన్స్, రైటింగ్,రీడింగ్
పులివెందుల ముద్దుబిడ్డ వైస్సారు,మా పురిటి గడ్డ మిమల్ని మరువదు సారు! క్యాప్షన్ : పేద,సామాన్య,బడుగు బలహీనవర్గాల పెన్నిధి,రైతుభాంధవుడు దివంగత మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం,డాక్టర్ వైస్సార్ తాను సీఎంగా పనిచేసిన కాలంలో ప్రజల సౌకర్యార్థమై 108 అంబులెన్సు సర్వీస్,మహిళలకు పావలా వడ్డీ రుణాలు,పేద విద్యార్థులు చదువుకునేందుకు ఫీజురీయింబర్స్ మెంట్,రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ,పేద,సామాన్య ప్రజలకు ఏదైనా పెద్ద జబ్బు వచ్చినప్పుడు వారు చికిత్సతీసుకునే నిమితమై ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ప్రవేశపెట్టి వారి హృదయాలలో కొలువై ఉన్న దేవుడిలా నేటికీ వారి చేత కొనియాడబడుతున్నాడు మాట మీద నిలబడే మడమ తిప్పని నేత,ఇచ్చిన హామీకీ,చెప్పిన మాటకు ఆరునూరైనా కట్టుబడే మహానేత,ఓ గొప్ప సుపరిపాలకుడు,నిరుపేదల తలవ్రాతను మార్చిన మేరుగరణధీరుడు ఈ మన దివంగత డాక్టర్ వైస్సార్! జోహార్ వైస్సార్! అమర్ రహే పులివెందుల ముద్దుబిడ్డ డాక్టర్ వైస్సార్!✍️✍️✍️
- మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు! #ysr
దీపావళి పండుగ అంటేనే మన కుటుంబాలలో ఎనలేని కళాకాంతులతో కూడిన సంతోషాలహరివిల్లు ఉప్పొంగిపోతుంటుంది!🧨🧨🧨🏹🏹🏹 #deepavali
ప్రభుత్వం నుంచి తీసుకునే వేలాది రూపాయల వేతనాలు చాలక మామూళ్ళ మత్తులో జోగాడుతున్న కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు!
లేదా
కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు తమ బాధ్యాతాయుతమైన వృత్తికి మచ్చ తెచ్చేలా నానా గడ్డి మేస్తుండటం అత్యంత జూగుస్సకరం,హేయం!
ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు బరి తెగించి ప్రజల నుండి ప్రభుత్వం ద్వారా తీసుకునే వేలాది రూపాయల వేతనాలు చాలక,మరీ కకృతికి, అత్యాశకు పోయి మామూళ్ళ మత్తులో జోగాడుతున్న వైనం ఈ సమాజానికి సంబంధించి అత్యంత సిగ్గుచేటైనా,జుగుస్సకరమైన విషయం.ఓక విధంగా చెప్పాలంటే వీరి వ్యవహారశైలిని చూస్తే అత్యంత బాధ్యాతాయుతమైన,గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతూ కూడా వారి పవిత్ర వృత్తికి మచ్చ తెచ్చేలా,కళంకం వచ్చేలా ఇలా నానా గడ్డి మేస్తుండటం ఏ మేరకు,ఎంతమేరకు సబబో ఒక్కసారి వారి మనస్సాక్షిని ప్రశ్నించుకుంటే బాగుంటుంది.అయితే ఇలాంటి మితిమీరిన లంచగొండ్ల వంటి కొంతమంది ప్రభుత్వ అధికారులు వున్న నేటి సమాజంలో కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ,తమ వృత్తిని దైవప్రదంగా భావిస్తూ,నీతి, నిజాయితీ,నిబద్దతతో నడుచుకునే,మసలుకొనే ప్రభుత్వ ఉద్యోగులకు సైతం కోదువలేదు.ఎందుకంటే తమ వృత్తిని అత్యంత అంకితభావంతో చేస్తూ లంచాలకు తావు లేకుండా కాస్తంత సేవాభావంతో తమ విధిని నిర్వర్తించే అధికారులు సైతం ఈ సమాజంలో మనకు తరచుగా తటస్థపడుతుండటం నిజంగా ఓక మంచి ఆరోగ్యకరమైన పరిణామమే.ఇంకా చెప్పుకుంటూ పోతే అదృష్టవశాత్తు ఆ దేవ దేవుడు ప్రసాదించిన మంచి తెలివితేటల ద్వారా ఓక స్ఫూర్తిదాయకమైన విద్యను అభ్యసించి మరీ ఓక గొప్ప హుందాతనంతో కూడిన ఓక చెప్పుకోదగ్గ, ఆర్థికంగా ఎలాంటి డోకా లేని ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడినప్పటికి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకనో వక్రమార్గాన వెళుతూ అయిన దానికి కానిదానికి ప్రజలను పీడించుకు తింటూ వారి నుంచి బలవంతంగా మామూళ్లు వసూలు చేస్తూ శవాలను ఆరగించే,పీక్కుతినే ఓక రాబందుల లాగా వ్యవహారిస్తుండటం వారి పేరాశకు,విపరీత బుద్ధికి ఓ ప్రబల నిదర్శనం.ఓక విధంగా చెప్పాలంటే ' కంచె చేను మెస్తే ' లాంటి వ్యవహారశైలి వున్న ఇలాంటి నీచ,కాసులకు కకృతి పడే బుద్ది గల కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల మూలాన మొత్తం ప్రభుత్వ వ్యవస్థనే అప్రతిష్టపాలు అయ్యే దురదృష్టకరమైన పరిస్థితి దాపురిస్తుండటం ఎంతైనా మనమంతా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం.
ఏదిఎమైన కొన్ని కొన్ని సందర్భాలలో లంచాలు రుచి మరిగిన కొంతమంది ప్రభుత్వ అధికారులు తాము చేసిన తప్పుల మూలాన చట్టం ముందు దోషిగా నిలబడుతూ జైలు ఊచలు లెక్కబెడుతూ, సస్పెండ్ ల వేటు ఎదుర్కొంటున్నప్పటికి కనీసం అలాంటి గుణపాఠం పొందిన వారిని చూసైనా చాలా మంది ప్రభుత్వ అధికారులకు,ఉద్యోగులకు బుద్ది రావడం లేదు,మంచిగా తమ పనేదో తాము చేసుకుంటూ,న్యాయబద్దంగా తమ విధులను నిర్వర్తించే ప్రభుత్వ ఉద్యోగులు అయిన వారిని తమ కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూస్తూ కళ్ళు వున్న కళ్ళు లేని కాబోదుల్లా వ్యవహారిస్తూ ఏ మాత్రం తమ చెడు,వినాశక పంథాను మార్చుకోకుండా వక్ర మార్గంలోనే వెళ్తున్న ఆ ప్రభుత్వ అధికారులు సత్ బుద్దిని పొందలేకపోతుండటం అనేది నిజంగా వారు చేజేతులారా కొని తెచ్చుకునే కర్మ క్రిందకు వస్తుంది తప్ప మరేమి కాదు.అయితే ఈ రోజుకు కూడా కొంతమంది ప్రభుత్వ అధికారులు,ఉద్యోగులు తమ వృత్తికి నూటికి నూరుపాళ్ళు న్యాయం చేస్తూ,వన్నె తెస్తూ మన భారతదేశ కీర్తిని ఇనుమడింపచేసేలా వ్యవహరించేవారు సైతం లేకపోలేదు.ఏమైనా ఇప్పటికయినా మామూళ్లకు,లంచాలకు పాల్పడుతూ తమ బొక్కసాలు నింపుకునే బొత్తిగా వ్యక్తిత్వం లేని కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల ఆలోచన విధానంలో,తీరు తెన్నులలో కొద్దో గొప్పో మార్పు తీసుకురావాలని మనం ఆశించడంలో తప్పు లేదు.కాబట్టి ఇకనైనా కొంతమంది ప్రభుత్వ అధికారులు తమ వికృత బుద్ధికి స్వస్తి పలికి ఉన్నంతలో తృప్తి పడుతూ,లేనిదాని కోసం అర్రులు చాచే నికృష్ట పంథాకు గుడ్ బై చెబితే యావత్ ఈ దేశ,మన రాష్ట్ర ప్రజానీకం ఎంతో హర్షిస్తారు.అప్పుడు మీ ప్రభుత్వ ఉద్యోగుల,అధికారుల కీర్తి దిశ,దశలా ఇనుమడించడం తథ్యం.మామూళ్లకు అలవాటు పడిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్లో మానవత్వం వికసించాలి!వారు చెడు మార్గాన్ని విడనాడి ఒక మంచి ఆదర్శమైన నడవడికతో ముందుకెళ్లి యావత్ ప్రజల మన్ననలు విశేషంగా పొందాలని మనమంతా మనసా,వాచ,కర్మణ కోరుకుందాం! బొలో భారతమాతాకీ జై! మేరా హిందూస్తాన్ మహాన్!జైహింద్!🇮🇳🇮🇳🇮🇳✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #అవినీతి
ప్రసన్నాంజనేయం అదే నామదేయం!
ప్రతి మంచి కార్యం జరిపించు దైవం!
ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం!
నాలోని దైర్యం శ్రీ ఆంజనేయం!
నావెంటే నువ్వుంటే భయమేలా!
ఓం ఆంజనేయాయ విద్మహే
వాయుపుత్రాయ దీమహి!
తన్నో హనుమాన్ ప్రచోదయాత్!
జై శ్రీరామ్!
సీతారామలక్ష్మణ సహిత
హృదయం కలవాడ
కష్టములు హరించు మంగళమూర్తి
సమస్త సేవలతో నా మది యందుడువు స్వామి!
శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్ర నామతత్తుల్యం
రామనామ వరాననే!
- మా హిందూ భక్తజనతన్మయత్వానికి ఆధ్యాత్మిక జై శ్రీరామ్,జై వీరహనుమా శుభ శనివారం! #శుభ మంగళవారం
ఫైనల్ గా చెబుతున్న నేను చూసే కేసు విషయంలో పిచ్చా క్లారిటీ తో వున్నా ❤️❤️❤️ #nbk
వెలుగురేఖ విరజిమ్మినట్లు, అలలపై కళ కళ మెరిసినట్లు! #✨మ్యాజిక్ జంక్షన్✨
రాజమండ్రి రాగమాంజలి, మా అమ్మ పేరు కలవనోళ్లు ఎవరు లేరు మెషిరి!
క్యాప్షన్ : ప్రస్తుతం ట్రేండింగ్ లో వున్న, యువతను బాగా హుషారేత్తిస్తున్న, మజా చేస్తున్న ఈ పాటకు, నా డాన్స్ హంగామా!🕺🕺🕺🕺🕺🕺🩰🩰🩰💃💃💃💃 #dance
అచ్చ అచ్చ బచ్చా బచ్చా!
క్యాప్షన్ : మెగాస్టార్ చిరంజీవి నటించిన రాక్షసుడు చిత్రం లోని ఈ పసందైనా, ఎవర్ గ్రీన్ పాట కు చెవి కోసుకొని వారెవరు! ఎంతకాలం గడిచిన ఈ పాట శ్రోతాలను ఊర్రుతలుగిస్తున్నే ఉంటుంది!🎻🎸🎻🎻🎻🎤🎤🎶🎶🎶🥁🥁🪈🪇🪕🎵 #✨మ్యాజిక్ జంక్షన్✨
హిందువులకు అత్యంత పవిత్రమైన, చరిత్రాత్మిక ఆధ్యాత్మిక క్షేత్రంగా బాసిల్లుతున్న అయోధ్యలోని శ్రీరామజన్మభూమి దేవాలయంలో బాలరాముని విగ్రహానికి అత్యంత వైభోపేతంగా, అంగ, రంగ వైభవంగా అడుగడుగున, అంచెలంచెల భక్తి భావాన్ని చాటుతూ మన ప్రియతమ ప్రదాని నరేంద్ర మోదీజీ అత్యంత భక్తిశ్రద్దలతో, భగవంతునితో లీనమై పూజలు నిర్వహిస్తున్న సుమధుర దృశ్యం చూడటానికి కళ్ళు చాలవు!🕉️🕉️🕉️🕉️ #శుభ మంగళవారం




