Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
ShareChat
click to see wallet page
@gudapati2430
gudapati2430
Gudapati Naresh [ Amma Chetti Goru mudda ]
@gudapati2430
ఐ లవ్ షేర్ చాట్
#🌺💙💞శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశాయ గోవిందా💞💙🥰🌺 గోవిందా హరి గోవిందా 🥰 #శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవిందా #విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏 #ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా శ్రీ శ్రీనివాస శ్రీనివాస గోవిందా గోవిందా #జై శ్రీకృష్ణ.. జైజై శ్రీకృష్ణ💐 🕉️ 🪔🙏🏻🌺🌿🌼🌿🌺🙏🏻🪔 🕉️ ఓం వాసుదేవం హృషీకేశం వామనం జలశాయినమ్ | జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుడధ్వజమ్ || వారాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకమ్ | అవ్యక్తం శాశ్వతం విష్ణుం అనంతమజమవ్యయమ్ || నారాయణం గదాధ్యక్షం గోవిందం కీర్తిభాజనమ్ | గోవర్ధనోద్ధరం దేవం భూధరం భువనేశ్వరమ్ || వేత్తారం యజ్ఞపురుషం యజ్ఞేశం యజ్ఞవాహకమ్ | చక్రపాణిం గదాపాణిం శంఖపాణిం నరోత్తమమ్ || దామోదరం దయోపేతం కేశవం కేశిసూదనమ్ | వరేణ్యం వరదం విష్ణుం ఆనందం వసుదేవజమ్ || 🙏🏻*ఓం నమో నారాయణాయ నమః*🙏🏻 🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅 🌿 *ఉత్పత్తి ఏకాదశి శుభాకాంక్షలు* 🌿
🌺💙💞శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశాయ గోవిందా💞💙🥰🌺 గోవిందా హరి గోవిందా 🥰 - @ 9 @ 9 - ShareChat
#🌺💙💞శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశాయ గోవిందా💞💙🥰🌺 గోవిందా హరి గోవిందా 🥰 #శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవిందా #ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా శ్రీ శ్రీనివాస శ్రీనివాస గోవిందా గోవిందా #విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏 #కార్తీక మాసం ---------------------------------------- *ఈరోజు ఉత్పన్న ఏకాదశి* ---------------------------------------- *కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఇది పరమ ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిధి.* ------------------------------------- *ఉపవాసములు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి. శ్రీమహావిష్ణువు యొక్క. శక్తి స్వరూపములను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనది.* -------------------------------------- *ముర అనబడే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని నామధేయం చేశాడు. సప్తమాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపములలో ఒకటి. అందువల్ల ఉత్పన్న ఏకాదశి ని ఏకాదశి తిధి యొక్క జయంతిగా భావిస్తారు.* ---------------------------------------- *ఈరోజు ఉపవాసం తప్పనిసరిగా చేయవలెను. ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపములు హరించబడతాయి. ముర అంటే తామసిక , రాజసిక , అరిషడ్వర్గాలకు ప్రతీక. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించిన వారి ఆ మురను జయించి మిగతా 23 ఏకాదశులలో ఉపవాసం చేసిన ఫలితం కలిగి వైకుంఠప్రాప్తి పొందగలరు. వితంతువులు కానీ ఈ రోజు ఉపవాసము ఆచరించిన యెడల ముక్తిని పొందగలరు.* ---------------------------------------- *ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత:* --------------------------------------- *ఉత్పన్న ఏకాదశి యొక్క గొప్పతనాన్ని శ్రీ కృష్ణుడు మరియు యుధిష్ఠిర రాజు మధ్య సంభాషణ రూపంలో 'భవవ్యోత్తర పురాణం'* *వంటి వివిధ హిందూ గ్రంథాలలో వర్ణించారు. 'సంక్రాంతి' వంటి పవిత్ర రోజులలో విరాళాలు ఇవ్వడం లేదా హిందూ తీర్థయాత్రలలో పవిత్ర స్నానం చేయడం వంటివి ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. ఉత్పన్న ఏకాదశి అతని / ఆమె పాపాల నుండి విముక్తి పొందాడని మరియు చివరికి మోక్షాన్ని పొందుతారని భావిస్తారు. మరణం తరువాత 'వైకుంఠం' విష్ణువు నివాసానికి నేరుగా తీసుకువెళతారు. 1000 ఆవులను దాతృత్వంగా దానం చేయడం కంటే ఉత్పన్న ఏకాదశి మహిమ ఇంకా ఎక్కువ అని నమ్ముతారు. ఉత్పన్న ఏకాదశిలో ఉపవాసం హిందూ మతం యొక్క మూడు ప్రధాన దేవతలు బ్రహ్మ , విష్ణు , మరియు మహేశ్వరులకు ఉపవాసానికి సమానం. అందువల్ల హిందూ భక్తులు ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని పూర్తి అంకితభావంతో , ఉత్సాహంగా పాటిస్తారు.* --------------------------------------
🌺💙💞శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశాయ గోవిందా💞💙🥰🌺 గోవిందా హరి గోవిందా 🥰 - சம்o శనివారం 15.11.2025 ో ఉత్పన్నఏకాదని ఏకాదశీదేవత ప్రాదుర్చవించిన రోబు కనుక ఇది ఓత్పన్న ఏకాదశిగా అత్యంత మహిమాన్వితమయింది: ఈ రోజున ఏకాదశి ప్రతపాలన విష్డుప్రీతికరం சம்o శనివారం 15.11.2025 ో ఉత్పన్నఏకాదని ఏకాదశీదేవత ప్రాదుర్చవించిన రోబు కనుక ఇది ఓత్పన్న ఏకాదశిగా అత్యంత మహిమాన్వితమయింది: ఈ రోజున ఏకాదశి ప్రతపాలన విష్డుప్రీతికరం - ShareChat
#శివ. కేశవులు🕉️🔱🔯☸️🕉️ #కార్తీక మాసం #🙏ఓం నమః శివాయ🙏ૐ #🛕శివాలయ దర్శనం #🙏శివపార్వతులు ---------------------------------------- *కార్తీక పురాణం - 25 వ అధ్యాయము* ---------------------------------------- *దూర్వాసుడు అంబరీషుని శపించుట* -------------------------------------- *"అంబరీషా! పూర్వజన్మలో కించిత్ పాపవిశేషమువలన నీకీ యనర్ధము వచ్చినది. నీ బుద్దిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము" అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు "ఓ పండితోత్తములారా! నానిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీనిష్టను విడచుట కన్న, విప్రశాపము అధికమయినది కాదు. జలపానము చేయుట వలన బ్రాహణుని అవమానపరచుటగాదు. ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. గాన, జలపాన మొనరించి వూరకుందును" అని వారి యెదుటనే జలపానము నొనరించెను.* -------------------------------------- *అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై క౦డ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ "ఓరీ మదాంధా! నన్ను భోజనానికి రమ్మని, నేను రాకనే నీవేల భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము? ఎంతటి ధర్మ పరిత్యాగివి? అతిధికి అన్నము పెట్టెదనని ఆశజూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్ష కుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిధిని విడిచి భుజించినావు కాన, నీవు నమ్మకద్రోహివగుదువేగాని హరిభక్తుడవెట్లు కాగలవు? శ్రీ హరి బ్రాహణావమానమును సహింపడు. మమ్మే యవమానించుట యనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరి యొకడులేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపాన మొనరించితివి. అంబరీషా! నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా! నీ వంశము కళంకము కాలేదా?" అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అ౦బరీషుడు, ముని కోపమునకు గడ గడ వణుకుచు, ముకుళిత హస్తములతో "మహానుభావా! నేను ధర్మహీనుడను, నా యజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులూ, దయా దాక్షిణ్యములు గలవారూ కాన, నన్ను కాపాడు" డని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన యెడమకాలితో తన్ని "దోషికీ శాపమీయకుండా వుండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగానూ, మూడవజన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, యైదవజన్మలో వామనుడు గాను, ఆరోవ జన్మలో క్రూరుడవగు బ్రాహణుడవుగాను, యేడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, యెనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగానిలేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్తునిగాను, పదవ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక" అని వెనుక ముందు లాలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా, శ్రీ మహావిష్ణువు బ్రాహణ శాపము వృధాకాకూడదని, తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు - అంబరీషుని హృదయములో ప్రవేశించి "మునివర్యా! అటులనే - మీ శాపమనుభవింతు" నని ప్రాధేయపడెను. కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా, శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దూర్వసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి "బ్రతుకుజీవుడా" యని పరుగిడెను. మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరునీ యెంత ప్రార్దంచినను వారు సైతము చక్రాయుధము బారినుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి.* ---------------------------------------- *ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి పంచవింశోధ్యాయము - ఇరవయ్యయిదో రోజు పారాయణము సమాప్తము.* ----------------------------------------
శివ. కేశవులు🕉️🔱🔯☸️🕉️ - 9)9689 8 @ 9)9689 8 @ - ShareChat
#శివ. కేశవులు🕉️🔱🔯☸️🕉️ #కార్తీక మాసం #🔱🕉️ హర హర మహాదేవ శంభో శంకర 🔱 #విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏 #🙏ఓం నమః శివాయ🙏ૐ --------------------------------------- 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️--------------------------------------- శనివారం,నవంబరు15, 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు 🪔కార్తీక మాసం - బహుళ పక్షం🪔 తిథి: ఏకాదశి* తె4.06వరకు వారం: శనివారం(స్థిరవాసరే) నక్షత్రం: ఉత్తర:రా2.01వరకు యోగం:వైధృతిఉ10.11వరకు కరణం: బవ:మ3.50 వరకు తదుపరి:బాలువతె4.06వరకు వర్జ్యం: ఉ8.28 - 10.08 దుర్ముహూర్తము:ఉ6.08-7.37 అమృతకాలం: సా6.30-8.10 రాహుకాలం: ఉ9.00 - 10.30 యమగండ/కేతుకాలం : *మ1.30 - 3.00* సూర్యరాశి: తుల చంద్రరాశి: కన్య సూర్యోదయం: 6.08 సూర్యాస్తమయం: 5.21 ------------------------------------ 👉 *సర్వఏకాదశి* ------------------------------------ సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు ---------------------------------------- *గోమాతను పూజించండి* *గోమాతను సంరక్షించండి*. ----------------------------------------
శివ. కేశవులు🕉️🔱🔯☸️🕉️ - ShareChat
#🙏🏻కృష్ణుడి భజనలు #🕉️ జై శిరిడి సాయి బాబా కి జై జై జై 🕉️ #విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏 #జై శ్రీకృష్ణ 🚩 #💖జై శ్రీ రాధాకృష్ణ 💖 🕉️ శ్రీ గురుభ్యోనమః🙏 శనివారం, నవంబరు 15, 2025* శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* దక్షిణాయనం - శరదృతువు* కార్తీక మాసం - బహుళ పక్షం* తిథి : *ఏకాదశి* తె4.06 వరకు వారం : *శనివారం* (స్థిరవాసరే) నక్షత్రం : *ఉత్తర* రా2.01 వరకు యోగం : *వైధృతి* ఉ10.11 వరకు కరణం : *బవ* మ3.50 వరకు తదుపరి *బాలువ* తె4.06 వరకు వర్జ్యం : *ఉ8.28 - 10.08* దుర్ముహూర్తము : *ఉ6.08 - 7.37* అమృతకాలం : *సా6.30 - 8.10* రాహుకాలం : *ఉ9.00 - 10.30* యమగండ/కేతుకాలం : *మ1.30 - 3.00* సూర్యరాశి: *తుల* చంద్రరాశి: *కన్య* సూర్యోదయం: *6.08* సూర్యాస్తమయం: 5.21* సర్వఏకాదశి* సర్వేజనా సుఖినోభవంతు - శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏
🙏🏻కృష్ణుడి భజనలు - ShareChat
00:20
#శ్రీ మహా లక్ష్మి దేవి 🙏 #🚩🕉️ శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారు🚩🕉️ #జై జై దుర్గ భవాని అమ్మ #🙏🏻అమ్మ భవాని 🕉️ 🪔🙏🏻🌺🌿🌺🌿🌺🙏🏻🪔 🕉️ నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః | నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ || దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై | ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః || యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా | నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 🙏🏻 *ఓం అపరాజితా దేవ్యై నమః* 🙏🏻 🌅⚛️🌹🪔శుభోదయం🪔🌹⚛️🌅
శ్రీ మహా లక్ష్మి దేవి 🙏 - JOTHI 6955 JOTHI 6955 - ShareChat
#బాలల దినోత్సవ శుభాకాంక్షలు #happy children's day
బాలల దినోత్సవ శుభాకాంక్షలు - దినోత్సేవే ٥٥٥ శుభయిర్షల 0 CA"" Clillvew _ 00 దినోత్సేవే ٥٥٥ శుభయిర్షల 0 CA"" Clillvew _ 00 - ShareChat
#శివ. కేశవులు🕉️🔱🔯☸️🕉️ #కార్తీక మాసం #🛕శివాలయ దర్శనం #🙏ఓం నమః శివాయ🙏ૐ #🔱🕉️ హర హర మహాదేవ శంభో శంకర 🔱 ------------------------------------- *కార్తీక పురాణం - 24 వ అధ్యాయము* -------------------------------------- *అంబరీషుని ద్వాదశి వ్రతము* ------------------------------------ *అత్రి మహాముని మరల అగస్త్యునితో "ఓ కుంభసంభవా ! కార్తీకవ్రత ప్రభావము నెంతివిచారించిననూ , యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరింతును. అలకింపుము.* -------------------------------------- *"గంగా , గోదావరీ మొదలగు నదులలో స్నానము చేసినందువలనను , సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులోనరించినను యెంత ఫలము కలుగునో శ్రీమన్నారయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీకవ్రతమందు శుద్ధద్వాదశినాడు భక్తిశ్రద్దలతో దానధర్మములు చేయువారికిని అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్యఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటె వేయి రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశీ వ్రతముచేయు విధానమెట్లో చెప్పెదను వినుము.* -------------------------------------- *కార్తీక శుద్ధదశమి రోజున , పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును. దీనికొక ఇతిహాసము కాలదు. దానిని కూడా వివరించెదను. సావధానుడవై అలకింపుము"అని ఇట్లు చెప్పుచున్నాడు.* ------------------------------------ *పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమభాగవతోత్తముడు. ద్వాదశీ వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు , ద్వాదశి ఘడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్దముగా నుండెను. అదే సమయమున కచ్చటకు కోపస్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి , ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలయునుగాన , తొందరగా స్నానమున కేగిరమ్మనమని కోరెను. దుర్వాసుడందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలెను. అంబరీషుడు ఎంత సేపు వేచియున్ననూ దుర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను.* *"ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానముకు వెళ్లి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకాతిధ్యమిత్తునని మాటయిచ్చి భోజనం పెట్టక పోవుట మహాపాపము. అది గృహస్తునకు ధర్మము గాదు. అయన వచ్చువరకు ఆగితినా ద్వాదశీ ఘడియలు దాటిపొవును. వ్రతభంగమగును. ఈ ముని మహా కోపస్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమియు తోచకున్నది. బ్రాహ్మణ భోజనమతిక్రమించరాదు. ద్వాదశి ఘడియలు మించిపోకూడదు. ఘడియలు దాటిపోయిన పిదప భుజించినయెడల , హరిభక్తిని వదలిన వాడనగుదను. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్పలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు , భోజనము చేసిన దూర్వాసునకు కోపము వచ్చును. అదియునుగాక , ఈ నియమమును నేను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మయందు జేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చితము లేదు."అని అలోచించి "బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీమహావిష్ణువే పోగట్టగలరు. కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే ఉత్తమము. అయిననూ పెద్దలతో ఆలోచించుట మంచి"దని , సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో యిట్లు చెప్పెను.* ---------------------------------------- *"ఓ పండిత శ్రేష్టులారా ! నిన్నటి దినమున ఏకాదశి యగుటం జేసి నేను కటిక ఉపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా మత్రమే ద్వాదశి ఘడియలున్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజించవలసియున్నది. ఇంతలో నా యింటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. అ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించితిని. అందులకాయన అంగీకరించి నదికి స్నానర్ధమై వెళ్లి ఇంతవరకూ రాకుండెను. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా ? లేక , వ్రతభంగమును సమ్మతించి ముని వెచ్చేవరకు వేచియుండవలెనా ? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిన"దని కోరెను. అంతట ఆ ధర్మజ్ఞులైన పండితులు , ధర్మ శాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసికొని , దీర్ఘముగా అలోచించి "మహా రాజా ! సమస్త ప్రాణి కోటుల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగావించి దేహేంద్రియాలకు శక్తినొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును. అ తపము చల్లార్చవలెనన్న అన్నము , నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగచేయువాడు అగ్నిదేవుడు , దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవునందరు సదాపూజింపవలెను. గృహస్తు , ఇంటికి వచ్చిన అతిధి కడజాతివాడైనాను 'భోజన మిడుదు' నని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదవేదాంగ విద్యావిశారదుడును , మహతపశ్శాలియు , సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన అయుక్షిణము కలుగును. దుర్వాసునంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగను"* *అని విశదపరచిరి.* ---------------------------------------- *ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్యమందలి చతుర్వింశోధ్యాయము - ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము.* ----------------------------------------
శివ. కేశవులు🕉️🔱🔯☸️🕉️ - 9)9689 8 @ 9)9689 8 @ - ShareChat
#జై బాలయ్య బాబు, తగ్గేదే లే #balayya fire
జై బాలయ్య బాబు, తగ్గేదే లే - ShareChat
00:18
#cbn ఒంటరి వాళ్ళం కాదు.. ప్రజా బలం ఉన్నవాళ్ళం - నారా బ్రాహ్మణి | Nara Brahmani | I Am With Babu | #IAmWithBabu #WeWillGiveitBack #PeopleWithNaidu #FalseCasesAgainstNaidu #SelfGoalByJagan #NaraBhuvaneshwari #NaraBrahmani #BrahmaniNandamuri
cbn - ShareChat
00:26