👉 మొట్టమదటి బాబాసాహెబ్ విగ్రహం
మొట్టమొదటి అంబేద్కర్ విగ్రహం, బాబాసాహెబ్ జీవించి ఉన్న సమయానికే, అనగా డిసెంబర్ 07, 1950 లో మహారాష్ట్ర కోల్హాపూర్ లోని బిందు చౌక్ ప్రాంతంలో స్థాపించబడింది.. దీనిని "మాధవ్ రావు భగల్" అనే రాజపుత్ క్షత్రియ కులానికి చెందిన సామాజిక కార్యకర్త స్థాపించారు.. కొల్హాపూర్ తాసిల్దార్ కొడుకైన ఈయన మహాత్మా జోతిభా ఫూలే స్థాపించిన "సత్యశోదక్ సమాజ్" సిద్ధాంతాలకు ఆకర్షితుడై, దళిత ఉద్ధరణ పాటుపడ్డారు.. మరియు స్వతంత్ర సంగ్రామంలో కూడా కీలకపాత్ర పోషించారు.. వీరు కొల్హాపూర్ లో బాబాసాహెబ్ మీద భక్తితో, జోతిభా ఫూలే గారితో పాటు బాబాసాహెబ్ విగ్రహాన్ని స్థాపించారు.. 1954 కొల్హాపూర్ పర్యటనలో భాగంగా బాబాసాహెబ్ ఈ విగ్రహాన్ని సందర్శించారు..
మొట్టమొదటి విగ్రహం అయినప్పటికీ,, ఇది ఇప్పుడు కనిపించే విగ్రహాలవంటిది కాదు (పై ఫొటోలో చూడచ్చు).. ఇది కేవలం Bust size విగ్రహం మాత్రమే... #జై భీమ్