✍️యేసుక్రీస్తు 12-30 సం.మధ్య ఎక్కడ ఉన్నాడు?
✝️✝️✝️🛐🛐🛐🕎🕎🕎
🔺 *యేసుక్రీస్తు వారు 12 నుంచి 30 సంవత్సరాల మధ్య కాలంలో ఎక్కడ ఉన్నారు? బైబిల్ గ్రంధంపై బురద చల్లడానికి అనేకమంది యేసుక్రీస్తు వారి చరిత్రను కలంకపరుస్తూ తమకు తోచిన విధముగా ఆయనను గురించి వ్రాసుకోవడం చెప్పుకోవడం మొదలుపెట్టారు.!*
👉 యేసుక్రీస్తు 12 నుంచి 30 సంవత్సరాల మధ్య కాలంలో భారతదేశానికి వచ్చాడని,ఆయన భారతదేశంలో అనేక పుణ్య క్షేత్రాలను దర్శించి హైందవ పెద్దల దగ్గర జ్ఞానమును అభ్యసించి తిరిగి ఇశ్రాయేలు దేశం వచ్చాడని కొందరి వాదన.!
👉 మరికొందరైతే ఆయన బౌద్ధ ఆశ్రమంలో చేరి బుద్దుని బోధనలను నేర్చుకొని తిరిగి ఇశ్రాయేలు దేశం వెళ్ళిపోయాడని మరికొందరి వాదన.!
👉 మరికొంతమందైతే బీహార్ నలంద విశ్వ విద్యాలయంలో 16 సంవత్సరాలు సుమారు విద్యను అభ్యసించి తిరిగి ఇశ్రాయేలు దేశంనకు వెళ్లిపోయాడని కొందరి వాదన.!
👉 ఇలా యేసు ఎడ్ల బండి కట్టుకొని కాశ్మీరు వచ్చాడని, అదే విధంగా బీహారు వచ్చాడని ఇలా రక రకాల వాదనలు ఈ రోజు భారతదేశంలో వినబడుతున్నాయ్.!
👉 ఇంకా ప్రపంచ పరిస్థితిని గూర్చి ఆలోచిస్తే ఆయన ఇంగ్లాండ్ వచ్చాడని కొందరు, జపాన్ వెళ్లాడని మరి కొందరు,ఇలా వాదిస్తూ యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు దేశంలో లేరు అని ఎన్నో రకాలైనటువంటి వారి యొక్క అభిప్రాయాలను,వారి యొక్క ఆలోచనలను, ఈ రోజు యేసుక్రీస్తు వారి పైన రుద్దుతున్నారు.!
🔷 *యేసు ఈ 18 సంవత్సరముల కాలంలో ఎక్కడ ఉన్నారు?* యేసు భారతదేశం వచ్చాడని రష్యా దేశానికి చెందిన Nicolas notovitch అనే చరిత్రకారుడు చెప్పాడు. ఈయన 1858 నుంచి 1916 మధ్య కాలపు వాడు,ఈ పైన చెప్పినటువంటి ఈ కధలన్నిటికీ కూడ ఇతనే మూలం. ఇతను వ్రాసిన the unknown life of Jesus Christ అనే పుస్తకము దీనికి ఒక ఆధారం. ఇతను ఒక జర్నలిస్ట్. అంతే కాకుండ ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించాలని ఒక వెర్రి ఆశతో ఇతను యేసుక్రీస్తుపై బురద చల్లడం ప్రారంభించాడు, ఐతే ఈయన చెప్పిన దానిపై పురావాస్తు గానీ,శాస్త్రీయ ఆధారాలు గానీ, ఎటువంటివి కూడ దొరకలేదు. ఈయన చెప్పినవన్నీ అబద్దాలని అనేకమంది ఆనాడే నిరూపించారు, వారిలో డెగ్లస్ అనే దేవుని సేవకుడు అతనివి అన్నీ కూడ ఆధారాలు లేని అబూతకల్పనలు అని ఆనాడే నిరూపించాడు.!
👉 *యేసుక్రీస్తు 12 నుంచి 30 సంవత్సరాల మధ్య ఇశ్రాయేలు దేశంలోనే ఉన్నాడని మనకు ఎన్నో ఆధారాలు ఉన్నాయ్ వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.!*
🔺 1. యేసుక్రీస్తు వారిని గూర్చి వ్రాయబడినటువంటి సువార్తలలో ఎక్కడ కూడా *యేసుక్రీస్తు వారు భారతదేశం వచ్చాడని వ్రాయబడలేదు.*
🟥🟨🟧🟫🟫⬛⬜🟦🟩🟪🟪⬛
చిన్నప్పుడు 2 సంవత్సరాలు ఆయన ఐగుప్తులో ఉన్నాడని దానినే వ్రాయించాడు,అంటే చంపడానికి చూసినటువంటి రాజు నిమిత్తమై యేసుక్రీస్తు వారిని యోసేపు మరియలు ఐగుప్తులో 2 సంవత్సరాలు దాయడము దాని గురించే బైబిల్ లో స్పష్టంగా వ్రాయించాడు ఇక (లూకా సువార్త,4:16) వ వచనంలో ఐతే *ఆయన పెరిగిన నజరేతు* అనేటువంటి విషయం మనకు ఇక్కడ కనపడుతుంది., ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలను మనం జాగ్రత్తగా గమనిస్తే *ఆయన తన వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్లెను* అనే సందర్భం మరొకటి కనపడుతుంది అంటే ఆయన తన దేశంలోనే ఉన్నాడని అనడానికి తన వాడుక అనగా అలవాటు చొప్పున విశ్రాంతి దినాన సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడ భోదించేవాడని ఇక్కడ వ్రాయబడింది.!
🔷 అంతే కాకుండ యేసుక్రీస్తు వారు బాప్తీస్మం తీసుకోవడానికి *ఆయన గలలీ నుండి వచ్చెను* అని (మత్తయి సువార్త,3:13) వ వచనంలో కూడ స్పష్టంగా వ్రాయబడింది. *యేసు జ్ఞానమందును, వయసు నందును,దేవుని దయ యందును,మనుషుల దయ యందును,ఆయన వర్ధిల్లుచూ ఉండెనని* మరొక సందర్భంలో కనపడుతుంది మనకు. ఇక (మార్కు సువార్త,1:9) వ వచనంలో చూస్తే *ఆ దినములలో యేసు నజరేతు నుండి వచ్చి యోహాను చేత బాప్తీస్మం పొందవచ్చెనని* అనేటువంటి విషయం మనకు కనపడుతుంది. ఆయన భోదిస్తున్నప్పుడు ఈయన యోసేపు కుమారుడు కాడా,మరియ ఇతని తల్లి కాదా,యోసేపు,యూదా,యోహాను అను వారు ఇతని తమ్ముళ్లు కారా,ఇతని చెల్లెళ్ళందరు మనతోనే ఉన్న వారు కారా అని యేసుక్రీస్తు వారిని గూర్చి అనేకమంది గుర్తు పట్టి *ఈయన "నజరేయుడైన యేసు అని మాట్లాడినట్లుగా మనం చూడగలం.!*
🔷 అంతే కాకుండ యేసుక్రీస్తు వారిని చూసినటువంటి ఒక దెయ్యం పట్టినటువంటి వాడు మాట్లాడిన మాటను కూడ మనం గమనిస్తే (లూకా సువార్త,4:31) వ వచనంలో *నజరేయుడైన యేసు అని* దెయ్యం మాట్లాడుతున్నట్లుగా మనకు కనపడుతుంది అంటే యేసుక్రీస్తు వారు నజరేయుడన్న సంగతి ప్రవచనాలలో వ్రాయబడినటువంటి విషయం,అదే విధంగా యేసుక్రీస్తు వారు పెరిగిన విధానాన్ని బట్టి ఆ దెయ్యము కూడ అక్కడ పిలవడం జరిగింది.!
🔺 2.ఇక రెండవ విషయానికొస్తే..
🟥🟨🟧🟫🟫⬛⬜🟦🟪🟪⬛
పాత నిబంధనలో ఏ ఒక్క ప్రవచనం కూడ *యేసుక్రీస్తు వారు భారతదేశం వెళతారు అని వ్రాయబడలేదు.* ఆయన జీవితమంతా ప్రవచనాల ప్రకారమే సాగింది. ఆయన ఎలా బ్రతుకుతాడో,ఎక్కడ బ్రతుకుతాడో, ఏ విధంగా మరణించి తిరిగి లేస్తాడో ప్రతీ విషయం కూడ ప్రవచనాలే సాక్ష్యమిచ్చాయ్. ఆ ప్రవచనాలలో ఎక్కడ కూడ యేసుక్రీస్తు వారు భారతదేశం వస్తాడని ఎక్కడను వ్రాయబడలేదు.!
🔺 3. ఇక మూడవ విషయానికొస్తే..
🟥🟨🟧🟫🟫⬛⬜🟦🟩🟪🟪
ఆయన భోదనలో కూడ ఎక్కడ ఈ విషయం ప్రస్థావించలేదు చెప్పలేదు. యేసు పాత నిబంధనను మాత్రమే తన భోదల్లో కోడ్ చేస్తూ వచ్చాడు. ఆయన సత్యవంతుడు నిజంగానే ఒకవేళ ఆయన భారతదేశం వచ్చి గనుక విద్యను అభ్యసించి ఉంటే నిజంగానే ఆయన తన భోదల్లో ఈ విషయాన్ని గూర్చి చెప్పి చెప్తాడు. ఆయన యందు అసలు అబద్దమే లేదు. *నాలో పాపమున్నదని మీలో స్థాపించువాడు ఎవడు అని ఆయన ఆ రోజే సమాజానికి ఛాలెంజ్ విసిరాడు* అంటే ఆయన ఎంత సత్యవంతుడో మీరే గమనించండి. ఆయనను నిందించేవారు కూడా ఎవ్వరు నువ్వు భారతదేశం వెళ్ళి ఇవన్నీ నేర్చుకొని వచ్చి మాకు చెబుతావా అని శాస్త్రులు గానీ,పరిసయ్యులు గానీ, భారతదేశాన్ని గూర్చి యేసుక్రీస్తు వారిని అనలేదు.!
🔺 4.ఇక నాలుగవ విషయానికొస్తే.. "
🟥🟨🟧🟫⬛⬜🟦🟩🟪🟪
చరిత్రకారులు" చరిత్రకారులు కూడ ఎంతో మంది యేసుక్రీస్తు వారు భారతదేశము వచ్చి విద్యనభ్యసించి భోదనలు నేర్చుకొని వచ్చాడన్న సంగతి కూడ ఎవరు వ్రాయలేదు. వీరిలో "ఫ్లావియస్ జోసిఫస్" అనే ఇతను యూదా చారిత్రకారుడు, ఇతని తరువాత రోమా చరిత్ర గ్రంధాలను ప్లాట్రస్ వ్రాసిన అనే చారిత్రకారుడు కానివ్వండి, సుతోనియస్ అని గానీ, ప్లనిత్ అంగర్ అనే డ్రాజన్ రాజు దగ్గర మెజిస్ట్రేట్ గా పని చేసినటువంటి ఇతను గానీ,.. లూసియన్ ఇతను గ్రీకుల చరిత్రను వ్రాసాడు, ఇతను కూడ ఎక్కడ యేసుక్రీస్తు వారు భారతదేశం వచ్చి విద్యను అభ్యసించినట్లుగా తన గ్రంధాలలో తన రచనల్లో వ్రాయలేదు. ఎపిక్టీటస్ అనే గ్రీకు ఫిలాస్పర్ కూడ, గాల్వన్ అనే టర్కీ దేశ సర్జన్ మరియు ఫిలాస్పర్ కూడ, మూడవ శతాబ్దానికి చెందినటువంటి "యూసిబియస్" గానీ,వీరందరు వ్రాసినటువంటి చరిత్ర గ్రంధాలలో..చరిత్ర పుస్తకాలలో..యేసుక్రీస్తు వారు 12 నుంచి 30 సంవత్సరాల మధ్య భారతదేశం వచ్చారని ఎక్కడ కూడ చెప్పలేదు.
🔷 అంతే కాదు యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్నటువంటి అనేకమంది భోదకులు,యేసుక్రీస్తు వారి యొక్క భోదలకు ఆశ్చర్యపడి ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడిది,ఈయన యోసేపు కుమారుడు కాడా,ఈయన వడ్ల వాని కుమారుడు కాడా,అని ప్రతీ రోజు తన తండ్రితో పాటు తాను చేయుచున్నటువంటి పనిని కూడా అక్కడ అనేకమంది జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనకు కనపడుతుంది.!
🔷 *ఫ్రెండ్స్ ఈ ఆధారాలన్నీ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు అసలు భారతదేశం రాలేదని స్పష్టంగా మనం ఇక్కడ గమనించవచ్చు.* యేసుక్రీస్తు వారు 12 వ యేట నుంచి 30 సంవత్సరం మధ్య కాలంలో ఆయన నజరేతులోనే ఉన్నాడు అని ఈ వచనాలను బట్టి ఈ సందర్భాలను బట్టి మనం ఆలోచించొచ్చు.!
🔷 ఈరోజు చాలామంది యేసు మా దగ్గరకు వచ్చాడు, ఇక్కడనే నేర్చుకున్నాడు, ఆ గొప్పతనమంతా మాదే అనేవారు చాలామంది ఉన్నారు. ఫ్రెండ్స్ వాళ్ళు అనుకున్నట్లుగా ఒకవేళ నిజంగానే యేసుక్రీస్తు వారు భారతదేశం వచ్చి నేర్చుకుంటే నిజంగా నేర్చుకున్న శిష్యునికే ఇంత జ్ఞానముంటే నేర్పించిన గురువుకి ఇంకెంత జ్ఞానముండాలి.? మరి యేసుక్రీస్తు వారి గురువు కూడ ఎవరో వీరే చెప్పాలి..
🔷 ఫ్రెండ్స్ ఒకవేళ ఎక్కడికి వెళ్లకపోతే యేసుక్రీస్తు వారు 12 నుంచి 30 సంవత్సరాల మధ్య కాలంలో మరి ఎక్కడ ఉన్నాడు? యేసుక్రీస్తు వారిని గూర్చి బైబిల్ లో ఎందుకు వ్రాయబడలేదు. ఈ విషయాన్నీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మరి ఈ ప్రశ్నకు సమాధానంగా యోహాను గారు మనకు చెప్తారు యేసుక్రీస్తు వారి దినచర్య అంతా రాస్తాము అంటే *అట్లు వ్రాయబడిన గ్రంధాలకు భూలోకమైనను చాలదని యోహాను గారు అంటున్నట్లుగా మనకు కనపడుతుంది* అంటే రక్షణకు అవసరమైనటువంటి విషయాలు మాత్రమే దేవుడు బైబిల్ గ్రంధంలో వ్రాయించాడు మిగిలిన విషయాలను ఆయన వ్రాయించలేదు. ఫ్రెండ్స్ మరి యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి ఎన్నో అపోహలను మరి ఈ పాఠం ద్వార పటాపంచలు చేయొచ్చని నేను అనుకుంటున్నాను
👉 ఫ్రెండ్స్ ఎవరైనా యేసుక్రీస్తు కాశ్మీరు వచ్చారు అని అంటే ఖచ్చితంగా బైబిల్ నుండి మరియు చరిత్ర పరంగా కూడ మీరు ఈ ఆధారాలను చూపించవచ్చు..
👉 *దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికి తోడైయుండి బలపరచును గాక...!!!*
🟥🟪🟩🟫🟨🟧🟧
#📀యేసయ్య కీర్తనలు🎙 #❤️నా యేసయ్య ప్రేమ ❤️
https://youtube.com/watch?v=-ht1Vh1wBJM&si=wQ-pT7ktPhgPRuRV #📀యేసయ్య కీర్తనలు🎙 #❤️నా యేసయ్య ప్రేమ ❤️
#🕉 शिव भजन #🙏🏻आध्यात्मिकता😇 #🕉 ओम नमः शिवाय 🔱 #🔱हर हर महादेव #🔱बम बम भोले🙏
నిత్య జీవానికి నకిలీ మెట్లు
▫️/————————————
ఆధ్యాత్మిక జీవితంలో మనము చేస్తున్న అనేకమైన పనులు, పరలోకానికి చేర్చే మెట్లుగా మనలను భ్రమింపజేస్తాయి. నిజంగా ఆ మెట్లమీద మనము నిలబడాల్సివస్తే మాత్రం కుప్పకూలిపోతాయి. కారణం అవి నకిలీ మెట్లు.
🔅 *మంచి పనులు*
▫️ఆపదలో నున్నవారిని ఆదుకొనుట
▫️ధర్మకార్యాలు
▫️ఎవ్వరికీ కీడు చేయకుండుట
ఇవన్నీ నిన్ను సమాజంలో మంచి వ్యక్తిగా నిలబెడతాయితప్ప, “రక్షణ లేకుండా” నిత్యరాజ్యానికి మాత్రం నిన్ను చేర్చలేవు.
🔅 *పుట్టు క్రైస్తవులు*
▫️క్రైస్తవ కుటుంబములో జన్మించియుండొచ్చు
▫️క్రైస్తవ పేరు కలిగియుండొచ్చు
▫️స్కూల్ సెర్టిఫికెట్ లో కూడా క్రైస్తవునిగానే వుండొచ్చు.
కానీ, “తిరిగి జన్మించకుంటే మాత్రం”, పైనున్న అర్హతలేవీకూడా నిన్ను పరమునకు చేర్చలేవు.
🔅 *బాప్తీస్మము*
▫️పెళ్లి కొరకు కాదు
▫️అదేదో ఒక ఆచారము కాదు
▫️ఎవరినో సంతోషపెట్టుట కొరకు కాదు.
▫️సమాధుల దొడ్డిలో స్థలము కొరకు కాదు. ( ఇటీవల కాలంలో ఒక మందిరంలో ప్రకటించగా విన్నాను. సంఘములో బాప్తీస్మము తీసుకోకుండా మరణించినవారికి, సంఘ సమాధుల దొడ్డిలో స్థలము ఇవ్వబడదని.)
▫️బాప్తీస్మము అనేది ఖచ్చితంగా రక్షణ పొందినవారికి మాత్రమే. రక్షణ లేకుండా తీసుకొనే బాప్తీస్మం “నీటిలో మునక” వంటిది మాత్రమే.
🔅 *ప్రభురాత్రి భోజనం*
▫️తీసుకోకపోతే నేనేదో పాపం చేస్తున్నానని అనుకుంటారని కాదు.
▫️మన సంతృప్తి కొరకు కాదు.
▫️ఇతరులను మోసపుచ్చడానికి కాదు.
ఇది కేవలం రక్షించబడి, బాప్తీస్మముపొంది, రక్షణను కాపాడుకొంటున్నవారికి మాత్రమే. ఇది ప్రభువు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం
🔅 *దశమభాగములు *
▫️భక్తి చేస్తున్నామనే సంతృప్తినిస్తాయి.
▫️సేవకుని దృష్టిలో మంచి అభిప్రాయం కలిగివుంటాము.
కానీ, రక్షణ లేకుండా చెల్లించే దశమ భాగములు దేవునిచేత అంగీకరించబడవు.
🔅 *ఉపవాసము*
▫️వ్యక్తిగత సంతృప్తినివ్వొచ్చు
▫️ఆధ్యాత్మిక ఏకాగ్రతకు దోహదం చెయ్యొచ్చు.
▫️శారీరిక ఆరోగ్యానికి కూడా దోహదపడొచ్చు.
కానీ, రక్షణ లేని ఉపవాసాలు దేవునిని సంతోషపరచలేవు. .
🔅 *ప్రార్ధనలు *
నీ ప్రార్ధన దేవునిచేత అంగీకరించబడాలంటే? మొట్టమొదటిగా ప్రార్ధించే నీవు దేవునిచేత అంగీకరించబడాలి. అది “రక్షణ ద్వారా మాత్రమే” సాధ్యం. నీనుండి ప్రభువు ఆశించే మొట్టమొదటి ప్రార్ధన “దేవా! పాపినైన నన్ను క్షమించు”. మారుమనసు, పశ్చాత్తాపం, పాప క్షమాపణ లేకుండా చేసే ప్రార్ధనలు పరమునకు చేర్చలేవు.
🔅 *ఆరాధనలకు హాజరగుట*
సంఘ ఆరాధనలకు, నియామక కూడికలు క్రమము తప్పకుండా హాజరగుటవలన అది మనకు సంతృప్తి కలిగించే విషయమే. అది సంఘములో కూడా మంచి పేరును తీసుకొస్తుంది. కానీ, రక్షణ లేకుండా, మన అటెండన్స్ చూచి, పరలోకం చేరడానికి ప్రభువు ఎట్లాంటి గ్రేస్ మార్క్స్ యివ్వరు.
▫️ప్రసంగాలు చేయడం
▫️పాటలు పాడడం
▫️మ్యూజిక్ ప్లే చెయ్యడం
▫️చర్చ్ ఆక్టివిటీస్ లో చురుకుగా పాల్గొనడం
▫️సోషల్ మీడియా ద్వారా పరిచర్య
యింకా, అది ఏదైనా సరే,
‘రక్షణ’ మరియు ‘రక్షణా కొనసాగింపు’ లేకుండా, నీకున్న మరి ఏ ఇతర క్వాలిఫికేషన్ గాని, టాలెంట్ గాని, నిన్ను పరమునకు చేర్చలేవు.
🔅 *ఆచారాలు*
క్రైస్తవ్యం అనేది మతమే కాదండి. నిత్యరాజ్యానికి చేర్చే ఏకైక మార్గం. కొంతమంది మతం పుచ్చుకున్నామంటారు. ఆమాట వింటేనే చాలా బాధనిపిస్తుంది.
▫️క్రిస్మస్
▫️లెంట్
▫️గుడ్ ఫ్రైడే
▫️ఈస్టర్
▫️ఈ మధ్య యేసు మాల, మరియమ్మ మాల అంటూ ఏవోవో వింటున్నాము. అవి విన్నప్పుడు చెప్పలేనంత బాధనిపిస్తుంది.
ఏది ఏమైనా ఇట్లాంటివి చెయ్యాలనిగాని, చేసినట్లుగానే పరిశుద్ధ గ్రంధములో ఎక్కడా కనబడదు. వీటి విషయంలో ఎవరి అభిప్రాయములు వారికున్నాయి. ఎన్ని చెప్పినప్పటికీ. ఎంత చేసినప్పటికీ “రక్షణ లేకుండా” ఇవేమి మనలను పరమునకు చేర్చలేవు.
🔅 *పరమునకుచేర్చే మార్గము ఒకే ఒక్కటి! *
యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. (యోహాను 14:6) గొఱ్ఱలు పోవు ద్వారమును నేనే ( యోహాను 10:8) నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములొ నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చ యముగా చెప్పుచున్నాను. (యోహాను 5:24)
🔅 *నిత్యజీవానికి చేర్చే అసలైన మెట్లు*
▫️ప్రతీ (పాప) భారమును విడిచిపెట్టాలి
▫️సులువుగా చిక్కులుపెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి
▫️యేసువైపు మాత్రమే చూడాలి
▫️ఓపికతో పరుగెత్తాలి ( గమ్యం చేరేవరకు)
హెబ్రీ 12:1-3
ఒక్కసారి మన ఆధ్యాత్మిక జీవన విధానం ఎట్లా వుందో మనలను మనమే పరిశీలన చేసుకొని, సరిచేసుకోగలిగితే జీవితం ధ్యన్యమౌతుంది. ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! #📀యేసయ్య కీర్తనలు🎙 #❤️నా యేసయ్య ప్రేమ ❤️
Hai friend's have a great day and blessed day .... 🙋
..... "Do God's will and glorify God"....
... Jesus is coming soon .. 🙏🙌💘🕊 #❤️నా యేసయ్య ప్రేమ ❤️
https://youtube.com/watch?v=YqWc5wWIFTs&si=HDyB8aBBZ4BlaVNV #❤️నా యేసయ్య ప్రేమ ❤️ #📀యేసయ్య కీర్తనలు🎙
మన పరీక్షలు ఎన్నో రూపాల్లో వస్తాయి — శరీరంలో ముళ్లు కావొచ్చు, రోగాలు రావొచ్చు, ఆర్థిక ఒత్తిడిగా ఉండవచ్చు, కుటుంబంలో తుపాన్లుగా ఉండవచ్చు, ఆత్మీయ యుద్ధాలుగా ఉండవచ్చు, లేదా క్రీస్తు నామమునకై అనుభవించే బాధలుగా రావొచ్చు. అయితే దేవుని వాక్యం చెబుతోంది: పరీక్షలు విశ్వాసమును, ఓర్పును పుట్టిస్తాయి మరియు మనము మునుపెన్నడూ లేనంతగా దేవునిపైన ఆధారపడటం నేర్చుకుంటాము.
అందుకే అపొస్తలులు బాధల మధ్య కూడా సంతోషించారు.
“ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి.”
— అపొస్తలుల కార్యములు 5:41
వారు బాధను భారంగా చూడలేదు — పాత్రులుగా చూశారు.
ఇది ప్రతి విశ్వాసి యొక్క స్వభావముగా మారాలి:
క్రీస్తు నిమిత్తం మీరు బాధపడినప్పుడు,
ఆయన నామమునకై మీరు హింసింపబడినప్పుడు,
మీరు ఒంటరిగా బాధపడడం లేదు. క్రీస్తు మీతో పాటు బాధపడుతున్నాడు.
దమస్కు దారిలో సౌలు ప్రభువును ఎదుర్కొన్నప్పుడు, వాక్యం ఇలా చెబుతోంది:
“అప్పుడతడు నేలమీదపడి –
సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని
తనతో ఒక స్వరము పలుకుట వినెను.
ప్రభువా, నీవెవడవని అతడడుగగా
ఆయన–నేను నీవు హింసించుచున్న యేసును.”
— అపొస్తలుల కార్యములు 9:4–5
ఇది యేసు హృదయాన్ని తెలియజేస్తుంది:
మనలను తాకినది — ఆయనను తాకినట్టే.
దానియేలు 3 — అగ్నికుండలో యేసు ఉన్నాడు
షద్రక్, మేషక్, అబెద్నెగోలను అగ్నికుండలో పడేసినప్పుడు,
బయటపడే ఆశ కూడా లేదు.
మనుష్య దృష్టికి అది మరణమే.
కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు.
వారు ముగ్గురే లోపలికి వెళ్లారు —
కానీ రాజు నాల్గవ వ్యక్తిని చూశాడు.
అగ్నిలో నడుస్తూ,
వారిని కాపాడుతూ,
వారితో పాటు ఉన్న యేసు.
“అందుకు రాజు–నేను నలుగురు మనుష్యులు బంధకములులేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను; వారికి హాని యేమియు కలుగలేదు; నాల్గవవాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను.”
— దానియేలు 3:25
మీరు జలములలో నడిచినప్పుడు — ఆయన మీతో ఉంటాడు.
మీరు అగ్నిలో నడచినప్పుడు — ఆయన మీ పక్కనే నిలుస్తాడు.
“నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును;
నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు;
నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు,
జ్వాలలు నిన్ను కాల్చవు.”
— యెషయా 43:2
#krupavarun #bibleverse #trials #countitalljoy #biblestudy #daily #devotional #James1v2 #📀యేసయ్య కీర్తనలు🎙 #❤️నా యేసయ్య ప్రేమ ❤️











