*తులం బంగారం @ 1.5 లక్షలు...!! ఇది పేదవాడికి ఉరితాడు...!! రాజకీయ రాబందులకు పండగ...!!*
ఒక్క నిమిషం ఈ నిజాలు చదవండి...!! గుండెలు పగిలే వాస్తవాలు ఇవి..✍️
ఈరోజు 10 గ్రాముల (తులం) బంగారం కొనాలంటే అక్షరాలా లక్షా యాభై వేల రూపాయలు (Rs. 1,50,000/-) పెడితే కానీ రావడం లేదు...!!
అసలు ఎందుకు ఇంత రేటు పెరిగింది...?? దీని వెనుక ఉన్న అసలు దోపిడీ దారులు ఎవరు...??
ఇది కేవలం మార్కెట్ మాయాజాలం కాదు...!! "రాజకీయ అవినీతి" సృష్టిస్తున్న కృత్రిమ కొరత...!!
ఒక సామాన్య తండ్రి ఆవేదన...!!
ఒక మధ్యతరగతి తండ్రి తన కూతురు పెళ్లి కోసం, చిన్నప్పటి నుండి రూపాయి రూపాయి కూడబెట్టి ఒక 5 లక్షలు దాచుకున్నాడు అనుకుందాం...!!
రెండేళ్ల క్రితం ఆ 5 లక్షలకు సుమారు 10 తులాల బంగారం వచ్చేది...!! పెళ్లి ఘనంగా జరిగేది...!!
కానీ ఈరోజు...??
అదే 5 లక్షలకు కనీసం 3 తులాల బంగారం కూడా రావడం లేదు...!!
ఆ తండ్రి ఇప్పుడు ఏం చేయాలి...??
తన కూతురు ముందు తలదించుకోవాలా...?? లేక పెళ్లి కోసం ఇల్లు తాకట్టు పెట్టాలా...??
ఈ పాపం ఎవరిది...??
రాజకీయ నాయకుల వైభవం...✍️
అదే మీ నియోజకవర్గ నాయకుడి ఇంటి పెళ్లి చూడండి...!!
పెళ్లి కూతురు ఒంటి నిండా కిలోల కొద్దీ బంగారం...!!
విందు భోజనాల్లో వాడే ప్లేట్లు, గ్లాసులు కూడా వెండి, బంగారమే...!!
వాళ్ళకి ఆ డబ్బు ఎక్కడిది...??
మనం కట్టిన పన్నులు, మన దగ్గర దోచుకున్న వేల కోట్లు...!!
మన ఇంట్లో ఉన్న అమ్మకు, భార్యకు మెడలో నల్లపూసల గొలుసు ఉండదు...!!
కానీ వాళ్ళ కుక్కల మెడలో మాత్రం బంగారు గొలుసులు ఉంటాయి...!!
ఇదేనా ప్రజాస్వామ్యం...✍️
అసలు కుట్ర ఏంటి...?? (The Conspiracy)
1) నాయకుల నల్లధనం దాచుకోవడానికే ఈ రేట్లు...!!
దేశంలో రాజకీయ నాయకులు, బడా బాబులు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు...!! నోట్ల రద్దు భయంతో, ఐటీ దాడుల భయంతో...!!
ఆ డబ్బునంతా "బంగారు బిస్కెట్లు" గా మార్చేస్తున్నారు...!!
వాళ్ళు టన్నుల కొద్దీ బంగారాన్ని కొని, ఫాంహౌస్లలో, విదేశీ లాకర్లలో కుప్పలుగా దాచేస్తున్నారు...!!
మార్కెట్లో ఉండాల్సిన బంగారం అంతా వాళ్ళ ఇళ్లల్లో బందీ అయిపోతే...!!
సామాన్యుడికి బంగారం ఎక్కడ దొరుకుతుంది...??
అందుకే డిమాండ్ పెరిగి, ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్ళిపోయాయి...!!
2) పన్నుల పేరుతో పగటి దోపిడీ...!!
మనం కష్టపడి సంపాదించి, పొట్ట కోసుకుని కొనే ఆ కాస్త బంగారంలో కూడా ప్రభుత్వం వాటా ఎంతో తెలుసా...??
కస్టమ్స్ డ్యూటీ... విదేశాల నుండి బంగారం వస్తున్నందుకు పన్ను...!!
GST... దాన్ని మనం కొంటున్నందుకు పన్ను...!!
తరుగు మజూరీ... తయారీ పేరుతో దోపిడీ...!!
మొత్తం కలిపి మనం కట్టే 1.5 లక్షల్లో... సుమారు 20 వేల నుండి 25 వేల రూపాయలు కేవలం పన్నుల రూపంలోనే ప్రభుత్వానికి, వ్యవస్థకు వెళ్తున్నాయి...!!
మన రక్తం పిండి వసూలు చేసిన ఈ పన్నులే...!!
రేపు ఎలక్షన్లలో అదే బంగారం ఓటుకు 500, 1000 నోట్లుగా మారి మన ముఖాన కొడతారు...!!
3) వ్యవస్థ మీద నమ్మకం లేక...!!
మనల్ని పాలించే ప్రభుత్వాలే... "భవిష్యత్తులో ఈ కరెన్సీ నోట్లు చెల్లవు" అని భయపడి, రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్వారా టన్నుల కొద్దీ బంగారాన్ని కొని దాచుకుంటున్నాయి...!!
ప్రభుత్వానికే కరెన్సీ మీద నమ్మకం లేనప్పుడు...!!
సామాన్యుడి బతుకుకు గ్యారెంటీ ఏది...??
చైతన్యం తెచ్చుకోండి...!!
రేట్లు పెరిగాయని బాధపడటం కాదు...!! ఈ వ్యవస్థ మారాలని కోరుకోండి...!!
పేదవాడికి బంగారం అనేది ఒక "ఆభరణం" కాదు...!! ఆకలి వేస్తే అమ్ముకునే "ఆస్తుల" భరోసా...!!
కానీ ఈరోజు ఆ భరోసాను కూడా మనకు దూరం చేశారు...మన ఓటుతో గెలిచిన నాయకులు...!!
మీ బతుకులను బంగారం చేస్తామని చెప్పి, చివరకు మీ తాళిబొట్టు కూడా కొనలేనంత దారుణమైన స్థితికి మనల్ని నెట్టేశారు...!!
ఇది చదివాకైనా ఆలోచించండి...!!ప్రశ్నించండి...!!
లేకపోతే రేపటి రోజున "బంగారం" అనేది మన పిల్లలకు కేవలం మ్యూజియంలో చూసే వస్తువుగానే మిగిలిపోతుంది...!!
ఒక బాధ్యత గల పౌరుడి ఆవేదన, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి...🙏
🇮🇳 NRL 🇮🇳
#మళ్లీ షాకిచ్చిన గోల్డ్ రేట్స్.. #గోల్డ్ #గోల్డ్ రేట్