https://youtube.com/watch?v=K054j5Q3B3M&si=md4vADhQ7boQtw10 #🎶భక్తి పాటలు🔱
#💑రిలేషన్ షిప్ కోట్స్ #✍️కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌
*🙏నేటినుండి ధనుర్మాసం ప్రారంభం🙏*
*🙏\|/🌞ధనుర్మాసం విశిష్టత🌞\|/🙏*
#🎶భక్తి పాటలు🔱
*🙏\|/ నేటినుండి ధనుర్మాసం ప్రారంభం.*
🙏\|/ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. ధనుర్మాస మంతా విష్ణు పారాయణాలతో దేవాలయాలు మారు మోగుతాయి. మార్గశిరం ఈ మాసంలోనే ధనుర్మాసం జరుగు తుంది. మాసాలలో మార్గశిరాన్ని నేనే అని విష్ణుమూర్తి స్వయంగా చెప్పుకున్నారంటే ఈ మాసానికి వున్న వైశిష్టత అర్థమవుతుంది.
🙏\|/మార్గశిర మాసంలో ధనురాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకరరాశిలో సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. విష్ణువుకు ప్రీతిపాత్రమైన ధనుర్మాసోత్సవాన్ని వైష్ణవులు ఎంతో పవిత్ర మాసంగా భావిస్తున్నారు. ఈనెల 16వ తేదీ నుంచి *జనవరి 14 న* గోదాదేవి కల్యాణంతో ముగుస్తుంది.
🙏\|/కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి.
🙏🎋చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు .ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు . ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు . . . అదేవిధముగా కర్కాటకరాశిలో సూర్యుడు సంచరిచే కాలము కర్కాటకమాసము అంటారు .
ధనస్సురాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం . కాగా ధనస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు.
🙏\|/🌺మానవులకు ఒకసంవత్సరం దేవతలకు ఒకరోజు అంటారు . ఈలెక్కన ఉత్తరాయణం రాత్రి , దక్షిణాయనం పగలుగా భావించబడుతోంది . సూర్యుడు కర్కటకరాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు . అక్కడనుండి దక్షిణాయనం ప్రారంభం . అనగా . . . ఇది రాత్రి కాలం . మకరరాశిలో ప్రవేశించు సమయం మకరసంక్రమణం ఇక్కడినుండి ఉత్తరాయణం . అనగా . . . పగలుగా భావన . ఇలా భావిచినప్పుడు . . . దక్షిణాయనమునకు చివరిది . . . ఉత్తరాయణమునకు ముందుది ఐనదే ధనుర్మాసం.
🙏🌻 ప్రాతఃకాలమువలె పవిత్రమైనది . . . సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది . కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈనెలలో ఆరాధిస్తారు . . . ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించినదే.
🙏🌞 సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని 'పండుగ నెలపట్టడం' అనికూడా అంటారు.
🙏\|/ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది. కానీ మనం (తెలుగు వారం) చాంద్రమాన అనుయాయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుని తీర్చిదిద్దుతారు.
🙏\|/ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. విష్ణు ఆలయాలల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీనిని *బాలభోగం* అని పిలుస్తారు.
*🔥 భోగితో ముగుస్తుంది 🔥*
🙏\|/సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకూ (సంక్రాంతి ముందురోజు) ధనుర్మాసం కొనసాగుతుంది. ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి (అండాళ్) *మార్గళి వ్రతం* పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి , స్వామిని కీర్తించింది. ధనుస్సంక్రమణ రోజు స్నానాలు , పూజలు , జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు , వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం.
*🙏\|/ ఎంతో పునీత మాసం \|/🙏*
🙏\|/ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. *ధను* అనగా దేనికొరకు ప్రార్థించడమో అనే అర్థం దృష్ట్యాధనుర్మాసం అత్యంత పునీతమైనది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు , ఇతర సంప్రదాయాలు కలగలసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి అంటే ఆండాళమ్మ పూజ , తిరుప్పావై పఠనం , గోదాకళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమే అని పెద్దలు చెప్తారు. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు , సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. శయన బేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగే సంప్రదాయం.
*🙏\|/ బ్రహ్మముహూర్తంలో పారాయణం \|/🙏*
🙏\|/ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతి రోజు బ్రాహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తద్యమని శాస్తవ్రచనం. సాక్షాత్ భూదేవి , అవతార మూర్తి అయిన అండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో *"తిరు"* అనగా పవిత్రమైన , *పావై* అనగా వ్రతం , ప్రబంధం అని అర్థం. వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని మన పూర్వాచార్యులు ప్రస్తుతించి యున్నారు. ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వ సులభరీతిలో వెలువడి నాయనీ , తిరుప్పావై మహావిష్ణు పాద పద్మాలను అందుకోవటానికి మార్గదర్శకాలనీ చెప్పబడింది. ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి , మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి. పెళ్లిడు అమ్మాయిలు తమ ఇళ్లముందు ముగ్గులు , గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.
*☘శ్రీకృష్ణుడికి తులసిమాల:☘*
🙏\|/ప్రతి రోజూ ఒక పాశురంలో (కీర్తన) స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు, నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ , ఆదిత్య పురాణాల్లో , భాగవతంలో , నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించుకోవాలను కునేవారు శక్తిమేరకు విష్ణు ప్రతిమని తయారుచేయించి , పూజాగృహంలో ప్రతిష్టించుకోవాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి , స్నానాదికాలు ముగించాలి. పంచామృతాలతో శ్రీమహావిష్ణువును అభిషేకించాలి. అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది. తర్వాత తులసీ దళాలు , పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం నమర్పించాలి. ఈ నెలరోజులూ విష్ణు కథలను చదవటం , తిరుప్పావై పఠించటం చెయ్యాలి. నెలరోజులూ చెయ్యలేనివారు పదిహేను రోజులు , 8 రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా ఆచరించవచ్చు. వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకం పఠించి , ఆశీస్సులు అందుకోవాలి.
*🙏\|/శ్లో. మదుసూధన దేవేశ ధనుర్మాస ఫలప్రదా*
*తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా:*
🙏\|/ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు , పరలోక మోక్షం పొందుతారు. ఆత్మపర మాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయు లందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుని సుల భంగా వశపరచుకోవచ్చనీ , నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసి వారికి, తిరుప్పావై గాన , శ్రవణం చేసిన వారికీ ఆయు రారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయం కాగలదనీ, ఆశిద్దాం.
*🙏\|/ ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలేంటి ? \|/🙏*
🙏\|/ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం , పాయసం , దద్దోచనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది.
ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు , పెరుగు , పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది. ఆయుర్వేదం , జ్యోతిష్యం ప్రకారము ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వ గుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి.
*🙏\|/ కన్నెపిల్లలకు మేలు జరుగుతుంది 🙏\|/*
🙏\|/వివాహం కాని , మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తెయైన గోదాదేవి మానవమాత్రులని కాక రంగనాధుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆ కారణముగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని , భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాధ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగానాధుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది.
*🙏\|/ ధనుర్మాసంలో ముగ్గులు \|/🙏*
🙏\|/రవి ధనురాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనుస్సు , మీనంలో రవి ఉన్నప్పుడు రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా , ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య పూజలు చేస్తారు. ఇంకా విష్ణుముర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు. ఇలా చేయటం శుభం.
గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు ? ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యంపిండి , పసుపు , కుంకుమ , పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించటం జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వలన స్త్రీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది.
*🙏\|/ కాత్యాయనీ వ్రతం పూజా విధానం \|/🙏*
🙏\|/రోజులానే ముందు పూజ చేసుకోవాలి. ఆ తరువాత శ్రీ కృష్ణ అష్టోత్తరం,గోదా అష్టోత్తరం చదువుకోవాలి. రంగనాధ అష్టోత్తరం కూడా చదివితే మరి మంచిది. ముందుగా ప్రార్ధన చదవాలి. ఆ తరువాత వరుసగా తనయ చదవాలి. తిరుప్పళ్ళి యోళుచ్చి చదివేటప్పుడు ప్రారంభం కదిరవన్ చదవకుండా అది మొత్తం ఒక్కసారి చదివాక రెండవసారి చదివినప్పుడు కదిరవంతో కలిపి చదవాలి. తనయ చదువుతూ తొమ్మిది , పది తనయలు రెండు సార్లు చదవాలి. చివర తిరుప్పళ్ళి యోళుచ్చి సంపూర్ణం అని చదవాలి. ఆ తరువాత ప్రార్ధన చదవాలి. ఆ తరువాత గోదాదేవి తనయ చదవాలి. ఆ తరువాత పాశురములు చదవడం ప్రారంభించాలి.
*🙏\|/ పాశురములు \|/🙏*
🙏\|/చదివేటప్పుడు మొదటి పాశురము రెండు సార్లు చదవాలి. అల మొత్తం అన్ని పాశురాలు రోజు చదవాలి. అలా వీలు కాని వారు మున్నిడి పిన్నిడి గా చదవాలి. (అంటే మొదటి పాశురంలో ఒక లైను , చివరపాశురంలో ఒక లైను చదవాలి.చివరగా గోదా హారతి చదవాలి. మంత్ర పుష్పం కూడా చదవాలి. మళ్ళి ఏ రోజు పాశురం ఆ రొజు రెండు సార్లు చదివి హారతి ఇవ్వాలి.
*🙏\|/ నైవేద్యం \|/🙏*
🙏\|/సమర్పంచాలి (రోజు పొంగలి , తద్ధోజనం , పరవన్నం ఉండి తీరాలి. కాలము ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు. కాని ఒక్క విషయం గుర్థుకు పెట్టుకోవాలి. పైవి అన్ని కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి.అనేదే నియమం కానీ రోజు ఉదయం చేయడానికి ప్రయత్నం చేయండి , పొంగలి మటుకు ముఖ్య నైవేద్యం కుదిరితే అది పెట్టండి కుదరని వాళ్ళు పండు , పాలు పెట్టి చేసుకోండి, భక్తి ముఖ్యం
*🙏\|/ధనుర్మాసఫలశ్రుతి\|/🙏*
🙏\|/ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మనము ఒక్క రోజు అయినా మనసా వాచ కర్మణా యదాశక్తిగా పూజించిన యెడల 1000 యేళ్ళు విష్ణుమూర్తిని పూజించిన ఫలితము కలుగుతుంది. అలాగే ఏదైనా ఒక నదిలోకాని లేక ఏదైనా ఒక పవిత్రమైన నదీ పుణ్య జలంలోకాని లేదా ఒక చెరువు లోకాని మీకు తోచిన పుణ్య స్థలంలో ఒక్క మునుగు మునుగిన 4 రెట్లు అశ్వమేధయాగం చేసిన ఫలితము దక్కును.
*⏰కళ్యాణచక్రవర్తి జ్యోతిషాలయం🖐️*
*బుచ్చిరెడ్డిపాళెం నెల్లూరుజిల్లా*
*9014612323 9391087299*
*ప్రాక్పశ్చిమజ్యోతిశ్శాస్త్రమహావిద్వాన్*
*🪷\|/ వేదగిరి.కళ్యాణచక్రవర్తి \|/🪷*
🕉️పుట్టిన సమయం (⏰టైమ్) ను అనుసరించి మరియు పుట్టిన సమయం లేని వారికి, వారి పిల్లల పుట్టిన సమయమును అనుసరించి లేదా చేతి 🖐️హస్త రేఖల ద్వారా జాతకములు చెప్పబడును. దోషము ఉన్నచో దోష పరిహార శాంతులు చేయబడును.
🏡 గృహమునకు వాస్తు చూడబడును. వాస్తుదోషము ఉన్నచో దోషపరిహార శాంతులు చేయబడును. వ్యాపార సంస్థలకు ధన మన జన ఆకర్షణ యంత్రములు ఇవ్వబడును. ప్రతిరోజు పంచాంగం, రాశిఫలాలు, జాతకవిషయాలు, మరియు ఆధ్యాత్మిక భక్తి కధలు తెలుసుకొనుటకు క్రింది వాట్సాప్ లింక్ ని నొక్కండి. మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండ
#💪మోటివేషనల్ కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌 #✍️కోట్స్ #💑రిలేషన్ షిప్ కోట్స్
#✍️కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌 #💪మోటివేషనల్ కోట్స్
#✍️కోట్స్ #😊పాజిటివ్ కోట్స్🤗 #💑రిలేషన్ షిప్ కోట్స్










![💪మోటివేషనల్ కోట్స్ - Own feet . long as you have strength; Run as walk when your strength decreases, following in but don't worry about] someone elses footsteps: Fb / Motivation Quote $ 0 7 Own feet . long as you have strength; Run as walk when your strength decreases, following in but don't worry about] someone elses footsteps: Fb / Motivation Quote $ 0 7 - ShareChat 💪మోటివేషనల్ కోట్స్ - Own feet . long as you have strength; Run as walk when your strength decreases, following in but don't worry about] someone elses footsteps: Fb / Motivation Quote $ 0 7 Own feet . long as you have strength; Run as walk when your strength decreases, following in but don't worry about] someone elses footsteps: Fb / Motivation Quote $ 0 7 - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_134047_2405edbb_1765805087039_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=039_sc.jpg)


