*🌤️మకర సంక్రాంతి శుభాకాంక్షలు👏*
🕉️ ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్ |
జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ ||
☀️ ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా...👏
🌤️సూర్య భగవానుడు మకర రాశిలోకి అడుగుపెడుతూ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని,
🌾 కొత్త బియ్యంతో వండిన పొంగలి రుచిలా మీ ఇంట తీయటి జ్ఞాపకాలు నిండాలని,
🐂 గంగిరెద్దుల ఆటపాటల్లా మీలో నూతన శక్తి కలగాలని,
🎶 హరిదాసు కీర్తనల్లా మీ ఇల్లు ఆనందంతో మారుమోగాలని కోరుకుంటూ...
మీకు, మీ కుటుంబ సభ్యులకు *🌤️సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు!👏*
తమ విశ్వసనీయ
*కప్పాటి పాండురంగారెడ్డి*
తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు🌤️
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚
సర్వేజనా సుఖినోభవంతు 👏
🚩┈┅━❀ॐ❀━┈🚩
#కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు
_*రేనాటి వీరుడా ఒడ్డే ఓబన్న వందనం!👏*_
*బ్రిటీష్ వారి నిరంకుశత్వాన్ని ఎదిరించిన స్వాతంత్ర సమరయోధుడు, అక్రమ పన్ను వసూళ్లపై తిరుగుబాటు చేసిన ధీశాలి శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను.👏*
ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఓబన్న స్నేహితుడు భరణాన్ని అధికారులు ఎగ్గొట్టడంతో మొదలైన పోరు.
సైరాకు ప్రధాన అనుచరుడు.. ఏడాదిపాటు సమరం గెరిల్లా పద్ధతుల్లో బ్రిటిష్ ఖజానాపై దాడులు నల్లమల కేంద్రంగా పోరాట వ్యూహాలకు పదును
జగన్నాథకొండ వద్ద పట్టుబడి 39 ఏళ్లకే అమరత్వం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తెలుగునాట తొలిసారి సవాల్ చేసిన సైరా... ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి మిత్రుడు, జీవితంలోను, పోరాటంలోను, మరణంలోను స్నేహితుడి వెంట నిలిచిన వీరుడు వడ్డే ఓబన్న నంద్యాల జిల్లాలోని సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన వడ్డె సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు ఓబన్న 1807 జనవరి 11న జన్మించారు. ఉయ్యాలవాడ తాత చెంచుమళ్ల జయరామరెడ్డిది ఇదే గ్రామం. ఓబన్న తండ్రి గ్రామ రక్షకునిగా(తలారీ)గా పనిచేసేవారు. ఈ రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. నరసింహారెడ్డి, ఓబన్నల మిత్రత్వం చిన్ననాడే మొదలై, మరణం వరకు కొనసాగింది. అప్పట్లో గ్రామ రక్షకుల జీతాలను తెల్లదొరలు రద్దుచేశారు. ఉయ్యాలవాడ వంశానికి ఎప్పటినుంచో అందుతున్న భరణాలను ఎగ్గొట్టారు. రైతులపై అధిక పన్నులు విధించారు. కరువు, కాటకాలతో పంటలు పండకపోయినా.. బలవంతంగా రైతులనుంచి శిస్తు వసులు చేసేవారు. వస్తుమార్పిడికి విరుద్ధంగా డబ్బులు కట్టాలంటూ హింసించేవారు. దీనికి వ్యతిరేకంగా 1845లో సైరా.. నరసింహారెడ్డి నాయకత్వంలో ఉద్యమం మొదలైంది.
ఆయన వెంట ప్రజలు సాయుధులై నిలిచారు. ఈ ఉద్యమం ఏడాది సాగింది. వడ్డే ఓబన్న తన స్నేహితుడికి బాసటగా ఉద్యమంలో ముందువరుసలో నిలిచారు. ఆయనను ఈ పోరాటానికి సైన్యాధికారిగా సైరా.. ప్రకటించారు. నరసింహారెడ్డి తన అనుచరులతో కలిసి 1846 జూలై 10న కోవెలకుంట్ల సబ్ ట్రెజరీపై దాడి చేశారు. అక్కడినుంచి 3నెలల పాటు, అంటే అక్టోబరు 6 వరకు బ్రిటీష్ పాలకులతో వీరోచితంగా పోరాడారు. అధికారులపై మెరుపు దాడులు సాగించిన తర్వాత నల్లమలలోకి వెళ్లి ఓబన్న నాయకత్వంలో కొత్త దాడులకు వ్యూహరచన సాగించేవారు. దీంతో తెల్లదొరలు ఇతర ప్రాంతాల్లోని బలగాలను రప్పించి అణచివేతను తీవ్రతరం చేశారు. ఇన్‌ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటుచేసుకుని పోరాటవీరుల సమాచారం సేకరించారు. సంజామల మండలం గిద్దలూరు గ్రామ సమీపంలోని జగన్నాథకొండ వద్ద నరసింహారెడ్డి, ఓబన్న తమ బలగాలతో ఉన్నట్టు ద్రోహి ఇచ్చిన సమాచారంతో బ్రిటిష్ బలగాలు అక్కడకు పెద్దఎత్తున చేరుకున్నాయి. సైరా సేనలను ఓబన్న.. బ్రిటిష్ సైన్యాన్ని లెఫ్ట్‌నెంట్ వాట్సన్, కెప్టెన్ రసూల్ నడిపారు. 1846 అక్టోబరు 6న జగన్నాథకొండ వద్ద భీకర పోరాటం సాగింది. నరసింహారెడ్డి అనుచరుల్లో చాలామంది మరణించారు. అయినా, ఓబన్న, సైరా.. చివరివరకు పోరాడారు. ముందుగా వడ్డే ఓబన్న వీరమరణం పొందారు. అప్పటికి ఆయన వయసు 39 ఏళ్లు. ఆ తర్వాత నరసింహారెడ్డిని బందీగా పట్టుకుని కోవెలకుంట్లలో గుమ్మానికి ఉరితీశారు.
జయంతి నేడు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి ఆయనను స్వాతంత్ర సమరయోధునిగా గుర్తించింది.
_*-కప్పాటి పాండురంగా రెడ్డి*_
తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు🌤️
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚
. #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు
*చేతిలో ఫోన్ లేదు.*
*జేబులో డబ్బు మోతాదు కాదు.*
*ఇంట్లో ఏసీలు, కూలర్లు లేవు.*
అయినా సరే…
ఆ తరం మనకంటే వందేళ్లు ఎక్కువ ఆనందంగా, ఎక్కువ ఆరోగ్యంగా జీవించింది.
ఇది కేవలం నాస్టాల్జియా కాదు. ఇది ఒక నిజం.
ప్రశ్న ఒక్కటే.
*అసలు వారి రహస్యం ఏమిటి?*
ఈ తరం వెళ్లిపోతే, మనకు ప్రేమను పంచే చేతులు ఉండవు.
మన కథలను ఓపికగా వినే చెవులు ఉండవు.
మన చిన్న విజయాలను చూసి కన్నీరు పెట్టే కళ్ళు ఉండవు.
మన కళ్ల ముందే ఒక శకం నిశ్శబ్దంగా ముగిసిపోతోంది.
మనకు జన్మనిచ్చిన, జీవితాన్ని నేర్పిన గొప్ప తరం ఒక్కొక్కరిగా శాశ్వత వీడ్కోలు చెబుతోంది.
వారితో పాటు వారి విలువలు, వారి ఆప్యాయతలు, వారి జీవనశైలి కూడా నెమ్మదిగా మసకబారుతోంది.
మనము ఏం కోల్పోతున్నామో నిజంగా తెలుసా?
ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం.
*ఆ తరం గొప్పతనం ఏమిటి?*
అది అన్నం తినే ముందు పక్కవాడి ఆకలిని గుర్తించిన తరం.
ఇల్లు చిన్నదిగా ఉండేది.
కానీ మనుషుల మధ్య ప్రేమ విశాలంగా ఉండేది.
వాళ్లు ఎప్పుడూ
*“నేను”* అనలేదు.
ఎప్పుడూ
*“మనము”* అని జీవించారు.
ఉమ్మడి కుటుంబాల్లో
*కష్టాలు పంచుకున్నారు*
*సుఖాలు పంచుకున్నారు*
*కన్నీళ్లను దాచుకోలేదు*
*ఆనందాన్ని దాచుకోలేదు*
ఆస్తుల కంటే ఆప్యాయతలకు విలువ ఇచ్చిన తరం అది.
డబ్బు కన్నా బంధాలు ముఖ్యమని నమ్మిన తరం.
*విద్య, జ్ఞానం, జీవన బుద్ధి*
వాళ్లకు పెద్ద పెద్ద డిగ్రీలు ఉండకపోవచ్చు. కానీ
*జీవితం అనే పుస్తకాన్ని పూర్తిగా చదివిన తరం అది.*
* గడియారం లేకున్నా – సూర్యుణ్ని చూసి సమయం చెప్పగలిగారు
* క్యాలిక్యులేటర్ లేకున్నా – నోటి లెక్కలతో లాభనష్టాలు చూసుకున్నారు
* ఇంటర్నెట్ లేకున్నా – అపారమైన జ్ఞానాన్ని నిల్వ చేసుకున్నారు
* జీపీఎస్ లేకున్నా – గమ్యాన్ని తప్పకుండా చేరగలిగారు
తెలివి అంటే మార్కులే కాదు అని వాళ్లు మనకు నేర్పారు.
జ్ఞానం అంటే సమాచారం మాత్రమే కాదు, అనుభవమని చూపించారు.
*సంబంధాలు, సంభాషణలు*
ఆ రోజుల్లో చేతిలో మొబైల్ ఫోన్ లేదు.
కానీ
మనసు విప్పి మాట్లాడుకునే స్నేహాలకు లోటు లేదు.
పోస్ట్ కార్డులపై రాసిన నాలుగు వాక్యాలు
ఈరోజు గంటలకొద్దీ మాట్లాడే ఫోన్లకంటే ఎక్కువ ప్రేమను పంచేవి.
* ఎదురుగా కూర్చుని మాట్లాడేవారు
* కళ్ళల్లోకి చూసి నవ్వేవారు
* బాధ ఉంటే దాచుకోకుండా చెప్పేవారు
ఇప్పుడు మన దగ్గర ఫోన్లు ఉన్నాయి.
కానీ మనుషుల మధ్య దూరం పెరిగింది.
*వినోదం, ఆనందం*
టీవీలు లేవు.
ఓటిటి లేదు.
యూట్యూబ్ లేదు.
కానీ
వీధి నాటకాలు ఉన్నాయి.
బుర్రకథలు ఉన్నాయి.
హరికథలు ఉన్నాయి.
మనుషులే వినోదం.
మనుషులే సంబరాలు.
*ఆరోగ్యం, జీవనశైలి*
ఏసీలు లేవు.
కూలర్లు లేవు.
ఆరుబయట మంచం వేసుకుని
చల్లగాలిలో
జాబిల్లి వెలుగులో
హాయిగా నిద్రపోయిన తరం అది.
మినరల్ వాటర్ తెలియదు.
బావి నీళ్లు, చెరువు నీళ్లు తాగారు.
రాళ్లు తిన్నా అరిగించే జీర్ణశక్తి వాళ్లది.
* పిజ్జాలు కాదు
* బర్గర్లు కాదు
* ప్యాకెట్ ఫుడ్ కాదు
పేలాలు, పీచు మిఠాయిలు, జొన్న రొట్టెలు, సజ్జ అన్నం.
జిమ్‌లకు వెళ్లలేదు కానీ
రోజంతా చాకిరి చేసి
చెమట చిందించి
శరీరాన్ని దృఢంగా ఉంచుకున్నారు.
అందుకే
* బీపీలు తక్కువ
* షుగర్లు తక్కువ
* హార్ట్ ఎటాక్లు అరుదు
* కార్పొరేట్ హాస్పిటల్స్ అవసరం లేదు
*పిల్లల పెంపకం, క్రమశిక్షణ*
ఆరు ఏళ్లు వచ్చే వరకు
పిల్లల బాల్యం ఆటపాటలతో నిండేది.
ఆ తర్వాత
పైసా ఫీజు లేని సర్కారు బడులు.
అక్కడి నుంచి దేశానికి ఉపయోగపడే మనుషులు.
* టీచర్ దండిస్తే – ఇంట్లో ప్రశ్నలు కాదు
* ఇంట్లో మరో రెండు దెబ్బలు
* క్రమశిక్షణే జీవితానికి పునాది
అందుకే ఆ తరం పిల్లలు
దృఢంగా ఎదిగారు.
బాధ్యతగా మారారు.
*నీతులు, విలువలు*
వ్యాపారంలో కల్తీ లేదు.
జీవితంలో మోసం లేదు.
నీతి, నిజాయితీ వాళ్ల శ్వాస.
కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు.
త్యాగాలతో పిల్లల భవిష్యత్తును నిర్మించారు.
కులమతాలకు అతీతంగా
అందరినీ మనుషుల్లా చూసిన తరం అది.
*ఈరోజు పరిస్థితి*
ఆ తరం
లాంతర్ల కాంతితో
మన జీవితాల్లో వెలుగు నింపింది.
ఈ తరం
కరెంటు దీపాల వెలుగులో
చీకట్లను పెంచుకుంటోంది.
వెళ్తున్న ఆ తరం నుంచి
ప్రేమను
విలువలను
ఓర్పును
సహనాన్ని
నేర్చుకోకపోతే
మన భవిష్యత్తు నిజంగా అంధకారమే.
*మన బాధ్యత*
* ఉన్నంతకాలం వాళ్లను ప్రేమగా చూసుకుందాం
* వాళ్ల మాటలను ఓపికగా వినుదాం
* వాళ్లు నడిచిన బాటలో కొంతైనా నడుద్దాం
*పాత తరాన్ని గౌరవించండి.*
వాళ్లే మన మూలాలు.
వాళ్లే మన బలం.
ఈ కథ మీ మనసును తాకితే
ఒక్కసారి ఆ తరం మనుషుల్ని గుర్తు చేసుకోండి.
వాళ్ల చేతిని ప్రేమగా పట్టుకోండి.
అదే వాళ్లకు మనం ఇవ్వగలిగిన అతిపెద్ద గౌరవం.
#కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy)
*🌤️ శుభ శుభోదయం 🙏🏻*
✨ ఏకాంతాన్ని ఇష్టపడు..
అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది!
⏳ కాలంతో స్నేహం చెయ్యి..
ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది!
❤️ భవిష్యత్తుకు ప్రేమను పంచు..
అది నీ జీవితగమ్యానికి దారి చూపుతుంది!
*-కప్పాటి పాండురంగారెడ్డి*
🌤️🌻🌻🌻🌻🌻🌻🌻🪷
#కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు
_భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త,రచయిత్రి_
*సావిత్రిబాయి పూలే గారి జయంతి మరియు మహిళా విముక్తి దినోత్సవ శుభాకాంక్షలు👏*
ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫులే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసారు. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. క్రాంతి బాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రీబాయి ఫూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొందుతూనే ఉంటుంది.
సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా వారికి మా గణ నివాళి👏
తమ విశ్వసనీయ
_*కప్పాటి పాండురంగా రెడ్డి*_
తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు🌤️
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚
#కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు
*✨ 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ✨*
🟢 కొత్త దారుల్లో, కొంగొత్త ఆశలతో...
సరికొత్త ఆశయాలతో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తున్న ఈ శుభ సమయాన... 🎊గతాన్ని మించిన ఘనత మీ సొంతం కావాలని,భవిష్యత్తును జయించే పథం మీది అవ్వాలని,సమున్నత లక్ష్యాలు సత్ఫలితాలివ్వాలని ఆశిస్తూ...
🔶 తెలంగాణ రాష్ట్ర సాధనలా...
మరుపురాని మరెన్నో విజయాలతో
తెలంగాణ ప్రజలు మురవాలని,
సంక్షేమం, సమన్యాయం సకల జనులకు దక్కాలని...
✊ "జనహితం మన పథం" అనే తలంపుతో కవితక్క తలపెట్టిన 'జనం బాట' విజయం మనందరి దవ్వాలని కోరుకుంటూ...
అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర
*శుభాకాంక్షలు! 💐*
🙏 ఇట్లు
తమ విశ్వసనీయ,
#తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy)
*కప్పాటి పాండురంగారెడ్డి*
తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు🌤️
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ 📚
🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚
#కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు
*కొన్ని గంటల దూరంలో నూతన సంవత్సరం నిలబడి ఉంది...*
*(2025) వెనక్కి తిరిగి చూస్తే గతం గాయాలతో గుర్తు చేస్తుంది, వర్తమానం భారంగా ఊపిరి తీస్తుంది...*
*మనసులో అనుభవాల అలజడి.. నిశ్శబ్దంగా ఆలోచనలు... కళ్ల మాత్రం ముందే నిలిచిన భవిష్యత్తు వైపు చూస్తూ... నిశ్శబ్దంగా ఉన్నా, ఆలోచనలు శబ్దం చేస్తున్నాయి...*
*నేటి శ్రమే రేపటి విజయానికి పునాది, అని తెలుసుకున్న చూపు ఇది...*
*భయంతో కాదు.. ఓ చిన్న ఆశతో ఎదురు చూస్తున్నాయి..2026 .....కోసం......*
*Wishing y'all a highly successful year of 2026*
— _*కప్పాటి పాండురంగారెడ్డి*_
తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు🌤️
#తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy)
*🛑 2026 న్యూ ఇయర్ వినోదం.. కారాదు విషాదం 🛑*
🍾🥃 "కొత్త ఏడాది కదా అని 'ఫుల్'గా మద్యం సేవించి వాహనాలు నడపొద్దు..🚗"
🚘🤾♂️ "రోడ్డు ప్రమాదాలకు కారణమై అమాయకుల ప్రాణాలను తీయొద్దు.."
🏍️ "ఎంజాయ్ పేరుతో ప్రమాదకరమైన బైక్ రేసింగ్‌లు నిర్వహించవొద్దు.."
🤔 "మైనర్ డ్రైవింగ్ నేరం.. పిల్లలకు వాహనాలు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఆలోచించాలి.."
✨ మీ న్యూ ఇయర్ ను రోడ్డు ప్రమాదరహితంగా ప్రారంభించండి! 🙏🏻
శుభాకాంక్షలతో...💐
తమ విశ్వసనీయ
*-కప్పాటి పాండురంగా రెడ్డి*
తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు 🌤️
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ 📚
🚔🚗🚕🚙🚓🛵🏍️🚘🚓🚑
#కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు
*🌤️శుభ శుభోదయం👏*
*"🗣️పెద్దలమాట"🙏🏻*
*విలువ ఇవ్వని బంధాలకు, బాధ్యత లేని బాంధవ్యాలకు, అబద్ధాలాడే అనుబంధాలకు మౌనంగా, దూరంగా ఉండటం మంచిది.*
*బతకడానికే మనం తినాలి, పదిమందికి మేలు చేసేందుకే బతకాలి.*
*దుష్టులు భయానికి, సజ్జనులు ప్రేమకు లొంగుతారు.*
*సత్యం కోసం దేన్నయినా వదులుకోవచ్చు. కానీ సత్యాన్ని దేని కోసం త్యాగం చేయరాదు.*
*ప్రతి మనిషి దీపంలా వెలగాలి. పదిమందికి వెలుగునివ్వాలి.*
తమ విశ్వసనీయ
_*-కప్పాటి పాండురంగారెడ్డి*_
తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు🌤️
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు












![కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) - ఇయరెవినోదం . ನ್ಯ ' కందీషవదం కవ్వశంట్ల కవిలశ్క ಘು ತಲಂಗಾಣ ಜಾಗೈೃಶಿ ವೈನನ್ಹಾನ5 ಅಎಖರಾಲು కొత్త ఏడాది కదా అని ఫులగా మద్యం సేవించి వాహనాలు నడపాద్దు రోడ్డు ప్రమాదాలకు కారణమై అమాయకుల ప్రాణాలను తీయొద్దు ఎంజాయ్ పేరుతో ప్రమాదకరమైన ACCIDENT బైక్రేసింగిలు నిర్వహించవొద్దు. మైనర్ డ్ెవింగ్నేరం . పిల్లలకు వాహనాలు . ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఆలోచించాలి: Mana reldngang Mana CM STOP ఇయీరను ನ್ రడ్డు ప్రమోదరహితంగా ప్రారంభించండి] కప్పాటి పాండురంగా రెడ్డి తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఇయరెవినోదం . ನ್ಯ ' కందీషవదం కవ్వశంట్ల కవిలశ్క ಘು ತಲಂಗಾಣ ಜಾಗೈೃಶಿ ವೈನನ್ಹಾನ5 ಅಎಖರಾಲು కొత్త ఏడాది కదా అని ఫులగా మద్యం సేవించి వాహనాలు నడపాద్దు రోడ్డు ప్రమాదాలకు కారణమై అమాయకుల ప్రాణాలను తీయొద్దు ఎంజాయ్ పేరుతో ప్రమాదకరమైన ACCIDENT బైక్రేసింగిలు నిర్వహించవొద్దు. మైనర్ డ్ెవింగ్నేరం . పిల్లలకు వాహనాలు . ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఆలోచించాలి: Mana reldngang Mana CM STOP ఇయీరను ನ್ రడ్డు ప్రమోదరహితంగా ప్రారంభించండి] కప్పాటి పాండురంగా రెడ్డి తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు - ShareChat కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) - ఇయరెవినోదం . ನ್ಯ ' కందీషవదం కవ్వశంట్ల కవిలశ్క ಘು ತಲಂಗಾಣ ಜಾಗೈೃಶಿ ವೈನನ್ಹಾನ5 ಅಎಖರಾಲು కొత్త ఏడాది కదా అని ఫులగా మద్యం సేవించి వాహనాలు నడపాద్దు రోడ్డు ప్రమాదాలకు కారణమై అమాయకుల ప్రాణాలను తీయొద్దు ఎంజాయ్ పేరుతో ప్రమాదకరమైన ACCIDENT బైక్రేసింగిలు నిర్వహించవొద్దు. మైనర్ డ్ెవింగ్నేరం . పిల్లలకు వాహనాలు . ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఆలోచించాలి: Mana reldngang Mana CM STOP ఇయీరను ನ್ రడ్డు ప్రమోదరహితంగా ప్రారంభించండి] కప్పాటి పాండురంగా రెడ్డి తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఇయరెవినోదం . ನ್ಯ ' కందీషవదం కవ్వశంట్ల కవిలశ్క ಘು ತಲಂಗಾಣ ಜಾಗೈೃಶಿ ವೈನನ್ಹಾನ5 ಅಎಖರಾಲು కొత్త ఏడాది కదా అని ఫులగా మద్యం సేవించి వాహనాలు నడపాద్దు రోడ్డు ప్రమాదాలకు కారణమై అమాయకుల ప్రాణాలను తీయొద్దు ఎంజాయ్ పేరుతో ప్రమాదకరమైన ACCIDENT బైక్రేసింగిలు నిర్వహించవొద్దు. మైనర్ డ్ెవింగ్నేరం . పిల్లలకు వాహనాలు . ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఆలోచించాలి: Mana reldngang Mana CM STOP ఇయీరను ನ್ రడ్డు ప్రమోదరహితంగా ప్రారంభించండి] కప్పాటి పాండురంగా రెడ్డి తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_997368_202dfea6_1767187907527_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=527_sc.jpg)
