
కొండ.సతీష్
@laddu_nani
తల్లి తండ్రి గౌరవించండి -వారు కనిపించే దైవము .ఆడ పిల్లలను కాపాడండి.
దేవీ మహాత్మ్యంలోని "నారాయణీ స్తుతి" లోనిది. ఇది అమ్మవారిని స్తుతించే అత్యంత శక్తివంతమైన శ్లోకాలలో ఒకటి.
శ్లోకం
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే ||💐శుభోదయం 💐🙏🏻 #😃మంచి మాటలు #🙏మన సాంప్రదాయాలు #✍️కోట్స్ #👫 బంధం #😇My Status
#😇My Status #😃మంచి మాటలు #✍️కోట్స్ #👫 బంధం #🙏మన సాంప్రదాయాలు #🙏మన సాంప్రదాయాలు #😇My Status #👫 బంధం #✍️కోట్స్ #😃మంచి మాటలు
🌹ఔను అమ్మను కంటికి రెప్పలా కాచుకోవాలి అడుగులు కంది పోనివ్వకుండా కలకాలం కుమారునిగా కుడి భుజమై సేవ చేయాలి.
🌹ఆదిదేవునిలా అభిమానించి అంతకు మించి ఆరాధించాలి.
*🙏శివానీ శివోహం శివోహం🙏*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ #😇My Status #😃మంచి మాటలు #✍️కోట్స్ #👫 బంధం #🙏మన సాంప్రదాయాలు
*🔔శుభోదయం🔔*
*_మనకు బాగా ఆకలి వేసినప్పుడు "భోజనం", బాగా దాహం వేసినప్పుడు "నీళ్లు" చాలా రుచిగా అనిపిస్తాయి._*
*_అలాగే మనకు అవసరం ఉన్నప్పుడు ఆ అవసరాన్ని తీర్చే "మనిషి" విలువ కూడా చాలా తెలుస్తుంది."_* #✍️కోట్స్ #🙏మన సాంప్రదాయాలు #👫 బంధం #😃మంచి మాటలు #😇My Status
----------------------------
మనుషుల బంధాలు మనుషులకు అనుబంధాలతో బలమైన సంకెళ్ళను.
మనసుకి తెంచుకోలేని ప్రేమ కంచేలను వేసి
జీవితాంతం బానిసలుగా మారుస్తాయి...
వీటి నుండి బయట పడలేక ఒంటరిగా
ఉండలేక మనిషి బతుకు నరకయాతనే చచ్చేవరకు...!
*శుభోదయం*
#🙏మన సాంప్రదాయాలు #😇My Status #😃మంచి మాటలు #👫 బంధం #✍️కోట్స్
*_నువ్వు డౌనైతే కౌంట్ డౌనే!_*
ఇచ్చేసావా మొత్తం నీ సిరి..
ఇక నీ పని సరి..
ఇంకేమి మిగిలున్నా ఇవ్వు..
*_సలహా మినహా..!_*
ఆఫీసులో పదవీ విరమణ
ఇంట్లో పెదవీ విరమణ..
విధులకు గుర్తింపుగా పెన్షన్
ఇంట్లో మొదలయ్యే టెన్షన్
అక్కడ చివరి రోజున సన్మానం
ఇక్కడ మొదటి రోజు నుంచే అవమానం..
ఇన్నాళ్లు విధినిర్వహణ...
*_ఇకపై కష్టసుఖాల_*
*_ఆరోహణ అవరోహణ...!_*
వృద్ధాప్యమంటే మంటే..
పంటి బిగువున బాధ..
కంటిలో కనిపించని ధార..
గుండెల్ని పిండేసే వేదన...
వడలే మోము..కదిలే పళ్లు..
అవయవాలకు తెగుళ్ళు..
మనసుకు పగుళ్లు..
భారంగా గడిచే పగళ్లు..
నిద్రపట్టని రాత్రుళ్ళు..
నెమరువేసుకుంటూ
గతకాలపు స్మృతులు..
*_అనుభవిస్తూ వర్తమానపు_*
*_చేదు అనుభూతులు!_*
*_వృద్ధాప్యం.._*
నీకుగా అనిపించకపోయినా
ఇంట్లో వారు వేసేసే ముద్ర..
ఆపై శాశ్వత నిద్ర..
ఊరు పొమ్మంటుంది
కాడు రమ్మంటుంది..
నరకమో.. స్వర్గమో
అది చేరేలోగానే
ఇంట్లో మొదలయ్యే నరకం
మారే బంధువుల వాలకం..!
మెయిన్ హాలు నుంచి
మూల గదిలోకి మారే
నీ మకాం..
అప్పటి నుంచి
అన్నిటికీ బీ కాం
ఫించను ఠంచనుగా వస్తే ఓకే
లేదంటే అధ్వానపు బ్రతుకే..
ఇన్నాళ్లు నీ వారి కోసం
నువ్వు పెట్టిన పరుగు..
ఇప్పుడేమి మిగిలేను
నిన్ను చూస్తేనే విసుగు...
పనులకైనా
పనికొస్తుందేమో అమ్మ..
*_నాన్న ఉత్తి దిష్టిబొమ్మ!_*
వ్యాపారంలో..
మోసాలు సాగినంతకాలం
హవాలా..
అన్నీపోతే దివాలా..
జీవితంలో అంతా
బాగున్నప్పుడు రంగీలా..
లేదంటే గిలాగిలా..
వృద్ధాప్యం కారాదు శాపం..
అనిపించుకోవద్దు
అయ్యో పాపమని..
సంపద ఉంటే తప్పేను ఆపద
ఆపై ఆరోగ్యమే మహాభాగ్యం
ఈ రెండూ కరవైతే
ముసలి కాలం
కష్టనష్టనికృష్ఠాల మిశ్రమం..
అదిగో పిలుస్తోంది వృద్ధాశ్రమం..
*_నీ జీవిత_*
*_చరమకాల ఆరామం!_*
************************
_అంతర్జాతీయ_
_సీనియర్ సిటిజెన్స్ డే.. #😇My Status #✍️కోట్స్ #👫 బంధం #😃మంచి మాటలు #🙏మన సాంప్రదాయాలు
🌹☘️🌹*శ్రీ మాత్రే నమః*🌹☘️🌹
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*🌺స్త్రీ ధరించే గాజుల మహత్యం🌺*
*ధనవంతులు రెండు చేతులనిండా ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా... ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టి (గాజు)గాజులు వేసుకోవాలని శాస్త్రం చెప్తోంది. అమ్మవారి పూజల్లో పసుపు, కుంకుమలతోపాటు గాజులను కూడా ఉంచి పూజించడం మన ఆచారం. ముత్తయిదువులకు గాజులిచ్చి గౌరవించే సాంప్రదాయం మనది.*
*ఎంత పేదింటి అన్నయినా... చెల్లెలిని చూడడానికి వచ్చి, తిరిగి వెడుతున్నప్పుడు... ఓ పదో, పరకో చేతిలోపెట్టి... గాజులేయించకోమ్మా’ అంటాడు. ఇలా స్త్రీ జీవితంలో గాజులు చోటుచేసుకుని, వారికి అందాన్నిస్తూ, జాగ్రత్తలు నేర్పుతూ, తాము పగలకుండా, మన సాంప్రదాయాలు పగలకుండా కాపాడుతూ వస్తున్న గాజులను గౌరవిస్తే మన సాంప్రదాయాలను గౌరవించినట్టే.*
*గాజుల ధరించడం వలన స్త్రీలకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. గాజులు ఒక్క స్త్రీ కే కాదు , పూర్వ కాలంలో పురుషులు కూడా ధరించేవారట. రాను, రాను ఈ* *ఆచారం స్త్రీలకు మాత్రమే అనేలా వచ్చింది.*
*స్త్రీ మంచి చీరకట్టుకొని , ఎన్ని నగలు మెడలో ధరించినా , చేతులకు గాజులు లేవంటే అందమనేది రాదు కదా ?గాజులు ధరించడం అనే సాంప్రదాయం , పుట్టిన పిల్లల నుండి వస్తున్నదే కదా ? ఎలా అంటారా ? పుట్టిన బిడ్డలకు దిష్టి తగలకుండా చేతికి నల్లని గాజులు వేస్తారు. అది కేవలం దిష్టి కోసమే కాదు , ఆ గాజులనుండి వచ్చే సవ్వడులు, పసిపిల్లలను పలకరించి వారిలో బోసినవ్వులను పూయిస్తాయట.*
*గాజులు ధరించడం వలన స్త్రీలలో నడవడిక మారుతుందట. ఎలా అంటే గాజులు ఎంత సున్నితం గా ఉంటాయో,గాజులు ధరించిన స్త్రీ అవి పగల కుండా సున్నితం గా నడుస్తుంది , అలాంటి నడకవలన , నడవడిక మారుతుందట.*
*చేతి నిండా గాజులు వేసుకొని తిరుగుతుంటే సాక్ష్యాత్తు శ్రీ మహాలక్ష్మి ఇంటిలో తిరుగుతుందట. గాజులు అందంతో పాటుగా స్త్రీ సౌభాగ్యం ప్రతిబింబిస్తుంది. అందుకే గాజులు పగులకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.*
*శ్రీమంతం లో మట్టి గాజులు ఎందుకు తొడుగుతారు... అనే దానికి మరో అద్బుతమయిన కారణాలు ఉన్నాయి...*
*అయిదవ నెలలో స్త్రీ గర్భం లో వుండే పిండానికి ప్రాణం వస్తుంది, శిశువు ఎంత సున్నితం గా వుంటుందో ,తనను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, గాజుల రూపం లో(గాజులు సున్నితమైనవే కదా)తెలిజేస్తారట. మోచేతికి మరియు మణికట్టుకు మధ్య ప్రాంతం లో వుండే నాడులు గర్బాశయ నాడులతో అనుసంధానం అయి ఉంటాయట. స్వల్ప వత్తిడి గాజుల ద్వారా కలుగజేయడం వలన గర్భాశయంలోని నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమయి,గర్బం లోని కండరాలు సరిగా పనిచేసే దానికి దోహదపడుతాయట.*
*అంతేకాదు గాజులు ధరించిన చేతులు గర్భానికి దగ్గరగా ఉంటాయి కనుక గర్బం లో వుండే శిశువు కు గాజుల సవ్వడి స్పష్టం గా వినబడి ,శిశువు వినికిడి శక్తి పెరిగేందుకు సహాయపడుతాయి.*
🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🔔🔔🔔🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻
#👫 బంధం #🙏మన సాంప్రదాయాలు #😃మంచి మాటలు #✍️కోట్స్ #😇My Status
*_🎯తృప్తిని మించిన సంపద లేదు_* 🎁✨🎈
🕉️🦚🌻🌹💎🌈🚩
*🍁మనిషికి కోరికలు అనంతం.జీవితం నీటి బుడగ వంటిదనితెలిసీ కలకాలంబతకాలనుకొంటాడు.నిరంతరం సుఖాల్లో తేలియాడాలని తపిస్తాడు. తేలికగా తన కోరికలు తీరే మార్గాలు అన్వేషిస్తాడు*
*భగవంతుడి దయ ఉంటే తన కోరికలు తీరతాయన్న స్వార్థంతో పూజిస్తాడు.* *భగవంతుడు* *దయామయుడు. అందరి ప్రార్థనలు వింటాడు. ఎవరికి* *ఎంత ప్రాప్తమో అంతే అనుగ్రహిస్తాడు. నిస్వార్థంగా భగవంతుని నమ్ముకున్నవారికి అడగకపోయినా అనుగ్రహిస్తాడు.*
*కైకసి పుత్రులైన రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మదేవుణ్ని సంతోషపెట్టి వరాలు పొందాలని ఘోరమైన తపస్సు ప్రారంభిస్తారు.* *రావణుడు వెయ్యి సంవత్సరాల తపస్సు పూర్తికాగానే ఒక తలను పూర్ణాహుతి కావిస్తూ పదివేల సంవత్సరాలు తపస్సు చేసి తన పదో తలను కూడా ఆహుతి చేయబోతుండగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటాడు. తనకు మరణం లేని వరం ప్రసాదించమంటాడు.*
*అలాంటి వరం ప్రసాదించడం అసాధ్యమంటూ మరేమైనా కోరుకొమ్మంటాడు బ్రహ్మ. మానవులు తనకు గడ్డిపరకల వంటివారని, కనుక దేవతలు, *గరుడ, గంధర్వ, పన్నగ, యక్షుల చేతిలో చావు లేకుండా వరం కోరుకుంటాడు రావణుడు. అలాగేనని అనుగ్రహించిన బ్రహ్మ రావణుడు బలి ఇచ్చిన తొమ్మిది తలలు తిరిగి*
*పుట్టేలా కూడా వరం ఇస్తాడు.*
*కుంభకర్ణుడు గ్రీష్మ రుతువులో అగ్ని మధ్య నిలబడి, వర్షరుతువులో వానలో తడుస్తూ, శిశిరరుతువులో* *నీటి నడుమ నిలబడి పదివేల సంవత్సరాలు తపస్సు* *చేస్తాడు.*
*అతడి తపస్సుకు మెచ్చి పరమేష్టి వరమీయ సంకల్పించగానే- అతడికి వరాలు ప్రసాదించవద్దని దేవతలు అడ్డుపడతారు. సరస్వతీదేవిని కుంభకర్ణుడి నాలుకపై ప్రవేశపెట్టి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే- నిర్దయ బదులు సరస్వతీదేవి ప్రేరణతో నిద్దుర కావాలంటాడు కుంభకర్ణుడు. తథాస్తు అంటాడు కమలాసనుడు.*
*విభీషణుడు ఒంటికాలిపై నిలబడి అయిదు వేల సంవత్సరాలు, సూర్యుడి గతిని అనుసరించి తిరుగుతూ మరో అయిదువేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ వరం కోరుకొమ్మంటే విభీషణుడు కష్టాలు అనుభవిస్తున్న సమయంలోనూ తన బుద్ధి ధర్మమందే నిలిచి ఉండాలని, సర్వకాల సర్వావస్థల్లో తన బుద్ధి ధర్మమార్గాన్ని వీడిపోకుండా ఉండేలా అనుగ్రహించమని కోరతాడు.*
*ముగ్గురు సోదరులు ఒకేసారి పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసినా వారి బుద్ధులను బట్టి వరాలు పొందగలిగారు.*
*లోకాలను జయించి చిరంజీవి కావాలనుకున్న రావణుడి కోరిక నెరవేరలేదు. కోరకుండానే చిరంజీవి కాగలిగాడు విభీషణుడు. కుంభకర్ణుడు శయన మందిరంలో నిద్రావస్థలో ఉండిపోయాడు.*
*‘భగవంతుడి శరణు వేడుతున్నవారు పరమేశ్వరుడి ప్రీతి కొరకు వేచి ఉండాలి. తమ ఇచ్ఛానుసారం ఈశ్వరుణ్ని జరిపించమని కోరడమంటే ఆయనను శాసించినట్లవుతుంది. ఆయనను ఒప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరికి ఎప్పుడు ఏది అనుగ్రహించాలో భగవంతుడికి తెలుసు’ అన్న రమణ మహర్షి బోధను అర్థం చేసుకున్నవారికి- భగవంతుణ్ని కోరికలు లేని శరణాగతి వేడుకోవాలని అవగతమవుతుంది.*
*తృప్తిని మించిన సంపద లేదు. అంతులేని కోరికలు కోరుకుంటూ తీరడం లేదని ఆవేదన చెందేవారికి జీవితమంతా ముళ్లబాటే. భగవంతుడు ప్రసాదించిన శక్తియుక్తులను వినియోగించుకుంటూ తృప్తితో జీవనం సాగించేవారికి ఆనందం వెన్నంటే ఉంటుంది.*
🕉️🦚🌻🌹💎🌈🚩 #🙏మన సాంప్రదాయాలు #😇My Status #✍️కోట్స్ #😃మంచి మాటలు #👫 బంధం
*శ్రీకృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు, ఆయన శరీరం పంచభూతాలలో కలిసిపోయింది, కానీ ఆయన గుండె సాధారణంగా జీవించి ఉన్న మనిషిలా కొట్టుకుంటుంది మరియు ఆయన ఇంకా ఈ లోకంలో సాధారణం గానే జీవించి ఉన్నాడు అనిపించేలా కొట్టుకుంటుంది. ఆయన గుండె ఈ రోజు వరకు కూడా సురక్షితంగా ఉంది, ఇది చాలా తక్కువ మందికి తెలుసు.*
*కొయ్య_విగ్రహంలోపల జగన్నాథుడి అంశగా నివసిస్తాడు.*
*మహాప్రభు యొక్క గొప్ప రహస్యం ఇక్కడ స్వామి వారి స్థానం బంగారు_చీపురుతో_శుభ్రపరచడం_జరుగుతుంది.*
*మహాప్రభు_జగన్నాథ్ (శ్రీ కృష్ణుడు)ని కలియుగ దేవుడు అని అంటారు.*
*మహాప్రభు విగ్రహాన్ని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు,ఆ సమయంలో పూరీ నగరం మొత్తం చీకటిగా మారుతుంది అంటే నగరం మొత్తం లైట్లు ఆపివేయబడతాయి, లైట్లు ఆపివేయబడిన తర్వాత, crpf సైన్యం పహారాలోకి వెళ్లిపోయితుంది ఆ ప్రాంగణం. నలువైపుల నుంచి ఆలయ ప్రాంగణంలోకి* *ఆ సమయంలో ఎవరూ గుడికి వెళ్లలేరు.*
*గుడిలోపల దట్టమైన చీకటి... పూజారి కళ్లకు కట్టు...*
*బ్రహ్మపదార్ధం ఏమిటో నేటికీ ఎవరికీ తెలియదు... ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు.*
*వేల సంవత్సరాలుగా అది ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి బదిలీ చేయబడుతోంది,*
*ఇది అతీంద్రియ పదార్ధం, దీన్ని తాకడం ద్వారా, వ్యక్తి యొక్క శరీరం అద్వితీయంగా శక్తిమంతంగా తయారు అవుతుంది.ఈ అవకాశం 19 సంవత్సరాల తర్వాత వచ్చింది, కొన్నిసార్లు ఇది 14 సంవత్సరాలలో జరిగినప్పటికీ, ఈ సందర్భాన్ని నవ్_కల్వర్ అని పిలుస్తారు,*
*కానీ మహాప్రభు జగన్నాథుని విగ్రహంలో ఏముందో ఇప్పటి వరకు ఏ పూజారి చెప్పలేకపోయారు???*
*మేము అతని చేతిని చేతిలోకి తీసుకున్నప్పుడు, అతను కుందేలులా గెంతుతున్నాడని... అక్కడ కళ్లకు గంతలు ఉన్నాయని... చేతిలో గ్లౌజులు ఉన్నాయని, మాకు మాత్రమే అనిపించిందని కొందరు పూజారులు అంటున్నారు.*
*ఈరోజు కూడా జగన్నాథ యాత్ర సందర్భంగా పూరీ రాజు స్వయంగా బంగారు చీపురుతో ఊడ్చేందుకు వస్తాడు.*
*జగన్నాథుని ఆలయంలోని సింహద్వారం నుంచి లోపలికి తొలి అడుగు వేయగానే లోపల సముద్రపు అలల శబ్దం వినిపించదు, అయితే ఆశ్చర్యం ఏంటంటే... గుడి నుంచి ఒక్క అడుగు బయటకు వేయగానే సముద్రపు శబ్ధం మళ్లీ వినబడుతుంది,*
*మీరు చాలా దేవాలయాల శిఖరాగ్రంపై పక్షులు ఎగురుతూ ఉండడం చూసి వుంటారు కానీ జగన్నాథ దేవాలయం మీదుగా ఏ పక్షి వెళ్లదు, జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది, జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన శిఖరం రోజులో ఏ సమయంలోనైనా నీడ ఉండదు.*
*జగన్నాథుని ఆలయంలోని 45 అంతస్తుల శిఖరంపై ఉన్న ధ్వజాన్ని ప్రతిరోజూ మారుస్తుంటారు, జెండాను ఒక్కరోజు కూడా మార్చకపోయినట్లైతే, 18 సంవత్సరాల పాటు ఆలయం మూసివేయబడుతుందని నమ్ముతారు.*
*అదేవిధంగా, జగన్నాథ దేవాలయం పైభాగంలో సుదర్శన చక్రం కూడా ఉంది, ఇది ప్రతి దిశ నుండి చూసినప్పుడు, మీ వైపుకు ఉంటుంది.*
*జగన్నాథ దేవాలయంలోని వంటగదిలో, ప్రసాదాన్ని వండడానికి 7 మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచుతారు, దీనిని కట్టెల ద్వారా వండుతారు, ఈ సమయంలో పైన ఉన్న కుండలోని వంటకం మొదట వండుతారు.*
*జగన్నాథుని ఆలయంలో ప్రతిరోజూ చేసే ప్రసాదం భక్తులకు తగ్గదు, కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆలయ తలుపులు మూసిన వెంటనే, ప్రసాదం కూడా ముగుస్తుంది మరియు సనాతన ధర్మానికి చెందిన అనేక అద్భుతమైన విషయాలు ఉన్నాయి. సనాతన ధర్మానికి నమస్కారం.*
హరే కృష్ణ #😇My Status #👫 బంధం #😃మంచి మాటలు #✍️కోట్స్ #🙏మన సాంప్రదాయాలు
*భారతీయులారా! వర్షాకాలం సమీపిస్తోంది, ఇది చెట్లు నాటడానికి, పచ్చదనాన్ని పెంచడానికి అద్భుతమైన సమయం!*
*మన ఊరు, వీధి, ఇల్లు, తోటలో ఆరోగ్యానికి మేలు చేసే, సంస్కృతిలో ప్రాముఖ్యత కలిగిన చెట్లు, తీగలు నాటితే మన జీవన విధానం సమతుల్యంగా ఉంటుంది.*
*ఈ చెట్లు, మొక్కలు మనకు ఔషధ గుణాలు, నీడ, పండ్లు, పుష్పాలు, ఆక్సిజన్‌ను అందిస్తాయి.*
*అంతేకాదు, వీటిలో చాలా మొక్కలు మన సంప్రదాయంలో పవిత్రమైనవి. కాబట్టి, ఈ వర్షాకాలంలో మనం అందరం కలిసి ఈ చెట్లను నాటి, మన ఇంటిని, ఊరిని ఆకుపచ్చగా మార్చుదాం!*
―
*I. మన ఊరిలో ఉండాల్సిన చెట్లు*
*1. రావి చెట్టు (Peepal Tree)*
- ప్రాముఖ్యత: పవిత్రమైన చెట్టు, రాత్రిపగలు ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది
- ఆరోగ్య ప్రయోజనాలు: గాలిని శుద్ధి చేస్తుంది, ఉబ్బసం, చర్మవ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది
- ఎక్కడ నాటాలి: గుడి సమీపం, ఊరి చివర, బహిరంగ ప్రదేశాలు
―
*2. మర్రిచెట్టు (Banyan Tree)*
- ప్రాముఖ్యత: జాతీయ వృక్షం, సంప్రదాయంలో ప్రాధాన్యం
- ఆరోగ్య ప్రయోజనాలు: గాలి కాలుష్యాన్ని తగ్గిస్తుంది, మధుమేహం, జీర్ణ సమస్యలకు ఔషధంగా ఉపయోగపడుతుంది
- ఎక్కడ నాటాలి: ఊరి మధ్యలో, సముదాయ కేంద్రాల వద్ద
―
*3. అశోక చెట్టు (Ashoka Tree)*
- ప్రాముఖ్యత: హిందూ-బౌద్ధ సంప్రదాయాల్లో పవిత్రం, పుష్పాల అందం
- ఆరోగ్య ప్రయోజనాలు: గర్భాశయ సమస్యలు, చర్మ వ్యాధులకు ఔషధంగా ఉపయోగపడుతుంది
- ఎక్కడ నాటాలి: ఊరి ప్రవేశ ద్వారం వద్ద, బహిరంగ ప్రదేశాల్లో
―
*II. మన వీధిలో ఉండాల్సిన చెట్లు*
*4. వేప చెట్టు (Neem Tree)*
- ప్రాముఖ్యత: "సర్వరోగ నివారిణి", ఆయుర్వేదంలో విశిష్ట స్థానం
- ఆరోగ్య ప్రయోజనాలు: చర్మవ్యాధులు, దంత ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి మేలు చేస్తుంది
- ఎక్కడ నాటాలి: వీధుల ఇరువైపులా, ఇంటి గేట్ దగ్గర
―
*5. బాదం చెట్టు (దేశీ బాదం)*
- ప్రాముఖ్యత: ఆకర్షణీయమైన ఆకులు, గింజలతో శోభ
- ఆరోగ్య ప్రయోజనాలు: గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు మేలు చేస్తుంది
- ఎక్కడ నాటాలి: రోడ్ల పక్కన, పార్కుల్లో
―
*6. మామిడి చెట్టు (Mango Tree)*
- ప్రాముఖ్యత: పండ్ల రాజు, సంస్కృతిలో ప్రాధాన్యం
- ఆరోగ్య ప్రయోజనాలు: విటమిన్ A, C, ఫైబర్‌తో శక్తివంతమైన పండు, దంత ఆరోగ్యానికి మేలు
- ఎక్కడ నాటాలి: వీధుల ఇరువైపులా, బహిరంగ స్థలాల్లో
―
*III. మన ఇంట్లో ఉండాల్సిన చెట్లు*
*7. మునగ చెట్టు (Drumstick Tree)*
- ప్రాముఖ్యత: సూపర్ ఫుడ్‌గా పరిగణించబడే ఆకులు, కాయలు
- ఆరోగ్య ప్రయోజనాలు: విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం అధికంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి
- ఎక్కడ నాటాలి: ఇంటి వెనుక భాగంలో
―
*8. కరివేపాకు చెట్టు (Curry Leaf Tree)*
- ప్రాముఖ్యత: వంటల్లో అవసరమైనది
- ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణక్రియ మెరుగుదల, జుట్టు ఆరోగ్యం
- ఎక్కడ నాటాలి: ఇంటి ఆవరణలో, కుండీలో
―
*9. ఉసిరి చెట్టు (Amla Tree)*
- ప్రాముఖ్యత: అమృత ఫలం, ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం
- ఆరోగ్య ప్రయోజనాలు: విటమిన్ సి అధికంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది
- ఎక్కడ నాటాలి: ఇంటి తోటలో లేదా ఖాళీ స్థలంలో
―
*10. జామ చెట్టు (Guava Tree)*
- ప్రాముఖ్యత: ఆరోగ్యపరంగా అత్యుత్తమమైన పండు
- ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణక్రియ మెరుగుపరచడం, రక్తపోటు నియంత్రణ
- ఎక్కడ నాటాలి: ఇంటి పెరట్లో
―
*11. నిమ్మ చెట్టు (Lemon Tree)*
- ప్రాముఖ్యత: విటమిన్ సి మూలం, వంటలలో కీలకం
- ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణశక్తి, చర్మ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెంపు
- ఎక్కడ నాటాలి: ఇంటి ఆవరణలో, కుండీలో
―
*12. దానిమ్మ చెట్టు (Pomegranate Tree)*
- ప్రాముఖ్యత: ఆరోగ్యానికి శ్రేష్ఠమైన పండు, సంప్రదాయంగా పవిత్రం
- ఆరోగ్య ప్రయోజనాలు: రక్త ప్రసరణ, హృదయ ఆరోగ్యం, రక్తహీనత నివారణ
- ఎక్కడ నాటాలి: ఇంటి తోటలో
―
*IV. మన తోటలో ఉండాల్సిన మొక్కలు*
*13. తులసి (Holy Basil)*
- ప్రాముఖ్యత: హిందూ సంప్రదాయంలో పవిత్రమైన మొక్క
- ఆరోగ్య ప్రయోజనాలు: జలుబు, దగ్గు, రోగనిరోధక శక్తి పెంపు
- ఎక్కడ నాటాలి: ఇంటి గుమ్మం వద్ద, కుండీలో
―
*14. అలోవెరా (Aloe Vera)*
- ప్రాముఖ్యత: చర్మ, జుట్టు ఆరోగ్యానికి ఉత్తమ ఔషధ మొక్క
- ఆరోగ్య ప్రయోజనాలు: గాయాలకు చికిత్స, జీర్ణక్రియ మెరుగుదల
- ఎక్కడ నాటాలి: తోటలో లేదా కుండీలో
―
*15. పుదీన (Mint)*
- ప్రాముఖ్యత: వంటలో, టీలు, చట్నీలలో ఉపయోగించదగిన మొక్క
- ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణ సమస్యలు, నోటి దుర్వాసన నివారణ
- ఎక్కడ నాటాలి: తోటలో లేదా కుండీలో
―
*16. కొత్తిమీర (Coriander)*
- ప్రాముఖ్యత: ప్రతి వంటలో ముఖ్యమైన పాత్ర
- ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణక్రియ, కొలెస్ట్రాల్ నియంత్రణ
- ఎక్కడ నాటాలి: కుండీలో, తోటలో
―
*17. ఇన్సులిన్ మొక్క (Costus Igneus)*
- ప్రాముఖ్యత: మధుమేహ నియంత్రణకు ప్రసిద్ధ ఔషధ మొక్క
- ఆరోగ్య ప్రయోజనాలు: రక్తంలో చక్కెర స్థాయి తగ్గింపు, శరీర శక్తి పెంపు
- ఎక్కడ నాటాలి: తోటలో లేదా కుండీలో
―
*V. మన ఇంటి గోడలపై పాకవలసిన తీగలు*
*18. తిప్పతిగా (Passion Flower)*
- ప్రాముఖ్యత: అందమైన పుష్పాలు, శాంతి సూచిక
- ఆరోగ్య ప్రయోజనాలు: ఒత్తిడి, నిద్రలేమికి నివారణ
- ఎక్కడ నాటాలి: గోడల దగ్గర, కంచెలపై
―
*19. తమలపాకు (Betel Leaf)*
- ప్రాముఖ్యత: పూజలలో, సంప్రదాయాలలో ప్రధానంగా ఉపయోగపడే తీగ
- ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణ సమస్యలు, నోటి ఆరోగ్యం, ఇన్ఫెక్షన్ల నివారణ
- ఎక్కడ నాటాలి: చెట్ల వద్ద లేదా గోడలపై
―
*20. బంగారు తీగ (Money Plant)*
- ప్రాముఖ్యత: వాస్తు ప్రకారం శుభ సూచిక
- ఆరోగ్య ప్రయోజనాలు: గాలి శుద్ధి, ఇంటి వాతావరణాన్ని మెరుగుపరచడం
- ఎక్కడ నాటాలి: ఇంటి లోపల లేదా గోడలపై
―
*వర్షాకాలంలో చెట్లు నాటడం ఎందుకు ముఖ్యం?*
- వాతావరణానికి ఉపయోగకరం
- ఆరోగ్యానికి ఔషధ ప్రయోజనాలు
- సంప్రదాయ పరిరక్షణ
- పర్యావరణ సమతుల్యత
―
*చెట్లు నాటడం ఎలా?*
- స్థలం ఎంపిక
- మట్టి సిద్ధం
- మొక్క నాటకం
- సంరక్షణ
―
*మనం చెట్లు నాటాలి ఎందుకంటే:*
- భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్, నీడ
- కాలుష్య నివారణ
- ఆరోగ్య రక్షణ
- సంస్కృతిని నిలుపుకోవడం
―
*మన ఊరు, మన వీధి, మన ఇల్లు పచ్చగా మారాలంటే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఈ వర్షాకాలాన్ని వృథా చేయకుండా మొక్కలు నాటుదాం, మన జీవితం పచ్చబడేలా చేసుదాం.* #👫 బంధం #🙏మన సాంప్రదాయాలు #✍️కోట్స్ #😃మంచి మాటలు #😇My Status











