#😇My Status #💝 నీకై ప్రేమతో... #✌️నేటి నా స్టేటస్ #🙆 Feel Good Status #🏞️లైఫ్ is బ్యూటీఫుల్
#💝 నీకై ప్రేమతో... #😇My Status #✌️నేటి నా స్టేటస్ #🏞️లైఫ్ is బ్యూటీఫుల్ #🙆 Feel Good Status
🌿🌹💐🤝😊 బంధం అయినా , స్నేహం అయినా , కలకాలం నిలిచి ఉండాలంటే :------------ ఒకరికి ఒకరంటే ప్రేమగా ఉండాలి ✅ ఒకరిపై ఒకరికి నమ్మకం వుండాలి. ✅ ఒకరంటే ఒకరికి " మన "" అనే ఆత్మీయత ఉండాలి. ✅ ఎదుటివాళ్ల బలహీనతల్ని ఆసరాగా చేసుకోకూడదు. ✅ మనసులను గెలవాలి .. శరీరాలను కాదు. ✅ ఇద్దరి మధ్య ఎలాంటి ఆధిపత్యం ఉండకూడదు. ✅ నమ్మకం , భరోసా ఇద్దరూ కల్పించాలి. ✅ మనిషికి తనకంటూ ఆత్మీయులు ఉన్నారనే భరోసా ఇవ్వాలి. ✅ ఉన్నావా!! , ఎలా ఉన్నావు ? , తిన్నావా !! మరి చేరావా , ఏంటి ? ..
ఇలాంటి రొటీన్ పదాలు వాడుతూ వుండాలి. ✅ నోరారా పలకరిస్తూ వుండాలి. ✅ అనవసరమైన డాo బికాలు పక్కనపెట్టి ఎదుటి వ్యక్తిని ఆప్యాయంగా పలకరించండి. ✅ అప్పుడే స్నేహంలో అయినా , బంధంలో అయినా విడిపోవడాలు ఉండవు. వారి మధ్య ప్రేమ ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది.
__________________________________________
HARI BABU.G
__________________________________________
#✌️నేటి నా స్టేటస్ #😇My Status #💝 నీకై ప్రేమతో... #🏞️లైఫ్ is బ్యూటీఫుల్ #🙆 Feel Good Status
#😇My Status #✌️నేటి నా స్టేటస్ #తెలుసుకుందాం
#✌️నేటి నా స్టేటస్ #🙆 Feel Good Status #💝 నీకై ప్రేమతో... #😇My Status #🏞️లైఫ్ is బ్యూటీఫుల్
*🌑 శనివారం శనేశ్వర దర్శనం ప్రయోజనాలు*
🪔 1. శని దోష నివారణ
శనిగ్రహ దోషం, శని మహాదశ, అంతర్ది ప్రభావం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. మనస్సుకు శాంతి లభిస్తుంది.
🧘♂️ 2. కష్టాలు, అడ్డంకులు తొలగింపు
ఉద్యోగం, డబ్బు, ఆరోగ్యం, కుటుంబం లాంటి విషయాల్లో ఎదురయ్యే అడ్డంకులు నెమ్మదిగా తొలగుతాయి.
💰 3. ధన స్థిరత్వం పెరుగుతుంది
ఆర్థిక ఇబ్బందులు తగ్గి, సేవింగ్స్ పెరగడానికి శనేశ్వర అనుగ్రహం సహాయపడుతుంది.
🌟 4. కర్మ శుభ్రత
శని దేవుడు కర్మ ఫలదాత. ఆయన దర్శనం వల్ల మన చెడు కర్మలు తగ్గి, మంచి కర్మలకు ఫలితం త్వరగా వస్తుంది.
🚶♂️ 5. మానసిక బలం, ఓర్పు పెరుగుతుంది
ఓర్పు, సహనం, సరైన నిర్ణయ శక్తి పెరిగి, మనోవైకల్యాలు తగ్గుతాయి.
⚖️ 6. న్యాయం, ధర్మానికి మద్దతు
సత్యం, నిజాయితీతో ఉండే వారికి శనేశ్వరుడు ప్రత్యేక అనుగ్రహం ఇస్తాడు. అన్యాయం చేసినవారికి శిక్ష, నిజాయితీ ఉన్నవారికి రక్షణ.
🛡️ 7. అపశకునాలు, కష్టకాలం నుంచి రక్షణ
శని దర్శనం వల్ల దూరదృష్టి, జాగ్రత్త, రక్షణ శక్తి పెరిగి ప్రమాదాలు, అనుకోని నష్టాలు నివారిస్తాయి.
🏠 8. కుటుంబ శాంతి
కుటుంబంలో కలహాలు తగ్గి, అన్యోన్యత పెరుగుతుంది.
🙏 9. భక్తి, దైర్యం పెరుగుదల
శనేశ్వరుని దర్శనం మనలో భగవద్భక్తి, ధైర్యం, త్యాగ భావనలు పెంచుతుంది.
__________________________________________
HARI BABU.G
_________________________________________
#🙏 శని భగవానుడు 🙏 #శని భగవానుడు ##🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🔱🕉⚜ దేవుళ్ళ భక్తి స్టేటస్ ⚜🕉🔱 #👋విషెస్
*గీతా జయంతి*
మార్గశిర శుధ్ధ ఏకాదశిని "గీతా జయంతి" గా జరుపుకుంటున్నాము. హిందువులకు ప్రత్యేకమైన పవిత్రగ్రంథం "శ్రీమద్భగవద్గీత"...గీతా మహత్మ్యం గురించి ఇప్పుదు తెలుసుకుందాము.
*మలినే మోచనం పుంసాం జలస్నానం దినే దినే*
*సకృద్ గీతామృతస్నానం సంసారమల నాశనం ||*
ప్రతిదినము చేసే స్నానము వలన దేహముపైని మురికిని శుభ్రపరచుకోవచ్చును. కాని పవిత్రమైన భగవద్గీత అనెడి గంగాజలమున స్నానము చేసిన వాడు సంసార మాలిన్యము నుండి సంపూర్ణంగా ముక్తి నొందుచున్నాడు..అని గీతా మహాత్మ్యము తెలిపినది.
*గీతా సుగీతా కర్తవ్యా కిం అన్య: శాస్త్ర విస్తరై:*
*యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్ విని:సృతా: ||*
భగవద్గీత అనునది శ్రీ కృష్ణ భగవానుని ముఖకమలము నుండి వెలువడినది కావున , మానవులు ఈ ఒక్కదానిని పఠించి, శ్రవణ, మనన , స్మరణము ల ద్వారా సాధన చేసిన చాలును... ఈ యుగమందు మానవులు లౌకిక ప్రయోజనార్ధులై ఉండుంట వలన వేద వాజ్ఞ్మయమును పఠింపలేరు...వారికి గీతగ్రంథ పారాయణమే ముక్తినొసగును.
*భారతామృత సర్వస్వం విష్ణువక్త్రా ద్వినిసృతం*
*గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే ||*
గంగాజలమును సేవించిన వాడే పునర్జన్మ నుంచి ముక్తిని పొందుచుండ , భారతము నందు ప్రవచించబడిన గీతామృతమును గురించి చెప్పనేల? గంగా నది విష్ణు పాదముల నుండి, భగవద్గీత విష్ణు భగవానుని నోటి నుండి వెలువడినవి...అందువలన రేండూ ప్రతి మానవునకు పవిత్రములే..
*సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన:*
*పార్థోవత్స: సుధీర్భోకా దుగ్ధం గీతామృతం మహత్ ||*
సర్వోపనిషత్తుల సారమైన గోవు భగవద్గీత కాగా, గోపాలుడైన భగవానుడు ఆ క్షీరమును పితుకువాదు...అనగా ఆ సారమును మనకు అందిచువాడు. ఆ భగవద్గీతా సారమును పొందు అర్జునుడు గోవత్సము (దూడ) కాగా, పండితులు, భక్తులు, పరమ భాగవతులు,ఆ భగవద్గీతా క్షీరమును పానము చేయువారుగ నున్నారు.
ఇటువంటి అద్భుతమైన మహాత్మ్యం కలది "శ్రీ మద్భగవద్గీత". ఈ గీతా జయంతి నాడు శ్రీ కృష్ణ భగవానుని స్మరించి గీతా పఠనం చేద్దాం..
*అందరికీ ముందుగా"గీతా జయంతి " శుభాకాంక్షలు.*
___________________________________________
HARI BABU.G
__________________________________________
#గీతా జయంతి #భగవద్గీత #భగవద్గీత# గీతా సారాంశం #జై శ్రీ కృష్ణ #🌻🌻🌹#గీతా సారాంశం#🌹🌻🌻# #🙏🏻కృష్ణుడి భజనలు
#🌅శుభోదయం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🎶భక్తి పాటలు🔱
🌹🙏శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
మాతః సమస్త జగతాం మధుకైటభారే:
వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్
సమస్త లోకములకును మాతృదేవతవు, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవు,
మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవు, జగదీశ్వరివి, ఆశ్రితుల కోరికలను నెరవేర్చుదానవు,
శ్రీ వేంకటేశ్వరుని సతీమణివి అయిన ఓ లక్ష్మీదేవీ! నీకు సుప్రభాతమగు గాక...🙏🌹 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🎶భక్తి పాటలు🔱 #🌅శుభోదయం
#✌️నేటి నా స్టేటస్ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎧మ్యూజిక్ #🎷పాత పాటలు








