@manmademeaweapon
@manmademeaweapon

చుట్టూ జనం మధ్యలో మనం

🤔 మంచి మంచి కథలు, 😋 ఫన్నీ, కామెడీ జోక్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి మరి 😁 ఆలస్యం ఎందుకు 🤗

#

📋కథలు

హత్య - 4 మరుసటి రోజు అభి,రితికల ఇంటికి వెళ్ళాడు మాధవ పొద్దున్నే. అప్పుడే నిద్ర లేచిన రితిక "ఇంత త్వరగా వచ్చావేంటి మాధవా.. సర్లే రా.." అని లోపలికి తీసుకెళ్లింది. హాల్లో రితిక ఫైల్ ఉన్న వైపు చూసి ఒక నవ్వు నవ్వి లోనకు వెళ్ళాడు మాధవ. "మాధవా.. నువ్వు రోజు మొక్కలకి నీళ్ళు పోయాలి, వెజ్జీస్ తేవాలి, బట్టలు ఉతకాలి.. ఇల్లు ఊడవటం తుడవడం అంట్లుకి వేరే అమ్మాయి వస్తుంది.." అంది రితిక. తలూపాడు మాధవ. "అర్థం అయ్యిందా..." అంది రితిక. మళ్లీ తలూపాడు మాధవ. అప్పుడు గుర్తొచ్చింది మాధవ మాట్లాడలేడని. "మాధవా.. నాకు ఏదైనా చెప్పాలనుకుంటే సైగ చెయ్యి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా.. పోని రాయడం వచ్చా..?" అంది రితిక. రాదన్నట్లు తలూపాడు మాధవ. అభి కి ఇష్టం లేకపోయినా రితిక కోసం మాధవ పనికి వస్తుంటే ఊరుకున్నాడు. రితిక చాప కింద నీరులా జరిగిన హత్య గురించి ఎవరికీ తెలియకుండా వివరాలు సేకరించడానికి ప్రయత్నిస్తుంది. కొలీగ్స్ చాందిని, ఆకాష్, హేమల దగ్గర మాత్రం ఏం పట్టనట్లు వ్యవహరిస్తోంది. తను సేకరించిన వివరాలు అన్ని ఒక ఫైల్లో పెట్టుకుంటుంది రితిక. అలా ఒక వారం గడిచింది.                     పొద్దున్నే 4 గంటలకి ఆగకుండా రితిక ఫోన్ మోగుతుండంతో నిద్రపోతున్న రితిక ను తట్టి "నీ ఫోన్ మోగుతుంది చూడు.." అన్నాడు అభి కళ్ళు మూసుకుని. "విషెస్ అనుకుంట.. లేచాక చూస్కోవచ్చులే.." అని గొణుక్కుంటూ ఫోన్ వాల్యూం తగ్గించి పడుకుంది రితిక. కొన్ని నిమిషాల తర్వాత తలుపు చప్పుడవుతుండటంతో ' ఈ మాధవ కి ఈ చలిలో మెలుకువ ఎలా వస్తుందో..' అనుకుంటూ తలుపు తెరిచి ఎదురుగా ఉన్న చిన్న మామగార్ని చూసి కంగారుపడింది. "మామయ్యగారు.. బాగున్నారా.. మీరేంటి ఇక్కడ.. ఇంత పొద్దున్నే.." అంది రితిక. "ఈ రోజు నా కొడుకు పెళ్లిరోజు తల్లీ.. రాకుండా ఎలా ఉంటా.." అన్నాడు బుజ్జి. "మీకొడుకు ఇంటికి మీరు ఎప్పుడైనా రావొచ్చు.. రండి లోనకు.." అని లోనకు దారిచ్చి "కొంచెం ఫ్రెష్ అవ్వండి మామయ్యగారూ.. నేను కాఫీ, టిఫిన్ ఏర్పాట్లు చేస్తాను.." అంది రితిక. "ఇప్పట్నుంచే ఏర్పాట్లా.. వెళ్లి పడుకో తల్లీ కాసేపు.. ఇంకో గంట ఆ చలిలో ఉండటానికి కుదరక లేపాను లేకపోతే బయటే ఉండేవాడిని.." అన్నాడు బుజ్జి. "ఊరుకోండి మామయ్య.. మీ కొడుకు ఇల్లు పెట్టుకొని.. ఎలాగో ఇంకాసేపట్లో మాధవ పనికి వచ్చేస్తాడు.. ఈలోపు ఏదో ఒకటి వండుతాను.. మీరు ఏ టైంలో తిన్నారో ఏమో.." అంటూ లోనకు వెళ్లింది రితిక. బాత్రూం లోకి వెళ్లి మొఖం కడుక్కుని జుట్టు కొంచెం సరిచేసుకుని వంట ఆరంభించింది రితిక. కూరగాయలు కోస్తు బుజ్జి రావడం గమనించి ఆయనకి కుర్చీ వేసి వంటింట్లో కబుర్లు చెప్తూ వంట చేయసాగింది రితిక. "....అస్సలు కుదరదు మామయ్య అభికి.. నేను నైనిటాల్ వచ్చి రెండు వారాల పైన అయ్యిందా.. ఆ ఎంగేజ్మెంట్ పార్టీకి తప్పితే ఒక్క చోటుకు తీసుకువెళ్ళింది లేదంటే నమ్మండి...." అని రితిక చెప్తుండగా " ఏంటి పొద్దున్నే మా బాబాకి నా మీద కంప్లైంట్స్ చెప్తున్నావా..?" అంటూ వచ్చాడు అభి వాకింగ్ కి రెడీ అయ్యి. "బాబూ.. నీకో దణ్ణం.. నేను ఏం చెప్పట్లేదు.." అంది రితిక. "ఏరా.. బావున్నావా.. ఎందుకురా ఈ పోలీస్ ఆఫీసర్ జాబ్ నీకు.. నీ డ్రీమ్ జాబ్ ఒక్క సంవత్సరం చేస్తా అన్నావ్.. ఊరుకున్నా ఇంకో సంవత్సరం అన్నావ్ ఊరుకున్నా.. పెళ్ళయ్యేవరుకు అన్నావ్ సరే అన్నాం.. ఇప్పుడేమో ఏం మాట్లాడటంలేదు.. మన బిజినెస్ మనకి ఉంది.. చక్కగా దాన్ని చూసుకోరా.." అన్నాడు బుజ్జి. "బాబా.. నువ్వు ఇప్పుడు ఉన్న బిజినెస్ ఇంకా పెద్దది చెయ్యి.. అప్పుడు మానేస్తా" అన్నాడు అభి నవ్వుతూ. అభి వైపు చూసింది రితిక. "అవును బాబా.. పెద్ద ప్రాజెక్ట్ వస్తే నేను బిజినెస్ లోకి వచ్చేస్తా.. నాకు కొత్తగా మొదలుపెట్టాలని ఉంది ఏదైనా.. మీరు నన్ను గైడ్ చేద్దురుగాని.." అన్నాడు అభి. "తప్పకుండా అభి.. నీ పుట్టిన రోజుకి అదే నీకు గిఫ్ట్" అన్నాడు బుజ్జి. మళ్లీ బుజ్జి "ఈ రోజు వాకింగ్ ఎందుకులేరా.. తల్లీ రితిక.. వంట అయిపోతే స్నానం చేసి రండి ఇద్దరూ.." అని అన్నాడు.                  వంట అయ్యాక వాళ్ళ గదిలోకి వెళ్ళిన రితిక ' నిన్న నైట్ ఎవరో మెసేజెస్ చేశారు.. థాంక్స్ చెప్పాలి ' అనుకుంటూ ఫోన్ పట్టుకోవడానికి బెడ్ పక్కనున్న లాంప్ టేబుల్ వైపు నడిచింది. "రీతూ.. బాబా అర్జెంట్ అంటున్నాడు నేను బాబా గదిలో చేస్తాను నువ్వు ఈ గదిలో ఫ్రెష్ అయిపో" అంటూ లోనకు వచ్చిన అభి రితిక వైపు చూసాడు. "సరే అభి.." అని కబోర్డ్ వైపు నడిచింది రితిక. వెనక నుంచి వచ్చిన అభి తన రెండు చేతులతో రితిక ని పట్టుకోగా రితిక ఒక్కసారి వెనక్కి తిరిగింది. అలా తిరిగిన రితిక ని తనకి కబోర్డుకి మధ్య రెండు చేతులతో లాక్ చేసి తన కళ్ళలోకి చూసాడు అభి. "ఏంటి అలా చూస్తున్నావ్.." అంది రితిక. "ఈ రోజు మొత్తం నీతోనే ఉండాలనిపిస్తుంది.. ఇలా.." అని నుదుటిన ముద్దు పెట్టాడు అభి. "అయితే ఉండు.. నీ భార్యతో నువ్వు ఉండటాన్ని ఏ గవర్నమెంటు తప్పు పట్టదు.." అంది రితిక. "సరే.. ఈ రోజు నీతోనే ఉంటా.." అని ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి తన బట్టలు తీసుకొని వెళ్ళిపోయాడు అభి.                           రెడీ అయిన రితిక ' ఆఫీస్ లో ఈ రోజు నేను లీవ్ తీసుకుంటున్నట్లు చెప్పాలి ' అనుకుంటూ హాల్లో కి వెళ్ళిన రితిక యూనిఫాం లో ఉన్న అభి ని కోపంగా చూసింది. "రామ్మా.. బంగారం.." అని వాళ్ళిద్దర్నీ దగ్గరకి నుంచోబెట్టాడు బుజ్జి. "ఏంటి వెళ్ళిపోతున్నావా..?" అంది రితిక కేవలం అభి కి మాత్రమే వినబడేలా. "లేదు ఇలా ఉంటే బాబా వెళ్లిపోతాడు కదా.." అని మెల్లగా చెప్పి కన్ను కొట్టాడు అభి. "తల్లీ రితిక.. ఇదిగో నా గిఫ్ట్" అని స్కూటీ కీస్ ఇచ్చాడు బుజ్జి. రితిక ఏదో అనబోతుండగా "ఈ సంవత్సరం నాకు వారసుడ్ని ఇస్తావని ఇస్తున్నా కాదనకు" అని అన్నాడు బుజ్జి. సిగ్గు పడింది రితిక. బుజ్జి దగ్గర ఇద్దరు దీవెనలు తీసుకున్న కాసేపటికి ఏదో పని ఉన్నట్లు రితిక ని గదిలోకి పిలిచాడు అభి. ఒక పావుగంట తరువాత అభి రితిక ఇద్దరు గంభీరంగా బయటికి వచ్చారు ఏదో గొడవ పడినట్లుగా. "ఏంట్రా అంతా బానే ఉందా.." అన్నాడు బుజ్జి అభి,రితిక లని టిఫిన్ చేసే టైంలో. "అంతా బావుంది" అన్నాడు అభి. నవ్వి ఊరుకుంది రితిక. ఇంతలో రితిక ఫోన్ మోగింది. "ఒక్క నిమిషం" అని గదిలోకి వెళ్లి ఫోన్ చేత్తో పట్టుకొని నడుస్తూ చూస్తుంది రితిక. -> హెల్లో రితిక.. నేను వేసిన ప్లాన్ ను డీకోడ్ చెయ్యాలని బాగా ప్రయత్నిస్తున్నావుగా.. -> ట్రై టిల్ యు సక్సీడ్.. కావాలంటే ఇంకో పజిల్ ఇస్తా.. -> మీ పెళ్లి రోజు కదా ఈ రోజు.. -> నీకు గుర్తుండి పోయేలా ఒక అనెక్స్పెక్టెడ్ గిఫ్ట్.. ఓన్లీ ఫర్ యూ.. -> వాన్నా సీ థ గిఫ్ట్.. అన్న మెసేజెస్ కనబడేసరికి అర్థంకాక -> డు వి నో ఈచ్ అథర్           అని రిప్లై పెటట్టడానికి ప్రయత్నించి మెసేజ్ డెలివరీ అవ్వకపోతే ప్రాంక్ ఏమో అని ఫోన్ పక్కన పెట్టింది. "టీవీ పెడతా ఇవ్వండి" అని రిమోట్ తీసుకొని ఆన్ చేశాడు అభి. ఫోన్ మోగేసరికి రితిక మెసేజెస్ చూడటానికి ఫోన్ ఎత్తిపట్టుకుంది. -> గిఫ్ట్ డెలివర్డ్.. వాచ్ లోకల్ ఛానెల్ వన్స్       అని మెసేజ్ వచ్చింది. ఇంతలో మాధవ వచ్చి టీవీ వైపు చూసాడు. మొహానికి ఎదురుగా ఉన్న ఫోన్ కొంచెం కిందకి జరిపి టీవీ లో స్క్రోల్ అవుతున్న ^ఆరు నెలల గర్భిణి హత్య^ అన్న న్యూస్ చూసి షాక్ అయ్యింది రితిక. #📋కథలు
100 వీక్షించారు
28 నిమిషముల క్రితం
#

📋కథలు

హత్య - 3 మెల్లగా వెళ్లి చూస్తే అక్కడ చీఫ్ ఎడిటర్ సూర్య వెనక్కి తిరిగి వెళ్ళడం గమనించింది. వెనక్కి వచ్చి కూర్చుని "ఏమి లేదు.. ఊరికే గెస్ చేసా..." అన్నది రితిక. "ఇందాక ఎందుకు అలా వెళ్ళావ్.." అంది చాందిని. "ఏం లేదు.. ఎవరో ఉన్నట్లు అనిపిస్తే చూసా..." అంది రితిక. ఆకాష్ చాందిని ఇద్దరు మోహమోహాలు చూసి నవ్వుకున్నారు. చాందిని , ఆకాష్ వారి ప్లేసుల్లోకి వెళ్ళిపోయాక పేపర్ మీద రాయడం మొదలు పెట్టింది రితిక. * పేరు : మైధిలి, వయసు: 57 భర్త: కార్తికేయ, కొడుకు: శివ కార్తికేయ, హ్యాపీ ఫ్యామిలీ.. ముందు రోజు ఎంగేజ్మెంట్ జరిగింది కొడుక్కి.. జాగింగి కని భర్త, కొడుకు వెళ్లి వచ్చేసరికి ఘోరం జరిగింది.. రోజు పూజ చేసుకోవడానికి పూలు కోసేది..* అని రాసి ' ఇంకా ఏమైనా ఉన్నాయా...?' అనుకుంది రితిక. ఇంతలో అక్కడ ఉన్న టీవీ లో ఒక పోలీస్ చెప్తున్న వార్త తనని షాక్ కి గురిచేసింది. ^ ఒక పోలీస్ " బాడీకి పోస్టుమార్టం జరిగింది.. ఆవిడ ఆవిడ చనిపోయిన సమయం సుమారు 5.30 దగ్గరగా ఉండొచ్చు.. ఆవిడకి ముందు మత్తుమందు ఇచ్చి తరువాత కాలి నరాలు కోశారు.. ప్రజలంతా భయపడకండి.. ఇది ఆ కిల్లర్ పని కాదు ఎందుకంటే ఆ కిల్లర్ ను మేము ముందే అరెస్ట్ చేసేసాం.. ఇది వాళ్ళ ఫ్యామిలీ గొడవలు వల్ల జరిగింది... విచారించి త్వరలోనే అసలు హంతకుడిని పట్టుకుంటాం.." అని చెప్తున్నాడు ^ అది విన్న వెంటనే ' అభి పొద్దున హంతకుడు ఎవరు అనుకున్నాడు... కానీ వీళ్లేంటి ఇప్పుడు ఎప్పుడో పట్టేసుకున్నాం హంతకుడిని అంటున్నారు...?' అనుకుంది రితిక. ఆకాష్ దగ్గరకి వెళ్లి "ఆకాష్ ఆ సీరియల్ కిల్లర్ ను ఆల్రెడీ పట్టుకున్నారా...?" అని అడిగింది రితిక. "నువ్వు ఈ ఊరిలో కాదా ఉంటుంది...?" అన్నాడు ఆకాష్ రితికని. "అది కాదు... నిజానికి లాస్ట్ టు మంత్స్ నేను ఇక్కడ లేను.. అభికి ట్రాన్స్ఫర్ అయ్యింది.. అయ్యాక టు వీక్స్ తర్వాత వద్దాం అనుకుంటే మా మామయ్యగారికి బాలేదు.. ఆ తర్వాత మా ఆడపడుచు గృహప్రవేశం అలా.. వన్ వీక్ బ్యాక్ వచ్చాను... ఇక్కడ విషయాలు అంతగా తెలీదు.." అంది రితిక అమాయకంగా. "ఓహ్ ఓకె.. ఎవడో అమాయకుడ్ని అరెస్ట్ చేసి చక్కగా కిల్లర్ పట్టుబట్టాడు అంటున్నారు..." అన్నాడు ఆకాష్ టీవీ వైపు చూస్తూ. ఇంక తన పని తను చేసుకొని ఇంటికెళ్ళింది రితిక. "రీతూ..." అంటూ లోనకు అడుగు పెట్టాడు అభిరామ్. "హా.." అంటూ దగ్గరకి రాబోయింది రితిక. "నో... ఇప్పుడు కాదు.. లెట్ మి ఫ్రెష్.." అని గదిలోకి వెళ్ళిపోయాడు అభి. అభి వచ్చేలోపు తినడానికి ప్లేట్లు రెడీగా పెట్టింది రితిక. భోజనం చేస్తూ "ఎలా ఉంది నీ ఫస్ట్ డే వర్క్..?" అని అడిగాడు అభి. "గుడ్.." అని జరిగింది మొత్తం చెప్పింది రితిక. "ఆ కిల్లర్ దొరక్కపోయినా దొరికాడు అని చెప్పారేంటి.." అంది రితిక. "పబ్లిక్ పానిక్ అవ్వకూడదు" అన్నాడు అభి ముక్తసరిగా. "అది కాదు.." అని రితిక ఇంకేదో అనబోతుండగా "ప్లీస్ రీతూ... ఇక్కడ ఎన్విరాన్మెంట్ స్పాయిల్ చెయ్యకు.. మూడ్ చెడగొట్టి..." అన్నాడు అభి చిరాగ్గా. ఏం మాట్లాడకుండా కూర్చుంది రితిక. తరువాతి రోజు అభిని పంపేసి రితిక నిన్న హత్య జరిగిన ఇంటి వైపు వెళ్లింది. ఇంటి దగ్గర్లో నిన్న మాట్లాడిన ముసలాయన కనబడ్డాడు రితికకి. "తాతయ్యా.. బాగున్నారా..." అంది రితిక. "నువ్వూ... ఇక్కడ...?" అన్నాడు ముసలాయన ఆశ్చర్యంగా. "అదీ ఊరికే ఇటు వైపు వచ్చాను.. వీళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం అని..." అంది రితిక. "మా అమ్మగారు ఉంటే.. ఈ పాటికి.." అంటూ ఏడుపు మొదలుపెట్టాడు ముసలాయన. "ప్లీస్ ఊరుకోండి... అసలు నిన్న ఏమైందో ఒక్కసారి చెప్తారా" అంది రితిక. "నెన్నమ్మా.. పూలు కొయ్యడానికి వెళ్తాను అని చెప్పి నన్ను కూరగాయలు తెమ్మందమ్మా అమ్మ.. వచ్చి చూసేసరికి ఇలా..." అన్నాడు ముసలాయన. "నిన్న ఆ టైంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు..? ఆ ముందు వెనుక ఎవరెవరు వచ్చారు ఇంట్లోకి..?" అని అడిగింది రితిక. "అయ్యగారు, చిన్నబాబు, అమ్మ.. నేను, రంగ.. రంగ బట్టలుతుకుతుంది.. బాబులిద్దరు వాకింగ్ కి వెళ్ళారు... దానికి ముందు వంట వాళ్ళు డబ్బులు కోసం వచ్చారు, డబ్బులు తీసుకొని పాత్రలు కూడా తీసుకెళ్లారు..." అని "ఇవి మీరెందుకు అడుగుతున్నారు...?" అన్నాడు అనుమానంగా ముసలాయన. "ఏం లేదు.. ఊరికే..." అంది రితిక. "ఇవ్వన్నీ పోలీసులతో కూడా చెప్పాము.." అన్నాడు ముసలాయన. "ఓహో మామూలుగా అడిగా అంతే., వెళ్ళొస్తా" అని నడవబోయింది రితిక. "ఒక్క నిమిషం..." అన్నాడు ముసలాయన. "ఏంటి..?" అంది రితిక కొంచెం భయంగా. "నిన్న పనోళ్లు కావాలన్నావు.. మా వొడు ఒకడున్నాడు.." అన్నాడు ముసలాయన. "ఎవరు...?" అంది రితిక. "ఒరేయ్ మాధవా..." అని కేకేసాడు ముసలాయన. రెండు నిమిషాల తరువాత ఒక అతను వచ్చాడు. "పేరు మాధవ.. కూరగాయలు తేవడం, కొయ్యడం, బట్టలు ఉతకడం, మొక్కలకి నీళ్ళు పెట్టడం, అన్ని చేస్తాడు.." అన్నాడు ముసలాయన. ఒక్కసారి అతన్ని ఎగాదిగా చూసి అడ్రస్ చెప్పి "రేపొచ్చి ఒకసారి మా వారికి కనబడండి.." అని చెప్పి వెళ్ళింది రితిక. ఆ ఇంటి వైపు వెళ్ళిన రితిక కి ఒక నిచ్చెన కనబడింది పొదల్లో... అదే సమయంలో ముసలాయన ని చూస్తూ నవ్వాడు మాధవ. అటు ఇటు చూసి ఎవరు చూడటం లేదని కన్ఫర్మ్ చేసుకొని పరుగున ఆ నిచ్చెన చేరుకుంది. ఆ నిచ్చెన లాగటానికి ప్రయత్నించింది రితిక. కొంచెం లాగాక రితిక వల్ల కాలేదు. చేతులు నడుము మీద పెట్టుకొని ' నేనెక్కువ ఆలోచిస్తున్నానేమో... ఇది వేరే ఇంటి వాళ్ళదేమో...' అని వదిలేసి ఫోన్ లో ఫోటో తీసుకుని అక్కడ నుంచి ఆఫీస్ కి వెళ్ళింది రితిక. ఏమ్ తోచక కాసేపు దగ్గర్లో ఉన్న గుడిలు, వాటి ప్రత్యేకతలు వెతికి రాసి బోర్ కొట్టి ఫేస్బుక్ చూడటం మొదలు పెట్టింది. దాన్ని తిప్పుతూ ఉండగా ఒక ఆర్టికల్ కనబడింది రితికకు. ^ పోలీసులు నిజాన్ని కప్పిపెడుతున్నారా... జర్నలిస్టులు అబద్ధాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారా... ^ దాన్ని ఓపెన్ చేసింది. అందులో ఏవేవో సంఘటనలు, దానిలో అసలు నిజాలు తెలుసుకోకుండా ఎలా ఒక కంక్లూషన్ కి రావడం వలన కలిగిన సమస్యలు అన్ని రాశాడు అందులో. ' ఇది కరెక్ట్.. నిజానికి సపోర్ట్ చేయాలి.. కానీ మేం చేసేది ఎంటి.? ప్రజలు పానిక్ అవ్వకూడదు అని పోలీసులు అబద్ధాలు చెప్తుంటే జర్నలిస్టుముగా వాళ్ళ అబద్ధాలని ప్రచారం చేస్తున్నాం.. అదే మేము ఆ హంతకుడిని పట్టుకొగలిగితే.. పోలీసులకి హెల్ప్ చెయ్యగలిగితే...' అనుకుంది రితిక. "హేయ్.. ఏంటి.. ఏం ఆలోచిస్తున్నావ్...?" అంది చాందిని. "ఏమ్ లేదు.. జస్ట్.." అనుబోతుండగా "ఒక్క నిమిషం.." అని కుర్చీ జరిపి టేబుల్ కిందున్న కేబుల్ తీసి వేరే సిస్టం కి తగిలించింది చాందిని. "హేయ్.. ఇదేంటి.." అంది రితిక. "ఆ చీఫ్ చీప్ వేషాలు వేస్తున్నాడు.. చెయ్యి చెయ్యి అని చావగొడుతూ.. అందుకే వైర్ తీసి ఎవరు చూడకుండా దాచేసా. అప్పుడైతే కంప్యూటర్ పని చేయడం లేదని చెప్పొచ్చు.." అంది చాందిని కన్నుకొట్టి. నొసలు ముడేసింది రితిక. ' ఆ నిచ్చెన హంతకుడు దాచాడా..?' అనుకుంది రితిక. ' కానీ హంతకుడు నిచ్చెన దాచాడు అంటే దాన్ని ఎక్కి లేదా దిగి ఉంటాడు.. దిగే టైమ్ అయితే పొద్దున్నే కాబట్టి ఎవరో ఒకళ్ళు చూసే అవకాశం ఉంది కాబట్టి ఎక్కి ఉంటాడు.. ఆ నిచ్చెన ఉన్న ప్లేసు కరెక్ట్ గా వాళ్ళింట్లో మల్లె పొద దగ్గరకి వస్తుంది.. అక్కడ నుంచి ఎక్కి దూకాడు అనుకుందాం.. కానీ బయటికి ఎలా వెళ్ళాడు..?' అనుకుంది రితిక. అనుకున్నదే తడవుగా ఫైల్లోంచి పేపర్ తీసి దాని మీద రాసింది. ' జెనరల్ గా పోలీసులు ఇంటి చుట్టూ వెతుకుతారు.. వాళ్ళకి ఈ నిచ్చెన , ఆ పాదముద్రలు కనబడలేదా..' అనుకుని ఆశ్చర్యపోయింది రితిక. కానీ ఎవరితో ఈవిషయం మాట్లాడలేదు. ఆ పేపర్ భద్రంగా ఫైల్ లో పెట్టుకుంది రితిక. రాత్రి అభి ఇంటికి వచ్చాక భోజనం చేస్తున్నప్పుడు "అభి.. మొన్న క్రైమ్ సైట్ లో నాకు కొన్ని థింగ్స్ సస్పిషియస్ గా అనిపించాయి.. ఒకటి నిచ్చెన, అదే తిన్నగా పాదాల గుర్తులు కూడా ఉన్నాయి" అంది రితిక. "ఓహో తమరు కూడా ఇన్వెష్టిగేట్ చేసేస్తున్నారా.. ఎందుకు మేము ఇంట్లో ఉంటాం.. మీరు పట్టేసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసుకోండి.." అన్నాడు అభి వ్యంగ్యంగా. "అభి ప్లీస్.. జస్ట్ మీరు నోటీస్ చేశారా అని అడిగా.. అంతే.." అంది రితిక కొంచెం నొచ్చుకొని. రితికకు గోరు ముద్ద పెడుతూ "రీతూ బంగారం.. అంతా జరిగింది.. ఆ పాదాల ముద్రలు అక్కడున్న పనివాళ్ళవి.. ఆ మొక్కలకి పాదులు తీస్తున్నప్పుడు పడ్డాయి.. అండ్ ఆ నిచ్చెన వేరే ఇంటి వాళ్ళది.. వాళ్ళే ఒప్పుకున్నారు అది మాది అని.." అన్నాడు అభి. "ఓకె.." అంది అన్యమస్కంగా రితిక. తినడం పూర్తయ్యాక రితికను తన కౌగిట్లో కి లాక్కుంటూ "సీ రీతూ... ఈ కేసులు క్రిమినల్స్ నాకు తప్పవు ఎందుకంటే ఇది నా ప్రొఫెషన్.. కానీ నీకు ప్రొఫెషన్ లో ఒక భాగం.. ఈ భాగం లేకుండా కూడా నువ్వు నీ ప్రొఫెషన్ ను కంటిన్యూ చేయొచ్చు..." అన్నాడు అభి తన మొహం మీద పడుతున్న జుట్టు చెవి పక్కకి తోస్తూ. బాధగా తలొంచుకుంది రితిక. "సీ.. ఈ కిల్లింగ్స్, రక్తాలు, ఇవన్నీ నిన్ను డిస్టర్బ్ చేస్తాయి రీతూ.. ఆల్రెడీ నేను ఈ మెస్ లో ఉన్నా అండ్ దీనిలో నేను నిన్ను చూడలేను బంగారం.." అన్నాడు అభి బుగ్గపై ముద్దు పెట్టి. మరుసటి రోజు అభి,రితికల ఇంటికి వెళ్ళాడు మాధవ పొద్దున్నే. అప్పుడే నిద్ర లేచిన రితిక "ఇంత త్వరగా వచ్చావేంటి మాధవా.. సర్లే రా.." అని లోపలికి తీసుకెళ్లింది. హాల్లో రితిక పర్సు ,ఫైల్ ఉన్న టేబుల్ వైపు చూసి ఒక నవ్వు నవ్వి లోనకు వెళ్ళాడు మాధవ. #📋కథలు
116 వీక్షించారు
1 గంటల క్రితం
#

📋కథలు

హత్య - 2 వెనుక నుంచి మీద చెయ్యి పడటంతో ఉలిక్కిపడింది రితిక. మెల్లగా వెనక్కి తిరిగి చూసింది రితిక. "ఎవరమ్మా నువ్వు...?" అన్నాడు ఒక ముసలాయన. "ఆఫీసర్ అభిరామ్ భార్యని.. తనతో పాటు వచ్చాను.. నాకు మొక్కలు అంటే ఇష్టం.. అందుకే ఇటు వైపు వచ్చాను..." అంది రితిక. "పర్లేదులే తల్లీ.. ఇప్పుడు ఏమైంది...? రోజూ అమ్మగారు ఇక్కడ పూలు కోసుకోవడానికి వచ్చేవాళ్ళు.. ఇప్పుడు ఆవిడ ఇలా..." అని ఏడుస్తూ అన్నాడు ముసలాయన. "ప్లీస్ ఏడవకండి..." అంది రితిక. "పర్లేదులే తల్లీ.." అని కండువా తో కళ్ళు తుడుచుకుంటూ "కావాల్సినవి కోసుకెళ్లు తల్లీ" అని వెళ్ళబోయాడు ఆ ముసలాయన.                       "ఒక్క నిమిషం..." అంది రితిక. వెనక్కి తిరిగి చూసాడు ముసలాయన. ' ఎందుకైనా పనికొస్తాడేమో' అనుకుని "ఇదిగోండి... ఈ వంద ఉంచండి.." అంది రితిక. తీసుకోకుండా "దేనికమ్మా.. ఇవి..?" అన్నాడు ముసలాయన. "అదీ..." అని ఒక్క క్షణం ఆగి "నాక్కూడా ఇంట్లో ఉండి పని చేసే ఒక మనిషి కావాలి.. బట్టలు ఉతకడానికి, ఇంటి పని వాటికి.. ఎవర్నైనా చూసి పెట్టగలరా..?" అంది రితిక. "సరేనమ్మ..." అని చెప్పి వెళ్ళిపోయాడు ముసలాయన. రితిక వెళ్ళబోతుండగా మల్లె పొదల్లో ఎందుకో అనుమానాస్పదంగా తోచి కిందకి ఒంగి చూసింది. ఎవరో తొక్కినట్లు చెప్పుల గుర్తు... అది కూడా ఒక బరువైన మనిషి అక్కడ కూర్చున్నట్లు అలా.. ఒక్క క్షణం అలానే చూసి ఫోన్లో ఫోటో తీసుకుని బయల్దేరింది రితిక.                        ఆఫీసులో మేనేజర్ నారాయణ ని కలిసింది రితిక. "హెలో మిస్సెస్ రితికా. నైస్ టు మీట్ యూ.. మీ చిన్న మామగారు నాకు బాగా క్లోజ్.. వాడికి పిల్లలు లేరుగా.. సో అభిరామ్ కోసం మీ మామగారు ఎంత కష్టపడ్డాడో తెలీదు గానీ అభిరామ్ కోసం వీడు అంత కష్టపడి తపించాడు.." అన్నాడు నారాయణ. "హా అవును సర్.. ఆయనే నన్ను ఇక్కడికి పంపించారు" అంది రితిక. "తెలుసమ్మా.. మూడు రోజులనుండి ఫోన్లు మీద ఫోన్లు.. మా కోడలు వచ్చిందా.. వస్తే చిన్న పనులు చెప్పు పెద్దవి కాకుండా అని" అని "సరే పాయింట్ కి వద్దాం... నేను నీకు చిన్నవి ఇస్తే బాగోదు కాబట్టి నార్మల్ ఎసైన్మెంట్ ఇస్తా" అన్నాడు నారాయణ. "ఏంటి సర్ అది.." అంది రితిక ఆశగా. "భక్తి ప్రోగ్రాం కార్డినేటర్" అన్నాడు నారాయణ పేపర్లు చూస్తూ. ' దేవుడా...' అనుకుంటూ "సర్.. నాకు జర్నలిజం లో అనుభవం ఉంది.. ఐ కాన్ మానేజ్.. ప్లీస్ నాకేదైనా ఇంటరెస్టింగ్ అసైన్మంట్ ఇవ్వండి" అంది బతిమాలుతూ.                            బతిమాలినా వినకపోవడంతో చేసేది లేక బయటికి వచ్చింది. "హాయ్.. న్యూ జాయినింగ్ ఆహ్..?" అంది ఒక అమ్మాయి వెనుక నుంచి వచ్చి. "హా యస్.." అంది రితిక. "అయితే కొత్తగా వచ్చిన ఆ భక్తి ప్రోగ్రాం కార్డినేటర్ నువ్వేనా" అంది ఎగాదిగా చూస్తూ. "హా.. రితిక.." అని చేయ్యిచ్చింది రితిక. "చాందిని.." అని పరిచయం చేసుకుని "కం.. మన వింగ్ లో అందర్నీ పరిచయం చేస్తాను.." అని తీసుకెళ్లింది చాందిని. "ఈయన మన చీఫ్ ఎడిటర్ సూర్య. నేను కంటెంట్ రైటర్.. ఆకాష్ అండ్ హేమ.. జర్నలిస్ట్స్. ఇక్కడ లేరు ప్రస్తుతానికి లైవ్ కవరేజ్ కోసం వెళ్ళారు... సుధీర్ మన కంట్రోల్ యూనిట్ మేనేజర్.. .... .... .... చివరికి ఇతను మన ప్యూన్ రాజా.." అంది చాందిని. అందర్నీ పరిచయం చేసుకుని తనకి ఎలాట్ చేసిన టేబుల్ దగ్గర కూర్చుంది. ఇంతలో చాందిని, ఆకాష్ ని తీసుకొచ్చింది పరిచయం చేద్దాం అని. "రితిక.. తను ఆకాష్... ఆకాష్ థిస్ ఇస్ రితిక.. న్యూ భక్తి ప్రోగ్రాం కార్డినేటర్..." అంది చాందిని. "ఇంత చిన్న వయస్సులో అంత పెద్ద పెద్ద పనులు ఎందుకండీ.." అన్నాడు ఆకాష్ నవ్వుతూ.             "నాకు మాత్రం ఏమైనా ఇష్టమా.. తప్పదుగా.." అంది రితిక. ఒక నవ్వు నవ్వి "చిల్.. అక్కడ నువ్వు చెయ్యాల్సింది ఏమ్ లేదు.. కాళీగా కూర్చోవడమే.. ఎందుకంటే ఇంకో వన్ మంత్ ప్రోగ్రామ్స్ అన్ని ప్లాన్ చేశారు భక్తి టైమింగ్ స్లాట్ లో.." అంది చాందిని. "హా.. అలాంటప్పుడు దాన్ని మీరు ప్రొడక్టివ్గా మార్చుకోవచ్చు.. లేదా టైమ్ వేస్ట్ చేసుకోవచ్చు.." అన్నాడు ఆకాష్. ' ఎందుకు వేస్ట్ చేస్తా... ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లో నా టాలెంట్ చూపిస్తా..' అనుకుని నవ్వింది రితిక. "హేయ్.. నువ్వు కవరేజ్ చేసిన న్యూస్.. పొద్దున జరిగిన మర్డర్ కేసు.." అంది చాందిని టీవీ వైపు చూస్తూ. తలూపాడు ఆకాష్. "ఏదో బిజినెస్ గొడవలు.. అందుకే చంపించారు..." అన్నాడు ఆకాష్. "ఆర్ యూ ష్యూర్..?" అంది రితిక అనుమానంగా. "హా.. సెంట్ పర్సెంట్.." అన్నాడు ఆకాష్ కాన్ఫిడెంట్ గా. కాదన్నట్లు తలూపింది రితిక. "ఎందుకు అంత అనుమానం...?" అన్నాడు ఆకాష్. ఇంతలోపు వాళ్ళని ఎవరో తలుపు చాటున నుంచుని గమనిస్తున్నారు ఎవరో అనిపించి తల తిప్పి చూసింది రితిక. మళ్లీ వదల్లేదు ఆ అనుమానం. ' ఒక్క నిమిషం ' అని  మెల్లగా తలుపు వైపు నడిచి చూసింది రితిక. #📋కథలు
116 వీక్షించారు
1 గంటల క్రితం
#

📋కథలు

హత్య - 1 "హాయ్ బేబీ... గుడ్మార్నింగ్..." అని నిద్రలేపింది రితిక అభిరామ్ ని. "గుడ్మార్నింగ్.... " అని చెప్పి మళ్ళీ బద్దకంగా మంచం మీద పడుకున్నాడు అభిరామ్. " అభీ... మరీ చిన్న పిల్లాడిలా ప్రవర్తించకు... గెట్ అప్... చూడు ఈ రోజు నాకు జాబ్ కి ఫస్ట్ డే...  టైమ్ అవుతుంది వెళ్ళాలి..." అని దుప్పటి లాగింది రితిక. "సర్లే..." అని బద్దకంగా లేచాడు అభిరామ్. అభిరామ్ బాత్రూమ్ లోకి వెళ్ళడం చూసి టిఫిన్ తయారు చెయ్యడానికి వెళ్లింది రితిక. స్నానం చేసొచ్చిన అభి టేబుల్ దగ్గర కూర్చుని "నీకు ఈ ఉద్యోగం అవసరమా రితూ... నేను సంపాదిస్తున్నా కదా..." అన్నాడు అభి. "ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది... నీతో పాటు వెళతా.. బట్ నీకంటే ముందే ఇంటికొస్తా.. ఐ ప్రామిస్.." అంది రితిక టిఫిన్ ప్లేట్లో పెడుతూ. "సర్లే..." అని అయిష్టంగా చెప్పి టీవీ ఆన్ చేశాడు. టీవీలో హత్య వార్త వస్తుంటే "వీడు ఎవడో గానీ.. రెండు నెలల్లో ఇది నాలుగో హత్య.. వాడి మోటివ్ ఎంటో అసలు ఏమి అర్ధం కావడంలేదు.. కనీసం క్లూస్ కూడా వదలడంలా.." అన్నాడు అభిరామ్ ఇంక టీవీలో చూపించే విజువల్స్ చూడలేక. కాసేపు గమనించిన రితిక "అభి.. ఈవిడ్ని నెన్న నైట్ ఎంగేజ్మెంట్ పార్టీలో చూసాం అభి... గుర్తుందా.. మీ కమీషనర్ గారి కూతురికి కాబోయే అత్తగారు..." అంది. "వాట్...?" అని తినేది ఆపేశి టీవీ స్క్రీన్ మీద డిటైల్స్ కనబడకపోవడం వలన వేరే ఛానల్ పెట్టి చూసాడు. "అదుగో.. మీ కమీషనర్ గారు వాళ్ళ కూతురికి కాబోయే మామగారు.. నిన్న నువ్వు రావడం లేట్ అయ్యింది కదా.. అందుకని ముందు నన్ను కమీషనర్ అంకుల్ వాళ్ళకి పరిచయం చేశారు.." అంది రితిక. "ఓహ్.. షిట్... నీడ్ టు గో నవ్.." అన్నాడు అభి తినేది వదిలేసి. రితిక తను తినేది కూడా వదిలేసి "నేను వస్తాను.." అని లేచి పర్స్ తీసుకొని వచ్చేసింది. "నువ్వెందుకు క్రైమ్ సీన్ దగ్గరకి" అన్నాడు అభి కార్ స్టార్ట్ చేస్తూ. "పర్లేదు అభి.. ప్లీస్.. నిన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తో నేను మాట్లాడాను.. బాగోదు చూడకపోతే.." అని అంది రితిక.         కమీషనర్ కు కాబోయే అల్లుడి ఇంటికి వెళ్ళారు రితిక, అభి. నిశబ్ధంగా అభి వెనుక నుంచుంది రితిక. "సారీ సర్... నైట్ ఎంగేజ్మెంట్ పార్టీలో లేట్ అయ్యింది కదా.. అందుకే ఆలస్యంగా వచ్చా... ఐ వోంట్ రిపీట్ ఇట్ అగైన్.." అని కమీషనర్ తో చెప్పి పక్కనున్న కానిస్టేబుల్ సుభాష్ ని "డిటైల్స్ రాయించుకున్నావా.." అని అడిగాడు. ఈ లోపు క్లూస్ టీమ్ వచ్చింది. వాళ్ళు బాడీని ఫొటోస్ తీసి క్లూస్ కోసం చూస్తుండగా అభి వెళ్లి కమీషనర్ కి కాబోయే అల్లుడ్ని పలకరించాడు. "నేను నాన్న జాగింగ్ కి వెళ్ళేటప్పుడు అమ్మ బానే ఉంది.. వచ్చి చూసేసరికి ఇలా..." అన్నాడు తను. "ఓకె.. ప్లీస్ కామ్ డౌన్.. సారీ.." అని చెప్పి అభి సుభాష్ వైపు తిరిగి "ఇంటి డిటైల్స్ చెప్పు.." అన్నాడు. "మొత్తం చూసాను సార్.. ఓన్లీ ఒక దారి మాత్రమే ఉంది ఇంట్లోకి రావడానికి.. ఎంట్రీ సీసీ కెమెరా ఫుటేజ్ కలెక్ట్ చేసా కానీ అందులో అనుమానాస్పదంగా ఎవరు లేరు.." అన్నాడు సుభాష్. "ఓహ్ ఐ సీ.." అని రితిక వైపు తిరిగి "ఇంక నువ్వు వెళ్లు" అన్నాడు అభి. ఒక్క నిమిషం ఆలోచించి "సరే.. బై.." అని చెప్పి బయటకి నడిచింది రితిక.                    అక్కడ ఉన్న వాళ్ళందర్నీ చూసి ఒక్కసారి నిట్టూర్చి, ' అసలు ఎలా చనిపోయింది ఈవిడ..' అనుకుంటూ ఒక్కసారి బాడీ వైపు చూసింది. ముఖం ప్రశాంతంగా పడుకున్నట్లే ఉంది. కానీ కిందకి చూస్తే రెండు కాళ్ళ చీలమండలు దగ్గర్నుంచి రక్తం దారలై పారుతుంది. ' నిన్న ఎంత ఆనందంగా ఉన్నారు.. ఈ రోజు ఇలా చూస్తా అనుకోలేదు నేను...' అనుకోని ఇంట్లోంచి బయటికి నడిచింది రితిక. బయట గోడ వరుసగా ఏపుగా పెరిగిన మందార మొక్కలు, మల్లె మొక్కలు తీగలు, ఇంకా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి. మెల్లగా ఆ గార్డెన్ వైపు నడిచింది. గార్డెన్ లో క్రోటన్ మొక్కలు, లాన్ టేబుల్ అన్నిటితో ఎంతో అందంగా అనిపించింది. ' ఆ మందార మొక్కలు ఎత్తు ఉండి కనబడలేదు కానీ ఈ గార్డెన్ ఎంత బావుంది పెద్దగా..' అనుకుని అటు నడిచింది. అక్కడ ఉన్న మల్లె పాదు దగ్గర నుంచుని వాసన చూస్తూ కళ్ళు మూసుకుని ' ఎంత బావుంది ఇక్కడ ' అనుకుని కొన్ని అడుగులు ముందుకేసి కళ్ళు తెరిచింది. అక్కడ కొన్ని పూలు గుట్టగా పడున్నాయి. ' కొయ్యటం ఎందుకులే ' అనుకుని గుట్టలో రెండు పూలు తీసుకుని వాసన చూస్తూ రెండు అడుగులు ముందుకి వేసి ఒక్కసారి మొక్కల్లో చూసి ఆలోచనలో పడింది రితిక. #📋కథలు
110 వీక్షించారు
1 గంటల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..