
MURALI MOHINI
@mmstudios
షేర్ చాట్ ప్రేక్షకులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
#అమ్మవారు ప్రతిరూపాలు అర్హతను బట్టి కాదు,,మన ఆర్తిని బట్టి అమ్మవారు అనుగ్రహిస్తుంది..👑🦜✨💫💚
పంచాంగం :
జనవరి 22, 2026 గురువారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశిర ఋతువు
మాఘ మాసం శుక్ల పక్షం
తిథి : చవితి రా 1.36 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం : శతభిషం మ 2.16 వరకు
తదుపరి పూర్వాభాద్ర
యోగం : వరీయాన్ సా 5.47 వరకు
తదుపరి పరిఘ
కరణం : వణిజ మ 1.57 వరకు
తదుపరి భద్ర
సూర్యరాశి : మకరం
చంద్రరాశి : కుంభం
సూర్యోదయం : ఉ 6.38
సూర్యాస్తమయం : సా 5.45
రాహుకాలం : మ 01.30 - 03.00
యమగండం : ఉ 06.00 - 07.30
వర్జ్యం : రా 08.36 - 10.10
దుర్ముహూర్తము : మ 02.47 - 03.31
అమృతకాలం : ఉ 07.01 - 08.38
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు..🌹🙏🏻🌹
#MMSTUDIOS
_*నాన్నకు ప్రేమతో..*_
**********************
*_నాన్న.._*
నిన్ను చిన్నప్పటి నుంచి
కంటికి పాపలా చూసుకున్నాడని అనుకుంటున్నావేమో..
*తన రెండు కళ్లూ నువ్వే అయి నిను కాచాడు..!*
నీకు కష్టం వచ్చినప్పుడు
తన రెండు చేతులూ చాచి
దగ్గరకు తీసుకున్నాడని
మురిసిపోతున్నావేమో..
అంతకు మించి తన గుండె తలుపులు తెరిచి అక్కడ
నిన్ను పొదుగుకుని
*నీకు ఊరట కల్పించాడు..*
*తానూ అలా సేదదీరాడు..!*
నీతో పాటు బయటికి వచ్చినప్పుడు నువ్వు అది కొను ఇది కొను అన్నప్పుడు
జేబులు చూసుకుంటూ
నిన్ను చూసి నవ్విన
వెర్రి నవ్వులు నీకు అర్థం అయ్యాయో లేదో..
ఆ క్షణాన నాన్నలో నువ్వు లోభిని చూసావేమో..
నీకోసం జేబులో ఉన్న
ఆ కాస్త డబ్బులూ ఖర్చు పెట్టేందుకు సిద్ధపడ్డ త్యాగి కనిపించి ఉండడు..
*ఎందుకంటే అప్పుడూ నాన్న నీకు నవ్వుతూనే కనిపిస్తాడు!*
నువ్వు గెలిస్తే తాను గెలిచినట్టు పొంగిపోయే నాన్న బడి నుంచి నువ్వు తెచ్చిన కప్పు..
ఒలింపిక్ మెడల్ మాదిరి
తన మెడలో వేసుకు తిరిగి
నీ చుట్టూ
*తన కలల మేడలు కట్టేసుకుంటాడు..!*
చిన్నప్పుడు నీ బదులు
నీ కలల్ని తాను కనే నాన్న..నువ్వు పెద్దయ్యాక నువ్వు కనే కలల్ని
*నిజం చేసేందుకు*
*తాను శ్రమిస్తాడు..!*
నీ గెలుపు తన గెలుపై..
నీ కష్టం తన కష్టమై..
నీ ఇష్టం ఒక్కోసారి
తనకు కష్టమైనా ఇష్టపడి..
నీ ప్రతి అడుగు
తన అరచేతిపై నుంచి పడేలా..
నీ నవ్వు తన బహుమానమై..
నువ్వే తన బలమై..
నీ ఉన్నతి తన ఆకృతై..
నీ ఎదుగుదల తన వరమై..
నువ్వే తన ఇహమై..పరమై..
బ్రతికే నాన్న నీ దృష్టిలో నాయకుడైనా కాకపోయినా
*నువ్వు నాన్న జీవితకాలపు*
*_హీరో..!_✍️💎⚜️🙏 #మనలోని మాటలు
*రోజుకు ఇరవైనాలుగు గంటలు*
*ఒక్కవేయి నాలుగువందల నలభై నిముషాలు ఎనభై ఆరువేల నాలుగువందల సెకనులు...*
*మరి తండ్రి శివుని కోసం మనం ఖర్చు చేస్తున్నది ఎంత ఎప్పుడైనా ఆలోచన చేశామా...*
*⚜️శివోహం శివోహం శివోహం⚜️*
#MMSTUDIOS










