
సుధా కృష్ణా
@mugalasudha
If ur gud is better, ur better can be best...
#అక్కా తమ్ముడు బంధం # #అక్కా తమ్ముడు ప్రేమా #మంచి సందేశం #✌️నేటి నా స్టేటస్
#ఆడపిల్లలు జాగ్రత్త #మంచి సందేశం #✌️నేటి నా స్టేటస్
ఒక సోదరి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చెప్పారు... ఈ కాలం వాళ్ళు నిజంగా పాటించాల్సినవే అనిపించాయి మీరు ఒకసారి చూడండి...
మరో ముఖ్యమైన విషయం... మాకు అబ్బాయిలే అండి మాకు అవసరం లేదు అనుకుకోండి... ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు అబ్బాయిల వలన అంటే... వారిని అంత సంస్కార హీనంగా పెంచిన తల్లిదండ్రులది తప్పే అండి... విలువలతో కూడిన పెంపకం జరిగితే... బయట పశువుల్లా ప్రవర్తించరు. దయచేసి మగపిల్లలు ఉన్నవారు మీరు ఒక తల్లిగా (ఆడదానిగా) సమాజంలో ఉన్న పరిస్థితులు... నడుచుకోవాల్సిన పద్ధతుల గురించి వివరించండి.🙏🙏🙏🙏🙏🙏
అందరూ అలానే పెంచుతున్నారు అనే ఉద్దేశ్యం కాదు ఇక్కడ... పరిస్థితులు గమనించండి... అర్ధం చేసుకోండి... #బామ్మలమాటలు
ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులు ఈ విషయాలు కూడ గమనించండి. ఎవరిని నమ్మొద్దా?? అని నాతో గొడవ వద్దు. సొంత తండ్రి దగ్గరే రక్షణ లేదు కొందరు ఆడపిల్లలకి.
సొంత మేనమామ, బాబాయ్, అన్నాతమ్ముల దగ్గర రక్షణ లేదు కొందరికి.
ఈర్ష్య ద్వేషాలు ఊపిరిగా బ్రతుకుతున్న కొందరు మనుషులు మన చుట్టూ నే ఉన్నారు, కనుక జాగ్రత్త పడటం లో తప్పులేదు.
మన ఇంటి ఆడబిడ్డ మన బాధ్యత, మనం ఎదుటి వారితో మంచిగా ఉన్నాం అని వాళ్ళు మన పిల్లలతో అలానే ఉంటారు అనుకోవడం మూర్ఖత్వం అని మర్చిపోకండి.
1. మన ఫ్యామిలీ అంటే తండ్రి, తోడబుట్టినవాడు మాత్రమే అని చెప్పండి. అన్న, తమ్ముడు వరుస అయ్యేవాళ్ళు ని కూడా దూరంగా ఉంచాలి.
2 బయట ఇళ్ళకి మాత్రమే కాదు, బంధువులు ఇళ్ళకి కూడా వద్దు అని చెప్పండి.
మన ఇంట్లో ఆడపిల్లల సేఫ్టీ మనకు తప్ప, బాబాయ్ లు, మావయ్యలు, దగ్గర కూడా ఉండని రోజులకు ఎపుడో వచ్చేశాం.
3. ఒకసారి ఎవరి ఇంట్లో వాళ్ళ వల్ల అయిన తేడా జరిగింది అనిపిస్తే బంధుత్వాలు పోతాయి అనో, మనవాడే అనో, రెండో అవకాశం మాత్రం ఇవ్వదు అని కూడా చెప్పాలి.
4. ఆడపిల్లలు ఉన్న తండ్రి, తన పిల్లలపై చెడు ఆలోచనలు ఉన్నాయి అని తెలిసిన(ప్పుడు) కాళ్ళు, చేతులు విరగ్గొట్టేలా ఉండాలి తప్ప పోన్లే పాపం అనేలా ఉండకూడదు అని చెప్పండి.
5. "ఎవరి touch గురించి అయినా ఇబ్బంది పడినపుడు తల్లికి వెంటనే చెప్పాలి" అనే విధంగా మనం వాళ్ళకి చెప్పాలి. కానీ 'వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకూడదు అని అనుకోవద్దు' అని చెప్పండి. ఎందుకంటే కొంతమంది మహా నటీమణులు ఉంటారు. మొగుడు మీద, కొడుకుమీద తప్పులు పడకుండా!!
చెప్పిన వాళ్ళని తప్పు పడతారు; ఇటువంటి ఆడవాళ్ళు. ఇలాంటి పనులు చేసేటపుడు తాము ఆడవాళ్ళం అని మన ఇంట్లో ఆడపిల్ల ఉంది అని మరచిపోతారు.
6. వేరేవాళ్ల బండి ఎక్కాలి అనుకుంటే, వాళ్ళ బ్యాగ్ లో దబ్బలాలు ఉండేలా చూడండి . అవసరం తప్పక ఎక్కుతారు అని చూడకుండా బండి బ్రేక్స్ వేసే ఎదవలకి బ్రేక్ వేయగానే అది గుచ్చుకునేలా పట్టుకోమని చెప్పండి
అన్నిటికంటే ముఖ్యమైంది 'ఆడపిల్ల బయటకు వెళ్ళినపుడు ఎంత పనిలో ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తె ముందు రిసీవ్ చేసుకోవాలి .'
ఇలా రాసింది ఇష్టం వచ్చినట్టు అనుకోకండి, ఎందుకంటే 2020 నుంచి నేను చాలా చోట్ల చూసిన విషయాలు ఇది తప్పు అని నేను చెప్పడం వల్ల చాలా అవమానాలు కూడా పడాల్సి వచ్చింది...
పైన అన్ని విషయాలు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దారుణాల దృష్ట్యా జాగ్రత్త సూచనలే....
వీటి అన్నిటితో పాటు ఆడపిల్లల వస్త్ర దారణ కూడా చాలా ముఖ్యమైనది అని గమనించండి. ఒంటి నిండుగా బట్టలు ధరించడం మన భారతీయ సంప్రదాయం... దానిలో చాలా గొప్పతనం నిండి ఉంటుంది అర్ధం చేసుకుంటే... కానీ నేటి సమాజం పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టు తయారయ్యారు ఒకరిని చూసి ఒకరు విచిత్ర పోకడాలకు పోతున్నారు... ఎవరైనా పెద్దవారు బట్టలు గురించి సలహా ఇస్తే హక్కులు, స్వేచ్ఛ గురించి మాట్లాడతారు... బట్టలు హుందాగా ఉండటం అంటే బ్రాండెడ్ వి ధరించడం కాదని గమనించండి...
#womenabusement
#బామ్మలమటలు
#LatestUpdate
#girlssafety








