రేపు ఏపీని తాకనున్న నైరుతి రుతుపవనాలు.
మరో 24 గంటల్లో రాయలసీమను తాకనున్న రుతుపవనాలు.
రేపటి నుంచి ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం.
తీరం వెంబడి 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు.
#Monsoon2025 #WeatherAlert #RainAlert #AndhraPradesh
#ఆంధ్ర ప్రదేశ్ #🌨️వాతావరణ అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🗞ప్రభుత్వ సమాచారం📻
BIG BREAKING: ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కేరళలో అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ పోలీసులు ఆయన్ని కేరళలో అరెస్ట్ చేశారు. కాకాణి గోవర్థన్ రెడ్డిని రుస్తుం మైనింగ్ కేసులో ఏ4గా ఉన్నారు.
పోలీసుల విచారణకు హాజరు కాకుండా రెండు నెలలుగా ఆయన పరారీలో ఉన్నారు. దీంతో నేడు ఆయన్ని బెంగుళూర్లో అరెస్ట్ చేశారు.
#kakanigovardhanareddy
#KakaniGovardhanReddyPolicearrest
#APPolice
#🧐ఈరోజు అప్డేట్స్ #ఆంధ్ర ప్రదేశ్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️రాజకీయాలు #🔵వైయస్ఆర్సీపీ
విశాఖపట్నం వాసులకు,టూరిస్టులకు డబుల్ ధమాకా...
విశాఖపట్నం వాసులకు, అలాగే విశాఖను సందర్శించే టూరిస్టులకు డబుల్ ధమాకా.. త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులు విశాఖ వీధుల్లో చక్కర్లు కొట్టనున్నాయి. విశాఖపట్నంలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి, అలాగే పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు గానూ గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్..
హాప్ ఆన్ హాప్ ఆఫ్ (HOHO) బస్సులను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోంది. పర్యాటకులతో పాటుగా స్థానికులకు కూడా సౌకర్యవంతమైన రవాణాను అందించేందుకు జీవీఎంసీ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (GVSCCL) ఈ ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా విద్యుత్తుతో నడిచే రెండు డబుల్ డెక్కర్ HOHO బస్సులను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఇందులో ఒకటి ఎయిర్ కండిషన్డ్ కాగా.. మరొకటి నాన్ ఏసీ డబుల్ డెక్కర్ బస్సు. ఈ మేరకు రెండు డబుల్ డెక్కర్ బస్సులను కొనుగోలు చేసేందుకు జీవీఎస్సీసీఎల్ ప్రతిపాదనలను కోరుతోంది.
ఈ రెండు డబుల్ డెక్కర్ బస్సులను విశాఖపట్నంలోని అన్ని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల మీదుగా నడపనున్నారు. పర్యాటక శాఖ భాగస్వామ్యంతో కలిసి ఈ ప్రాజెక్టు చేపట్టాలని జీవీఎంసీ ఆలోచిస్తోంది. విశాఖలోని ముఖ్యమైన ప్రదేశాలను చుట్టేసేలా ఈ బస్సులను తీసుకువస్తే పర్యాటకులకు మరింత అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఒక్కరోజులోనే విశాఖలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను చుట్టేయాలనుకునేవారికి ఈ హోహో డబుల్ డెక్కర్ బస్సులు అనుకూలంగా ఉంటాయి. తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతమైన ప్రయాణంతో విశాఖ అందాలను ఆస్వాదించవచ్చు. అలాగే అటు స్థానికులకు కూడా ఉపయోగపడతాయి.
ఏంటీ హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సుల ప్రత్యేకత
హాప్ ఆన్ హాప్ ఆఫ్ విధానం వలన ప్రయాణికులు ఒకచోట బస్సు ఎక్కి, తమకు ఇష్టమైన ప్రదేశంలో దిగొచ్చు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించిన తర్వాత.. ఆ వెనుక వచ్చే బస్సులో తిరిగి ప్రయాణించే వీలుంటుంది. దీంతో తమకు ఇష్టమైన చోట దిగి.. మళ్లీ వెనుక వచ్చే బస్సులో ఖర్చు లేకుండా ప్రయాణించే వీలును ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్ విధానం కల్పి్స్తుంది. ఇక ఈ బస్సులు విద్యుత్ ఆధారంగా నడుస్తాయి. దీంతో పర్యావరణ కాలుష్యం ఉండదని అధికారులు చెప్తున్నారు. డబుల్ డెక్కర్ బస్సులు కావటంతో బస్సులో ప్రయాణిస్తూ అద్దాల మధ్య నుంచి విశాఖ అందాలను వీక్షించే అవకాశం కలుగుతుంది. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే విశాఖలో ప్రైవేట్ వాహనాల వినియోగం తగ్గించేందుకు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు,
#vizag
#vizagtourism
#visakhapatnam
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🧐ఈరోజు అప్డేట్స్ #ఆంధ్ర ప్రదేశ్ #🗞ప్రభుత్వ సమాచారం📻
చీకటిలోనూ చూడగలిగే... ఐడ్రాప్స్ను డెవలప్ చేసిన
పరిశోధకులు!
అచ్చం పగటిపూట మాదిరిగానే చిమ్మచీకటి ఆవహించినప్పుడు సైతం మన చుట్టూ ఉండే పరిసరాలు, వస్తువులు కనిపించేలా ఓ అద్భుతాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. కాలిఫోర్నియాకు చెందిన బయోహాకర్స్ టీమ్, అలాగే సైన్స్ ఫర్ ది మాసెస్(Science for the Masses) అనే స్వతంత్ర పరిశోధకుల బృందంలోని నిపుణులు ఈ ఘనత సాధించారు. చిమ్మ చీకటిలోనూ చూడగలిగే ఐడ్రాప్స్ను వారు డెవలప్ చేశారు.
చీకటిని ఛేదించే కంటి చుక్కలను డెవలప్ చేయడం కోసం పరిశోధకులు క్లోరిన్ e6 (Ce6) అనే సమ్మేళనాన్ని ఉపయోగించారు. వాస్తవానికి ఇది లోతైన సముద్రాల్లోని చేపలలో, వాటి కంటిచూపునకు దోహదపడే ఒక రసాయనం. దీని కారణంగా అవి చీకటిలోనూ నీటిలో తిరుగుతూ అన్నీ చూడగలవు. అయితే ఈ సమ్మేళనాన్ని ఇన్సులిన్, అలాగే సెలైన్‌తో కలిసి కంటిలో వేయడం వల్ల తాత్కాలికంగా రాత్రిపూట సైతం చూపును మెరుగు పరిచే ఒక ద్రావణాన్ని పరిశోధకులు సృష్టించారు.
పరిశోధనలో భాగంగా సరికొత్త ఐడ్రాప్ను సృష్టించిన పరిశోధకులు వాటిని రెండు చుక్కలు వేసుకున్నప్పుడు చిమ్మచీకటిలో సైతం164 అడుగుల దూరం వరకు 100% కచ్చితత్వంతో చూడగలిగినట్లు పేర్కొన్నారు. పైగా 20 రోజుల వరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడలేదట. అయితే ఆ డ్రాప్స్ పనితీరు సమయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు 33% వరకే పనిచేసినట్లు తెలిపారు. అంటే రాత్రి నుంచి తెల్లవారు జాము వరకే ఈ ఐడ్రాప్ ప్రభావం ఉంటోందని గుర్తించిన పరిశోధకులు, నిరంతర పనిచేసేలా మరిన్ని పరిశోధనలపై దృష్టి సారించారు. ఇప్పటికిప్పుడైతే ఈ ఐడ్రాప్స్ వినియోగించేందుకు అందుబాటులో లేవు. కానీ భవిష్యత్తులో మరిన్ని పరిశోధనల తర్వాత వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
#Eyedropsthatcanseeeveninthedark
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🧐ఈరోజు అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం
పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు..
మేమే పట్టించుకోలేదు..
కష్టం వచ్చినప్పుడు కలవడం వేరు..
#AlluAravind
#🧐ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #✡జనసేనాని పవన్ కళ్యాణ్
ఒకేసారి మూడు నెలల రేషన్..రేషన్ కార్డుదారులకు శుభవార్త..!
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని రేషన్ కార్డుదారులకు సౌకర్యవంతంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ఆదేశాలను అమలు చేసేందుకు సిద్ధమైంది.
జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు, జూన్ 1 నుంచి 30వ తేదీలోపు రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. అయితే, రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం బయోమెట్రిక్ ధ్రువీకరణను నెలవారీగా వేర్వేరుగా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం రేషన్ కార్డుదారులకు గొప్ప ఊరటనిస్తుందని, వర్షాకాలంలో సరుకుల కొరత లేకుండా ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ ఏర్పాట్లతో ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యాలు సకాలంలో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.
#Telangana
#RationCard
#RationCardHolders
#🧐ఈరోజు అప్డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ
🔹️UPSC పరీక్షల ప్రక్రియ ప్రారంభమయ్యింది.
🔹️దీనిలో భాగంగా ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రిలిమ్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
🔹️అఖిల భారత సర్వీసుల్లో ఉధ్యోగాల భర్తీకి UPSC నిర్వహించే ఈ క్లిష్టమైన పరీక్ష 3 దశల్లో జరుగుతుంది.
#upsc
#🗞ప్రభుత్వ సమాచారం📻 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🥻సమ్మర్ కాటన్ డ్రెస్సెస్👗 #🏆పోటీ పరీక్షల స్పెషల్ #📖ఎడ్యుకేషన్✍
కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారి నూతన ఇంట గృహ ప్రవేశం
#ChandrababuNaidu
#NaraLokesh
#NaraChandrababuNaidu
#ఆంధ్ర ప్రదేశ్ #🧐ఈరోజు అప్డేట్స్ #🟡తెలుగుదేశం పార్టీ #🏛️రాజకీయాలు #🗞ప్రభుత్వ సమాచారం📻
జూన్ 1 నుండి థియేటర్ల బంద్ లేదు
జూన్ ఒకటి లోపు చర్చలు జరపకపోతే థియేటర్లు మూసివేస్తాం అని చెప్పింది, జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని తప్పుగా బయటకు వెళ్ళింది.
ఆల్ సెక్టార్ల మీటింగ్ పెట్టుకున్నాం, మాట్లాడుకున్నాం... యథావిథిగా థియేటర్లు రన్ అవుతాయి - దామోదర్ ప్రసాద్, ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ.
#Tollywood #Cinema #TheatersStrike
#filmchamber #pressmeet #theatersbandh #🧐ఈరోజు అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🎬మూవీ ముచ్చట్లు #🎬టాలీవుడ్ అప్డేట్స్ #🎞️సినిమా ప్రపంచం
నైరుతి రుతుపవనాలు ఈరోజు మే 24,2025 కేరళలో ప్రవేశించాయి.
ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీ కంటే 8 రోజుల ముందుగా కేరళలో ప్రవేశించాయి.
గతంలోమే 23,2009న ఇలానే ముందుగా రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి.
2009 నుంచి రుతుపవనాలు కేరళను తాకిన తేదీలు.
#SouthwestMonsoon2025
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🧐ఈరోజు అప్డేట్స్ #నైరుతి రుతుపవనాలు #రుతుపవనాలు #🌨️వాతావరణ అప్డేట్స్