nvs subramanyam sharma
ShareChat
click to see wallet page
@nvssharma
nvssharma
nvs subramanyam sharma
@nvssharma
ఐ లవ్ షేర్ చాట్
Divya Bharathi...🧡🧡🧡 #Wednesday crash..❤️ #First Crash For Me❤️ #👩టాలీవుడ్ భామలు #😍దివ్య భారతి...❤️ #@Divya bharathi❤️
👩టాలీవుడ్ భామలు - ShareChat
00:24
Divya Bharathi...🧡🧡🧡 #Wednesday crash..❤️ #First Crash For Me❤️ #👩టాలీవుడ్ భామలు #😍దివ్య భారతి...❤️ #@Divya bharathi❤️
👩టాలీవుడ్ భామలు - ShareChat
Ananya Nagalla...🩶🩶🩶 #Wednesday crash..❤️ #First Crash For Me❤️ #👩టాలీవుడ్ భామలు #😍అనన్య నాగళ్ళ..❤️ #Ananya nagalla💞💞💞
👩టాలీవుడ్ భామలు - ShareChat
00:25
Ananya Nagalla...🩶🩶🩶 #Wednesday crash..❤️ #First Crash For Me❤️ #👩టాలీవుడ్ భామలు #😍అనన్య నాగళ్ళ..❤️ #Ananya nagalla💞💞💞
👩టాలీవుడ్ భామలు - ~00| ~00| - ShareChat
Swathishta Krishnan...❤️❤️❤️ #Wednesday crash..❤️ #First crush for me #👩టాలీవుడ్ భామలు #💖💖స్వాతిష్ట కృష్ణన్💖💖 #💖💖💖Swathishta Krishnan💖💖💖
👩టాలీవుడ్ భామలు - ShareChat
00:15
Swathishta Krishnan...❤️❤️❤️ #Wednesday crash..❤️ #First crush for me #👩టాలీవుడ్ భామలు #💖💖స్వాతిష్ట కృష్ణన్💖💖 #💖💖💖Swathishta Krishnan💖💖💖
Wednesday crash..❤️ - dud ಞ 9mikkic phologrphliy Lee dud ಞ 9mikkic phologrphliy Lee - ShareChat
అట్ల తదియ (చంద్రోదయ గౌరీ వ్రతం) : అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా పట్టు పావడాలు కట్టిన పల్లె పడుచులు. తమ ఆశలు ప్రతిఫలించేలా, నవవధువులు ముత్తైదు భాగ్యాలు సిద్ధించేలా, కరచరణాలకు నఖరంజని ధరిస్తారు. తెలుగు లోగిళ్లకు, తోటలకు సరికొత్త అందాలు తెస్తారు. ఆధ్యాత్మిక శోభకు పట్టం కడతారు. కన్నెలు, నవవధువులు చేసే సరదాల సందళ్లు చూసే కన్నులు వెలుగులై, మనసు ముగ్ధమయ్యే కమనీయ రమణీయ పర్వం అట్లతద్ది. అట్లతద్ది ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి వెళ్లిన మూడో రోజు వస్తుంది. పెళ్లైన స్త్రీలు ఐదవతనం కోసం, కన్నె పిల్లలు మంచి భర్త కోసం అట్లతద్ది నోము నోచుకోవడం ఆనవాయితీగా కనిపిస్తుంది. అట్లతద్ది రోజున తెల్లవారు జామునే లేచి, స్నానాలు చేసి చద్దిభోజనం చేస్తారు. పగలంతా భోజనం చేయరు. పగలంతా తోటలవెంట చెలులతో ఆట పాటలతో గడిపి సాయంవేళకు ఇళ్లకు చేరుకుంటారు. పొద్దువాలిన తరువాత పదకొండు మంది ముత్తైదువులను ఆహ్వానిస్తారు. పూజగదిలో కలశం ప్రతిష్టించి గౌరీదేవిని ఆవాహన చేసి పూజిస్తారు. పూజలో తులసీదళం, తమలపాకులు తప్పనిసరిగా వినియోగిస్తారు. ఆ ఆకులతో 11 ముళ్లు వేసి చేతులకు తోరాలు కట్టుకుంటారు. అనంతరం అట్లతద్ది కథ చదువుకుంటారు. కథ పూర్తైన తర్వాత అమ్మవారికి కుడుములు, పాలతాలికలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. ముత్తైదువులకు ఒకొక్కరికీ 11 అట్లు చొప్పున పెట్టి, గౌరీ దేవికి నివేదించిన కుడుముల్లోనుంచి ఒకటి ఉంచిన తాంబూలంతో వాయనం ఇస్తారు. ఆ తర్వాత చంద్రుణ్ణి దర్శించుకుంటారు. తరువాత అట్లు ఆరగించి ఉపవాసం విరమిస్తారు. . #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🌷గురువారం స్పెషల్ విషెస్ #🎉👩‍❤️‍👩అట్లతద్ది శుభాకాంక్షలు 🍌🥥🎊 #అట్లతద్ది శుభాకాంక్షలు💐💐
☀️శుభ మధ్యాహ్నం - ShareChat
🙏శ్రీ దక్షిణామూర్తి ద్వాదశ నామ స్తోత్రం🙏 💫💫💫💫💫💫💫💫💫💫💫💫 🙏*గురవే సర్వలోకానాం* *భిషజే భవరోగిణాం* *నిథయే సర్వవిద్యానాం* *శ్రీ దక్షిణామూర్తయే నమః*👏 💫*ప్రథమం* దక్షిణామూర్తి నామ *ద్వితీయం* వీరాసనస్థితం *తృతీయం* వటవృక్షనివాసంచ *చతుర్ధం* సనకసనందనాదిసన్నుతం *పంచమం* నిగమాగమనుతంచ *షష్ఠం* బ్రహ్మజ్ఞానప్రదం *సప్తమం* అక్షమాలాధరంశ్చ *అష్టమం* చిన్ముద్రముద్రం *నవమం* భవరోగభేషజంశ్చ *దశమం* కైవల్యప్రదం *ఏకాదశం* భాషాసూత్రప్రదంశ్చ  *ద్వాదశం* మేధార్ణవం || *సర్వం శ్రీ మేధాదక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు*👏 ఓం నమః శివాయ నమః🌾🌺🙏 హరే కృష్ణ గోవిందా 🪷🙏🪷 . . #☀️శుభ మధ్యాహ్నం #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🕉️శ్రీ దక్షిణామూర్తి స్వామి🙏 #🪔శ్రీ దక్షిణామూర్తి స్వామి..🕉️🚩
☀️శుభ మధ్యాహ్నం - ShareChat
01:30
🌿🌼🙏శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు ఉన్నత విద్య కొరకు, పిల్లలకు చదువు పట్ల ఆసక్తి, జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షలలో విజయం చేకూర్చే శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు🙏🌼🌿 🌿🌼🙏శివ జ్ఞాన స్వరూపుడు మేధా దక్షిణామూర్తి, విష్ణు జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు. వీరిద్దరూ జ్ఞాన స్వరూపులే. జ్ఞాన ప్రదాతలే🙏🌼🌿 🌿🌼🙏ఇక విద్యల గురించి వేరే చెప్పనక్క ర్లేదు. దక్షిణామూర్తి స్తోత్రం గురు గ్రహ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని పెద్దలు చెబుతారు🙏🌼🌿 🌿🌼🙏గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయేనమ:🙏🌼🌿 🌿🌼🌼అన్నిలోకాలకూ గురువు సంసారమనే రోగంతో బాధపడుతుతన్న వారికి వైద్యుడు, అన్ని విద్యలకూ నిధి అయిన శ్రీదక్షిణామూర్తికి నమస్కారమని దీని అర్థం🙏🌼🌿 🌿🌼🙏శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం🙏🌼🌿 🌿🌼🙏దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం🙏🌼🌿 🌿🌼🙏ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి🙏🌼🌿 🌿🌼🙏మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి🙏🌼🌿 🌿🌼🙏 ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి🙏🌼🌿 🌿🌼🙏దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది🙏🌼🌿 🌿🌼🙏అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు🙏🌼🌿 🌿🌼🙏మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది🙏🌼🌿 ఆ రూపాలు వరుసగా…. శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి¸ హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి¸ కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి¸ శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి. 🌿🌼🙏దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు🙏🌼🌿 🌿🌼🙏సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవాలు మేధా దక్షిణామూర్తి స్వామివారు మరియూ శ్రీ హాయగ్రీవ స్వామివారు🙏🌼🌿 #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🌷గురువారం స్పెషల్ విషెస్ #🪔శ్రీ దక్షిణామూర్తి స్వామి..🕉️🚩 #🕉️శ్రీ దక్షిణామూర్తి స్వామి🙏
☀️శుభ మధ్యాహ్నం - ShareChat
*మన దేవాలయాలు*_ 🪴🎪🎪🎪🎪🎪🎪🎪🎪🎪🎪🪴 *కర్నూలు జిల్లా : మంత్రాలయం* *శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయం* భారతావని పుణ్యభూమి. ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు, గుడులు గోపురాలకు కొదువ లేదు. ఆరోజుల్లో అత్యధిక ధన, కనక సంపద ఆలయాల్లోనే ఉండేది. అందుచేతనే పరమతస్థులు తమ దండ యాత్రలో ముఖ్యంగా దేవాలయాలనే ఎంచుకొని కొల్లగొట్టారు. అలాంటి ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయాల్లో శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు కర్నూలు నుండి 100కి.మీ దూరంలో తుంగభద్ర తీరంలో ఉంది. కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్థాపించేందుకు దైవ సంకల్పంతో జన్మించిన కారణ జన్ముడు శ్రీ రాఘవేంద్ర స్వామి. శ్రీహరి భక్తుడు. ఈయన కొలువై ఉన్న ప్రాంతమే "మంత్రాలయం". మంత్రాలయం అసలు పేరు "మాంచాల". శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖ గురువు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తున్నారు. తమిళనాడులోని కుంభకోణం మధ్వమఠాన్ని 1624 నుండి 1636 వరకూమఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేసారు. ఇతను శ్రీమూల రాముడి, శ్రీ పంచముఖ ఆంజనేయస్వామికి పరమ భక్తులు. *చరిత్ర :* రాఘవేంద్రస్వామి వెంకణ్ణ భట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మన్నభట్టు, గోపికాంబ అనే దంపతులకు రెండవ సంతానంగా 1595లో జన్మించారు. రాఘవేంద్ర స్వామి (1595-1671). జన్మ సంవత్సరం 1598 లేదా 1601 కూడా కావచ్చు అనే వాదనలున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు ఈతణ్ణి చిన్నప్పుడు వేంకటనాథుడనీ, వేంకటాచార్య అని కూడా పిలిచేవారు. తన బావ లక్ష్మీనరసింహాచార్ వద్ద మధురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక, వేంకటనాథుడిని కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరి, ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యాసించారు. 1614లో మధురై నుండి తిరిగి వచ్చినపుడు సరస్వతీబాయితో వీరికి వివాహమైంది. వీరి కొడుకు లక్ష్మీనారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు. శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్రతీర్థుల వద్ద అభ్యసించడం మొదలుపెట్టారు. అనతికాలంలో గొప్ప విద్యార్థిగా ఉద్భవించి, అన్ని వాదోపవాదాలలో తర్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు. సంస్కృత, వైదిక శాస్త్రాల్లో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలుపెట్టారు. రాఘవేంద్రస్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే, ఆయన కాలంలో ఆయనో గొప్ప వైణికుడు కూడా. తరువాత సంసార బంధాలు వదిలించుకుని సన్యాసం స్వీకరించి ....మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణ భారత దేశమంతా తిరిగారు.. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్యబృందానికి చూపిస్తూ మధ్వప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేసారు. మధ్వమఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్రస్వామి అక్కడున్న మూల రాములను పూజిస్తూ, బోధనలు చేస్తూ మంత్రాలయానికి వచ్చారు. స్వామి పూర్వ అవతారం శ్రీమహావిష్ణువు భక్తపరాయణుల్లో ఒకడైన ప్రహ్లాదుడు. అప్పుడు యజ్ఞాలు, యాగాలు చేసిన స్థలం మంత్రాలయమని గాథ. అందుకే పూర్వవతారంలో రాజుగా పాలించిన స్థలం కావడంతో ఇక్కడే తాను బృందావనస్థులు (జీవ సమాధి) కావాలని స్వామి తలచారు. ఆ సమయంలోనే ఆ గ్రామదేవత మంచాలమ్మ (రేణుకాంబ రూపిణి) రాఘవేంద్రస్వామిని ఇక్కడే ఉంచాలని ఆజ్ఞాపించిందట! దీంతో స్వామి ఇక్కడే ఉంటూ చివరకు ఇక్కడే బృందావనస్థులు అయ్యారు. అప్పటి నుంచి నిత్యం రాఘవేంద్రస్వామి మూల బృందావననానికి పండితులు మంత్రాలు వల్లిస్తూ ఉండటంతో ఈ మఠం కాలక్రమంలో మంత్రాలయంగా మారిందని చెబుతారు. ఇతను వైష్ణవాన్ని అనుసరించాడు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. 1671లో తన శిష్యబృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవసమాధి అయ్యారు. శ్రీ రాఘవేంద్రస్వామి వారు జీవ సమాధిలో వుండికూడ అనేక మహిమలు ప్రదర్శిస్తుంటారు. భక్తులు కోర్కెలు తీరుస్తుంటారు. ఆ స్వామి జీవ సమాధి అయిన తరువాత తనకు కనిపించి తనతో మాట్లాడినట్లుగా Thomas Manro అనే ఆంగ్లేయ అధికారి చెప్పినట్లు కర్నూలు జిల్లా Gajette Records లో ప్రస్తావించబడింది. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ ద్వితీయనాడు 'ఆరాధన' ఉత్సవం జరుపబడుతుంది. తనను దర్శించిన భక్తుల కోరికలను తీర్చటమే కాకుండా, వారికి మంచి ఆరోగ్నాన్ని, సిరిసంపదలను కలుగచేస్తున్న వర ప్రదాత మూగ, చెవిటి, గ్రుడ్డి వారందరికి స్వస్థత చేకూర్చే ఆరోగ్య ప్రధాత శ్రీ రాఘవేంద్ర స్వాములవారు. *మాంచాలమ్మ ఆలయం :* మంత్రాలయం గ్రామ దేవతగా మాంచాలమ్మని కొలుస్తారు. శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకునే ముందు భక్తులు మాంచాలమ్మ వారి ఆలయాన్ని దర్శించుకుంటారు. రాఘవేంద్ర స్వామి వారు ఈ మాంచాలమ్మ వారిని ప్రతి రోజు పూజించే వారని అంటారు. *పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం:* ఇక్కడే రాఘవేంద్రస్వామి 12 ఏళ్లపాటు తపస్సు చేశారట! నాటి పంచముఖ ఆంజనేయుడి ప్రతిరూపమే ఇక్కడ చూడొచ్చు. అయిదు ముఖాలతో ఇక్కడ కనిపించే ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేకమైనది. 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔 #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🌷గురువారం స్పెషల్ విషెస్ #🛕రాఘవేంద్ర స్వామి🙏 #🛕మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️
☀️శుభ మధ్యాహ్నం - ShareChat
00:29