@nyrk
@nyrk

💕💕️Chinni(నీ స్నేహంకోసం)✍

fαιℓυяє ∂σєѕи'т мєαи gαмє σνєя...ιт мєαиѕ тяу αgαιи ωιтн єχρєяιєи¢є

#

👫 బంధం

తల్లికి సర్తెన నిర్వచనం ఒకామె వీసా అప్లికేషన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడి అధికారి అప్లికేషన్ ఫారం పూర్తి చేస్తూ "మీరేం పని చేస్తూ ఉంటారు" అని అడిగాడు ."తల్లిని" అన్నది అధికారి కొంచెం అయోమయంగా, "ఇక్కడ ‘తల్లి’ అన్న ఆప్షన్ లేదు మేడమ్. మీ వృతి ఏమిటి?" అని అడిగాడు. "పిల్లల అభివృద్ది అనే అంశo పై నేను రీసెర్చ్ స్కాలర్ని" అని సమాధానం ఇచ్చింది గృహిణి. అధికారి మరింత అయోమయంతో "మీరు ఈ రీసెర్చ్ ఎక్కడ చేస్తున్నారు?" అని ప్రశ్నించారు. "మా ఇంట్లో" అన్నది తల్లి. అధికారి మరింత అయోమయంతో చూసారు . "ఈ రీసెర్చ్ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను. రోజుకి పద్నాలుగు గంటలు పని చేసినా పూర్తి అవ్వదు. దీనికి నాకు మార్గ దర్శకులు నా భర్త. సీనియర్ రీసెర్చ్ గైడ్, స్కాలర్స్ మా అమ్మ. ..! మా తాతమ్మ, అమ్మమ్మ, నానమ్మ. వీళ్ళందరూ నా యూనివర్సిటీ డైరెక్టర్లు. మా అత్తగారు అప్పుడప్పుడు నా పేపర్స్ దిద్దుతూ ఉంటుంది. ఇప్పటికే నాకు రెండు డిగ్రీలు వచ్చాయి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి" అంటూ ముగించింది. అధికారి ఆమెతో పాటూ గుమ్మం వరకు వచ్చి, కరచాలనం చేసి సాగనంపుతూ "తల్లికి ఇంతకన్నా గొప్ప నిర్వచనం నా జీవితంలో నేనెప్పుడూ వినలేదు మేడమ్. థాంక్స్" అన్నాడు మాతృదేవోభవ... 🙏🙏🙏 #👫 బంధం
403 వీక్షించారు
6 రోజుల క్రితం
#

🤔💭నా ఆలోచనలు

💧💧2050 లో వార్తా సమాహారం.. * * * * * ఈరోజు వార్తలు.. 🏠 నెల్లూరు నగరంలో తాళం వేసిన ఇంట్లో ఉన్న మూడు బిందెల నీళ్ళు దొంగిలించిన దుండగులు , వారి కోసం పోలీసుల వెతుకులాట.. 👫మూడు సంవత్సరాల పాపని lkg లో చేర్చుకోవడానికి రెండు బిందెల నీటిని అడిగిన స్కూల్ ప్రధానోపాధ్యాయుడి అరెస్ట్.. 🙋ఇంట్లో ఉన్న నాలుగు బిందెల నీటిని తీసుకుని ప్రియుడితో పారిపోయిన వివాహిత - నాలుగు బిందెల నీటిని అప్పగించాలని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భర్త. 💂రెండు బిందెల నీటిని ఇస్తే ఒకే సం 50 బిందెల నీటిని ఇస్తాం అనే నీటి మోసగాళ్ళ బృందం నుండి జాగ్రత్తగా ఉండాలని ప్రజలని హెచ్చరించిన ప్రభుత్వం. 😎 మేము అధికారంలోకి వస్తే రేషన్ షాపులో మూడు బిందెల నీటిని ఉచితంగా ఇస్తామన్న ప్రతిపక్షం - ఇది సాధ్యం కాదని ఖండించిన అధికారపక్షం 🚀భూమి నుండి గురుగ్రహం మీదకి రాకెట్ ద్వారా దొంగతనంగా పంపిన 20,000 లీటర్ల నీటిని స్వాధీనం చేసుకున్న గగన రక్షకభటులు 🏦 ప్రపంచ నీటి బ్యాంకు నుండి 50 కోట్ల లీటర్ల నీటిని అప్పుగా తీసుకున్న ఇండియా 👪దేశ ప్రజలంతా నెలకి ఒకసారి మాత్రమే స్నానం చేయాలని , స్నానానికి రెండు చెంబుల నీటిని మాత్రమే వినియోగించాలని చట్టం చేసిన కేంద్రప్రభుత్వం - స్వాగతించిన ప్రతిపక్షం ⛲ఈరోజు నీటి ధరల వివరాలు.. బావి నీరు ఒకలీటరు - 4364/- నది నీళ్ళు ఒక లీటరు - 8749/- శుద్ధి చేసిన నీరు లీటరు - 12542/- రూపాయల లెక్కన అమ్మకాలు జరుగుతున్నాయి. * * * * * 🌴 చెట్లు నాటుదాం , కాలుష్యాన్ని తగ్గిద్దాం - రాబోయే తరం వారికి ఇలాంటి సంఘటనలు ఎదురవకుండా చూద్దాం 😄 ఇది నవ్వడానికి కాదు 😡 ఆలోచించడానికి.. మరణం అందరికి ఉంది కాని .... మరణించాలని ఎవరూ అనుకోరు. ఈ రోజుల్లో ఐతే పరిస్థితి ఇంకా విషమంగా ఉంది.. 🆚భోజనం అందరికీ కావాలి కాని.... ఎవరూ వ్యవసాయం చేయాలనుకోరు. 🆚నీరు అందరికి కావాలి కానీ .... నీటి వనరులు రక్షించ డానికి ఎవరూ ప్రయత్నం చేయరు. 🆚పాలు అందరికీ కావాలి కానీ...ఆవు ను పాలించాలని ఎవరూ అనుకోరు. 🆚నీడ అందరికి కావాలి కాని.... చెట్లను నాటాలని వాటిని రక్షించాలనీ ఎవరూ అనుకోరు. 🆚భార్య అందరికి కావాలి....కాని ఆడ పిల్లలు పుట్టాలనీ... వారిని రక్షించాలనీ ఎవరూ అనుకోరు. 🆚ఈ మెసేజ్ చదివి వాహ్! వాహ్!!! అనేవారు ఉంటారు.... కాని వాటిని నలుగురికి పంపి చైతన్య పరచాలనీ ఎవరూ అనుకోరు........ అనుకునేవారు పంపి నిరూపించు కోగలరు. 🏃🏃‍♀✍✌ #🤔💭నా ఆలోచనలు
761 వీక్షించారు
10 రోజుల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్ ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..