https://youtube.com/watch?v=xrd0neWUoHE&si=swmg6vp47zT0ntEY
# #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #😴శుభరాత్రి #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🌊మన కోస్తాంధ్ర
తుపాను ప్రభావిత గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ కార్యక్రమం చేపట్టాలి
•పకడ్బందీగా పారిశుద్ధ్య పనుల కోసం మొబైల్ బృందాలు
•రోడ్ల పునరుద్ధరణకు తక్షణ చర్యలు
•తాగు నీరు సరఫరాకు ఇబ్బంది ఏర్పడిన చోట్ల ప్రత్యామ్నాయ చర్యలు
•మొంథా తుపాను అనంతర కార్యచరణపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూఎస్. ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan
‘మొంథా తుపానును సమర్థంగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు తుపాను అనంతర చర్యలు అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖలు యుద్ధ ప్రాతిపదికన పని చేయాలి. పటిష్టమైన ప్రణాళికతో, సమన్వయంతో పనిచేయాలి. తుపాను, భారీ వర్షాలు తగ్గాక గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య, తాగునీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఎక్కడా ఇబ్బందులు లేకుండా దీనిని సమర్థవంతంగా పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉంద’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ కార్యక్రమాలను మొదలుపెట్టాలన్నారు. తుపాను ప్రభావం వల్ల పాడైన రోడ్లను ప్రాధాన్య ప్రకారం బాగు చేయాలన్నారు. మొంథా తుపాను అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యలను తక్షణమే మొదలుపెట్టాలని సూచించారు.
1583 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రి కు తెలియచేశారు. శానిటేషన్ సిబ్బందిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకున్నామని చెప్పారు. 38 చోట్ల రోడ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయనీ, మరో 125 చోట్ల రహదారులకు గుంతలు ఏర్పడ్డాయని వివరించారు. రక్షిత తాగు నీటి పథకాల ట్యాంకులు దగ్గర క్లోరినేషన్ ప్రక్రియ చేస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “తాగు నీటిని అందించే పథకాలకు, నీటి సరఫరాకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రత్యామ్నాయం చూడాలి. ఈ చర్యలు తక్షణమే తీసుకోవాలి. గ్రామాల్లో మొబైల్ శానిటేషన్ బృందాలను సిద్ధంగా ఉంచాలి. 21,055 మంది పారిశుద్ధ్య సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి పారిశుద్ధ్య మెరుగుదలకు వెంటనే చర్యలు చేపట్టండి. వాన నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో నీటిని బయటకు పంపించే చర్యలు తీసుకోవాలి. నీరు ఎక్కడ కలుషితం కాకుండా, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ తరుణంలో దోమల వల్ల వచ్చే వ్యాధులు పెరుగుతాయి. వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకొని గ్రామాల్లో వ్యాధులు రాకుండా అరికట్టాల్సిన బాధ్యత తీసుకోండి. మూడు, నాలుగు రోజుల పాటు పారిశుద్ధ్య నిర్వహణపై పూర్తిగా దీనిపై దృష్టి సారించండి. మళ్ళీ సాధారణ పరిస్థితి వచ్చే వరకు గ్రామాల్లో నిరంతరం పారిశుద్ధ్య మెరుగుదలకు చర్యలు తీసుకోవాలి. దీనిలో ఎక్కడ లోటుపాట్లకు తావు ఉండకూడదు. దెబ్బ తిన్న రహదారుల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టాలి” అన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
•శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి
తుపాను అనంతరం తన శాఖల వారీగా జరిగిన నష్టం, తీసుకోవాల్సిన చర్యలను ఉన్నతాధికారులు పవన్ కళ్యాణ్ కు వివరించగా దీనిపై తగిన సూచనలను ఉప ముఖ్యమంత్రి చేశారు.
# #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #😴శుభరాత్రి #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ
https://youtube.com/shorts/nP9v83qJ80o?si=lbVlPgfboRKUNDvt
# #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🥳Celebrations Video🎆 #🙆 Feel Good Status
MLC శ్రీ నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#Nagababu #HBDNagababu #HappyBirthdayNagababu #Pawankalyan #Janasenapartytelangana #JanaSenaParty #AndhraPradesh #Telangana
# #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🙏Thank you😊 #🎂Birthday Party🥳 #😎మెగాస్టార్ ఫ్యాన్స్
మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి నిత్యావసర సరుకుల పంపిణీ.
ప్రాణ నష్టం కలుగకుండా తగిన చర్యలు తీసుకుని సఫలీకృతం అయిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలూ తీసుకుంటుంది.
#CycloneMontha
# #🌨వర్షాకాలం స్పెషల్ ఫుడ్ 🥘 #🌧వర్షాకాలం స్టేటస్🤗 #🆕Current అప్‌డేట్స్📢 #😇My Status #🟥జనసేన
https://youtube.com/shorts/R03f58NLa7o?si=Hea4TjIuER5SH71O
# #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #😎మా నాయకుడు గ్రేట్✊ #🌨️వాతావరణ అప్‌డేట్స్ #🌊మన కోస్తాంధ్ర
MLC శ్రీ నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
- @pawankalyan @nagababuofficial
#Nagababu #pawankalyan #HappyBirthdayNagababu #HDBNagababu #janasenapartytelangana #janasenaparty
# #🎂Birthday Party🥳 #☀️శుభ మధ్యాహ్నం #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #👫తోబుట్టువుల ప్రేమ 🥰
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఎప్పటికప్పుడు మొంథా తుపాను ప్రభావంపై తన కార్యాలయ అధికారుల ద్వారా క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తీసుకొంటున్నారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్ల నుంచి పేషీ అధికారులు క్షేత్ర స్థాయి సమాచారం తీసుకొన్నారు. అర్థరాత్రి తుపాను తీరం దాటిన క్రమంలో తీవ్రమైన ఈదురు గాలులు, భారీ వర్షాల మూలంగా కలిగిన నష్టంపై వివరాలు తెలుసుకున్నారు.
•పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో విద్యుత్ తీగలు పడటం, అదే విధంగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన క్రమంలో వాటి పునరుద్ధరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
•తుపాను బలహీనపడ్డా భారీ వర్షాలు ఉన్నందున ప్రజలను సురక్షిత ప్రదేశాల్లోనే ఉంచాలన్నారు.
•పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని ఈ రోజు కూడా అక్కడే ఉంచి ఆహార, వసతి కల్పించాలని స్పష్టం చేశారు.
# #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🗞️అక్టోబర్ 29th అప్‌డేట్స్💬 #🌧వర్షాకాలం స్టేటస్🤗 #⛈రుతుపవనాలు అప్‌డేట్స్
https://youtube.com/watch?v=__YQJFfwGjc&si=w2leLK6qfDQhukoK
# #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #🗞పాలిటిక్స్ టుడే #😴శుభరాత్రి #🌨️వాతావరణ అప్‌డేట్స్
https://youtube.com/shorts/sNMebZ4k3TE?si=sf21gK2jS0xc8CGt
# #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #saibaba #భగవాన్ శ్రీ సత్యసాయి బాబా #📅 చరిత్రలో ఈ రోజు













