*🔔_ #🌅శుభోదయం🌻🌺_🔔*
*_సంపదలెన్ని ఉన్నా, తృప్తిలేని జీవితం వ్యర్ధం._*
*_పూరి గుడిసే బ్రతుకైనా కంటి నిండా నిదురపోయే మనిషి జీవితం ధన్యం._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
#🙏అమ్మవారి అలంకారాలు🔱🌹
_*🚩నేడు(30.09.2025) ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గాదేవి అలంకరణ🚩*_.
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) ఏడవ రోజు శ్రీ దుర్గాదేవి అమ్మవారి అలంకరణ (కుజ + రాహు) ఎరుపు చీర (కుజుడు , బుధుడు) పేలాలు పాయసం నైవేద్యం (రాహువు , శుక్రుడు , చంద్రుడు)
దుర్గే దుర్గతి నాశిని..ఓం శ్రీ దుర్గా దేవ్యై నమః.
శ్లోకం:సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే , శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే...
దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి , ఎర్రటి అక్షతలు , ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి..
ఈ శ్లోకం చాలా శక్తిమంతమయిన శ్లోకం. దుర్గాదేవికి సంభందించిన 32 నామాలు ఇందులో ఉన్నాయి. ఈ శ్లోకం దుర్గాసప్తసతి లో కనిపిస్తుంది. ఈ శ్లోకాన్ని ఎవరు రోజూ చదువుతారో వారు అన్ని భయాలనుంచీ కష్ఠాలనుంచీ విముక్తులవుతారు. అందరూ తప్పకుండా నమ్మకం తో చదవండి..
*శ్రీ దుర్గా ద్వా త్రిశం నామ మాల స్తోత్రం*
దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వినివారిణీ
దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ
ఓం దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా
ఓం దుర్గమజ్ఞానదా దుర్గ దైత్య లోక దవానలా
ఓం దుర్గ మాదుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణీ
ఓం దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా
ఓం దుర్గమ జ్ఞాన సంస్థానా దుర్గమ ధ్యాన భాసినీ
ఓం దుర్గ మోహా దుర్గమదా దుర్గామాత స్వరూపిణీ
ఓం దుర్గ మాసుర సంహార్త్రీ దుర్గమాయుధధారిణీ
ఓం దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ
ఓం దుర్గభీమా దుర్గభామా దుర్లభా దుర్గ దారిణీ
నామావళి మిమాం యస్తు దుర్గాయా మమ మానవః
పఠేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి నసంశయః..
*పటించవలసిన మంత్రములు*
*దుర్గాష్టకం*
ఉద్వపయతునశ్శక్తి - మాదిశక్తే ద్దరస్మితమ్
తత్వం యస్యమాహత్సూక్ష్మం - మానన్దోవేతి సంశయః
జ్ఞాతుర్ఞానం స్వరూపం - స్యాన్నగుణోనాపి చక్రియా
యదిస్వ స్య స్వరూపేణ - వైశిష్య్యమనవస్దీతిః
దుర్గే భర్గ సంసర్గే - సర్వభూతాత్మవర్తనే
నిర్మమేనిర్మలేనిత్యే - నిత్యానందపదేశివా!
శివాభవాని రుద్రాణి - జీవాత్మపరిశోధినీ!
అమ్బా అమ్బిక మాతంగీ - పాహిమాం పాహిమాం శివా
దృశ్యతేవిషయాకారా - గ్రహణే స్మరణే చధీః
ప్రజ్ఞావిషయ తాదాత్మ్య - మేవం సాక్షాత్ ప్రదృశ్యతే
పరిణామో యథా స్వప్నః - సూక్ష్మస్యస్థూలరూపతః
జాగ్రత్ ప్రపఞ్చ ఏషస్యా -త్తథేశ్వర మహాచితః
వికృతి స్సర్వ భూతాని - ప్రకృతిర్దుర్గదేవతా
సతః పాదస్తయోరాద్యా - త్రిపాదీణియతేపరా!
భూతానామాత్మనస్సర్గే - సంహృతౌచతథాత్మని
ప్రభవే ద్దేవతా శ్రేష్ఠా - సఙ్కల్పానారా యథామతిః
*ఫలశృతి*
యశ్చాష్టక మిదం పుణ్యం - పాత్రరుత్థాయ మానవః
పఠేదనన్యయా భక్త్యా - సర్వాన్కామానవాప్నుయాత్
8 పర్యాయములు స్మరించవలెను. పై మంత్రము సాద్యము కానీ వారు *ఓం దుం దుర్గాయై నమః* అనే మంత్రమును 108 జపించవలెను.
*ఎవరు చెయ్యాలి ? ఎందుకు చెయ్యాలి ? ఎలా చెయ్యాలి ?*
ఈ రోజు అమ్మవారిని సశాస్త్రీయముగా పూజించడము వలన జాతకములలోని కుజ , రాహు క్షీణ - నీచ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గును. తద్వారా ఆకస్మిక గండములనుండి విముక్తి కల్గును.
వైవాహిక సమస్యలు తొలగి కుటుంబములో కలతలు తగ్గుతాయి.
రాహు గ్రహము వలన ఏర్పడిన వ్యసనముల నుండి విముక్తి లభించు అవకాశము కలదు.
తీవ్రమైన మానసిక ఆందోళనతో బాదపడుట - డిప్రెషన్ - భయము - ఉన్మాదము వంటి సమస్యల నుండి ఉపశమనము లబించే అవకాశము ఉన్నది
ఎందుకనగా వీటన్నింటికి కారణం వారి వారి జాతకములలోని చంద్ర , కుజ , రాహు గ్రహముల ప్రభావమే అని ఘంటా పదముగా చెప్పవచ్చు. ఇటువంటి సమస్యలున్న వారు ఈ రోజు దుర్గా దేవి ని సశాస్త్రీయం గా పూజించుట అత్యంత శ్రేష్ట దాయకము.
అనవసర ధన వ్యయం ( శుక్ర , చంద్ర , కుజ ) తగ్గును.
వివాహము ఆలస్యములు తొలగి సకాలములో వివాహము జరుగును.
*శ్రీ దుర్గా అష్టోత్తర శత నామావళి*
ఓం దుర్గాయై నమః
ఓం శివాయై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం చండికాయై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం సర్వాలోకేశాయై నమః
ఓం సర్వకర్మఫలప్రదాయై నమః
ఓం సర్వతీర్ధమయ్యై నమః
ఓం పుణ్యాయై నమః (10)
ఓం దేవయోనయే నమః
ఓం అయోనిజాయై నమః
ఓం భూమిజాయై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం ఆధారశక్త్యై నమః
ఓం అనీశ్వర్యై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం నిరహంకారాయై నమః
ఓం సర్వగర్వ విమర్దిన్యై నమః
ఓం సర్వలోకప్రియాయై నమః (20)
ఓం వాణ్యై నమః
ఓం సర్వవిద్యాధి దేవతాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం దేవమాత్రే నమః
ఓం వనీశాయై నమః
ఓం వింధ్యవాసిన్యై నమః
ఓం తేజోవత్యై నమః
ఓం మహామాత్రే నమః
ఓం కోటిసూర్య సమప్రభాయై నమః
ఓం దేవతాయై నమః (30)
ఓం వహ్నిరూపాయై నమః
ఓం సతేజసే నమః
ఓం వర్ణరూపిణ్యై నమః
ఓం గుణాశ్రయాయై నమః
ఓం గుణమధ్యాయై నమః
ఓం గుణత్రయ వివర్జితాయై నమః
ఓం కర్మజ్ఞానప్రదాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం సర్వసంహార కారిణ్యై నమః
ఓం ధర్మజ్ఞానాయై నమః (40)
ఓం ధర్మనిష్ఠాయై నమః
ఓం సర్వకర్మ వివర్జితాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం కామసంహర్త్ర్యై నమః
ఓం కామక్రోధ వివర్జితాయై నమః
ఓం శాంకర్యై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం చంద్రసుర్యాగ్ని లోచనాయై నమః
ఓం సుజయాయై నమః (50)
ఓం జయభూమిష్ఠాయై నమః
ఓం జాహ్నవ్యై నమః
ఓం జనపూజితాయై నమః
ఓం శాస్త్ర్యై నమః
ఓం శాస్త్రమయ్యై నమః
ఓం నిత్యాయై నమః
ఓం శుభాయై నమః
ఓం చంద్రార్ధమస్తకాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భ్రామర్యై నమః (60)
ఓం కల్పాయై నమః
ఓం కరాళ్యై నమః
ఓం కృష్ణ పింగళాయై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం రౌద్ర్యై నమః
ఓం చంద్రామృత పరిస్రుతాయై నమః
ఓం జ్యేష్ఠాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం మహామాయాయై నమః (70)
ఓం జగత్సృష్ట్యధికారిణ్యై నమః
ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయై నమః
ఓం కామిన్యై నమః
ఓం కమలాలయాయై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం కలాతీతాయై నమః
ఓం కాలసంహారకారిణ్యై నమః
ఓం యోగనిష్ఠాయై నమః
ఓం యోగిగమ్యాయై నమః
ఓం యోగిధ్యేయాయై నమః (80)
ఓం తపస్విన్యై నమః
ఓం జ్ఞానరూపాయై నమః
ఓం నిరాకారాయై నమః
ఓం భక్తాభీష్ట ఫలప్రదాయై నమః
ఓం భూతాత్మికాయై నమః
ఓం భూతమాత్రే నమః
ఓం భూతేశ్యై నమః
ఓం భూతధారిణ్యై నమః
ఓం స్వధాయై నమః
ఓం నారీ మధ్యగతాయై నమః (90)
ఓం షడాధారాధి వర్ధిన్యై నమః
ఓం మోహితాంశుభవాయై నమః
ఓం శుభ్రాయై నమః
ఓం సూక్ష్మాయై నమః
ఓం మాత్రాయై నమః
ఓం నిరాలసాయై నమః
ఓం నిమ్నగాయై నమః
ఓం నీలసంకాశాయై నమః
ఓం నిత్యానందాయై నమః
ఓం హరాయై నమః (100)
ఓం పరాయై నమః
ఓం సర్వజ్ఞానప్రదాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం సత్యాయై నమః
ఓం దుర్లభరూపిణ్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సర్వగతాయై నమః
ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః (108)
🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏
#*f🤣un*..
వయసు ఐస్ క్రీం లాంటిదని ఎందుకంటారంటే..
ఐస్ క్రీం కరిగితే చేతిలో పుల్ల మిగులుతుంది..
వయసు పెరిగితే చేతిలోకి కర్ర వస్తుంది..❗
#🌅శుభోదయం🌻🌺
A Happy Morning to all. Have a Blessed day. Take Care.🙏🏻🙏🏻
#🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥
*పాకిస్తాన్‌ను ముంచేసిన రవుఫ్.. దండం పెట్టి అడిగితే పాపం పాక్‌నే ఓడించాడు❗*
29.09.2025🏏
ఆసియా కప్ 2025లో భారత్ - పాక్ మధ్య జరిగిన ఉత్కంఠ ఫైనల్ పోరులో టీమిండియా ఛాంపియన్‌గా నిలిచింది. ఆఖరి ఓవర్ వరకూ దోబూచులాడుతూ వచ్చిన విజయం చివరికి భారత జట్టును వరించింది.
ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం.. మిడిల్ ఓవర్లలో పెద్దగా పరుగులు రాకపోవడంతో, లాస్ట్ ఓవర్లలో భారత్‌పై ఒత్తిడి ఎక్కువైంది. కానీ.. అదే సమయంలో హారిస్ రవుఫ్ ఓవర్లు టీమిండియాకు వరంలా మారి చివరికి విజయాన్ని అందించాయి.
బంగ్లాదేశ్‌పై విజయం తర్వాత ఆసియా కప్ ఫైనల్లో పాక్ అడుగుపెట్టడంతో హారిస్ రవుఫ్ గ్రౌండ్ మొత్తం తిరుగుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అదే సమయంలో ఒక పాకిస్తాన్ అభిమాని రవుఫ్ చేతులు పట్టుకుని భాయ్.. భారత్‌ను అస్సలు వదలొద్దు, ఫైనల్లో గెలవాలంటూ వేడుకున్నాడు. దండం పెట్టి మరీ గెలిపించండంటూ ప్రాధేయపడ్డాడు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆసియా కప్ ఫైనల్లో భారత్ గెలవడానికి ఒక కారణం తిలక్ వర్మ బ్యాటింగ్ అయితే, రెండో కారణం హారిస్ రవుఫ్ బౌలింగ్.
ఆసియా కప్ ఫైనల్లో హారిస్ రవుఫ్ చెత్త బౌలింగ్‌తో పాకిస్తాన్‌కు ఓటమి తప్పలేదు. ఆరంభంలో అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ క్యాచ్‌లను అందుకుని మ్యాచ్ గెలిస్తే చేసే సెలబ్రేషన్‌కి రెండు రెట్లు చేసిన రవుఫ్.. బౌలింగ్‌లో మాత్రం తేలిపోయాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో రెండు ఓవర్లు వేసి మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో కేవలం 3.4 ఓవర్లు వేసిన రవుఫ్ ఒక్క వికెట్ కూడా తీసుకోకుండా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మిగతా పాకిస్తాన్ బౌలర్లు ఎవ్వరూ కూడా ఓవర్‌కి 7 కంటే ఎక్కువ పరుగులు ఇవ్వకపోతే.. రవుఫ్ ఒక్కడే 13.6 పరుగులు ఇచ్చి పాకిస్తాన్ ఓటమికి ప్రధాన కారణమయ్యాడు.
పవర్ ప్లే తర్వాత బౌలింగ్‌కి వచ్చిన హారిస్ రవుఫ్ తొలుత ఎనిమిదో ఓవర్ వేసి ఒక బౌండరీతో ఏడు పరుగులు ఇచ్చాడు. ఇక ఆఖరి ఆరు ఓవర్లలో భారత్ విజయానికి 64 పరుగులు కావాలి.. అంటే ఓవర్‌కి పదికి పైగా చేయాల్సి పరుగులు చేయాలి. ఆ సమయంలో బంతి అందుకున్న రవుఫ్ 15వ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో ఏకంగా 17 పరుగులు ఇచ్చి భారత్‌పై ఒత్తిడిని తగ్గించాడు. 18వ ఓవర్లో చాలా జాగ్రత్తగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బౌలింగ్ చేసిన రవుఫ్ ఆఖరి బంతిని ఫుల్ టాస్‌గా వేయడంతో సిక్స్ వెళ్లింది. ఆ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. ఇక ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి పది పరుగులు కావాల్సి రాగా నాలుగు బంతుల్లోనే 14 పరుగులు ఇచ్చి పాకిస్తాన్ ఓటమికి ప్రధాన కారణమయ్యాడు.