@prasad831
@prasad831

P Venkateswara Rao

ప్రేమించు కానీ నటించకు

#

AP పొలిటిక్స్

వచ్చింది 143 ఓట్లు..? ఆయనకు టిడిపి టికెట్ ఇస్తానంటోంది..? 😢😜😁 పాపం.. ఎన్నికల దగ్గరకొస్తున్నకొద్దీ తెలుగుదేశం పరిస్థితి మరీ దయనీయంగా తయారవుతో్ంది. పటిష్టమైన అభ్యర్థులను సైతం పోటీకి పెట్టలేని పరిస్థితి కొన్నిచోట్ల కనిపిస్తోంది. ఉదాహరణ శ్రీశైలం స్థానం విషయం తీసుకుంటే ఇక్కడ ఓ అభ్యర్థికి టికెట్ ఇచ్చింది. తీరా టికెట్ ప్రకటించేసిన తర్వాత ఆయన తీరిగ్గా..నేను పోటీకి దిగడం లేదంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వదలారు. నా భార్య ఆరోగ్యం సరిగ్గా లేకపోవడమే కారణమంటూ చెప్పుకొచ్చారు. దీంతో టీడీపీకి దిక్కుతోచలేదు. మళ్లీ ఆయన్నే బుజ్జగించే పని చేపట్టింది. ఇంతలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరతానంటూ వర్తమానం పంపాడు. హమ్మయ్య అభ్యర్థిలేక ఇబ్బందిపడుతున్న తెలుగుదేశం ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు బైరెడ్డిని శ్రీశైలంలో నిలబెట్టే ఆలోచనలో ఉందట తెలుగుదేశం. ఇంతకీ ఈ బైరెడ్డి ఫ్లాష్ బ్యాక్ ఒక్కసారి గుర్తు చేసుకుంటే.. ఈయన ఆరేడేళ్ల కిందట ప్రత్యేక రాయలసీమ అంటూ హడావుడి చేశాడు. అదే నినాదంతో నంద్యాల ఉపఎన్నికలో తన పార్టీని పోటీకి దింపారు. భారీగా ప్రచారం చేసినా ఆ ఎన్నికలో ఈయన పార్టీకి వచ్చింది కేవలం నూటా నలభై మూడు ఓట్లు. దాంతో ఆయన పార్టీ మూసేసి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఇటీవల అది కూడా నచ్చక మళ్లీ తెలుగుదేశం వైపు చూస్తున్నారు.
110 views
1 hours ago
#

📰 A.P న్యూస్

ఎన్నికల వేళ జనసేనలో ఆ రెండూ బయటపడ్డాయ్! Mar 21, 2019 😀🙄 ఎన్నికల ఆల్రెడీ తెలుగుదేశం- జనసేన పార్టీల మధ్య అనైతిక పొత్తు గురించి గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఈ రెండు పార్టీలూ అంతర్గతంగా ఒకదానికి మరోటి సహకరించుకుంటున్నాయి.. అనే ప్రచారం ఒకటి ఊపందుకుంటోంది. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించింది లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికార పార్టీని పల్లెత్తు మాట అనకుండా - అధికార పార్టీ విధానాల్లోని లోటుపాట్లను ప్రస్తావించకుండా.. రాజకీయం చేయాలంటే అది కుదిరే పని కాదు. ఫ్యాన్స్ ఉన్నారు. కుల బలం ఉంది..ఇవే చాలు అనుకుంటే - ఆ వర్గాల ఓట్లు వంద శాతం పడ్డా… అవి గెలుపుకు సరిపడే స్థాయిలో ఉండబోవనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలోనే..జనసేనకు సంబంధించి మరో యాంగిల్ కూడా బయట పడేసింది. నాగబాబు జనసేనలోకి చేరడం - చేరుతూనే నరసాపురం ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ చెప్పిన నీతులు అన్నీ ఇన్నీ కాదు. తనకు కుల పిచ్చి లేదని… తనకు కుల సమీకరణాలతో సంబంధం లేదని - తను గెలుపు కోసం కుల సమీకరణాలు అనుకూలంగా ఉండే ప్రాంతంలో పోటీ చేసేది ఉండదని పవన్ చెప్పుకొచ్చారు. తనుగెలిచే అవకాశం లేకపోయినా అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయబోతున్నట్టుగా పవన్ కల్యాణ్ ప్రకటించుకున్నారు. అయితే చివరకు ఆ మాట తప్పారు. అనంతపురం నుంచి పోటీ చేయడం పక్కన పెట్టేసి.. కుల సమీకరణాలు పూర్తిగా అనుకూలంగా ఉండే ప్రాంతంలో పవన్ పోటీ చేస్తూ ఉన్నారు. తద్వారా.. తన అసలు రూపం చూపించేశారు జనసేన అధిపతి. ఒకవేళ అనంతపురం నుంచినే పవన్ నామినేషన్ వేసి ఉంటే గెలుస్తాడో గెలవడో.. కానీ సాహసం చేసిన వ్యక్తి అయ్యే వాడు. అయితే కాపుల జనాభా గట్టిగా ఉన్న చోట్ల నామినేషన్ వేసి పవన్ కల్యాణ్ తన అసలు కథను చాటి చెప్పుకున్నారు. ఇక అన్నయ్య నాగబాబుకు టికెట్ ఖరారు చేసేయడం కూడా అదే తీరున ఉంది. మొన్నటి వరకూ తాము జనసేనకు సపోర్టే కానీ.. తాము ఆ పార్టీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండమని.. పవన్ కల్యాణ్ కుటుంబీకులు స్పష్టం చేస్తూ వచ్చారు. అలా ఉండుంటే బాగానే ఉండేది. కేవలం తమ్ముడి ప్రచారం కోసం నాగబాబు రంగంలోకి దిగి పని చేసి ఉంటే అది బాగుండేది. అయితే ఇప్పుడు టికెట్ కూడా ఖరారు చేయడం అది కూడా మళ్లీ అటు వైపే వెళ్లడం.. మాత్రం జనసేనలోని బంధుప్రీతి బయటపడింది. ఇతర పార్టీల్లో బంధు ప్రీతి లేదు అని కాదు. అయితే పవన్ మాత్రం తనకు కులాభిమానం - బంధుప్రీతి రెండూ లేవని చెప్పుకొచ్చారు. తీరా ఎన్నికల సమయంలో అవే హైలెట్ అవుతూ ఉండటం విశేషం.
115 views
1 hours ago
#

📰 A.P న్యూస్

బాబు ప్లాన్ కు సబ్బం హరి విలవిల.. Mar 21, 2019 😊😜😂 సబ్బం హరి విలవిలా భీమిలి కథ కంచికి చేరింది. టీడీపీ నుంచి మాజీ అనకాపల్లి ఎంపీ సబ్బం హరికి చంద్రబాబు సీటు ఇచ్చేసి దులిపేసుకున్నారు. నిజానికి భీమిలీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ నుంచి ఎవ్వరూ నిలబడ్డా గెలిచే పరిస్థితుల్లో లేరట.. సర్వేలన్నీ వైసీపీకే అనుకూలంగా ఉన్నాయి. అక్కడ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరిన తర్వాత టీడీపీకి అసలు బలం పోయింది. దాంతోనే మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నఫళంగా విశాఖ ఉత్తరానికి షిఫ్ట్ అయిపోయారు. నారా లోకేష్ సైతం భీమిలి సేఫ్ కాదని మంగళగిరికి మంగళం పాడారు. అటువంటి టీడీపీ ఓడిపోయే సీట్లో ఇప్పుడు సబ్బం హరిని పోటీకి దింపి టీడీపీ ఆయనకు పరీక్ష పెట్టిందన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. నిజానికి సబ్బం హరి తనకు విశాఖ ఎంపీ సీటు ఇవ్వాలని బాబు వద్ద చివరి వరకూ ప్రయత్నించారట.. అయితే భీమిలి మాత్రమే ఖాళీగా ఉందని చెప్పడంతో చేసేదేంలేక సబ్బం హరి అక్కడి నుంచి పోటీకి రెడీ అయ్యారు. అయితే భీమిలీలోని టీడీపీ నాయకులు మాత్రం హరిని తెచ్చి తమ నెత్తిన పెడుతారా అని సహాయ నిరాకరణ మొదలుపెట్టారట.. తాము పనిచేయమని సబ్బం హరికి స్పష్టం చేశారట.. తమలో ఒకరికి టికెట్ ఇస్తే గెలుపు ఖాయమని.. అలాంటిది బయట నుంచి నాయకులను తమపై రుద్దడం ఏంటని భీమిలీ టీడీపీ నేతలంతా దూరం జరుగుతున్నారట.. ఓ వైపు భీమిలీలో వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ దూసుకుపోతున్నారు. గట్టిగా 20 రోజులు కూడా లేని వేళ సబ్బం హరి ఈ అసమ్మతితో తర్జన భర్జన పడుతున్నాడట. భీమిలి వైపు ఇప్పుడే అడుగులు వేస్తున్న క్రమంలో ఆయనకు ఓటమి కళ్లముందు కనిపిస్తోందట.. కిందా మీద పడి టికెట్ తెచ్చుకోవడమే కష్టమైన నేపథ్యంలో ఇప్పుడు ఓడిపోయే సీటును చంద్రబాబు ఇచ్చారని తెలిసి సబ్బం హరి బాధ వర్ణనాతీతం అంటున్నారట ఆయన పరిస్థితిని చూసిన దగ్గరి వాళ్లు.. రాజకీయ పబ్బం గడుపుకొని సబ్బంకు ఈ సీటును బాబు ఇచ్చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
107 views
2 hours ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post
Share on other apps
Facebook
WhatsApp
Unfollow
Copy Link
Report
Block
I want to report because