#ఈ రోజు 🌧️🌛🌔🌠
*కాలం - అనుకూలం*
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 26 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము శుక్ల పక్షం
తిథి: *అష్టమి రా.7.06 కు* తదుపరి *నవమి 27 సా.4.53 కు*
వారం: *ఇందువారము (సోమవారం)*
నక్షత్రం: *అశ్విని ఉ.10.58 కు* తదుపరి *భరణి 27 ఉ.9.28 కు*
యోగం: *శుభ ఉ.6:19 కు* తదుపరి *శుక్ల 27 తె.3:12 కు*
కరణం: *బవ రా.9:18 కు* తదుపరి *కౌలవ 27 రా.7:05 కు*
రాహుకాలం: *ఉ. 07.30 - 09.00 కు*
దుర్ముహూర్తం: *మ. 12.51 - 1.35 కు, మ. 3.05 - 3.49 కు*
వర్జ్యం: *ఉ.7.11 - 8.42 కు, రా.7.58 - 9.28 కు*
అమృతకాలం: *తె. 05.39 - 07.11 కు*
సూర్యోదయం: *ఉ. 6.53 కు*
సూర్యాస్తమయం: *సా. 6.04 కు*
🕉️ *భీష్మాష్టమి* 🕉️
*గురుబోధ:*
ఈరోజు సంతానార్థులైన వారు భీష్మోద్దేశ్యముగా శ్రాద్ధము ఆచరించవలెను. భీష్మతర్పణం, అర్ఘ్యం మాత్రము (తల్లితండ్రులు ఉన్నవారు కూడా) అందరూ చేయవలసినదే.
వైయాఘ్ర పదగోత్రాయ ౹ సాంకృత్య ప్రవరాయచ ౹౹
గంగాపుత్రాయ భీష్మాయ ౹ ఆజన్మ బ్రహ్మచారిణే౹౹
అపుత్రాయ జలందద్యాం ౹ నమో భీష్మవర్మణే ౹౹
భీష్మశ్శాంతనవో వీరః ౹ సత్యవాదీ జితేంద్రియః ౹౹
అభిరద్భి రవాప్నోతు ౹ పుత్ర పౌత్రోచితాంక్రియామ్ ౹౹
తర్పణ క్రమః
1. వైయాఘ్రపద గోత్రం సాంకృత్య ప్రవరం గంగాపుత్రం భీష్మ వర్మాణం
తర్పయామి - 3 సార్లు
2. ఆజన్మ బ్రహ్మచారిణం అపుత్రాయ భీష్మవర్మాణం
తర్పయామి - 3సార్లు
3. శంతను తనూభావం వీరం సత్యవాదినం జితేంద్రియం
భీష్మవర్మాణం తర్పయామి - 3సార్లు
ఈ రీతిగా తర్పణమిచ్చి సవ్యంగా ఈ క్రింద శ్లోకంతో అర్ఘ్యం ఇవ్వవలెను.
శ్లో. వసూనామవతారాయ ౹ శంతనోరాత్మజాయచ ౹౹
అర్ఘ్యం దదామి భీష్మాయ ౹ ఆబాల్య బ్రహ్మచారిణే ౹౹
ఇతిభీష్మ తర్పణ విధిః
1) భీష్ముడు యుద్ధరంగంలో పడిపోయి కూడా ఈ మాఘమాసం వచ్చే దాకా ప్రాణాన్ని శరీరంలో నిలబెట్టుకున్నాడు. మాఘమాసం లో శ్రీకృష్ణుడిని స్మరిస్తూ శరీరం విడిచిపెట్టాడు.
2) భీష్ముడు మాఘమాసంలో అష్టమి నాడు హరిని అనేక నామాలతో స్తోత్రం చేసాడు. పుండరీకాక్ష, వాసుదేవ, వరద, అప్రమేయ అని స్తోత్రం చేసాడు. అందుకే ఈ అష్టమికి భీష్మాష్టమి అని పేరు వచ్చింది. ఈ అష్టమి నాడు భక్తి శ్రద్ధలతో హరి నామం చేసేవాడు. శరీరం విడిచిపెట్టాక ముక్తి పొందాడు.
*శ్యామలా దండకం👇*
https://youtu.be/zGlmVMlrIsw?si=GhFrtzDf3QHoulCK
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial