ప్రీ వెడ్డింగ్ షో సినిమాకు రిలీజ్ రోజు టికెట్స్ ఇవ్వడం జరిగింది ... నైట్ షో చూస్తూ ఆ గంట 50 నిమిషాల చిత్రాన్ని ఎంతో ఆనందించాము .... ఊర్లో పలుకుబడి ఉన్న ఒక వ్యక్తి పెళ్ళి ప్రీ వెడ్డింగ్ షూట్ ను అంతా అద్భుతంగా తీసి ఆ మోరీ కార్డ్ ను పోగొట్టుకున్న తరుణం మన హీరో ఏం చేశాడు అన్న ఒక్క లైన్ తో చాలా బాగా ఎక్కడ వల్గర్ కామెడీ లేకుండా నాచురల్ హెల్తీ కామెడీ తో, ఆ కథా మలుపులతో మెలికలతో నడిపించిన కథనం ఆ పాత్రలు మనల్ని కట్టిపడేస్తాయి ..... అలాగే ఈ చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ గారు మన సిక్కోలు వాసి అవ్వడం మరెంతో గొప్ప విషయం.... మసూదా, పరేషన్ చిత్ర హీరో తిరువీర్ గారు, కమిటీ కుర్రాళ్ళు ఫేమ్ శ్రావ్య గారు , మేం famous చిత్రం ఫేమ్ నరేంద్ర గారు, 90 బయోపిక్ సిరీస్ ఫేమ్ మాస్టర్ రోహన్ అలాగే యామిని గారు గుర్తుండిపోయే నటనను కనబరిచారు...... అందరికి నచ్చే మెచ్చే మంచి కంటెంట్ ఉన్న సినిమాగా నిలిచింది ఈ చిత్రం .....
#🎬మూవీ ముచ్చట్లు #🎬నా ఫేవరెట్ మూవీ🤩 #🎬సినిమా రివ్యూ #🎬కొత్త సినిమా గురు🎬 #రాజశేఖర్ పట్నాయక్ ✍️