@ravi532459
@ravi532459

RAVI, Sr.JOURNALIST

ఐ లవ్ షేర్ చాట్

ఒక్కడినే వస్తా.. ఒక్కడినై వస్తా... గురువారం నాటి ప్రకటనతో పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చేశారు. వాళ్లూ లేదు, వీళ్లు లేదు ఎవ్వరితోనూ కలిసే సమస్యే లేదని... ఒక్క వామపక్షాలు తక్క... అంటూ తేల్చి చెప్పేశారు. మరి టీడీపీ అధినేత చంద్రబాబు ఇక తన ప్రయత్నాలను కట్టిపెట్టేస్తారా..? ప్రతిపక్షమైన వైసీపీ సీట్ల పంపంకం అయిపోయిందన్న గోల ఆపేస్తుందా..? చూడాలి. మున్ముందు ఈ మూడు ముక్కల ఆట ఎలాంటి ముగింపునకు రానుందో...! మొత్తంగా అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండూ పార్టీలు బద్ధశత్రువులైనప్పటికీ పవన్ కల్యాణ్ విషయంలో మాత్రం రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం బాగానే కుదిరినట్టుంది. లేకపోతే టీడీపీ కోరుకున్నది... వైసీపీ ఇప్పటి వరకు ప్రచారం చేసింది రెండూ ఒక్కటే కావడమేంటి..? ఇక పవన్ కల్యాణ్ విషయానికొద్దాం. పాతికేళ్ల రాజకీయం మాది అంటూ ... రానున్న ఎన్నికలే తమ లక్ష్యం కాదంటూ స్పష్టత ఇచ్చి పార్టీ అభిమానుల్లో ఉన్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అంత వరకు బాగానే ఉంది. వామపక్షాలే తమ మిత్రులంటూ లైన్ క్లియర్ చేశేశారు కూడా. అయితే ఇదే వామపక్షాలు రేపు అవసరమైతే... ఢిల్లీలో మోదీదో ఫైట్ కోసం.. తిరిగి చంద్రబాబు అంటున్న మహాకూటమిలో చేరినా ఆశ్చర్యం లేదు. మరి అప్పుడు ఈ మిత్రులు మిత్రులుగానే ఉంటారా... లేదా శత్రువులవుతారా అన్నది చూడాలి. 175 స్థానాల్లో పోటీ చేస్తామని తేల్చి చెప్పడం అంత ఈజీకాదు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చేసి చూపించడమంటే. ప్రజల అండ ఎంత ముఖ్యమో.... ఆర్థికంగా భరించే శక్తి ఉండటం కూడా అంతే ముఖ్యం. ఆ విషయంలో ఎంత వరకు నెట్టుకొస్తారన్నది రేపు టిక్కెట్లు ఇచ్చాక కానీ తెలియదు. ప్రజారాజ్యంలో అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే సగం సమస్య తీరిపోయినట్టే. పాతికేళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేస్తున్నామనడం వరకు బాగానే ఉంటుంది. కానీ ఆ విషయాన్ని అంత స్పష్టంగా చెప్పేస్తేనే ఇబ్బందులు. ఎన్నికలు మరో 6 నెలల్లో ఉంచుకొని మా లక్ష్యం ఈ ఎన్నికలు కావు అన్న అర్థాన్నే ఇస్తున్నాయి పవన్ మాటలు. కొత్తగా రాజకీయం చేసే ఏ పార్టీ లక్ష్యమైనా ముమ్మాటికి అలాగే ఉండాలి. కానీ ఇక్కడ పార్టీ పెట్టింది ఇంకెవ్వరో కాదు.. పవన్ కల్యాణ్. ఆయన అభిమానులంతా కాబోయే సీఎం మా నాయకుడే అని ఊహల్లో తేలిపోతున్నారు. త్రిముఖ పోటీలో చక్రం తిప్పేది ఆయనేనని ఒక అంచనాకు కూడా వచ్చేశారు. చాలా సభల్లో కూడా ఆయన తాను కూడా పరోక్షంగా అదే విషయాన్ని చెప్పారు కూడా. ఈ పరిస్థితుల్లో మళ్లీ పాతపాటే పాడటం... అభిమానులకు ఎలాంటి సందేశాన్నిస్తుందన్న అంశాన్ని కూడా ఓ సారి దృష్టిలో పెట్టుకోవాల్సిందేమో. బహుశా ఆయన గురువారం మాట్లాడిన మాటలకు రియాక్షన్ బట్టి మళ్లీ అంతర్గతంగానో లేదా బహిరంగ సభల్లోనో మరో సందేశం ఉండొచ్చు. అయితే ఒక్క విషయం.. రాజకీయాల్లో ముక్కుసూటిగా ఉండటం చాలా ముఖ్యం. కానీ ఈ నాటి రాజకీయాల్లో అదే సమయంలో పాదరసంలా కూడా పని చెయ్యాల్సి వస్తుంది. అభిమానులకు స్పష్టత ఇవ్వడం ఎంత ముఖ్యమో... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. రేపటి కోసం ఇవాళ్టి తరాన్ని సిద్ధం చెయ్యడం... గొప్ప బాధ్యత. కానీ అదే సమయంలో ఒక రాజకీయ పార్టీగా రాజకీయం చెయ్యడం కూడా అంతే బాధ్యత. పాతికేళ్ల లక్ష్యం అంటే పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చే నేతలు ఎంత మంది ఉంటారు..? అంత సహృదయులు రాజకీయాల్లోకి ఎందుకొస్తారు..? ఒక పార్టీ అధినేతగా తమ పార్టీ విధానాలను స్పష్టం చెయ్యడం ముమ్మాటికీ పవన్ కల్యాణ్ ఇష్టమే. కానీ అభిమానుల విషయంలో జనసేన అంటే పవన్... పవన్ అంటే జనసేన. అయితే ఇది అభిమాన సంఘాలుగా ఉన్నప్పుడు , సేవా కార్యక్రమాల్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ రాజకీయం చేసే సమయానికి వచ్చే సరికి మాత్రం పార్టీ మొత్తం వ్యక్తి చుట్టూనే తిరిగినప్పటికీ.... ఇంకా చాలా చాలా అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలను తీర్చాల్సిన వాళ్ల అవసరం కూడా చాలా చాలా ఉంటుంది. #😁పొలిటికల్ ట్రోల్స్
ఒక్కడినే వస్తా.. ఒక్కడినై వస్తా... గురువారం నాటి ప్రకటనతో పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చేశారు. వాళ్లూ లేదు, వీళ్లు లేదు ఎవ్వరితోనూ కలిసే సమస్యే లేదని... ఒక్క వామపక్షాలు తక్క... అంటూ తేల్చి చెప్పేశారు. మరి టీడీపీ అధినేత చంద్రబాబు ఇక తన ప్రయత్నాలను కట్టిపెట్టేస్తారా..? ప్రతిపక్షమైన వైసీపీ సీట్ల పంపంకం అయిపోయిందన్న గోల ఆపేస్తుందా..? చూడాలి. మున్ముందు ఈ మూడు ముక్కల ఆట ఎలాంటి ముగింపునకు రానుందో...! మొత్తంగా అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండూ పార్టీలు బద్ధశత్రువులైనప్పటికీ పవన్ కల్యాణ్ విషయంలో మాత్రం రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం బాగానే కుదిరినట్టుంది. లేకపోతే టీడీపీ కోరుకున్నది... వైసీపీ ఇప్పటి వరకు ప్రచారం చేసింది రెండూ ఒక్కటే కావడమేంటి..? ఇక పవన్ కల్యాణ్ విషయానికొద్దాం. పాతికేళ్ల రాజకీయం మాది అంటూ ... రానున్న ఎన్నికలే తమ లక్ష్యం కాదంటూ స్పష్టత ఇచ్చి పార్టీ అభిమానుల్లో ఉన్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అంత వరకు బాగానే ఉంది. వామపక్షాలే తమ మిత్రులంటూ లైన్ క్లియర్ చేశేశారు కూడా. అయితే ఇదే వామపక్షాలు రేపు అవసరమైతే... ఢిల్లీలో మోదీదో ఫైట్ కోసం.. తిరిగి చంద్రబాబు అంటున్న మహాకూటమిలో చేరినా ఆశ్చర్యం లేదు. మరి అప్పుడు ఈ మిత్రులు మిత్రులుగానే ఉంటారా... లేదా శత్రువులవుతారా అన్నది చూడాలి. 175 స్థానాల్లో పోటీ చేస్తామని తేల్చి చెప్పడం అంత ఈజీకాదు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చేసి చూపించడమంటే. ప్రజల అండ ఎంత ముఖ్యమో.... ఆర్థికంగా భరించే శక్తి ఉండటం కూడా అంతే ముఖ్యం. ఆ విషయంలో ఎంత వరకు నెట్టుకొస్తారన్నది రేపు టిక్కెట్లు ఇచ్చాక కానీ తెలియదు. ప్రజారాజ్యంలో అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే సగం సమస్య తీరిపోయినట్టే. పాతికేళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేస్తున్నామనడం వరకు బాగానే ఉంటుంది. కానీ ఆ విషయాన్ని అంత స్పష్టంగా చెప్పేస్తేనే ఇబ్బందులు. ఎన్నికలు మరో 6 నెలల్లో ఉంచుకొని మా లక్ష్యం ఈ ఎన్నికలు కావు అన్న అర్థాన్నే ఇస్తున్నాయి పవన్ మాటలు. కొత్తగా రాజకీయం చేసే ఏ పార్టీ లక్ష్యమైనా ముమ్మాటికి అలాగే ఉండాలి. కానీ ఇక్కడ పార్టీ పెట్టింది ఇంకెవ్వరో కాదు.. పవన్ కల్యాణ్. ఆయన అభిమానులంతా కాబోయే సీఎం మా నాయకుడే అని ఊహల్లో తేలిపోతున్నారు. త్రిముఖ పోటీలో చక్రం తిప్పేది ఆయనేనని ఒక అంచనాకు కూడా వచ్చేశారు. చాలా సభల్లో కూడా ఆయన తాను కూడా పరోక్షంగా అదే విషయాన్ని చెప్పారు కూడా. ఈ పరిస్థితుల్లో మళ్లీ పాతపాటే పాడటం... అభిమానులకు ఎలాంటి సందేశాన్నిస్తుందన్న అంశాన్ని కూడా ఓ సారి దృష్టిలో పెట్టుకోవాల్సిందేమో. బహుశా ఆయన గురువారం మాట్లాడిన మాటలకు రియాక్షన్ బట్టి మళ్లీ అంతర్గతంగానో లేదా బహిరంగ సభల్లోనో మరో సందేశం ఉండొచ్చు. అయితే ఒక్క విషయం.. రాజకీయాల్లో ముక్కుసూటిగా ఉండటం చాలా ముఖ్యం. కానీ ఈ నాటి రాజకీయాల్లో అదే సమయంలో పాదరసంలా కూడా పని చెయ్యాల్సి వస్తుంది. అభిమానులకు స్పష్టత ఇవ్వడం ఎంత ముఖ్యమో... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. రేపటి కోసం ఇవాళ్టి తరాన్ని సిద్ధం చెయ్యడం... గొప్ప బాధ్యత. కానీ అదే సమయంలో ఒక రాజకీయ పార్టీగా రాజకీయం చెయ్యడం కూడా అంతే బాధ్యత. పాతికేళ్ల లక్ష్యం అంటే పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చే నేతలు ఎంత మంది ఉంటారు..? అంత సహృదయులు రాజకీయాల్లోకి ఎందుకొస్తారు..? ఒక పార్టీ అధినేతగా తమ పార్టీ విధానాలను స్పష్టం చెయ్యడం ముమ్మాటికీ పవన్ కల్యాణ్ ఇష్టమే. కానీ అభిమానుల విషయంలో జనసేన అంటే పవన్... పవన్ అంటే జనసేన. అయితే ఇది అభిమాన సంఘాలుగా ఉన్నప్పుడు , సేవా కార్యక్రమాల్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ రాజకీయం చేసే సమయానికి వచ్చే సరికి మాత్రం పార్టీ మొత్తం వ్యక్తి చుట్టూనే తిరిగినప్పటికీ.... ఇంకా చాలా చాలా అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలను తీర్చాల్సిన వాళ్ల అవసరం కూడా చాలా చాలా ఉంటుంది. #జనసేన పోరాట యాత్ర
చంద్రబాబు రాజకీయం ఉన్నట్టుండి... ఒక్కసారిగా పవన్ కల్యాణ్ ఊసెత్తారు చంద్రబాబు. నిన్నటి వరకు మోదీ బ్యాచ్ అంటూ జనసేన అధినేతపై విరుచుకుపడ్డ చంద్రబాబుకి ప్రస్తుతం క్లారిటీ వచ్చినట్టుంది. అందుకే ఉన్నట్టుండి.. ఆయన్ను మోదీతో కలపొద్దంటూ మీడియాకు సలహాలిచ్చారు. సో... శత్రువుకి శత్రువు మిత్రుడు కనుక.... ఇన్నాళ్లు లోలోపల దాచుకున్న ప్రేమను బయటపెట్టారు. నిజానికి... లోకేశ్ లక్ష్యంగా చేసుకొని పవన్ విమర్శలు మొదలెట్టినప్పటి నుంచి... ఆయనైతే టీడీపీతో బంధాన్ని తెంచేసుకున్నప్పటికీ... మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ మాత్రం ఆచితూచి వ్యవహరించిందే తప్ప... ఎదురుదాడికి దిగలేదు. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు పనికొస్తారో... ఎవ్వరికీ తెలియదు. పాపం పవన్ కల్యాణ్ కంటే ఇంకా రాజకీయ అనుభవం లేదు కాబట్టి... ముక్కుసూటిగా చెప్పాలనుకున్నది చెప్పేసినా... సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు మాత్రం సై..అంటే సై.. అని తలుపుల్ని మూసేయలేదు. కన్నకొడుకును అంతంత మాటలంటున్నా వినీ విన్నట్టు ఊరుకున్నారు... మరీ విమర్శించాల్సి వస్తే మోదీ ఏజెంట్ అని పేరు పెట్టేసి అటు జగన్ ను, పవన్ కల్యాణ్ ను ఒకే గాటన కట్టేసి వదిలేశారంతే. ఎన్నికలు మరో ఆరు నెలలున్న నేపథ్యంలో... ఇకపై ఏపీలో చాలా రాజకీయ సిత్రాలు చూడాల్సి రావచ్చు. రాజకీయం చెయ్యడంలో తలపండిపోయిన నేత చంద్రబాబు కనుక... సమయానుకూలంగా వ్యవహరిస్తూ వస్తుంటారు. 2014లో మోదీతో కలిసినా... నిన్నగాక మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసినా ఆయన నూటికి నూరు పాళ్లు రాజకీయం చేస్తారంతే. ముక్కుసూటితనం కన్నా రాజకీయాల్లో ఎప్పటికయ్యది ప్రస్తుతం అన్నట్టు ఉంటేనే పది కాలాల పాటు చల్లగా ఉంటారు. అయితే పార్టీల అవసరాలను ప్రజలు కూడా నమ్మినట్టు చెయ్యాలంతే. అందుకు అనుభవం మాత్రమే కాదు మాటకారితనం, ప్రజల్ని మెప్పించే తనం ఉండాలి. రెండోది పెద్దగా లేకపోయినా టీడీపీ అధినేతకు మిగిలిన రెండు విషయాల్లో ఢోకా లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో త్రిముఖ పోటీ తప్పదు. అదే జరిగితే ఓటు బ్యాంకు చీలిపోవడమే తప్ప ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చి తీరుతుందని చెప్పలేం. ఈ పరిస్థితుల్లో ఎవరో ఇద్దరు కచ్చితంగా కలిసి తీరాల్సి రావచ్చు. అది ఎన్నికల ముందైనా, లేదా ఆ తర్వాతైనా. నిన్నటి వరకు బీజేపీ అటు పవన్ కల్యాణ్ ను, ఇటు జగన్ ను ఇద్దర్నీ కలిపి టీడీపీకి సవాల్ విసురుతుందని అంతా భావించారు. కానీ కొద్ది రోజులుగా వైసీపీ, జనసేనల మధ్య మాటలయుద్ధం మొదలయ్యింది. వైసీపీపై జనసేన చేస్తున్న విమర్శలకు అప్పటి వరకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తూ వచ్చినా జగన్ మాత్రం సంయమనం పాటిస్తూనే వచ్చారు. కానీ ఎక్కడ బెడిసి కొట్టిందో కానీ కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పై వ్యక్తిగతంగా విమర్శలు మొదలెట్టారు. భవిష్యత్తులో మిత్రులవుతారనుకునే వాళ్ల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. బహుశా అది తారస్థాయికి చేరినట్టు చంద్రబాబుకు కూడా పక్కా సమాచారం ఉండే ఉంటుంది. అందుకే ఆయన సరిగ్గా అదను చూసుకొని గాలం వేశారు. అయితే ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ దీనిపై ఇంకా స్పందించలేదు. అయితే కొద్ది రోజులుగా ఆయన టీడీపీ విషయంలో సైలెంట్ అవడం చూస్తుంటే... రక రకాల ఊహాగానాలకు తావిస్తోంది. టీడీపీతో కలవడం వల్ల జనసేనకేంటి..? : 1.జనసేనకు అభిమానులున్నారు తప్ప.. క్యాడర్ లేదు. అభిమానులంతా ఓటర్లు కాదు... వాళ్లు ఓటేసినంత మాత్రాన అధికారం కూడా రాదు. 2. నిధుల సమస్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలాంటి రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు భరించడం అంత ఆషామాషీ విషయమేం కాదు. తన విదేశీ పర్యటనలు నిధుల కాదని పవన్ చెబుతున్నప్పటికీ... ఆ పార్టీకి నిధులే మరో ప్రధానమైన సమస్య అన్న విషయం అందరికీ తెలిసిందే. ఏపీలో అన్ని స్థానాలకు కొత్తగా అభ్యర్థుల్ని నిలబెట్టి గెలిపించుకోవాలంటే అంత ఈజీకాదు. కచ్చితంగా అధికారంలోకో కనీసం ప్రతిపక్షంలోనైనా కూర్చునే అవకాశం ఉందంటే పోటీ చేసే అభ్యర్థులైనా ఖర్చుపెట్టేందుకు ముందుకొస్తారు. గత కొద్ది కాలం క్రితం జరిపిన సర్వేల్లో కూడా ప్రస్తుతానికి జనసేనది మూడో స్థానమే తప్ప... ఒకటి రెండు స్థానాల్లో లేదు. అలాంటప్పుడు ఎవరు మాత్రం ముందుకొచ్చి వందల కోట్లు ఖర్చుపెడతారు. సో.. జనసేనకు నిధులు కావాలి. 3. ఒక వేళ రాష్ట్రంలో హంగ్ వస్తే తన పాత్ర కీలకం అవుతుందన్నది పవన్ కల్యాణ్ ఆలోచన కావచ్చు. బహుశా అంత వరకు రాకుండా ఎన్నికల ఫలితాల తర్వాత ఇచ్చే ఆఫరేదో ముందే ఇస్తామన్న ప్రతిపాదన పెడితే అన్నది టీడీపీ ఆలోచన కావచ్చు. అదే జరిగితే జనసేనకు కూడా అన్ని విధాల కలిసొస్తుంది. ఇప్పటికే టీడీపీ, పవన్ కల్యాణ్ లు కలిసి పోటీ చేసి ఓ సారి విజయం సాధించారు కూడా. ఒక వేళ టీడీపీ ప్రతిపాదనకు జనసేనాధిపతి ఓకే చెబితే... అధికారంలో ఉన్న టీడీపీకి జనసేన ఎన్నికల ఖర్చు భరించడం పెద్ద కష్టం కూడా కాదు. ఇవి పార్టీ పరంగా జనసేనకు కలిసొచ్చే అంశం. ఇక ఇబ్బందికరమైన అంశాల విషయానికొస్తే 1.పవన్ కల్యాణ్ కు ఇప్పటి వరకు ఆవేశం ఉన్న మనిషి, ముక్కుసూటితనం, అవినీతికి దూరంగా ఉన్నారన్న పేరుంది. నిన్న మొన్నటి వరకు అవినీతి పార్టీ అంటూ విమర్శిస్తూ వచ్చిన టీడీపీతో కలిసి పోటీ చేస్తే బహుశా అధికారం రావచ్చేమో కానీ , ఆయన కూడా మామూలు రాజకీయ నేతే అన్న పేరు పడిపోతారు. 2. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు రాకపోవచ్చు. కానీ 20-30 సీట్లొచ్చినా చాలు కీ రోల్ పోషించవచ్చు. అంతేకానీ ముందే కలిసిపోతే... జనాల్లో నమ్మకం పోతుంది. బహుశా ఆయన కూడా ఇప్పటికిప్పుడు టీడీపీ ఆఫర్ విషయంలో స్పందించకపోవచ్చు. ప్రస్తుతం ఆయన వ్యవహార శైలిని బట్టి ఫలితాలొచ్చేంత వరకు ఓపిక పట్టినా ఆశ్చర్యం లేదు. ఓ రకంగా చంద్రబాబు పవన్ కల్యాణ్ ను తన ప్రేమ పూర్వక వ్యాఖ్యలతో ఇరుకున పెట్టేశారనే చెప్పొచ్చు. పార్టీ భవిష్యత్తా... తన వ్యక్తిత్వమా.. ఇది ఇప్పుడు పవన్ కల్యాణ్ తేల్చుకోవాల్సిన విషయం. #జనసేన పోరాట యాత్ర
చంద్రబాబు రాజకీయం ఉన్నట్టుండి... ఒక్కసారిగా పవన్ కల్యాణ్ ఊసెత్తారు చంద్రబాబు. నిన్నటి వరకు మోదీ బ్యాచ్ అంటూ జనసేన అధినేతపై విరుచుకుపడ్డ చంద్రబాబుకి ప్రస్తుతం క్లారిటీ వచ్చినట్టుంది. అందుకే ఉన్నట్టుండి.. ఆయన్ను మోదీతో కలపొద్దంటూ మీడియాకు సలహాలిచ్చారు. సో... శత్రువుకి శత్రువు మిత్రుడు కనుక.... ఇన్నాళ్లు లోలోపల దాచుకున్న ప్రేమను బయటపెట్టారు. నిజానికి... లోకేశ్ లక్ష్యంగా చేసుకొని పవన్ విమర్శలు మొదలెట్టినప్పటి నుంచి... ఆయనైతే టీడీపీతో బంధాన్ని తెంచేసుకున్నప్పటికీ... మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ మాత్రం ఆచితూచి వ్యవహరించిందే తప్ప... ఎదురుదాడికి దిగలేదు. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు పనికొస్తారో... ఎవ్వరికీ తెలియదు. పాపం పవన్ కల్యాణ్ కంటే ఇంకా రాజకీయ అనుభవం లేదు కాబట్టి... ముక్కుసూటిగా చెప్పాలనుకున్నది చెప్పేసినా... సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు మాత్రం సై..అంటే సై.. అని తలుపుల్ని మూసేయలేదు. కన్నకొడుకును అంతంత మాటలంటున్నా వినీ విన్నట్టు ఊరుకున్నారు... మరీ విమర్శించాల్సి వస్తే మోదీ ఏజెంట్ అని పేరు పెట్టేసి అటు జగన్ ను, పవన్ కల్యాణ్ ను ఒకే గాటన కట్టేసి వదిలేశారంతే. ఎన్నికలు మరో ఆరు నెలలున్న నేపథ్యంలో... ఇకపై ఏపీలో చాలా రాజకీయ సిత్రాలు చూడాల్సి రావచ్చు. రాజకీయం చెయ్యడంలో తలపండిపోయిన నేత చంద్రబాబు కనుక... సమయానుకూలంగా వ్యవహరిస్తూ వస్తుంటారు. 2014లో మోదీతో కలిసినా... నిన్నగాక మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసినా ఆయన నూటికి నూరు పాళ్లు రాజకీయం చేస్తారంతే. ముక్కుసూటితనం కన్నా రాజకీయాల్లో ఎప్పటికయ్యది ప్రస్తుతం అన్నట్టు ఉంటేనే పది కాలాల పాటు చల్లగా ఉంటారు. అయితే పార్టీల అవసరాలను ప్రజలు కూడా నమ్మినట్టు చెయ్యాలంతే. అందుకు అనుభవం మాత్రమే కాదు మాటకారితనం, ప్రజల్ని మెప్పించే తనం ఉండాలి. రెండోది పెద్దగా లేకపోయినా టీడీపీ అధినేతకు మిగిలిన రెండు విషయాల్లో ఢోకా లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో త్రిముఖ పోటీ తప్పదు. అదే జరిగితే ఓటు బ్యాంకు చీలిపోవడమే తప్ప ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చి తీరుతుందని చెప్పలేం. ఈ పరిస్థితుల్లో ఎవరో ఇద్దరు కచ్చితంగా కలిసి తీరాల్సి రావచ్చు. అది ఎన్నికల ముందైనా, లేదా ఆ తర్వాతైనా. నిన్నటి వరకు బీజేపీ అటు పవన్ కల్యాణ్ ను, ఇటు జగన్ ను ఇద్దర్నీ కలిపి టీడీపీకి సవాల్ విసురుతుందని అంతా భావించారు. కానీ కొద్ది రోజులుగా వైసీపీ, జనసేనల మధ్య మాటలయుద్ధం మొదలయ్యింది. వైసీపీపై జనసేన చేస్తున్న విమర్శలకు అప్పటి వరకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తూ వచ్చినా జగన్ మాత్రం సంయమనం పాటిస్తూనే వచ్చారు. కానీ ఎక్కడ బెడిసి కొట్టిందో కానీ కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పై వ్యక్తిగతంగా విమర్శలు మొదలెట్టారు. భవిష్యత్తులో మిత్రులవుతారనుకునే వాళ్ల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. బహుశా అది తారస్థాయికి చేరినట్టు చంద్రబాబుకు కూడా పక్కా సమాచారం ఉండే ఉంటుంది. అందుకే ఆయన సరిగ్గా అదను చూసుకొని గాలం వేశారు. అయితే ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ దీనిపై ఇంకా స్పందించలేదు. అయితే కొద్ది రోజులుగా ఆయన టీడీపీ విషయంలో సైలెంట్ అవడం చూస్తుంటే... రక రకాల ఊహాగానాలకు తావిస్తోంది. టీడీపీతో కలవడం వల్ల జనసేనకేంటి..? : 1.జనసేనకు అభిమానులున్నారు తప్ప.. క్యాడర్ లేదు. అభిమానులంతా ఓటర్లు కాదు... వాళ్లు ఓటేసినంత మాత్రాన అధికారం కూడా రాదు. 2. నిధుల సమస్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలాంటి రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు భరించడం అంత ఆషామాషీ విషయమేం కాదు. తన విదేశీ పర్యటనలు నిధుల కాదని పవన్ చెబుతున్నప్పటికీ... ఆ పార్టీకి నిధులే మరో ప్రధానమైన సమస్య అన్న విషయం అందరికీ తెలిసిందే. ఏపీలో అన్ని స్థానాలకు కొత్తగా అభ్యర్థుల్ని నిలబెట్టి గెలిపించుకోవాలంటే అంత ఈజీకాదు. కచ్చితంగా అధికారంలోకో కనీసం ప్రతిపక్షంలోనైనా కూర్చునే అవకాశం ఉందంటే పోటీ చేసే అభ్యర్థులైనా ఖర్చుపెట్టేందుకు ముందుకొస్తారు. గత కొద్ది కాలం క్రితం జరిపిన సర్వేల్లో కూడా ప్రస్తుతానికి జనసేనది మూడో స్థానమే తప్ప... ఒకటి రెండు స్థానాల్లో లేదు. అలాంటప్పుడు ఎవరు మాత్రం ముందుకొచ్చి వందల కోట్లు ఖర్చుపెడతారు. సో.. జనసేనకు నిధులు కావాలి. 3. ఒక వేళ రాష్ట్రంలో హంగ్ వస్తే తన పాత్ర కీలకం అవుతుందన్నది పవన్ కల్యాణ్ ఆలోచన కావచ్చు. బహుశా అంత వరకు రాకుండా ఎన్నికల ఫలితాల తర్వాత ఇచ్చే ఆఫరేదో ముందే ఇస్తామన్న ప్రతిపాదన పెడితే అన్నది టీడీపీ ఆలోచన కావచ్చు. అదే జరిగితే జనసేనకు కూడా అన్ని విధాల కలిసొస్తుంది. ఇప్పటికే టీడీపీ, పవన్ కల్యాణ్ లు కలిసి పోటీ చేసి ఓ సారి విజయం సాధించారు కూడా. ఒక వేళ టీడీపీ ప్రతిపాదనకు జనసేనాధిపతి ఓకే చెబితే... అధికారంలో ఉన్న టీడీపీకి జనసేన ఎన్నికల ఖర్చు భరించడం పెద్ద కష్టం కూడా కాదు. ఇవి పార్టీ పరంగా జనసేనకు కలిసొచ్చే అంశం. ఇక ఇబ్బందికరమైన అంశాల విషయానికొస్తే 1.పవన్ కల్యాణ్ కు ఇప్పటి వరకు ఆవేశం ఉన్న మనిషి, ముక్కుసూటితనం, అవినీతికి దూరంగా ఉన్నారన్న పేరుంది. నిన్న మొన్నటి వరకు అవినీతి పార్టీ అంటూ విమర్శిస్తూ వచ్చిన టీడీపీతో కలిసి పోటీ చేస్తే బహుశా అధికారం రావచ్చేమో కానీ , ఆయన కూడా మామూలు రాజకీయ నేతే అన్న పేరు పడిపోతారు. 2. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు రాకపోవచ్చు. కానీ 20-30 సీట్లొచ్చినా చాలు కీ రోల్ పోషించవచ్చు. అంతేకానీ ముందే కలిసిపోతే... జనాల్లో నమ్మకం పోతుంది. బహుశా ఆయన కూడా ఇప్పటికిప్పుడు టీడీపీ ఆఫర్ విషయంలో స్పందించకపోవచ్చు. ప్రస్తుతం ఆయన వ్యవహార శైలిని బట్టి ఫలితాలొచ్చేంత వరకు ఓపిక పట్టినా ఆశ్చర్యం లేదు. ఓ రకంగా చంద్రబాబు పవన్ కల్యాణ్ ను తన ప్రేమ పూర్వక వ్యాఖ్యలతో ఇరుకున పెట్టేశారనే చెప్పొచ్చు. పార్టీ భవిష్యత్తా... తన వ్యక్తిత్వమా.. ఇది ఇప్పుడు పవన్ కల్యాణ్ తేల్చుకోవాల్సిన విషయం. #😁పొలిటికల్ ట్రోల్స్
హమ్మయ్య... 2 వేల రూపాయల నోటు రద్దు కాలేదు మొత్తానికి కొత్త ఏడాదిలో తొలి రోజున సాయంత్రం ప్రైం టైంలో ఎలాంటి ఎంటర్ టైన్ మెంట్ న్యూస్ తో వ్యూయర్ షిప్ పెంచుకోవాలా అని తలబద్దలుకొట్టుకునే న్యూస్ ఛానెళ్లన్నింటికీ ప్రధాని మోదీ... మంచి పొలిటికల్ ప్రైం టైం విందు భోజనాన్నే అందించారు. సాయంత్రం మీడియాతో మాట్లాడుతానంటూ ముందే ప్రకటించి... న్యూస్ ఎడిటర్లకు మరో విషయం గురించి ఆలోచించకుండా సమయాన్ని ఆదా చేశారు. మొత్తంగా రెండు గంటల పాటు తాను ఏరి కోరి ఎంచుకున్న ఎఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి రికార్డెడ్ ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని... మీడియాను ధైర్యంగా ఎదుర్కోలేరన్న విమర్శలకు మరోసారి బలం చేకూర్చారు. అయితే ప్రశ్నావళిని బలంగానే రూపొందించినా... ప్రధాని మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడకుండా అన్నింటినీ ఇప్పుడు సమాధానం చెప్పే ప్రయత్నం చెయ్యడమే ఆయన స్థాయికి తగినట్టు అనిపించలేదు. ప్రపచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ కేవలం మోదీ, అమిత్ షాల జట్టుపై మాత్రమే నడవటం లేదని చెప్పడం.. దేనికి సంకేతం..? పార్టీలో తమ పట్టు తగ్గుతోందని చెప్పడానికా... లేదా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి భారాన్ని తాము మొయ్యాల్సిన పని లేదని మరోసారి స్పష్టం చెయ్యడానికా..? రాజస్థాన్ , మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో పదిహేనేళ్లుగా అధికారంలో ఉండబట్టే ప్రజల్లో సహజంగా ఏర్పడ్డ వ్యతిరేకతే తమ ఓటమికి దారి తీసిందని చెప్పారు. మరి గుజరాత్ లో రెండు దశాబ్దాలుగా బీజేపీయే అధికారంలో ఉంది కదా.. అంటే అక్కడ ప్రజావ్యతిరేకత రాకుండా పాలించిన పార్టీ... రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లో మాత్రం ఎందుకు పాలించలేకపోయింది...? తెలంగాణలో గెలుస్తామన్న నమ్మకమే లేదని సాక్షాత్తు మోదీయే చెప్పడం మరీ విడ్డూరం. అంత నమ్మకం లేనప్పుడు అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టడం ఎందుకు...? ఆయనే స్వయంగా ప్రచారానికొచ్చి ప్రజల్ని మభ్య పెట్టడం ఎందుకు..? రాజకీయాలన్నాక ఇవన్నీ తప్పదనుకుందాం. కానీ పార్టీకి దిశానిర్ధేశం కల్పించాల్సిన వ్యక్తే ఇలా చెబితే ఎలా..? దానికి బదులుగా మా ప్రయత్నం మేం చేశాం... ముందు మరింత కష్టబడి సానుకూల ఫలితాలు సాధిస్తాం అని సాధారణ నేత చెప్పినట్టు చెప్పినా బాగుండేది. ఆయనకు, ఆయన ప్రత్యర్థులకు మధ్య జరిగే వాదోపవాదాల జోలికి వెళ్లద్దు. కానీ మధ్య తరగతికి ఏం చేశారన్న ప్రశ్నకు .. ఆయన సమాధానం వింటే ఆశ్యర్యం కలగక మానదు. వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారట. అయ్యా మోదీ గారు... ఇప్పటికీ ఓ సామాన్యుడు తన బిడ్డను వైద్య విద్య చదివించాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలన్న విషయం ప్రధాని స్థానంలో ఉన్న మీకు తెలియదని మధ్యతరగతి వ్యక్తి మాత్రం అనుకోవడం లేదు. ఉడాన్ పథకం తీసుకొచ్చి మధ్యతరగతిని విమానాలెక్కిస్తున్నాం అన్నారు. మీకు తెలుసో లేదో.... మరో దారి లేక.... తప్పనిసరి పరిస్థితుల్లో చివరకు ఎయిర్ పోర్ట్ లో దాహమేస్తే 50 రూపాయలిచ్చి అరలీటరు మంచినీళ్లు కూడా కొనుక్కోకుండా... దాహమేస్తున్నా నోరు కట్టుకొని ఆర్టీసి బస్సుకన్నా ఇరుగ్గా ఉండే సీట్లలో కాళ్లు ముడుచుకొని మరీ ప్రయాణాలు చేస్తున్నాం. మధ్యతరగతిని విమానాలెక్కించక్కర్లేదు. కనీసం రైళ్లలోనైనా సురక్షితంగా ఇంటికి చేరిస్తే చాలు. ఇక గృహ నిర్మాణాల్లో రాయతీ ఇచ్చారు సరే... నిన్న మొన్నటి వరకు జీఎస్టీ పేరిట వేసిన పన్నుల సంగతేంటి..? బడ్జెట్ వస్తే చాలు ఆశగా ఎదురు చూసే మధ్యతరగతికి గడిచిన నాలుగు బడ్జెట్లో ఏం వెలగబెట్టారో అందరికీ తెలిసిందే. రైతుల విషయానికొస్తే ... స్వామినాథన్ సిఫార్సులంటూ మళ్లీపాత పాటే పాడారు కానీ నిన్నగాక మొన్న దేశ రాజధాని నడిబొడ్డున ఆదుకోండి మహాప్రభో అంటూ ఆందోళనలు చేసిన వేలాది రైతులకు మీరిచ్చే సమాధానం ఏంటి..? దేవీలాల్ సమయం నుంచి రుణ మాఫీలు చేస్తున్ని ఎందుకు ఇంకా అదే పని చెయ్యాల్సిందన్న ప్రశ్న చాలా మంచిదే. కానీ ఆ పరిస్థితి రాకుండా మీరు ఈ నాలుగున్నరేళ్లలో చేసిందేంటి..? నిజంగా మీరు అన్నదాతకు చెయ్యాల్సిందంతా చేస్తుంటే... వాళ్లు ఇప్పటికి రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకొస్తోంది..? మిగిలిన విషయాలను పక్కనబెడితే జీఎస్టీపేరిట గరిష్టంగా పన్నులు విధించిందీ మీరే... సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో తప్పని పరిస్థితుల్లో కాస్త తగ్గించి దానికే ఏదో ఘనకార్యం చేసినట్టు... తగ్గించామని చెప్పుకుంటున్నారు. మొత్తంగా తొలి ఏడాది తొలి రోజున మీ ఇంటర్వ్యూలో నూటికి 90 సమాధానాలను జనం ఇప్పటికే మీ ఎన్నికల ప్రచార సభల్లో వినే ఉన్నారు. ఒక్క విషయంలో మాత్రం మోదీని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే మోదీ ఇంటర్వ్యూ అనేసరికి జనాల్లో మళ్లీ 2వేల రూపాయలనోటు ఉంటుందో ఉండదో అని భయపడ్డారు. అయితే ఆయన మాత్రం ఎలాంటి సంచలనాలకు చోటివ్వకుండా చాలా సాదా సీదాగా మాట్లాడి మమ అనిపించేశారు. #🌷 భారతీయ జనతా పార్టీ
హమ్మయ్య... 2 వేల రూపాయల నోటు రద్దు కాలేదు మొత్తానికి కొత్త ఏడాదిలో తొలి రోజున సాయంత్రం ప్రైం టైంలో ఎలాంటి ఎంటర్ టైన్ మెంట్ న్యూస్ తో వ్యూయర్ షిప్ పెంచుకోవాలా అని తలబద్దలుకొట్టుకునే న్యూస్ ఛానెళ్లన్నింటికీ ప్రధాని మోదీ... మంచి పొలిటికల్ ప్రైం టైం విందు భోజనాన్నే అందించారు. సాయంత్రం మీడియాతో మాట్లాడుతానంటూ ముందే ప్రకటించి... న్యూస్ ఎడిటర్లకు మరో విషయం గురించి ఆలోచించకుండా సమయాన్ని ఆదా చేశారు. మొత్తంగా రెండు గంటల పాటు తాను ఏరి కోరి ఎంచుకున్న ఎఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి రికార్డెడ్ ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని... మీడియాను ధైర్యంగా ఎదుర్కోలేరన్న విమర్శలకు మరోసారి బలం చేకూర్చారు. అయితే ప్రశ్నావళిని బలంగానే రూపొందించినా... ప్రధాని మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడకుండా అన్నింటినీ ఇప్పుడు సమాధానం చెప్పే ప్రయత్నం చెయ్యడమే ఆయన స్థాయికి తగినట్టు అనిపించలేదు. ప్రపచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ కేవలం మోదీ, అమిత్ షాల జట్టుపై మాత్రమే నడవటం లేదని చెప్పడం.. దేనికి సంకేతం..? పార్టీలో తమ పట్టు తగ్గుతోందని చెప్పడానికా... లేదా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి భారాన్ని తాము మొయ్యాల్సిన పని లేదని మరోసారి స్పష్టం చెయ్యడానికా..? రాజస్థాన్ , మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో పదిహేనేళ్లుగా అధికారంలో ఉండబట్టే ప్రజల్లో సహజంగా ఏర్పడ్డ వ్యతిరేకతే తమ ఓటమికి దారి తీసిందని చెప్పారు. మరి గుజరాత్ లో రెండు దశాబ్దాలుగా బీజేపీయే అధికారంలో ఉంది కదా.. అంటే అక్కడ ప్రజావ్యతిరేకత రాకుండా పాలించిన పార్టీ... రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లో మాత్రం ఎందుకు పాలించలేకపోయింది...? తెలంగాణలో గెలుస్తామన్న నమ్మకమే లేదని సాక్షాత్తు మోదీయే చెప్పడం మరీ విడ్డూరం. అంత నమ్మకం లేనప్పుడు అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టడం ఎందుకు...? ఆయనే స్వయంగా ప్రచారానికొచ్చి ప్రజల్ని మభ్య పెట్టడం ఎందుకు..? రాజకీయాలన్నాక ఇవన్నీ తప్పదనుకుందాం. కానీ పార్టీకి దిశానిర్ధేశం కల్పించాల్సిన వ్యక్తే ఇలా చెబితే ఎలా..? దానికి బదులుగా మా ప్రయత్నం మేం చేశాం... ముందు మరింత కష్టబడి సానుకూల ఫలితాలు సాధిస్తాం అని సాధారణ నేత చెప్పినట్టు చెప్పినా బాగుండేది. ఆయనకు, ఆయన ప్రత్యర్థులకు మధ్య జరిగే వాదోపవాదాల జోలికి వెళ్లద్దు. కానీ మధ్య తరగతికి ఏం చేశారన్న ప్రశ్నకు .. ఆయన సమాధానం వింటే ఆశ్యర్యం కలగక మానదు. వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారట. అయ్యా మోదీ గారు... ఇప్పటికీ ఓ సామాన్యుడు తన బిడ్డను వైద్య విద్య చదివించాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలన్న విషయం ప్రధాని స్థానంలో ఉన్న మీకు తెలియదని మధ్యతరగతి వ్యక్తి మాత్రం అనుకోవడం లేదు. ఉడాన్ పథకం తీసుకొచ్చి మధ్యతరగతిని విమానాలెక్కిస్తున్నాం అన్నారు. మీకు తెలుసో లేదో.... మరో దారి లేక.... తప్పనిసరి పరిస్థితుల్లో చివరకు ఎయిర్ పోర్ట్ లో దాహమేస్తే 50 రూపాయలిచ్చి అరలీటరు మంచినీళ్లు కూడా కొనుక్కోకుండా... దాహమేస్తున్నా నోరు కట్టుకొని ఆర్టీసి బస్సుకన్నా ఇరుగ్గా ఉండే సీట్లలో కాళ్లు ముడుచుకొని మరీ ప్రయాణాలు చేస్తున్నాం. మధ్యతరగతిని విమానాలెక్కించక్కర్లేదు. కనీసం రైళ్లలోనైనా సురక్షితంగా ఇంటికి చేరిస్తే చాలు. ఇక గృహ నిర్మాణాల్లో రాయతీ ఇచ్చారు సరే... నిన్న మొన్నటి వరకు జీఎస్టీ పేరిట వేసిన పన్నుల సంగతేంటి..? బడ్జెట్ వస్తే చాలు ఆశగా ఎదురు చూసే మధ్యతరగతికి గడిచిన నాలుగు బడ్జెట్లో ఏం వెలగబెట్టారో అందరికీ తెలిసిందే. రైతుల విషయానికొస్తే ... స్వామినాథన్ సిఫార్సులంటూ మళ్లీపాత పాటే పాడారు కానీ నిన్నగాక మొన్న దేశ రాజధాని నడిబొడ్డున ఆదుకోండి మహాప్రభో అంటూ ఆందోళనలు చేసిన వేలాది రైతులకు మీరిచ్చే సమాధానం ఏంటి..? దేవీలాల్ సమయం నుంచి రుణ మాఫీలు చేస్తున్ని ఎందుకు ఇంకా అదే పని చెయ్యాల్సిందన్న ప్రశ్న చాలా మంచిదే. కానీ ఆ పరిస్థితి రాకుండా మీరు ఈ నాలుగున్నరేళ్లలో చేసిందేంటి..? నిజంగా మీరు అన్నదాతకు చెయ్యాల్సిందంతా చేస్తుంటే... వాళ్లు ఇప్పటికి రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకొస్తోంది..? మిగిలిన విషయాలను పక్కనబెడితే జీఎస్టీపేరిట గరిష్టంగా పన్నులు విధించిందీ మీరే... సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో తప్పని పరిస్థితుల్లో కాస్త తగ్గించి దానికే ఏదో ఘనకార్యం చేసినట్టు... తగ్గించామని చెప్పుకుంటున్నారు. మొత్తంగా తొలి ఏడాది తొలి రోజున మీ ఇంటర్వ్యూలో నూటికి 90 సమాధానాలను జనం ఇప్పటికే మీ ఎన్నికల ప్రచార సభల్లో వినే ఉన్నారు. ఒక్క విషయంలో మాత్రం మోదీని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే మోదీ ఇంటర్వ్యూ అనేసరికి జనాల్లో మళ్లీ 2వేల రూపాయలనోటు ఉంటుందో ఉండదో అని భయపడ్డారు. అయితే ఆయన మాత్రం ఎలాంటి సంచలనాలకు చోటివ్వకుండా చాలా సాదా సీదాగా మాట్లాడి మమ అనిపించేశారు. #😁పొలిటికల్ ట్రోల్స్
2019 ముగ్గురి జాతకాలు మార్చనుందా? అవును... 2019 ముగ్గురు ముఖ్యమైన వ్యక్తుల జాతకాల్ని మార్చేయనుంది... అందులో నెంబర్ వన్ నరేంద్రమోదీ సరిగ్గా ఐదేళ్ల క్రితం అంటే 2013 డిసెంబర్ 31 నాటికి మోదీ గ్రాఫ్... ఐదేళ్ల తర్వాత ప్రధాని ప్రస్తుతం మోదీ గ్రాఫ్ చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం అనిపించక మానదు. కానీ టైమ్...ఎవర్ని ఎప్పుడు ఎక్కడ కూర్చోబెడుతుందో తెలీదు. లేకపోతే ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే సమయానికి బీజేపీ మొత్తం మోదీ జపం చెయ్యడమేంటి..? ఇప్పుడు ఏదైనా తేడా వస్తే ఇంకొకర్ని చూద్దాం అన్న ఆలోచనల్లో ఆర్ఎస్ఎస్ ఉండటమేంటి..? 2014 ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేని మెజార్టీ రావడానికి కారణమైన మోదీకి.. 2019లో ఎదుర్కోబోయే ఎన్నికలు అసలు సిసలైన పరీక్ష. తనను తాను నిరూపించుకునే అత్యంత ముఖ్యమైన సమయం. మళ్లీ గెల్చి కమలాన్ని అందలం ఎక్కించారా మరో ఐదేళ్లు మోదీకి తిరుగుండదు. కానీ బొటా బొటి సీట్లతో ప్రధాని పీఠం వరకు వచ్చి ఆగిపోయారా... అంతే.... ఇప్పటి వరకు ఆయనే కింగ్... కానీ రేపు కింగ్ మేకర్ ఇంకొకరవ్వచ్చు. నిన్నటి వరకు మోదీ అపాయింట్మెంట్ కోసం ఆయన ఆఫీస్ ముందు ఎదురు చూసిన పార్టీల ముందే రేపు ఆయన కాచుకొని కూర్చున్నా ఆశ్చర్యం లేదు. మొత్తంగా మోదీ రాజకీయ చరిత్రలోనే ఇవి 2019 అత్యంత కీలకం. ఆయన రాజకీయ భవిష్యత్తును అటో ఇటో తేల్చేసే ఏడాది కచ్చితంగా 2019 ఇక నెంబర్ టు చంద్రబాబు నాయుడు ఏడు పదుల వయసుకు దగ్గర పడుతున్న చంద్రబాబునాయుడికి తన రాజకీయ జీవితంలోనే అత్యంత క్లిష్టమైన సంవత్సరం 2019 అని చెప్పొచ్చు. ఒకరా.. ఇద్దరా... ఎటు చూసినా శత్రువులే. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్, వారిద్దరికి తోడు.. ఇప్పుడు నేనున్నా... నీ సంగతి తేలుస్తానంటూ గెలుపు ఊపుమీద ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్. మొత్తంగా ముగ్గురు కలిసి బాబు భవిష్యత్తును క్లోజ్ చేస్తామంటూ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుటికే గెలుపు ఊపు మీద ఉన్న కేసీఆర్ నేరుగా కత్తి దూస్తున్నారు. ఇక జగన్ సంగతి చెప్పాల్సిన పనే లేదు. గడిచిన ఐదేళ్లుగా అదే పనిలో ఉన్నారు. దాదాపు పది నెలల క్రితం బీజేపీతో తెగ తెంపులు చేసుకున్న తర్వాత కమలనాధులు కూడా శత్రువులైపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేవలం ప్రజల్ని మాత్రమే నమ్ముకున్నారు. ఇన్నాళ్లు ఏం చెయ్యాలన్నా కేంద్రం అడ్డపడుతోందన్న ఆయన.. ఇప్పుడు ఎన్నికలకు మరో 6 నెలల వ్యవధి ఉన్న నేపథ్యంలో అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే తలకెత్తుకుంటూ హడావుడి శంకు స్థాపనలు చేస్తున్నారు. ముగ్గురు శత్రువుల బారి నుంచి తనను తాను కాపాడుకునేందుకు బద్దశత్రువైన కాంగ్రెస్ తో కూడా చేతులు కలిపారు. ఇలా తన మనుగడ కోసం, పార్టీ భవిష్యత్తు కోసం మూల సిద్ధాంతాలనే మార్చేసి మరీ యుద్ధరంగంలోకి దిగబోతున్నారు. ఈ యుద్ధంలో గెలిస్తే సరే సరి. లేదంటే మాత్రం 2019 ఆయన రాజకీయ జీవితంలో మరోసారి సుదీర్ఘ విశ్రాంతినివ్వబోతుందన్నమాటే. పాదయాత్రలతో ఏళ్ల తరబడి జనంలో ఉంటున్న జగన్ను నమ్ముతారా..? లేదా తానే అభివృద్ధి చేస్తున్నానంటూ కాలికి బలపం కట్టుకొని జనంలోకెళ్తున్న చంద్రబాబును నమ్ముతారా అన్న సంగతి మరి కొద్ది నెలల్లో తేలిపోనుంది. అదే సమయంలో చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు కూడా. కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్న ఆయన ఇంట గెలవాలి. లేకపోతే అప్పట్లో నేషనల్ ఫ్రంట్ లో కీలక పాత్ర పోషించిన మామ ఎన్టీఆర్ .. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయేసరికి పరిస్థితులు ఎలా ఎదురు తిరిగాయో... ఇప్పుడు అల్లుడు చంద్రబాబుకు కూడా అదే అనుభవం ఎదురు కావచ్చు. అందుకే 2019 చంద్రబాబు రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన సంవత్సరం. ఇక నెంబర్ త్రి జగన్మోహన్ రెడ్డి. వైఎస్ మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాస్త సంయమనం పాటించి కాంగ్రెస్ అధిష్టానంతో సయోధ్య చేసుకొని ఉంటే ఎప్పుడో సమైక్యాంధ్ర ప్రదేశ్ కే సీఎం అయి ఉండేవారని ఇప్పటికీ చాలా మంది కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆయన స్వభావరీత్యా దూకుడుగా వ్యవహరించే జగన్ చేజేతులారా ఆ అమూల్యమైన అవకాశాన్ని పోగొట్టుకున్నారట. అదుగో అప్పటి నుంచి ఆయన ప్రయత్నాలు సాగుతునే ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత 2014లో సీఎం అవకాశం వచ్చినట్టే వచ్చి చివరి క్షణంలో ప్రజలు తమ మనుసును మార్చుకున్న దృష్ట్యా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఈసారి ఎలాగైనా ఆ సీఎం కుర్చీలో కూర్చోవాలన్నది ఆయన తపన. అందుకోసం చెయ్యాల్సిదంతా చేస్తున్నారు. ఆయన పాదయాత్రలకు తోడు ఇటు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కూడా కలిసొస్తున్నట్టే కనిపిస్తున్నాయి. ఇప్పటికే మోదీకి చంద్రబాబు శత్రువైపోయారు. అటు కేసీఆర్ కూడా పక్క రాష్ట్రానికి సీఎం అయినప్పటికీ చంద్రబాబును ఓడిస్తానని శపథం చేసి మరీ కూర్చున్నారు. అంటే అనుకోని వరంలా జగన్ కు అటు బీజేపీ, ఇటు కేసీఆర్ ఇద్దరూ తోడు కానున్నారన్నమాట. నిజానికి టీఆర్ఎస్ ఉనికే ఏపీలో లేకపోయినా...కేసీఆర్ కావాలనుకుంటే జగన్ కు ఏదో విధంగా సాయం చెయ్యగలరు. ప్రచారానికి వచ్చినా చాలు. అంతో ఇంతో ప్రభావం ఉంటుందన్నది వారి ఆలోచన కావచ్చు. ఇలా మొత్తంగా 2019లో జగన్ కు అనుకోకుండానే పరిస్థితులు కలిసి వస్తున్నాయి. ఇంతకన్నా రాజకీయంగా మంచి అవకాశం ఎవ్వరికీ రాదు. జనం చంద్రబాబును కాదు అనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి కల నెరవేరినట్టే. కానీ 2014లో కూడా ఎన్నికలు సమీపించేంత వరకు పరిస్థితులు జగన్ కు అనుకూలంగానే ఉన్నాయి. కానీ చివరి పది రోజుల్లోనే పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు కూడా ఒక వేళ అదే జరిగితే... జగన్మోహన్ రెడ్డిని దురదృష్టం వెంటాడుతున్నట్టే. మొత్తంగా ఆయన భవిష్యత్తను అటో ఇటో తేల్చేసేది కూడా 2019 సంవత్సరమే. మొత్తంగా అటు మోదీ, ఇటు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ముగ్గురి 2019 అత్యంత కీలకం. #📣తెలంగాణా పొలిటిక్స్