@royalraju007
@royalraju007

Royal raju

ఐ లవ్ షేర్ చాట్

#

వార్తలు 📰

be alert చెప్పుడు మాటలు: వియ్యంకుడి చెప్పుడు మాటలు విని మహామంత్రి తిమ్మరసు కళ్ళు పీకించాడు శ్రీ క్రిష్ణ దేవరాయలు. తన సొంత ఖర్చులు కోసం టోపీ లు కుట్టుకునే ఔరంగజేబు చెప్పుడు మాటలు విని అధికారం కోసం కన్న తల్లి తండ్రులని బంధించాడు. తల్లి గర్భం లో చనిపోబోయే బిందుసారుడి ని తన ఉపాయం తో బతికిస్తే చివరికి చెప్పుడు మాటలు విని బిందుసారుడే చాణక్యుడి మరణానికి కారణం అయ్యాడు. చెప్పుడు మాటలు విని కురు సామ్రాజ్యం పై పగ పెంచు కున్నాడు శకుడు. అదే శకుని చెప్పుడు మాటలు విని ధ్రుతరాష్టుడు పాండవులపై యుద్ధం చేసి సర్వం కోల్పోయారు కౌరవులు. చెప్పుడు మాటలు విని రావణా బ్రహ్మ అంతటి మాహా జ్ఞానే సీతమ్మ తల్లి ని అపహరించి రాముడి తో యుద్ధానికి దిగి రాక్షసుడు అయ్యాడు. చెప్పుడు మాటలు విని స్నేహాన్ని కోల్పోయిన వారు కొందరు. చెప్పుడు మాటలు విని సంసారాలని నాశనం చేసుకున్నవారు మరికొందరు. చెప్పుడు మాటలు విని అధికారాన్ని కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. శకుని చెప్పుడు మాటలు వినటం వలన హస్తినాపుర మహా సామ్రాజ్యమే సర్వనాశనం అయింది. మనమెంత..? *** మనతో ఉంటూ చెప్పుడు మాటలు చెప్పే శకుని లాంటి వాళ్ళతో అప్రమత్తం గా లేకపోతే ఎంతటివారికైనా అపజయం కలుగుతుంది అని చరిత్ర మరియూ పురాణాలు చెప్తున్న నగ్న సత్యం. "అందుకే చెప్పుడు మాటలు వినకండి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండీ."👏👏
558 views
5 months ago
#

స్వామియే శరణం అయ్యప్ప🥁

*"నేను మళ్ళీ ఆలయానికి రాను"* ఒక 11 సంవత్సరాల కుమార్తె తన తండ్రి తో కలిసి దేవాలయానికి వెళ్లింది. భగవంతునికి నమస్కరించి వచ్చి ఓ ప్రక్కన కూర్చున్న సమయంలో, తన తండ్రితో ఆమె ఇలా అంది. "నేను ఇకపై ఆలయానికి రాను" తండ్రి ఇలా అడిగాడు: "ఎందుకో నేను తెలుసుకోవచ్చా?" ఆమె ఇలా అన్నది: " భగవంతునికి సేవ చేయడం మరియు భజనలో సమయం గడపటం కోసం మనం ఇక్కడకు వస్తున్నాము, కానీ ఇక్కడ నాకు అందరూ కపట భక్తులే గోచరిస్తున్నారు. దేవాలయానికి వచ్చిన తరువాత కూడా వారు తమ మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. వారి మనసు, దృష్టి మొత్తం సెల్ ఫోన్ మీదనే నిమగ్నమై ఉంటున్నాయి. చెడు మాటలు వినిపిస్తున్నాయి , వీరు కేవలం కపటులు మాత్రమే. వీరందరినీ చూసి చూసి నేను కూడా అలానే అవుతానేమో అనే భయం కలుగుతున్నది. అందుకే నేను ఇకపై ఆలయానికి రాదలచుకోవడం లేదు" అని చెప్పింది కుమార్తె తండ్రి నిశ్శబ్దంగా విన్నాడు, ఆపై ఇలా అన్నాడు: "సరే ... నీ తుది నిర్ణయం తీసుకునే ముందుగా నాకోసం చిన్న పని చేయగలవా?" అన్నాడు తండ్రి ఆమె అన్నది: "చెప్పండి .. నాన్నగారు, ఏమిటది?" తండ్రి ఇలా చెప్పాడు: "దయచేసి ఒక గాజు గ్లాసు నిండా నీరు తీసుకొని ఆలయం చుట్టూ 2 సార్లు నడిచి రావాలి ముఖ్యంగా వీళ్లందరి మధ్యలో నుండి నడచి వచ్చినా కూడా నీళ్ళు ఏమాత్రం క్రింద పడకుండా రావాలి." రాగలవా? అన్నాడు తండ్రి కుమార్తె చెప్పింది: "ఓ ... తప్పకుండా నేను చేయగలను." అప్పుడు ఆమె తండ్రి చెప్పినట్లు తిరిగి వచ్చి ఇలా చెప్పింది: "చూశారా! ఈ గ్లాసు నిండుగా ఉంది. ఒక్క చుక్క నీరు కూడా క్రింద పడలేదు. మీరు చెప్పిన పనిని నేను విజయవంతంగా పూర్తి చేయగలిగాను" అప్పుడు తండ్రి పాపను అభినందించి, ఆమెను 3 ప్రశ్నలు అడిగాడు: 1. ఈసారి వెళ్లినప్పుడు వారిలో ఎవరినైనా ఫోన్ తో ఉండగా నీవు చూశావా? 2. ఎవరైనా చెడు మాటలు, ఇతర గాసిప్స్ చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం ఈసారి నీవు చూశావా? 3. ఎవరైనా యథార్థత లేకుండా కపటంగా జీవిస్తున్నారా? ఆమె ఇలా చెప్పింది: "నేను ఏమీ చూడలేదు. నేను నా దృష్టి గ్లాసు మరియు దానిలోని నీటిపైనే నిలిపాను, నీళ్ళు ఒక్క చుక్క కూడా పోలేదు. మిగతావారిని నేను గమనించలేదు " అతను ఆమెతో చెప్పాడు: "నీవు దేవాలయానికి వెళ్ళినప్పుడు సరిగ్గా చేయవలసినదిదే. నీవు కేవలం భగవంతునిపై దృష్టి నిలిపి, ఆయనగురించే ఆలోచిస్తూ, ఆయనతో మమేకం అవడానికి ప్రయత్నించాలి. అలా కనుక నీవు చేయగలిగితే వీరెవరూ నీ దృష్టికి రారు, పైగా నీవంటి వారిని చూసి వారుకూడా క్రమంగా మారవచ్చు. అచంచలమైన భక్తి, నిరంతర ఏకాగ్రతా సాధనా మాత్రమే మనల్ని భగవంతునికి చేరువ చేస్తాయి. జీవితంలో ఉన్నతపథంలో నడిపిస్తాయి" దేవాలయంలో గడప వలసిన విధానం గురించి తెలిపినందుకు తండ్రికి ఆమె ధన్యవాదాలు తెలిపింది 🙏 శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష
1k views
5 months ago
#

life changing quotes

*సి.బి.ఐ.మాజీ.జే.డీ.లక్ష్మీనారాయణ* గారు మచిలీపట్నం లో ముఖాముఖీ కార్యక్రమం లో ఓ కధ చెప్పారు. ఒక ఊరిలో ఓ రైతు ఉన్నాడు. అతనికో ఇల్లు వుంది. ఆ రైతు తనతో పాటు ఒక కోడిని ఒక మేకను పెంచుకుంటున్నాడు. ఆ ఇంట్లో ఒక ఎలుక కూడా తిరుగుతుండేది. ఆ ఊరిలోనే గ్రామస్థుల అవసరాలకు ఒక చెరువు వుంది. దానిలో ఒక మొసలి నివాసం వుంటుంది. కొన్నాళ్ళ తరువాత ఆ రైతు కి వివాహమై బార్య కాపురానికి వచ్చింది. ఆవిడకి ఆ ఇంట్లో ఎలుక తిరగడం నచ్చలేదు. ఆ విషయమే భర్తకి చెప్పింది. ఎలుకను చంపడానికి బోను తీసుకురమ్మని చెప్పింది. మరుసటి రోజే రైతు ఓ ఎలుకల బోను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. జరిగిన తతంగాన్ని చూసిన ఎలుక భయపడింది. ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడటానికి ఏదో ఒకటి చేయాలి అనుకుంది. మందుగా కోడి దగ్గరకు వెళ్ళి ఇలా అడిగింది. *నేను ఇంతవరకూ ఈ రైతుకి ఏ విధమైన నష్టం కలిగించే పని చెయ్యలేదు. ఏదో నా మానాన నేను బతుకుతున్నాను. ఇక మీదట కూడా వారి జోలికి రాను. నన్ను చంపవద్దని చెప్పు.* అని ప్రాధేయపడి అడిగింది. దానికి ఆ కోడి చిద్విలాసంగా... *అది నీ వ్యక్తిగత విషయం. దానితో నాకేమిటి సంబంధం. నీ సమస్య నువ్వే పరిష్కరించుకో...* అని సమాధానం చెప్పింది. అప్పుడు ఆ ఎలుక మేకని ఆశ్రయించి అడిగింది. దానికి ఆ మేక కూడా... *అది నీ సమస్య...* *దానిని నువ్వే సరిచేసుకోవాలి* *నాకు సంబంధంలేదు* అని బదులిచ్చింది. చేసేదేమీ లేక ఎలుక చివరిగా చెరువు దగ్గరకు వెళ్ళి మొసలిని కూడా అడిగింది .. *ఎలాగైనా రైతుని ఒప్పించి నన్ను కాపాడు. నేను ఏ పొరపాటు చెయ్యను* అని అడిగింది. అప్పుడు ఆ మొసలి కూడా *నాకు సంబంధం లేదంటూ...* అలాగే మాట్లాడింది. ఏదయితే అదే జరుగుతుందిలే అనుకుని ఎలుక తిరిగి ఇంటికి వచ్చేసింది. ఆ రాత్రి ప్రొద్దుపోయాక పెద్ద శబ్దంతో బోను తలుపు మూసకుంది. వెంటనే రైతు బార్య ఎలుక చిక్కింది అనుకుంటూ చీకట్లో తడుముకుంటూ బోను దగ్గరకు వెళ్ళింది. కానీ... దానిలో దూరింది ఎలుక కాదు. అది ఓ పాము. ఆవిడ దగ్గరకు రాగానే అది ఆమెను చేతి మీద కాటేసింది. ఆవిడ అరుపుకి అందరూ లేచి వచ్చారు. ఆమెను ఓ మంచం మీద పెట్టి డాక్టర్ ని పిలుచుకొచ్చారు. ట్రీట్మెంట్ మొదలైంది. రోజులు గడుస్తున్నాయి. అందరూ వచ్చి పలకరించి వెళుతున్నారు. చుట్టాలు రావటం మొదలైంది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. వైద్యం జరుగుతూనే ఉంది. వచ్చిన చుట్టాలకి మర్యాదలు చేయటానికి ఓ రోజు ఆ రైతు తను పెంచుకున్న కోడిని కోసి వండి పెట్టాడు. *ఎలుక మాత్రం అక్కడే వుంది.* మరికొన్ని రోజులు గడిచాయి. వైద్యం జరుగుతోంది. చుట్టాలు ఇంకా ఎక్కువ మంది వచ్చారు. వారి కోసమని ఆ రైతు మేకని కోసి ఫలావు చేసి పెట్టాడు. *ఎలుక మాత్రం ఇంకా ఆ ఇంట్లో తిరుగుతూనే వుంది.* వైద్యం జరుగుతుంది. కానీ ఆమె కోలుకోలేదు. లాభం లేదని పొరుగూరు నుండి మరో వైద్యుడిని పిలిపించారు. ఆ వైద్యుడు ఆమెను చూసి... మరేమీ పర్వాలేదు. నేను ఈమెను బ్రతికిస్తాను. కానీ... వైద్యానికి నాకు మొసలి రక్తం కావాలి అన్నాడు. దానితో అందరూ వెళ్ళి చెరువులో ఉన్న మొసలిని పట్టుకుని చంపి దాని రక్తం తీసుకొచ్చి వైద్యునికి ఇచ్చారు. రైతు భార్యకి నయమైంది. *కోడి చచ్చింది.* *మేక కూడా చచ్చింది.* *చివరికి మొసలీ చచ్చింది.* *కానీ... ఆ ఎలుక మాత్రం అక్కడే వుంది.* *మన సమాజమూ ఇలాగే ఉంది* *ఎవరికి వారే నాకేమిటి సంబంధం అనుకుంటే....* *చివరికి వారు కూడా.....!!!!!!*
592 views
5 months ago
#

సిత్రం విచిత్రం

🚩 గత జన్మల పుణ్య ఫలం🚩 *********************** 🌷ఒక్క చిన్న కథ🌷 పూర్వం ఒక ఊరిలో ఓ పేద కుటుంబం ఉండేది. వాళ్ళులో ఇంటి పెద్ద రోజు శివ పూజ చేస్తూ తనకి ఉన్నంతలో నైవేద్యం నివేదన చేసి తనపని తాను చేసుకునేవాడు. అలా ఎన్నాళ్ళ నుండో పూజలు చేస్తూ తన బాధని శివయ్యకి వెళ్ళబోసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు పార్వతీదేవి శివుడితో "స్వామి అతడు అనేక సంవత్సరాలుగా నిత్యం పూజలు చేస్తూనే ఉన్నాడు. కరుణించి ఏదైనా వరం ఇవ్వవచ్చు కదా." అంటే శివుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. పార్వతికి కోపం వచ్చింది. ఏమిటి స్వామి ఆ నవ్వు! ఇప్పుడు మీరు ఆ భక్తుడిని కరుణించి పేదరికం మాపి ధనవంతుడిని చేయకపోతే ఊరుకొను అంది. శివుడు మళ్ళి నవ్వి దేవి! నీకోరిక కాదనలేను కాని జరగబోయే విపరీతాలు నీవు ఎరుగవు. ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి. అనుభవిస్తే కాని కర్మ పరిపక్వం చెందదు. అన్నాడు. అయినా వినలేదు. పట్టుబట్టింది. శివుడు ఇక కాదనలేక దేవి! నీకోరిక ప్రకారం అతడిని ధనవంతుడిని చేస్తాను. చేసే ముందు అసలు ఏమి జరుగుతుందో నువ్వే చూడు. అని అక్కడ మాయమయ్యాడు శివుడు. ఒక సాధువు వేషంలో ఆ పేదవాడి ముందు ప్రత్యక్షమై "నిన్ను నేను రోజు గమనిస్తున్నాను. ఎందుకు అలా సేవలు చేస్తావు ఆ శివుడికి. భోళా శంకరుడు అన్నారు కానీ ఎప్పుడైనా కనికరించాడా? వృథాగా పూజలు చేయకు అని ఒక వజ్రపు రాయి చేతికి ఇచ్చి ఇది అమ్ముకొ చాలా డబ్బు వస్తుంది. హాయిగా బ్రతకవచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ వజ్రపు రాయిని చూసే సరికి మతి పోయింది. ఎన్నో కోరికలు మనస్సులో మేలిగాయి. అది కొనాలి ఇది కొనాలి. ఇంకేదో చేయాలి అని ఊహిస్తూ ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చాడు. పెట్టెలో భద్రంగా దాస్తుంటే భార్య వచ్చింది. ఏమిటి అంటే జరిగింది చెప్పాడు. ఆవిడకి దానిమీద ఆశ పుట్టింది. చీరలు నగలు అంటూ వంద కోరికలు ఏకరువు పెట్టింది. ఇద్దరికీ వాదనలు జరిగాయి. భార్యని బయటికి గెంతి పెట్టెలో పెట్టబోతూ ఉండగా తాగుబోతు కొడుకు సరిగ్గా అక్కడికి వచ్చాడు, చేతిలో ఉన్న రాయిని చూసి దాని వెలుగులు చూసి నాకు ఇవ్వు. నేను తాగాలి జూదం ఆడాలి, అప్పులు తీర్చాలి అన్నాడు. పెద్ద గొడవ అయింది. పక్కనే ఉన్న కత్తి తీసుకొని తండ్రి మెడ మీద ఒక్కటి వేశాడు. అంతే అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. అడ్డువచ్చిన తల్లిని చంపేసి వజ్రం తీసుకొని పారిపోయాడు. అది చూసిన దొంగలు వాడిని చంపి వజ్రం ఎత్తుకుపోయారు. అది చూసిన భటులు ఆ దొంగలని చంపేసి రాజుగారికి ఇచ్చారు. దానిని చక్కగా చెక్కించి పూజించి కిరీటంలో పోదిగాడు. చూశావా! పార్వతీ! ఏమి జరిగిందో! ఒక్క రాయి ఎన్ని బ్రతుకులు మార్చిందో, ఎన్ని బ్రతుకులు నాశనం చేసిందో! ఎన్ని ప్రాణాలను బలిగొందో! ఆపేదవాడు పూర్వం బ్రాహ్మణ వశంలో జన్మించి భార్యని పిల్లల్ని హత్య చేశాడు. ఎవరికీ దానం ధర్మం చేయలేదు. భక్తి మాత్రం మెండు. ఆ భక్తే ఈజన్మలో నేటి వరకు కొనసాగింది. చేసిన కర్మఫలం నుండి బ్రహ్మ సైతం తప్పించుకోలేడు. ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధిని మార్చడం కుదరదు. అనుభవిస్తేనే కర్మ తీరుతుంది. ఏ వస్తువు ఎక్కడికి చేరాలో ఎవరికీ దక్కాలో వారికే దక్కుతుంది తప్ప అర్హత లేనివాడు పొందలేడు. తాత్కాలికంగా విలువైన వస్తువులు మనదగ్గర ఉన్నట్లు కనిపించినా అర్హత లేకపోవడం చేత తొందరగానే పతనం అవుతాయి. పేదవాడు,మంచివాడు అనేది ఉండదు. గతజన్మలో భార్య బిడ్డలని చంపాడు. భార్య గయ్యాళి అయింది. కొడుకు వ్యసనపరుడై తండ్రిని చంపాడు. వాడు చేసిన కర్మఫలమే ఈ ఫలితం. పుట్టుకైనా చావైనా తాను చేసుకున్నదానిని బట్టే వస్తుంది. ఇదే విధి అని సెలవిచ్చెను..... " లోకా సమస్తా🚩 సుఖినో భవంతు..!! "
545 views
6 months ago
#

తాజా వార్తలు 🆕 📰

hi *రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!* *సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి, మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కింద సూచించిన వాటిని ఎక్కువగా తినండి.* *రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు* *1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.* *2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .* *3. బొప్పాయి :::: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.* *4. వెల్లుల్లి :::: శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.* *5. ఆకుకూరలు :::: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.* *6. దానిమ్మ :::: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.* *7. ఆప్రికాట్ :::: ఐరన్ అధికంగా ఉన్నపండ్లలో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.* *8.ఎండు ద్రాక్ష :::: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.* *9.ఖర్జూరం :::: ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.* *ఈ సమాచారం ఉపయోగకరమైనది అనుకుంటే మీ మిత్రులకి షేర్ చేయండి...* 🙏 🙏🙏
817 views
6 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post
Share on other apps
Facebook
WhatsApp
Unfollow
Copy Link
Report
Block
I want to report because