*బాలుడికి టికెట్ తీసుకోకుండానే విమానం ఎక్కారు.. చివరికి*
* శంషాబాద్: వారు ఎప్పుడూ విమానం ఎక్కలేదు.. మొదటిసారి విమానం ఎక్కుతుండటంతో నిబంధనలు తెలియదు. సాధారణంగా రైలు, బస్సుల్లో ప్రయాణిస్తుంటే రెండున్నర సంవత్సరాల పిల్లలకు టికెట్ ఉండదు. అలాగే విమానంలో కూడా తమ మనవడికి టికెట్ ఉండదని భావించిన ఓ మహిళ.. అతనికి విమానం టికెట్ తీసుకోలేదు. #news #sharechat
*బ్రాడ్‌మన్ టోపీకి రూ.4 కోట్ల 21 లక్షలు*
* ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ ఉపయోగించిన బ్యాగీ గ్రీన్ టోపీకి భారీ ధర పలికింది. 1947-48లో భారత క్రికెటర్ శ్రీరంగ వాసుదేవ్ సొహోనికి బ్రాడ్‌మన్ బహుమతిగా ఇచ్చిన టోపీని సోమవారం వేలం వేయగా.. రూ.4 కోట్ల 21 లక్షలకు అమ్ముడుపోయింది. #news #sharechat
ఆడ తోడు కోసం పెద్ద పులి సుదీర్ఘ ప్రయాణం!
TG: యాదాద్రి జిల్లాలో రెండు వారాలుగా పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. రాజాపేట, తుర్కపల్లి, యాదాద్రి మండలాల్లో సంచరిస్తూ లేగదూడలపై దాడులు చేస్తోంది. అటవీశాఖ అధికారులు ఎంత ప్రయత్నిస్తున్నా పులి జాడ కనుక్కోలేకపోతున్నారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి నదులు, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలు దాటుకుంటూ 400km ప్రయాణించి, ఆడ పులి తోడు కోసం వచ్చినట్లు భావిస్తున్నారు. #news #sharechat
*ప్రియుడి కుటుంబంపై పెట్రోలుతో దాడి*
* ప్రేమగా చూసుకునే భర్త.. సంతోషాలు పంచే బిడ్డలు. హాయిగా సాగిపోయే జీవితంలోకి కొందరు కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు. తాత్కాలిక ఆనందం కోసం నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర బంధం మోజులోపడి తమ కుటుంబాన్నే కాదు.. భాగస్వామి కుటుంబాన్ని సైతం రోడ్డున పడేస్తున్నారు. #news #sharechat
*చైనా మాంజాకు ఐదేళ్ల చిన్నారి బలి*
* చైనా మాంజాకు ఐదేళ్ల చిన్నారి బలైంది. తల్లిదండ్రుల ద్విచక్ర వాహనంపై ముందు కూర్చున్న బాలిక మెడకు దారం చుట్టుకోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. హైదరాబాద్ కూకట్పల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కలిచివేసింది.
#news #sharechat
తెలుగు రాష్ట్రాలలో సోమవారం నమోదైన ఉష్ణోగ్రతలు #weather #news #sharechat
బతింద (పంజాబ్) రైతు రామదీప్ సింగ్, 2.5 కనాల భూమిలో ఏరోపోనిక్స్ పొటేటో సీడ్ కల్చర్‌తో మొదటి సంవత్సరంలో రూ. 1 కోటి మార్జిన్ సాధించాడు.
పరంపరాగత గోధుమ-వరి పంటల నుండి అధునాతన టెక్నాలజీకి మారి, ICAR-CPRI టెక్నాలజీతో 1 మిలియన్ G-0 మినీ-ట్యూబర్లు ఉత్పత్తి చేస్తున్నాడు. భారతదేశంలో పొటేటో సీడ్ అవసరాలలో కేవలం 8% మాత్రమే ఆర్గనైజ్డ్ వైరస్-ఫ్రీ సిస్టమ్‌ల ద్వారా సరిపోతున్నాయి.
రూ. 1.65-1.70 కోట్ల పెట్టుబడితో మొదలైన ఈ ప్రాజెక్ట్, 50% పైగా ప్రాఫిట్ ఇస్తోంది మరియు భవిష్యత్తులో భారతీయ వ్యవసాయానికి మార్గదర్శకంగా మారనుంది. #news #punjab #Farme🌽🌾 #sharechat #agriculture
కింగ్ చార్ల్స్ మూడవ వ్యక్తి భారతదేశానికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇండియా-UK మధ్య “స్థిరమైన భాగస్వామ్యం”ని ప్రస్తావించారు, కామన్వెల్త్ విలువలు, పరస్పర గౌరవంపై ఆధారపడినది.
విద్యా సహకారం
UK కొత్త అంతర్జాతీయ విద్యా వ్యూహంలో భారతదేశాన్ని ప్రధాన దేశంగా ఎంచుకుంది. 2030 నాటికి £40 బిలియన్ల విద్యా ఎగుమతుల లక్ష్యంతో, ఓవర్సీస్ క్యాంపస్‌లు, భాగస్వామ్యాలు పెంచుతున్నారు.
రక్షణ సంబంధాలు
8వ అజేయ వారియర్ వ్యాయామం (2025) రాజస్థాన్‌లో పూర్తయింది. ఇండియా-UK సైన్యాలు టెర్రరిజం వ్యతిరేక అభ్యాసాలు చేశాయి. బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ ఈ రక్షణ బంధాలను ప్రశంసించారు. #news #latestnews #sharechat
హైదరాబాద్ నాచారంలో ఉన్న పిజ్జా హట్ అవుట్‌లెట్‌లో జొమాటో డెలివరీ బాయ్‌పై సిబ్బంది దాడి చేసిన ఘటన వెలుగుచూసింది. కస్టమర్లు ఇచ్చిన తక్కువ రేటింగ్‌లకు తనను బాధ్యుడిని చేస్తూ వాదన ప్రారంభంగా, అది చేతులకందింది. సీసీటీవీలో మొత్తం ఘటన రికార్డ్ అయ్యింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ ఘటన గిగ్ వర్కర్ల భద్రత, హక్కులపై దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
#news #latestnews #sharechat
రేపు బ్యాంకులు బంద్!
బ్యాంక్ ఉద్యోగులు రేపు బంద్‌కు పిలుపునిచ్చారు. వారంలో 5 వర్కింగ్ డేస్‌ను డిమాండ్ చేస్తూ బ్యాంకు యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. జనవరి 23న ఈ మేరకు ప్రకటన వెలువడింది. గత బుధవారం, గురువారం ఈ విషయంపై చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మె యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది! ఇప్పటికే పలు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు తమ సేవల్లో అంతరాయం ఏర్పడొచ్చంటూ కస్టమర్లకు మెసేజ్‌లు పంపాయి. #news #latestnews #sharechat













