@sakshinews
@sakshinews

Sakshi News

Sakshi, Gets You News as it Breaks, Catch Events as They Unfold.

ఆ ఎస్‌బీఐ డెబిట్‌ కార్డ్‌లు ఇక పనిచేయవు!
#

🆕📰తాజావార్తలు

ఆ ఎస్‌బీఐ డెబిట్‌ కార్డ్‌లు ఇక పనిచేయవు!
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు మాగ్నటిక్ స్టిప్ డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్ కార్డులతో మార్చుకోవాలని సూచిస్తోంది. కస్టమర్ల వద్ద ఉన్న పాత కార్డులు డిసెంబర్ 31 తరువాత పనిచేయవని తెలిపింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం కార్డులను రీప్లేస్ చేసినట్టు వివరించింది. మాగ్నటిక్ స్టిప్ కార్డులతో మోసాలు జరుగుతుండడంతో వాటిని అరికట్టే ప్రయత్నంలో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
145 వీక్షించారు
41 నిమిషముల క్రితం
2020 ఒలింపిక్స్‌ నుంచి రష్యా ఔట్‌!
#

🏅📰స్పోర్ట్స్

రష్యాకు బిగ్ షాక్‌: ఒలింపిక్స్‌ నుంచి ఔట్‌!
మాస్కో : రష్యాకు భారీ షాక్‌ తగిలింది. డోపింగ్‌ టెస్టుకు సంబంధించి రష్యా తప్పుడు సమాచారం ఇచ్చిందని పేర్కొంటూ రష్యా ఆటగాళ్లపై నిషేధం విధిస్తున్నట్లుగా ప్రపంచ యాంటీ- డోపింగ్ సంస్థ(వాడా) ప్రకటించింది. డోపింగ్‌ టెస్టులో రష్యా జట్టు దొరికిపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం పేర్కొంది. ఈ నేపథ్యంలో జపాన్‌ రాజధాని టోక్యోలో 2020లో జరుగనున్న ఒలింపిక్స్‌, 2022లో చైనాలోని బీజింగ్‌లో జరుగనున్న శీతాకాల ఒలింపిక్స్‌ నుంచి రష్యాను తప్పిస్తున్నట్లు పేర్కొంది.
142 వీక్షించారు
46 నిమిషముల క్రితం
వైఎస్సార్‌ సీపీలో చేరిన గోకరాజు రంగరాజు
#

📰 A.P న్యూస్

వైఎస్సార్‌ సీపీలో చేరిన గోకరాజు రంగరాజు
సాక్షి, తాడేపల్లి: ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు రంగరాజు సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రంగరాజుతో పాటు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులు రామరాజు, నరసింహ రాజు కూడా పార్టీలో చేరారు. అనంతరం రంగరాజు మీడియాతో మాట్లాడుతూ... ‘వైఎస్‌ జగన్‌ పాలన అద్భుతంగా ఉంది. ఆయన నాయకత్వంలో పని చేయడం అదృష్టం. ఈ పార్టీలో నేను కొత్తవాడిని అనుకోవడం లేదు. వైఎస్సార్‌ సీపీలో అందరూ మా వాళ్లే ఉన్నారు. పార్టీ పిలుపు మేరకు వైఎస్సార్‌ సీపీలో చేరాను’ అని తెలిపారు.
146 వీక్షించారు
54 నిమిషముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..