@shiva8407
@shiva8407

Shiva Kumar

జీవితంలో మధురక్షణాలు ఏవని మనం తలపోస్తే..మనం నవ్విన

#కథలు స్నేహం: అనగనగా ఒక అడవిలో ఒక కాకి, పావురం ఉండేవి. పావురమేమో నీలంగా ఆకాశం రంగులో మెరుస్తూ ఉండేది. కాకి మటుకు నల్లగా, వికారంగా ఉండేది. కాకికి పావురం అంటే చాలా ఇష్టం. "మనిద్దరం స్నేహితులం- సరేనా?" అనేది చాలాసార్లు, పావురం దగ్గరికొచ్చి. పావురానికి మటుకు అదంటే చులకన. 'ఎట్లా ఉంటుందో చూడు- కర్రిగా' అనుకునేది. కాకితో మాట్లాడకుండా మొహం తిప్పుకునేది. అయితే ఒకరోజున దుష్ట నక్క ఒకటి ఆ అడవిలోకి వచ్చింది. ఆ నక్క చాలా చెడ్డది. ఆ రోజున పావురం చెట్టు కొమ్మ పైన కూర్చొని కునికిపాట్లు పడుతున్నది. ఆ సమయంలో చాటుమాటున నక్కుకుంటూ నక్క దాని దగ్గరికి రాబోయింది. అంతలోనే దాన్ని చూసిన కాకి 'కావ్ కావ్'మని అరిచింది గట్టిగా. దాని అరుపుకి పావురం చటుక్కున కళ్ళు తెరిచి చూసింది. ఆ సరికి నక్క దానికి చాలా దగ్గరికి వచ్చేసింది కూడా! అయితే వెంటనే పావురం గాల్లోకి ఎగిరింది- నక్కబారినుండి తప్పించుకున్నది. అంత జరిగినాక కూడా అది కాకిని చిన్నచూపు చూడటం మానలేదు. 'నల్ల కాకి!' అని అసహ్యించుకుంటూనే ఉంది. మరునాటి రోజున కాకి పుట్టిన రోజు. ఆ రోజున అది తన తోటి పక్షులన్నిటినీ విందుకు పిల్చింది. అన్నీ వెళ్ళి వచ్చాయిగానీ, పావురం మటుకు వెళ్లలేదు. 'కర్రిదాని ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి?' అని ఊరికే ఉన్నది. అయితే ఆరోజు రాత్రికే దానికి జ్వరం మొదలైంది. తర్వాతి రోజున కాకి తనే దాన్ని పరామర్శించటానికి వచ్చింది. వస్తూ వస్తూ పావురానికి ఇష్టమని ఏవేవో వంటలు కూడా చేసి పట్టుకొచ్చింది. అయితే పావురానికి దాన్ని చూస్తే చికాకు వేసింది. "నీ ఆహారం నాకు అవసరం లేదు. నువ్వు దూరంగా ఉండు" అంది పావురం. ప్రేమగా పలకరించబోయిన కాకి దాని మాటలకు చిన్నబోయింది. అయితే సరిగ్గా అదే సమయంలో మళ్ళీ పావురాన్ని పట్టుకునేందుకు నిశ్శబ్దంగా చెట్టు ఎక్కుతున్నది నక్క. చిన్నబోయి తల వంచుకున్న పావురపు చూపు నక్క మీద పడింది. "కావ్! కావ్! నక్క వచ్చేసింది! ఎగురు! పారిపో!" అని అది పావురాన్ని ఉద్దేశించి అరిచి, అది పైకి ఎగిరి పోయింది. ఇంకొక్క క్షణం ఆలస్యమైనా పావురం నక్క చేతికి చిక్కి ఉండేది! చటుక్కున తేరుకొని, అతి కష్టం మీద అది కాస్తా ఎగిరిపోయింది. అట్లా కాకి మంచితనాన్ని గుర్తించిన పావురం సిగ్గు పడింది. "నన్ను క్షమించు కాకమ్మా!నిన్ను అంతగా అవమానించాను" అన్నది. "కాకి నవ్వి, మనం మనం స్నేహితులం కదా, స్నేహితుల మధ్య క్షమాపణలుండవు" అన్నది. "ఈ నక్క పని పట్టాలి ఎవరైనా. ఎన్ని పిట్టలను చంపుతోందో ఇది" అని బాధ పడింది పావురం. "ఎవరో రమ్మంటే రారు- మనమే ఏదో ఒకటి చేద్దాం" అని, కాకి దానికొక పథకం చెప్పింది. వెంటనే అవి రెండూ కలిసి నక్క కంట పడకుండా తాము ఉండే చెట్టు చుట్టూతా ముళ్ల కంపలు తెచ్చి పరచాయి. తర్వాతి రోజున నక్క వచ్చింది మళ్ళీ, చెట్టు పైకి చూసుకుంటూ. అది అట్లా చెట్టు దగ్గరికి రాగానే దానికోసమే చూస్తున్న కాకి వేగంగా ఎగురుకుంటూ వచ్చి దాని కన్నును ఒకదాన్ని పొడిచి పోయింది. నక్క కుయ్యో మొర్రో మంటూ, ఒక్క కన్నుతోటే కోపంగా చెట్టును ఎక్కబోయింది. అంతలోనే కాకి, పావురం మళ్ళీ ఓసారి దానిపైకి దాడి చేసాయి. రెండో కన్నునూ పొడిచేసాయి. దాంతో నక్క కాస్తా పట్టుజారి ముళ్ల కంపలో పడి, లేచి, తోచిన దిక్కుకు ఉరికింది. నక్క బెడద తప్పినందుకు కాకి, పావురం ఎంతో సంతోషించాయి. పావురానికి స్నేహం విలువ అర్థమైంది.
#👨🏻‍⚕️ఆరోగ్య చిట్కాలు #🏋️‍♀️హెల్త్ టిప్స్
#కథలు ఒక వ్యక్తికి నలుగురు భార్యలు..........నాలుగవ భార్య అంటే చాలా ప్రేమ అతనికి... ఆమెకోరిన కోరికలన్నీ తీర్చేవాడు......అపురూపంగా చూసుకునేవాడు... మూడవ భార్య అన్నా ఇష్టమే. కానీ తన గురించి మంచిగా స్నేహితులదగ్గర చెప్పేవాడు కాదు.....తను వారితో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో....... రెండవ భార్యదగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు...ఆమెకూడా అతని సమస్యను తీర్చి పంపేది..... మొదటి భార్య అంటే అస్సలు ఇష్టమే ఉండేదికాదు....ఆమెను అస్సలు పట్టించుకునే వాడే కాదు......ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అతని ఆరోగ్యం క్షీణించిపోయింది.ఇక తను బ్రతకను అని తెలిసిపోయి తనమీద ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి తన నాలుగవ భార్యను పిలిచాడు. " నేను మరణానికి అతి దగ్గరలో ఉన్నాను......నిన్ను చాలా ప్రేమగా చూసుకున్నాను కదా! నాతో పాటు నువ్వు కూడా వచ్చేసేయ్.... మరణంలో కూడా నాకు నీతోడే కావాలి " అని అన్నాడు. నాలగవ భార్య అది విని అతనికి దూరంగా జరిగిపోయింది, ఆశ్చర్య చకితుడై తన మూడవ భార్యను ఇదే కోరాడు........ మూడవ భార్య ఇలా అంది. " ఇన్ని రోజులు నీతోనే,,,,,,,,నీ దగ్గరే ఉన్నాను.......నీ అవసరాలన్నీ తోర్చాను ఇక నాకు నీతో పనిలేదు.వేరేవారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను:" బాధతో ఏడుస్తూ తన రెండవ భార్యను ఇలాగే అడిగాడు...... " నేను నీతో పాటు నీ శవయాత్రలో పాల్గొనేంత వరకు నీవెంట ఉంటాను తరువాత నేను వెళ్ళిపో్తాను.....నిన్ను అప్పుడప్పుడు తలచుకోగలను." అంది. ఇంత ప్రేమగా చూసుకున్న ఈ ముగ్గురూ ఇలా అనేసరికి ఇక మొదటి భార్యను బాగా నిర్లక్ష్యం చేశానుకదా తనని అడగడం వృద్ధా అని భావిస్తుండగా....... మొదటిభార్య తలుపు చాటునుండి ఇలా అంది. " మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం మీ వెంట మీ చివరి పయనం దాకా తప్పక వస్తాను........మీరేమీ బాధపడకండి " అతని కంట నీరు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది.....కాబట్టి మనిషి దేన్నీ..... ఎవరినీ నిర్లక్ష్యం చేయకూడదు.......మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు.........పోయే ముందు తెలుసుకుని ప్రయోజనం ఉండదు. నిజం చెప్పాలంటే మనం అందరం నలుగురు భార్యల్తోనే ఉంటున్నాము. అదేంటి అలా అంటున్నారు అని ఆశ్చర్యంగా ఉందా??????? నాలుగవ భార్య......... మన శరీరం...... మూడవ భార్య ...............సంపద, ఆస్థిపాస్తులు...... రెండవభార్య.......... నేస్తాలు........బంధువులు....... మొదటి భార్య..............మన ఆత్మ.......... నిజమే కదా! దయచేసి మన ఆత్మ చెప్పిన దాన్ని ఆచరించండి.... పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేయకండి........సరేనా! కథ కంచికి మనం ఇంటికి...
#👋విషెస్ స్టేటస్ #🌙రంజాన్ స్టేటస్
#😀జోక్స్ #😆ఫన్నీ whatsapp స్టేటస్ #ఉచిత_సలహా నిన్న నేనొక ఫంక్షన్ కి అటెండ్ అయ్యా..దాదాపు 50 మంది అతిథులు కుర్చీల్లో ఆశీనులయ్యారు..నేను ముందు వరుసలో కూర్చున్నా..ఆకలిగా అనిపించింది. కాసేపయ్యాక ఒకామె ట్రేలో స్నాక్స్ తెచ్చి వెనుక వరుస నుండి అతిథులకు అందించడం ప్రారంభించింది..ముందుకి కూర్చున్న నా వరకు వచ్చేసరికి స్నాక్స్ అయిపోయాయి..చిరాగ్గా అనిపించింది.తిన్నగా లేచివెళ్లి వెనుక వరుసలో కూర్చున్నా. ఈలోగా మరొక ఆమె కూల్డ్రింక్స్ తెచ్చి ముందువరుస నుండి పంపకం మొదలెట్టింది..అనుమానించినట్టే వెనక్కు వచ్చేలోపు అవికూడా అయిపోయాయి.. కోపం పట్టలేక వెళ్లిపోదాం అని లేచి నిల్చున్నా..సరిగ్గా అదే టైమ్ కి ముగ్గురు మహిళలు ట్రే లలో ఘుమ ఘుమలాడే వంటకాలను తీసుకువచ్చారు..స్మార్ట్ గా ఆలోచించి ఈసారి మధ్య వరుసలో కూర్చున్నా. ఒకామె ముందునుండి, మరొకామే వెనుక నుండి అందించడం మొదలెట్టారు..థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు టెన్షన్ గా అనిపించింది..ఊహించరాని విధంగా మధ్య వరుస వచ్చేసరికి సమాప్తం.. అందరూ తింటుంటే ఏం చేయాలో తోచక అయోమయంగా తలదించి కోపంగా నా చేతులవైపు చేసుకుంటున్నా.. సరిగ్గా అదేసమయంలో మూడవ మహిళ నా వద్దకు వచ్చి..తన చేతిలో ఉన్న బౌల్ ని చూపించి తీసుకోమన్నట్టు సైగ చేసింది..ఆతృతగా బౌల్ లో చెయ్యిపెట్టి బయటకు తీసా..అదేంటో తెలుసా?? టూత్ పిక్..పళ్ళసందుల్లో ఇరుక్కున్న ఆహారాన్ని తీసే కర్రపుల్లలు ... దీనమ్మ జీవితం ... నీతి : జీవితంలో మీ పొజిషన్ ని తరచుగా మార్చడానికి ప్రయత్నించొద్దు. దేవుడు మీరు ఎక్కడుంటే మంచిదో అక్కడే ఉంచుతాడు. కాదూ,కూడదు అని తొందరపడితే దొరికేది "టూత్ పిక్" లే. 😋😂😆😉😍😀😅😄😁😊