@srilakshmi1122
@srilakshmi1122

Sri lakshmi

ధర్మో రక్షతి రక్షితః

#🥕పిండి వంటలు & పచ్చడ్లు ఫ్రైడ్‌ చికెన్‌ కావలసినవి: బోన్‌లెస్‌ చికెన్‌: పావుకిలో, అల్లం ముద్ద: 2 టీస్పూన్లు, వెల్లుల్లి ముద్ద: టీస్పూను, పచ్చిమిర్చి ముద్ద: టీస్పూను, మైదా: 4 టీస్పూన్లు, కాశ్మీరీ కారం: టీస్పూను, దనియాల పొడి: టీస్పూను, చాట్‌మసాలా: అరటీస్పూను, నిమ్మరసం: 2 టీస్పూన్లు, ఉల్లిపాయ: ఒకటి, ఎరుపు రంగు: చిటికెడు, నూనె: సరిపడా, ఉప్పు: తగినంత. తయారుచేసే విధానం: * ఉల్లిపాయను పేస్టులా చేయకుండా చాలా సన్నగా తరగాలి. * వెడల్పాటి గిన్నెలో చికెన్‌ ముక్కలు వేసి నూనె తప్ప మిగిలిన దినుసులన్నీ వేసి బాగా కలిపి అరగంటసేపు నాననివ్వాలి. * బాణలిలో నూనె వేసి కాగాక చికెన్‌ ముక్కల్ని కొంచెంకొంచెంగా వేసి వేయించి తీయాలి. చివరగా పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు, టొమాటో ముక్కలతో అలంకరించి అందించాలి
#

🥕పిండి వంటలు & పచ్చడ్లు

🥕పిండి వంటలు & పచ్చడ్లు - ఫ్రైడ్ చికెన్ - ShareChat
252 వీక్షించారు
47 నిమిషముల క్రితం
#ఆవకాయ పచ్చడి మటన్‌ రవ్వ కట్‌లెట్‌ కావలసినవి మటన్‌ కీమా: పావుకిలో, జీడి పప్పు: 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయలు: ఒకటి, పచ్చిమిర్చి: మూడు, అల్లం వెల్లుల్లి: టీస్పూను, పెరుగు: 2 టేబుల్‌ స్పూన్లు, జాజికాయ పొడి: చిటికెడు, జాపత్రి పొడి: చిటికెడు, గరంమసాలా: పావు టీస్పూను, గుడ్డు: ఒకటి, బొంబాయి రవ్వ: కప్పు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా తయారుచేసే విధానం * మటన్‌ కీమాను కడిగి నీళ్లు లేకుండా పిండాలి. అందులో ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు ఈ మొత్తాన్నీ మిక్సీలో వేసి ఓసారి రుబ్బి తీసి పక్కన ఉంచాలి. తరవాత పెరుగు, తగినంత ఉప్పు, జీడిపప్పు ముక్కలు, అల్లం వెల్లుల్లి, జాజికాయ, జాపత్రి, గరం మసాలా పొడులన్నీ వేసి కలపాలి. * గుడ్డు సొనని బాగా గిలకొట్టాలి. మటన్‌ మిశ్రమాన్ని మందపాటి వడల్లా చేసి గుడ్డుమిశ్రమంలో ముంచి రవ్వలో దొర్లించి పాన్‌లో నూనెవేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి.
#

ఆవకాయ పచ్చడి

ఆవకాయ పచ్చడి - మటన్ రవ్వ కట్లెట్ - ShareChat
145 వీక్షించారు
49 నిమిషముల క్రితం
#పుణ్యక్షేత్రాలు అష్ట వినాయక దర్శనం జగన్మాత పార్వతీదేవి తనయుడైన విఘ్నేశ్వరుడు విఘ్నాలను నివారించే మూర్తిగా అందరి చేత పూజలందుకుంటాడు. ఎలాంటి కార్యాన్నయినా ప్రారంభించేముందు స్వామిని పూజించి ప్రారంభిస్తే విజయం లభిస్తుంది. ఆదిదంపతుల ప్రథమ పుత్రరత్నమైన గణనాధుడికి తొలి పూజ అన్ని విధాలుగా అన్ని శుభాలను చేకూర్చుతుంది. పంచారామ క్షేత్రాలను ఒక్క రోజులో దర్శించుకుంటే ముక్తిదాయకం అని చెబుతారు. అదే కోవలో మహారాష్ట్రలోని అష్టవినాయక క్షేత్రాలను ఒక వరుసలో దర్శించుకోవడం ఆనవాయితీ. కాకపోతే ఒక్కరోజులో కష్టం. సరిగ్గా ప్రణాళిక వేసుకుంటే రెండు రోజుల్లో అన్ని చోట్లకూ వెళ్లొచ్చు. బల్లాలేశ్వరుడు పుణెకి 100 కిలో మీటర్ల దూరాన పాలి క్షేత్రంలో వెలసిన స్వామి బల్లాలేశ్వరుడు అంటే బాలగణపతి అనుకోవచ్చు. అష్ట క్షేత్రాల్లోనూ ఒక భక్తుడి పేరిట వెలసిన స్వామి ఈయనే. బల్లాల్‌ అనే పరమ భక్తుడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన గణపతి అతని పేరుతోనే ఈ గ్రామంలో వెలిశాడని స్థలపురాణం. తూర్పముఖంగా వెలసిన బల్లాలేశ్వరుడి విగ్రహంపై దక్షిణాయన కాలంలో సూర్యకిరణాలు పడటం ఇక్కడి ప్రత్యేకత. వరద వినాయకుడు చింతామణి గణపతి మయూరేశ్వరుడు సిద్ధి వినాయకుడు మహాగణపతి విఘ్న వినాయకుడు గిరిజాత్మజ వినాయకుడు ప్రారంభించిన చోటికే.. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ క్షేత్రాల్లో ఎక్కణ్నుంచి యాత్ర ప్రారంభిస్తామో మళ్లీ అక్కడికి తిరిగిరావాలి. అప్పుడే యాత్ర పూర్తయినట్లు యాత్రామార్గం ఆద్యంతం పచ్చటి ప్రకృతి అందాలతో కనువిందు చేస్తుంది. ఎలా చేరుకోవాలి * మహారాష్ట్రలోని పుణె నగరం చేరుకొని అక్కడ నుంచి అష్టవినాయక యాత్ర ప్రారంభించవచ్చు. * పుణెకుల దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు, విమాన, బస్సు సౌకర్యాలున్నాయి. * ఈ క్షేత్రాలకు కార్లలో వెళ్లలేని వారి కోసం మహారాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముంబై షోలాపూర్‌ నగరాల నుంచి అష్టవినాయక క్షేత్రదర్శనం స్పెషల్‌ ప్యాకేజీ బస్సులు ఉంటాయి. రుసుము కూడా తక్కువే
#

పుణ్యక్షేత్రాలు

పుణ్యక్షేత్రాలు - ShareChat
1.4k వీక్షించారు
50 నిమిషముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..