#🏛️రాజకీయాలు జుక్కల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం..
మద్దెలచెరువు - పిట్లం రోడ్, తిమ్మనగర్ వద్ద ₹4.86 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జ్‌ను ప్రారంభించి,
బిచ్కుంద నుండి డోంగ్లి వరకు ₹13.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది
పదేండ్లు పాలన చేసిన గత పాలకులు తెలంగాణను అభివృద్ధి చేయకుండా ఆగం చేసిండ్రు..
జుక్కల్ లాంటి వెనుకబడిన నియోజకవర్గం అభివృద్ధి చెందినపుడే నిజమైన అభివృద్ధి జరిగినట్లు..
జుక్కల్ అభివృద్ధి బాధ్యత కూడా నాదే..
సీఎం రేవంత్ రెడ్డి గారి సహకారంతో జుక్కల్ నియోజకవర్గంలో త్వరలనే మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభిస్తాం..
హృదయపూర్వకంగా ఘన స్వాగతం పలికిన జుక్కల్ ప్రజలందరికీ నా ధన్యవాదాలు..
ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత రావు,ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే సంజీవ రెడ్డి గారు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు,అధికారులు, నాయకులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.