#✍️కోట్స్ #💗నా మనస్సు లోని మాట #✍ఎమోషనల్ కోట్స్ #📝బెస్ట్ కోట్స్👌 #😊పాజిటివ్ కోట్స్🤗
ఓం నమో నారాయణాయ!!
ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా!!
ఆపద మొక్కల వాడా అనాథ రక్షక గోవిందా గోవిందా!!
🙏🙏🙏
వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం ఎందులోనో మీకు తెలుసా....?
ఇది వరకు తిరుమలలో “తొండమాన్ చక్రవర్తి” స్వామి వారికి రోజూ బంగారు తులసి దళాలు సమర్పించేవాడట. అప్పట్లో స్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా.
ఈ తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామి వారి దగ్గరికి వెళ్లి చెబుతూ ఉండేవాడుట – "స్వామి నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నాను. పైగా, నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి?'' అన్నాడుట.
స్వామి తొండమానుడుకి ఒక పాఠం చెప్పాలని, నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గ లోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు. వాడిని వెళ్లి చూడు అన్నారుట స్వామి.
మరుసటి రోజు వెళదాం అని అనుకుని, స్వామి వారి పాదాల క్రింద ఉన్న తులసి దళాలని శుభ్రం చేస్తున్నాడుట. అప్పుడు, తను చేయించిన బంగారు తులసి దళాల క్రింద, మట్టి తులసిదళాలు కనిపించాయుట.
స్వామి వారు చెప్పారుట ఈ మట్టి దళాలు, ఆ భీముడే సమర్పించాడు నాకు అని. అప్పుడు మనసులో అనుకున్నాడుట, మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా, అతడు ఎవరో కాని వెంటనే వెళ్లి కలవాలని బయలుదేరాడుట.
ఆ రోజు చాలా ఎండగా ఉంది, అప్పటికే నడిచి నడిచి, భీముడి ఇంటి దగ్గరలో స్పృహ తప్పి పడిపోయాడుట. అప్పుడు ఆ భీముడే, తొండమాన్ చక్రవర్తిని లేవదీసి తన ఇంటికి తీసుకువెళ్ళాడుట.
తొండమాన్ చక్రవర్తి అడిగాడుట......, " నువ్వు ఏమి చేస్తూ ఉంటావు? వేంకటేశ్వర స్వామి వారికి నువ్వంటే చాల ఇష్టం'' అని.
, నేనేం చేస్తాను స్వామి
కుండ చేసేముందు స్వామీ నన్ను అనుగ్రహించావు.
కుండలు చేసుకునే శక్తి ని ఇచ్చావు.
అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేసావు
వాటి వల్ల నా సంసారం సాగుతోంది.
నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పించేవాడుట.
ఏ పని మొదలుపెట్టినా “గోవింద” నేను చేయడమేమిటి? నీవే నాతో చేయించు కుంటున్నావు స్వామి'' అనేవాడుట?
అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నారుట,
ఇతడేమో – అంతా స్వామి వారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు,
నేనేమో – నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను.
ఇదే మనమందరము చేసే పెద్ద తప్పిదం.
భీముడు అన్నం తినే ముందు మట్టితో చిన్న మూకుడు చేసి, అందులో అన్నం ముద్ద పెట్టి, స్వామి వారికి సమర్పించి తను తినేవాడుట.
స్వామి వారు భీముడి భక్తికి పొంగిపోయి శ్రీదేవి, భూదేవి సహితుడై, దివ్య విమానంలోంచి దిగి, భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యారుట. వెంటనే స్వామి వారు భీముడిని కౌగలించుకుని, భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి, తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్ని భీముడి మెడలో వేసారట.
అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, వారి ఆభరణాలన్ని భీముడి భార్యకి తొడిగారుట. స్వామి వారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని సశరీరంగా, వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆదేశించారు.
ఇప్పటికీ స్వామివారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగు అన్నం. ప్రతి రోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు. అదొక్కటే తింటారు స్వామి వారు.
సారాంశం:
ఎక్కడ భక్తి ఉందో అక్కడ వశుడై పోతాడు స్వామి.
ఎక్కడ గర్వం/అహంకారం ఉన్నాయో అక్కడ ఆయన ఉండరు.
సేకరణ
#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻శనివారం భక్తి స్పెషల్
#✍ఎమోషనల్ కోట్స్ #💗నా మనస్సు లోని మాట #📝బెస్ట్ కోట్స్👌 #✍️కోట్స్ #😴శుభరాత్రి
#ujjani mahakali mata ki jai #జై శ్రీ మాతా సంతోషి #Jai sathosi mata ##kalimatha 🙏🏻🙏🏻#కాళీ మా 🙏🏻🙏🏻 #🎶భక్తి పాటలు🔱*💧శ్రీ దీపలక్ష్మీస్తోత్రమ్* 💧
🪔🪔🪔🪔🪔🪔🪔
🕉️దీపస్త్వమేవ జగతాం దయితా* *రుచిస్తే, దీర్ఘం తమః ప్రతినివృత్యమితం* *యువాభ్యామ్ స్తవ్యం* *స్తవప్రియమతః శరణోక్తివశ్యం* *స్తోతుం* *భవన్తమభిలష్యతి జన్తురేషః*
*దీపః పాపహరో నౄణాం దీప* *ఆపన్నివారకః*
*దీపో విధత్తే సుకృతిం* *దీపస్సమ్పత్ప్రదాయకః*
*దేవానాం తుష్టిదో దీపః* *పితౄణాం ప్రీతిదాయకః* *దీపజ్యోతిః పరమ్బ్రహ్మ* *దీపజ్యోతిర్జనార్దనః*
*దీపో హరతు మే పాపం* *సన్ధ్యాదీప నమోఽస్తు తే*
*శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద*
*మమ బుద్ధి ప్రకాశంచ దీప జ్యోతిర్ నమోస్తుతే*
*ఫలశ్రుతిః యా స్త్రీ పతివ్రతా* *లోకే గృహే దీపం తు పూరయేత్*
*దీపప్రదక్షిణం కుర్యాత్ సా భవేద్వై సుమఙ్గలా*
*ఇతి శ్రీదీపలక్ష్మీస్తోత్రం సమ్పూర్ణమ్*
🪔🪔🪔🪔🪔🪔🪔
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
#🎶భక్తి పాటలు🔱 ##kalimatha 🙏🏻🙏🏻#కాళీ మా 🙏🏻🙏🏻 #ujjani mahakali mata ki jai #జై శ్రీ మాతా సంతోషి #Jai sathosi mata
🙏జై గురుదేవ దత్త🙏 #గురుదత్తాత్రేయ మంత్రాలు
1.సర్వ బాధ నివారణ మంత్రం.
"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో ||
సర్వ భాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే||"
2. సర్వరోగ నివారణ దత్త మంత్రం.
"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో||
సర్వ రోగ ప్రశమనం కురు శాంతిమ ప్రయచ్ఛమే||"
3. సర్వ కష్ట నివారణ దత్త మంత్రం.
"అనసూయాత్రి సమభూతో దత్తాత్రేయో దిగంబర: స్మర్తృగామీ స్వభక్తానాం ఉధ్ధర్తా భవ సంకటాత్||
4.దరిద్ర నివారణ దత్త మంత్రం.
"దరిద్ర విప్రగ్రేహే య: శాకం భుక్త్వోత్తమ శ్రియమ||
దదౌ శ్రీ దత్త దేవ: సదా దారిద్ర్యాత్ శ్రీ ప్రదోవతు||"
5.సంతాన భాగ్యం కోసం దత్త మంత్రం.
"దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతం||
యో భూదభీష్టదః పాతు సనః సంతాన వృద్ధికృత్||"
6. సౌభాగ్యం కోసం దత్త మంత్రం.
"జీవయామాస భర్తారం మృతం సత్యాహి మృత్యుహా||
మృత్యుంజయః స యోగీంద్రః సౌభాగ్యం మే ప్రయచ్ఛతు||"
7. అప్పులు తీరుటకు, అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి రావడం కోసం దత్త మంత్రం.
"అత్రేరాత్మ ప్రదానేన యోముక్తో భగవాన్ ఋణాత్||దత్తాత్రేయం తమీశానం నమామి ఋణముక్తయే||"
8. సర్వ పాప నివారణ దత్త మంత్రం.
అత్రిపుత్రో మహాతేజా దత్తాత్రేయో మహామునిః||తస్య స్మరణ మాత్రేన సర్వ పాపైః ప్రముచ్యతే||
9.దత్తాత్రేయ అనుగ్రహ మంత్రం.
అనసూయాసుత శ్రీశ జనపాతక నాశన||
దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ||
10. ఉన్నత విద్య కోసం దత్త మంత్రం.
విద్వత్సుత మవిద్యం య అగతం లోక నిందితం|| భిన్న జిహ్వం బుధం చక్రే శ్రీ దత్తః శరణం మమ||
11. పోగొట్టుకున్న వస్తువులు, దొంగలించ బడ్డ ధనము లేక వస్తువుల తిరిగి పొందుటకు..
కార్త వీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్|| తస్య స్మరణ మాత్రేన హృతం నష్టంచ లభ్యతే||
విధానం
ఈ మంత్రాలలో మీ సమస్యకు తగట్టు ఏది అవసరమో ఆ మంత్రాన్ని రోజు 108 సార్లు లేక సమస్య తీవ్రత బట్టి 1008సార్లు గాని రోజూ ఉదయం జపం చేయాలి.. ఇలా 41 దినములు చేయాలి ..
జై గురుదత్త
#సర్వేజనా సుఖినోభావంత్
సేకరణ.... #🎶భక్తి పాటలు🔱
🕉️జయ విఘ్నేశ్వర నమో నమో!
🕉️జగద్రక్షకా నమో నమో !
🕉️జయకర శుభకర సర్వపరాత్పర!
🕉️జగదుద్ధారా నమో నమో !
🕉️జయ విఘ్నేశ్వర నమో నమో
🕉️జగద్రక్షకా నమో నమో !!
🕉️మూషికవాహన నమో నమో!
🕉️మునిజనవందిత నమో నమో !
🕉️మాయారాక్షసమదాపహరణా !
🕉️మన్మథారిసుత నమో నమో !
🕉️జయ విఘ్నేశ్వర నమో నమో
🕉️జగద్రక్షకా నమో నమో !!
🕉️విద్యాదాయక నమోనమో !
🕉️విఘ్నవిదారక నమో నమో !
🕉️విశ్వసృష్టిలయకారణ శంభో!
🕉️విమలచరిత్రా నమో నమో !
🕉️జయ విఘ్నేశ్వర నమో నమో !
🕉️జగద్రక్షకా నమో నమో !!
🕉️గౌరీప్రియసుత నమోనమో !
🕉️గంగానందన నమోనమో !
🕉️గంధర్వాద్భుత గానవినోదా
🕉️గణపతిదేవా నమోనమో !
🕉️జయ విగ్నేశ్వర నమో నమో
🕉️జగద్రక్షకా నమోనమో!!
🕉️నిత్యానందా నమోనమో!
🕉️నిజఫలదాయక నమోనమో !
🕉️నిర్మలపురవర నిత్యమహొత్సవ
🕉️రామానాథనుత నమోనమో!
🕉️జయ విఘ్నేశ్వర నమోనమో!
🕉️జగద్రక్షకా నమోనమో !!🙏🙏 #🎶భక్తి పాటలు🔱 #🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం #❤️హ్యాపీ న్యూ ఇయర్🎉 #🥳హాయ్ 2026 🙌
#😢Sad Feelings💔 #✍️కోట్స్ #✍ఎమోషనల్ కోట్స్ #💗నా మనస్సు లోని మాట #✍ జీవితం మీద కోట్స్👌








