🪷89శ్రీ లింగ మహాపురాణం🪷
🍀దేవతలు చేసే వివిధ శివలింగాల అర్చన🍀
#ఎనభై తొమ్మిదవ భాగం#
విశ్వకర్మ బ్రహ్మదేవునిఆదేశాన్ని అనుసరించిదేవతలుపూజించుటకైవివిధశివలింగాలుతయారు చేసి ఇచ్చాడు. ఇంద్రనీలముతో చేసినశివలింగంవిష్ణువుతీసుకునినిత్యంపూజించాడు.ఇంద్రుడు పద్మరాగపు శివలింగం తీసుకునిపూజించాడు.విశ్వవసుని పుత్రుడు స్వర్ణలింగం పూజించాడు. అష్ట వసువులు అయస్కాంతలింగాన్నిపూజించారు. విశ్వదేవులు రజత లింగం తీసుకుని పూజించారు. వాయుదేవుడు ఇత్తడి లింగం, అశ్వనీ దేవతలు పార్థివ (మట్టి) లింగం తీసుకుని లింగార్చన చేసారు.వరుణదేవుడు స్ఫటిక లింగాన్ని పూజించాడు.ద్వాదశ ఆదిత్యులు తామ్రలింగానికి పూజ చేసారు. చంద్రుడు ముత్యపు లింగానికి లింగార్చన చేశాడు గుహ్యకులు త్రిధాతు లింగాన్ని, గణములుసర్వధాతు లింగాన్ని,చాముండాదిమాతృకలు బిల్వవృక్షపు లింగాన్ని పూజించారు.యమధర్మరాజు మరకత లింగాన్నిపూజించాడు. రుద్రులుభస్మలింగాన్నిపూజించారు. లక్ష్మీదేవి బిల్వవృక్షపు లింగాన్ని పూజించింది. అనంతుడుమొదలైనమహాసర్ప రాజములు పగడ నిర్మిత లింగాన్నిపూజించారు.దైత్యులు అసురులు రాక్షసులు లోహ (ఇనుప) లింగాన్నిపూజించారు.
సరస్వతీదేవి రత్న లింగార్చన చేసింది. దుర్గాదేవి తదితరులు వేదికతో ఉన్న స్వర్ణలింగాన్ని పూజించారు. వామదేవాదులు పుష్పాలతో చేసిన లింగాన్ని పూజించారు. మన్మధుడు సుగంధ నిర్మిత లింగార్చన చేసాడు. సర్వ మంత్రములు యజ్ఞంలో ఆజ్యముతో నిర్మితమైన భవ్యలింగాన్ని పూజించారు. వేదములు దధి లింగమును పూజించాయి. పిశాచ భూతాదులు సీస నిర్మిత లింగాన్ని పూజించారు.
శివలింగ నిత్య పూజలు చేయడం వలనే ఈ చరాచర జగత్తు నిలచి ఉంది అని అనడంలో సందేహం లేదు. లింగ నిర్మాణానికిఉపయోగించే ద్రవ్యాలనుబట్టిఆరువిధములుగా, నలభై ఉప విభాగములుగా ఉన్నాయి.మొదటివిశైలాజములు అనగా రాతి చేత నిర్మాణ మైనవి. ఇందులో నాలుగు ఉప విభాగాలున్నాయి.రెండవవి రత్న మణినిర్మిత లింగములు. ఇందులో ఏడు ఉప విభాగాలు ఉన్నాయి. మూడవవి ధాతు నిర్మిత లింగములు. ఇందులో ఎనిమిదిఉపవిభాగాలున్నాయి. నాలుగవవి దారు (చెక్క) నిర్మిత లింగములు. ఇందులో పదహారుఉపవిభాగాలున్నాయిఐదవది మృత్తిక అనగా మట్టి నిర్మిత లింగాలు. ఇందులో రెండు ఉప విభాగాలున్నాయి. ఆరవ విధానికిచెందినలింగము లను క్షణికములు అంటారు. వీటిలో ఏడు ఉపవిభాగాలు ఉన్నాయిశిలాలింగాలు సిద్దిప్రదాలు. ధాతు లింగాలు, రత్నమయ లింగాలు సంపద ప్రదాలు. దారు నిర్మిత లింగాలు భౌతిక సుఖ ప్రదాలు. మట్టి చేత నిర్మితమైన పార్థివ లింగాలు అన్ని కోరికలు తీరుస్తాయి. లింగము యొక్క మూలములో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, పైన అగ్రభాగాన సదా శివుడు ఉంటారు. అందుకే ఊర్ద్వభాగాన్ని ప్రణవం అనగా ఓంకారం అంటారు.
లింగము యొక్క వేదిక త్రిగుణాత్మకమైన మహాదేవి. వేదిక సహిత లింగమును పార్వతీపరమేశ్వరులుగా భావించి పూజించాలి. లింగ పూజ చేసే వ్యక్తి స్తుతి చేస్తున్న ప్పుడు ఆకాశములో దేవతా గణాలు దుందుభి నాదాలతో తోడు నిలుస్తారు లింగార్చన నిత్యం చేసే వ్యక్తి తేజస్సు భూ భువర్లోకసువర్లోకసత్యలోకాలు దాటి కైలాసం చేరుకుంటుంది. అతని ఆత్మ తన శరీరాన్ని లింగముతోఐక్యంచేసుకుంటుంది.రుద్రరూపంపొందగలుగు
తాడు. అటువంటి శివభక్తుని దర్శన స్పర్శనాలచేతసామాన్య మానవులు పునీతులౌతారు.
https://chat.whatsapp.com/DnFG7pWG3BkH6MKxaSFRFb #🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు #🙏ఓం నమః శివాయ🙏ૐ
*తరువాతకధ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట
కరణంగారి సౌజన్యంతో🌹
💜 ఓం శ్రీఉమా
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః
సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
(సర్వం శ్రీశివార్పణమస్తు)
🌷🙏🌷
శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺













