#క్రికెట్ #Asia cup 2025 #🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥 #🏏క్రికెట్ 🏏 #🇮🇳టీమ్ ఇండియా😍
#🙏హ్యాపీ నవరాత్రి🌸 #🎉నవరాత్రి స్టేటస్🎊 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🙏🏻అమ్మ భవాని #🔱దుర్గ దేవి🙏
#🔱దుర్గ దేవి🙏 #🙏🏻అమ్మ భవాని #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🎉నవరాత్రి స్టేటస్🎊 #🙏హ్యాపీ నవరాత్రి🌸
#దసరా #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🙏🏻అమ్మ భవాని #📿నవరాత్రి పూజ విధానం🪔 #🔱దుర్గ దేవి🙏
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
తూర్పుగోదావరి జిల్లా, నార్త్ జోన్ పరిధిలో స్థానిక పోలీసులు క్రికెట్ బెట్టింగ్ ముఠాను గుట్టు రట్టు చేసి, 4 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ కోరుకొండ పోలీస్ స్టేషన్లో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. తమకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు, కోరుకొండ మండలం, కాపవరం గ్రామంలో ఓ ఇంట్లో నిర్వహించిన దాడుల్లో బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. వీరి వద్దనుండి 8,40,000 నగదు, 8 చరవాణిలు, క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు ఉపయోగించే టీవీ, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. బెట్టింగ్ కి పాల్పడుతున్న ప్రధాన నిందితుడుగా గుర్తించిన విశాఖపట్నం కి చెందిన రాకేష్ పరారీలో ఉన్నాడని, త్వరలో ప్రధాన నిందితుడు రాకేష్ ను పట్టుకుంటామని తెలిపారు. బెట్టింగ్ కు పాల్పడిన
గోసంశెట్టి వీరప్రసాద్, జాజుల బాలచక్రం, నల్లల లక్ష్మీ నరసయ్య, కొడతాల నానాజీలను రిమాండ్ కు తరలించనున్నట్లు డిఎస్పి తెలిపారు. బెట్టింగ్ రాయుళ్లను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన స్థానిక కోరుకొండ, సీతానగరం పోలీస్ సిబ్బందికి రివార్డు అందజేశారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో యువత చెడు మార్గాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, ఆన్లైన్ బెట్టింగ్ ల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని, అటువంటి ఆన్లైన్ బెట్టింగ్ లు, జూద క్రీడలకు మధ్యతరగతి ప్రజల దూరంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్‌డేట్స్ #👉నేరాలు - ఘోరాలు🚨 #🗞ప్రభుత్వ సమాచారం📻
రాజమండ్రిలో సందడి చేసిన సుందరకాండ మూవీ టీమ్ #రాజమండ్రి #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🎬మూవీ ముచ్చట్లు #👩టాలీవుడ్ భామలు #🎬టాలీవుడ్ అప్‌డేట్స్
జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి ఇతర అధికారులతో కలిసి మంగళవారం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద పర్యటించి, నీటి ప్రవాహం నీ క్షేత్ర స్థాయిలో పరిశీలన చెయ్యడం జరిగింది.
#rajahmundry #మన తూర్పుగోదావరి జిల్లా #తూర్పుగోదావరి జిల్లా #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్‌డేట్స్
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. నల్గొండ గ్రామ శివారులో దాదాపు 2.57 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 13,000 ఉంటుందని పోలీసులు తెలిపారు.
జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, నార్త్ జోన్ డిఎస్పీ వై. శ్రీకాంత్, సీఐ వై. సత్య కిషోర్ పర్యవేక్షణలో సీతానగరం ఎస్సై డి. రామ్ కుమార్ బృందం ఈ ఆపరేషన్ చేపట్టింది. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందనే పక్కా సమాచారంతో, జూలై 30న ఉదయం నల్గొండ గ్రామ శివారులోని మామిడి తోట వద్ద ఐదుగురు వ్యక్తులను గుర్తించారు. వారి వద్ద నుండి 5 ప్యాకెట్లలో గంజాయి, ఒక మోటార్ సైకిల్, రూ. 1500 నగదును స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను చింతల గంగరాజు (29), బండారు అప్పన్న దొర (50), తాటిపాక గణేష్ (20), నేరుమల్లి అఖిల్ (21), పోలిన సాయి సతీష్ (19) లుగా గుర్తించారు. వీరు ఒడిస్సా ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయిని కొనుగోలు చేసి, ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై తూర్పుగోదావరి జిల్లా నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్ నేడు సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
#తూర్పుగోదావరి #రాజమండ్రి #📰ఈరోజు అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱
రాజమండ్రి, జులై 30: తూర్పుగోదావరి జిల్లా లాలాచెరువులోని సత్యసాయి మంచినీటి సరఫరా కార్మికులు తమ 23వ రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. గత 19 నెలలుగా వేతనాలు లేకపోవడం, 25 నెలలుగా ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు అందకపోవడంతో కార్మికులు ఆకలి కేకలతో సమ్మెబాట పట్టారు.
ఈ సందర్భంగా సీఐటీయూ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి బి.వి.ఎన్. పూర్ణిమ రాజు మాట్లాడుతూ, కార్మికుల సమస్యలను అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, తమ ఆకలి బాధలు ఎందుకు కనిపించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుపరిపాలన అని చెప్పుకునే నాయకులకు తమ కష్టాలు అర్థం కావడం లేదా అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మికుల సమ్మె కారణంగా గోదావరి మంచినీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు నియోజకవర్గాల్లోని ఐదు మండలాల్లో సుమారు 85 గ్రామాలకు, ముఖ్యంగా గిరిజన మెట్ట ప్రాంతాల్లోని మూడు లక్షల మంది ప్రజలకు గత 23 రోజులుగా గోదావరి జలాలు అందక ఇబ్బందులు పడుతున్నారు.
పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి తమ వేతనాలు, సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు పీ. శ్రీను, కార్యదర్శి ఇసాక్, కోశాధికారి కే. రామకృష్ణతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.
#తూర్పుగోదావరి #East Godavari #rajahmundry #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్‌డేట్స్
జిల్లా పోలీసు, ది రాజమండ్రి కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మరియు ఈగల్ టీం ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై నిర్వహించిన అవగాహన ర్యాలీ మరియు సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్.
ర్యాలీని పచ్చ జెండా ఊపి ప్రారంభించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ.
యాంటిబయాటిక్స్, నార్కోటిక్స్ డ్రగ్స్ వినియోగంపై జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రజలకు మరియు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.
జిల్లాలో రెండు డ్రగ్ డిఅడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి,ఇప్పటికే వాటికి అలవాటు పడినవారికి ఈ కేంద్రాల ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నాం.
గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్న లేదా సేవిస్తున్న వారి వివరములు పోలీసు వారు తెలియజేయాలి.
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్.
#తూర్పుగోదావరి #📽ట్రెండింగ్ వీడియోస్📱 #rajahmundry #📰ఈరోజు అప్‌డేట్స్