Failed to fetch language order
శ్రీ కాళహస్తి విశేషాలు
526 Posts • 169K views
sivamadhu
799 views 15 days ago
#🙏ఓం నమః శివాయ🙏ૐ #శ్రీ కాళహస్తి విశేషాలు #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #ఓం శ్రీ మాత్రే నమః #🕉️హర హర మహాదేవ 🔱 కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శ్శివః కరోతు నిత్య కళ్యాణ కరుణా వరుణలయం దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు (04.10.2025) ఆశ్వీయుజ శుద్ధ త్రయోదశి ప్రదోషం సందర్భంగా సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్ల ప్రదోష నంది సేవ వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా వెండి ప్రదోష నంది వాహనంపై విశేష అలంకరణలో శ్రీ ఉమామహేశ్వర స్వామి అమ్మవార్ల మొదటి ప్రాకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి సన్నిధికి నేరుగా శ్రీ స్వామి అమ్మవార్ల వేంచేపు చేసి ప్రదోష అర్చన, విశేష సమర్పణ, వేద పఠనం, తేవార గానం మరియు పంచ మహా కర్పూర హారతులు వైభవంగా జరిగినవి. సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శ్రీ కాళహస్తీశ్వరా 🙏🪔🚩📿🔱🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ అనిలాచల ప్రాణ శివ 🙏🙏 శివోహం 🙏🙏
12 likes
9 shares
sivamadhu
1K views 16 days ago
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #శ్రీ కాళహస్తి విశేషాలు #🏹దసరా శుభాకాంక్షలు🎉 #🔱దుర్గ దేవి🙏 #ఓం శ్రీ మాత్రే నమః కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శ్శివః కరోతు నిత్య కళ్యాణ కరుణా వరుణలయం ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో కొలువువైన్న శ్రీ దుర్గాదేవి సన్నిధిలో ఆశ్వీయుజ మాసం జరిగిన శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసిన సంధర్భంగా నేడు (03.10.2025) ఉదయం శ్రీ దుర్గాదేవికి పూలంగి సేవ (పూలచీర) వైభవంగా జరిగినది. సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 జై భవాని 🙏🙏
23 likes
16 shares
sivamadhu
699 views 16 days ago
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #శ్రీ కాళహస్తి విశేషాలు #🏹దసరా శుభాకాంక్షలు🎉 #🔱దుర్గ దేవి🙏 #ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంకు అనుబంధ దేవాలయమైన కనకాచలం కొండ మీద వెలిసి ఉన్న శ్రీ కనకదుర్గ దేవి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 11వ రోజు (02.10.2025) దసరా పర్వదినం సందర్భంగా ఉదయం కలశ ఉద్వాసన చేసి శ్రీ కనకదుర్గమ్మ మూలవర్లకు శాంతి అభిషేకంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 జై భవాని 🙏🙏
17 likes
3 shares
sivamadhu
677 views 16 days ago
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🏹దసరా శుభాకాంక్షలు🎉 #👑శ్రీ రాజరాజేశ్వరి దేవి🌹 #శ్రీ కాళహస్తి విశేషాలు #ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంకు సమీపంలో రక్షణ నిమిత్తం వేడాం గ్రామం నందు వెలిసి ఉన్న శ్రీ దక్షిణకాళిక దేవి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 11వ రోజు (02.10.2025) దసరా పర్వదినం సందర్భంగా ఉదయం శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ దక్షిణకాళిక దేవి. విజయదశమి సందర్భంగా శ్రీ అమ్మవారి కుంభాభిషేకంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం స్వర్ణ కవచంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ దక్షిణకాళిక దేవి. సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర ఎడిట్స్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 జై భవాని 🙏🙏
13 likes
5 shares