ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్😀

ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్😀

#

ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్😀

క‌నుమ‌రుగ‌వుతున్న కిచ‌కిచ‌లు..! ఇక‌నైనా పిచ్చుక‌ల‌ను తిరిగి తెచ్చుకుందాం...!! March 20 2019🐦🐦🐦 హైద‌రాబాద్ : ఒకప్పుడు ఊర పిచ్చుకలు లేని ఊరులేదంటే అతిశయోక్తి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఏ వాడ చూసినా, ఏ ఇల్లు చూసినా గుంపులు గుంపులుగా ఊరపిచ్చుకలు దర్శనమిచ్చేవి. పిచ్చుకలు, మానవులు ఒకే కుటుంబసభ్యులుగా సహజీవనం చేసేవారు. మిగతా పక్షులకు భిన్నంగా ఊరపిచ్చుకల జీవితాలు మానవ జీవితాలతో పెనవేసుకున్నాయి. ఆహారం కోసం, నివాసం కోసం, గూడు కోసం పూర్తిగా మానవులపై ఆధారపడతాయి అవి. మనుషులతో సన్నిహితంగా మెలుగుతాయి. చిన్న చిన్న పురుగులు, ధాన్యం గింజలు తిని జీవిస్తాయి ఊరపిచ్చుకలు. ప్ర‌పంచ పిచ్చుకల దినోత్స‌వం సంద‌ర్బంగా వ‌న్ ఇండియా ప్ర‌త్యేక క‌థ‌నం..! వేకువ‌జాము కిచ‌కిచ‌ల చ‌ప్పుడు..! మ‌న‌సుకు ఎంతొ ఆహ్లాదం..!! పొద్దున్నే పక్షుల కిలకిలలు వింటే ఎంత హాయిగా ఉంటుందో..! గాల్లో ఎగురుతూ గమ్మత్తయిన విన్యాసాలు చేస్తుంటే ఎంత ముద్దొస్తుంటుంది..! పిచ్చుకలు రక్షణ కోసం గడ్డితో నిర్మించుకున్న అందమైన గూడును చూస్తే ఆశ్చర్యమేయ‌క మాన‌దు. ఆనందానికి.. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే ఆ పిచ్చుకలు ఎక్కడున్నాయిప్పుడు? పర్యావరణ కాలుష్యం పిచ్చుకల ప్రాణాలు తీస్తున్నది! వాతావరణ మార్పులు వాటి ఉనికికి ప్రమాదకరంగా మారుతున్నాయి! నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. పిచ్చుకల్ని ప్రేమిద్దాం.. ఈ రోజు నుంచే ప్రారంభిద్దాం! ఒకప్పుడు మన ఇంటి ముంగిట్లో పిచ్చుకల కిలకలారావాలు వినిపించేవి. ఇప్పుడు పిచ్చులన్నవే మాయమైపోతున్నాయి. మానవుడు కనిపెట్టిన సాంకేతిక పరిజ్ఞానం పిచ్చుకల మనుగడకు శాపంగా పరిణమించింది. సెల్ తరంగాల రేడియేషన్, కాలుష్యం కారణంగా ఇవి మన ముంగిట నుంచి కనుమరుగవుతున్నాయి. పీచుతో గూడు కట్టుకోవడం, నోటితో ఆహారాన్ని తెచ్చి పిల్లలకు అందివ్వడం, వాటిని జాగ్రతగా కాపాడటం లాంటివి చూసేవుంటాం. ఇవి తల్లి ప్రేమకు గుర్తుగా కనిపిస్తాయి. పిచ్చుకల అన్యోన్య జీవన విధానాన్ని గుర్తించిన ప్రపంచ దేశాలు మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. పిచ్చుకల ఘనతను గుర్తించిన భారత ప్రభుత్వం గతంలో తపాలా బిళ్లను విడుదల చేసింది. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్బంగా వివిధ దేశాలు పిచ్చుకల మనుగడకు సంబంధించిన అంశాలపై చర్చించి, అవసరమైన చర్యలు చేపడుతుంటాయి. పిచ్చుకల సంరక్షణను ప్రోత్సహించేందుకు ఎన్ఎఫ్ఎస్ సంస్థ పిచ్చుకల అవార్డులను ప్రకటించింది. ఇదిలావుండగా గతంలో రైతులు జొన్న, సజ్జ తదితర సంప్రదాయ పంటలను సాగు చేస్తుండేవారు. వాటిని తిని పక్షులు జీవించేవి. అయితే ప్రస్తుతం పత్తి తరహా వాణిజ్య పంటలవైపు రైతులు మొగ్గు చూపిస్తుడడంతో పిచ్చుకలకు ఆహారం కరువైంది. అయితే కృతిమ రీతిలో పిచ్చుక గూళ్లను ఏర్పాటు చేసి, వాటిని సంరక్షించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వీలైన చోట‌ పిచ్చుక‌లకు ఆశ్ర‌యం క‌ల్పించాలి..! వీలైన చోట‌ పిచ్చుక‌లకు ఆశ్ర‌యం క‌ల్పించాలి..! కిచ‌కిచ‌ల‌ను తిరిగి తెచ్చుకోవాలి..!! ప్రపంచ ఊర పిచ్చుకల రోజును పురస్కరించుకొని, పక్షి ప్రేమికులు, పర్యావరణ అభిమానులు అందరూ ఊరపిచ్చుకల పరిరక్షణకు నడుంకట్టాలి. పక్షి గూళ్లను కర్రతో చేసిన డబ్బాలాంటి గూళ్లను బాల్కనీలో వేలాడదీయాలి. కొద్ది రోజుల తర్వాత అవి మెల్లగా వాటిని గూడుగా మార్చుకుంటాయి. ఎండకాలంలో నీరు, ధాన్యం గింజలను సమకూర్చితే చాలు. పిచ్చుకల సందడి మళ్లీ మొదలవుతుంది. ప్రయత్నిద్దాం. తిరగి ఊర పిచ్చుకలతో స్నేహం చేద్దాం...! అంత‌రించిపోతున్న కిచ‌కిచ‌ల‌ను మ‌ళ్లీ విందాం..!
249 వీక్షించారు
7 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post