రెండు కళ్ల సిద్ధాంతం.. 👀
18 Posts • 3K views
P.Venkateswara Rao
587 views 27 days ago
#ఏపీ అప్ డేట్స్..📖 #రెండు కళ్ల సిద్ధాంతం.. 👀 *స్టిక్కర్ వేసెయ్.. సొంత డప్పు కొట్టేయ్..‼️* OCTOBER 25, 2025🤔 చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే తన మార్కు చూపించాలనుకుంది. పథకాలు వెంటనే అమలు చేసి, ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఆటోమేటిగ్గా కూటమి మార్కు కనిపించేది. కానీ చంద్రబాబు అలా అనుకోలేదు. ఆయన మరో విధంగా తన మార్కు చూపించే పనిలో బిజీగా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 108 వాహనాలకు స్టిక్కర్లు మార్చే కార్యక్రమం షురూ చేశారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వాహనాల స్టిక్కర్లు మార్చారు. జగన్ హయాంలో వచ్చిన కొత్త వాహనాలన్నింటిపై తను పెట్టి పేర్లు పెట్టుకున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాగైతే రంగులు మార్చే పని పెట్టుకున్నారో, అదే విధంగా చంద్రబాబు కూడా వ్యవహరించారు. కాకపోతే అంబులెన్సులపై స్టిక్కర్లు మార్చడంతో పాటు వాటి మరమ్మతు కార్యక్రమాలు కూడా చేసుంటే బాగుండేది. చాలా ప్రాంతాల్లో అంబులెన్సులు పడుకున్నాయి. ఇక గూగుల్ డేట్ సెంటర్ పై నడుస్తున్న ప్రహసనం గురించి అందరికీ తెలిసిందే. అది తమ ఘనతే అని చంద్రబాబు, లోకేష్ చెప్పుకుంటున్నారు. ఏకంగా 22వేల కోట్ల రూపాయల రాయితీలిచ్చి మరీ డేట్ సెంటర్ ను వైజాగ్ లో ఏర్పాటుచేసే విధంగా కృషి చేశామని, తద్వారా వేల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. వేల ఉద్యోగాలపై ఇప్పటికే విపరీత చర్చ జరుగుతోంది. ఆ సంగతి పక్కనపెడితే, గూగుల్ డేటా సెంటర్ ఆలోచన తమదేనని, తన ప్రభుత్వ హయాంలోనే దానికి బీజం పడిందంటూ జగన్ సాక్ష్యాలతో పాటు బయటకొచ్చారు. చంద్రబాబు క్రెడిట్ చోరీలో పీక్, పెర్ఫార్మెన్స్ లో వీక్ అంటూ ఎద్దేవా చేశారు. ఓవైపు ఇదిలా నడుస్తుండగానే, ఇప్పుడు కాకినాడ సెజ్ భూముల వ్యవహారం బయటకొచ్చింది. ఇదైతే మరీ దారుణం. కాకినాడ సెజ్ పేరిట గతంలో వైఎస్ఆర్ హయాంలోనే కార్యక్రమం మొదలైంది. ఆయన మరణించిన తర్వాత భూసేకరణ భారీగా జరిగింది. కొడుకు జగన్ కోసమే వైఎస్ఆర్ ఆ భూముల్ని సేకరిస్తున్నారంటూ చంద్రబాబు 2014లో ప్రచారం చేసుకున్నారు. రైతులకు తిరిగి ఆ భూముల్ని ఇచ్చేస్తామంటూ ఏకంగా దుక్కి కూడా దున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకుముందు ప్రభుత్వం కంటే జోరుగా భూసేకరణ చేశారు. నష్టపరిహారం పెంచి మరీ రైతుల నుంచి భూములు లాక్కున్నారు. దీంతో రైతులు లబోదిబోమన్నారు. సరిగ్గా అప్పుడే ఈ అంశంపై జగన్ ఫోకస్ పెట్టారు. తన ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతుల భూములు వెనక్కు ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు. ఈసారి కూడా రైతులు నమ్మి ఓటు వేశారు. జగన్ మాత్రం చంద్రబాబులా చేయలేదు. రైతులకు వాళ్ల భూముల్ని వెనక్కు ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టారు. పైగా రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేకుండా సెజ్ నుంచి రైతులకు ఉచిత రిజిస్ట్రేషన్ జరిగేలా జీవో జారీచేశారు. అలా జగన్ హయంలో దాదాపు వెయ్యి ఎకరాలు తిరిగి రైతుల చేతిలోకి వచ్చాయి. మిగతా భూమి కూడా బదలాయింపు జరిగే క్రమంలో జగన్ ఓడిపోయారు, తిరిగి చంద్రబాబు వచ్చారు. ఈసారి ఆయన ఏం చేశారనే, రైతులకు ఉచిత రిజిస్ట్రేషన్ కోసం గత ప్రభుత్వం ఇచ్చిన జీవోనే కొనసాగించాలంటూ మెమో ద్వారా ఆదేశాలు జారీచేశారు. ఇంతమాత్రానికే తెలుగుదేశం తమ్ముళ్లు డప్పులు బయటకుతీశారు. రైతులకు చంద్రబాబు ఉచితంగా భూములిచ్చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేదంటూ హంగామా చేశారు. ఏకంగా పాలాభిషేకాలు చేశారు. ఈ మెమో ఇవ్వడం వెనక కాస్తోకూస్తో పవన్ కల్యాణ్ చొరవ కూడా ఉంది కాబట్టి, అతడికి కూడా పాలాభిషేకాలు చేశారు. నిజానికి రైతులకు భూములు వెనక్కుఇచ్చేలా చేసింది జగన్. ఉచిత రిజిస్ట్రేషన్ కోసం జీవో జారీచేసింది జగన్. దాన్ని కొనసాగిస్తూ, క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది చంద్రబాబు సర్కారు.
9 likes
16 shares