కార్తీక మాసం
నాగరకత ఎంత పెచ్చు పెరిగినా ఇంకా దేవాలయాలలో ,దీపారాధన సంప్రదాయబద్ధంగానే చేస్తున్నారు. అటూ ఇటూ ప్రమిదలోకుందులో వెలుగుతుంటే , వాటిమధ్యన మన ఇష్టదైవం కనిపిస్తూ వుంటే నమ్మిన వారికి నయనానందకరంగా వుంటుంది. మన రోజు వారి మాటల్లో కూడా దీపం ప్రసక్తి చాలా సార్లు వస్తుంది. ఎవరైనా చెడ్డ వాడి గురించి చెప్పాల్సి వస్తే " అమ్మో వాడా ఎన్ని కొంపల్లో దీపాలు ఆర్పేశాడో " అంటుంటారు. ఇంట్లో దీపం మలిగితే , చాలా జాగ్రత్తగా " దీపం కొండెక్కింది" అంటారు. " ఆరిపోయింది" అనేది అశుభ సంకేతం. పిల్లల్ని కులదీపాలు, మా ఇంటి దీపం, మా కంటి దివ్వె .. ఇలా అంటుంటారు. ఇలా దీపం కబుర్లు ఎన్నెన్నో చెప్పుకోవచ్చు.. ఈ గ్రూపులోని సభ్యులకు .. వారి కంటి దివ్వెల్లాంటి వారి బిడ్డలకు ఈ దివ్య దీపకాంతులు మంగళప్రదం కావాలని కాంక్షిస్తూ సెలవు!! వచ్చే ఆదివారం సహృదయ మిత్ర మౌళి శ్రీ తోట వేంకటేశ్వర్లు గారి ఆధ్వర్యవం లో కపిలతీర్థం సమీపంలోని దివ్యారామంలో సాహితీ మిత్రులకు వనభోజన కార్యక్రమం వుంటుంది.. ఆసక్తి వున్నవారు, వెసులుబాటు వున్న వారు తప్పక రండి.. మరిన్ని వివరాలకు నన్నో, తోట వేంకటేశ్వర్లు గారినో,మల్లేశ్వర రావు గారినే సంప్రదించగలరని మనవి!!
#

కార్తీక మాసం

కార్తీక మాసం - ShareChat
1.2k వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post