om sri gurubhyo namaha
44 Posts • 44K views
హయగ్రీవుడు..........!! హయగ్రీవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఒకసారి మధుకైటభులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించారట. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి, ఆ మధుకైటభులను వధించి... వేదాలను రక్షించాడు. వేదాలు జ్ఞానానికీ, వివేకానికీ చిహ్నాలు. ఆ వేదాలనే రక్షించాడు కాబట్టి హయగ్రీవుడుని జ్ఞాన ప్రదాతగా భావిస్తారు. హయగ్రీవుడు అంటే గుర్రపు తల ఉన్నవాడు అని అర్థం. ఆయనకు ఆ ఆకారం ఉండటానికి వెనుక కూడా ఓ గాథ వినిపిస్తుంది. పూర్వం గుర్రపుతల ఉన్న ఓ రాక్షసుడు ఉండేవాడు. తనలాగే గుర్రపు తల ఉన్న వ్యక్తి చేతిలోనే, తనకు మరణం ఉండాలన్న వరం ఆ రాక్షసునికి ఉంది. దాంతో అతన్ని సంహరించేందుకు విష్ణుమూర్తి, హయగ్రీవ అవతారాన్ని ఎత్తినట్లు చెబుతారు. అంటే హయగ్రీవుడు శత్రునాశకుడు కూడా అన్నమాట! ఆ హయగ్రీవుని ఆరాధించడం వల్ల అటు జ్ఞానమూ ఇటు విజయమూ రెండూ లభిస్తాయన్నది పెద్దల మాట. హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ ఆయనలో సకల దేవతలూ కొలువై ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. సూర్యచంద్రులు కళ్లుగా, దేవతలు ఎముకలుగా, అష్టవసువులు పాదాలుగా, అగ్ని నాలుకగా, సత్యం వాక్కుగా, బ్రహ్మ హృదయంగా... ఇలా ఆయనలోని అణువణువూ దేవతామయమని అంటారు. మరి అలాంటి హయగ్రీవుని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది కదా! హయగ్రీవుని ఆరాధన ఇంత విశిష్టమైనది కనుకే కొందరు ప్రత్యేకించి హయగ్రీవుని ఉపాసిస్తారు. అత్యంత నిష్టతో కూడుకున్న హయగ్రీవ ఉపాసన అందరికీ సాధ్యం కాదు కాబట్టి... కనీసం హయగ్రీవ జయంతి రోజున అయినా ఆయనను ఆరాధించాలి. హయగ్రీవుడు లేదా విష్ణుమూర్తి ఉన్న పటాన్ని పూజగదిలో ఉంచి హయగ్రీవ స్తోత్రాన్ని కానీ, హయగ్రీవ అష్టోత్తర శతనామావళిని కానీ పఠించాలి. ఏదీ కుదరకపోతే కనీసం- జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్| ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే || అనే మంత్రాన్ని పఠించాలి. హయగ్రీవునికి తెలుపురంగు పూలు, యాలుకలతో చేసిన మాల, గుగ్గిళ్ల నైవేద్యం చాలా ఇష్టమని చెబుతారు. ఇవన్నీ మనకు అందుబాటులో ఉండేవే కాబ్టటి, వాటిని ఆయనకు అర్పించి ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు చెప్పుకొన్నట్లుగా హయగ్రీవుడు జ్ఞానప్రదాత. అందుకనే చాలామంది హయగ్రీవ జయంతిని శుభప్రదంగా భావించి, ఆ రోజున అక్షరాభ్యాసం కూడా చేసుకుంటారు. ఆ రోజు ఆయనను ఆరాధించినవారికి సకల విద్యలూ అబ్బుతాయనీ, అన్ని ఆటంకాలూ తొలగిపోతాయనీ చెబుతారు. ఇక హయగ్రీవుడు లక్ష్మీపతి కాబట్టి, ఆయన ఆరాధన వల్ల సిరిసంపదలకు కూడా లోటు లేకుండా ఉంటుంది. మరెందుకాలస్యం! హయగ్రీవుని ఆరాధించి మీ మనోభీష్టాలన్నింటినీ నెరవేర్చుకోండి. శ్రావణ్యాం శ్రవణ జాత: పూర్వం హయశిరా హరి: జగాద సామవేదంతు సర్వ కల్మష నాశనం స్నాత్వా సంపూజ యేత్‌ తంతు శంకచక్ర గదాధరం!! అని కల్పతరువు అనే గ్రంథంలో చెప్పబడింది. శ్రావణ పూర్ణిమ నాడు శ్రవణా నక్షత్ర యోగమున శ్రీహరి హయగ్రీవ రూపంలో అవతరించారు. హయశిరము గల హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మగూర్చి తపస్సు చేసి తన వంటి ఆకారం ఉన్న వానితోనే తాను మరణించాలని వరం కోరుకున్నాడు. తనవంటి వాడు ఇంకొకడు ఉండడు కావున తనకు మరణం లేదన్న గర్వంతో ఎన్నో దుష్కుృత్యములను ఆచరిస్తూ లోకాలను పీడించాడు. బ్రహ్మ నిద్రిస్తున్న సమయంలో అతని నిశ్వాసముల నుంచి వచ్చిన వేదములను అపహరించుకుని సముద్రంలో దాక్కొనెను. బ్రహ్మ ప్రార్థించగా శ్రీమహా విష్ణువు హయగ్రీవ రూపంతో అవతరించి సముద్రంపైన నిలిచి సామగానం చేసెను. ఆ సామనాద మాధుర్యానికి మైమరిచిన హయగ్రీవ రాక్షసుడు ఆ గానాన్ని దగ్గరనుంచి వినాలని సముద్రంపైకి వచ్చెను. అపుడు హయగ్రీవ స్వామి సముద్రం లోపలికి వెళ్ళి దాచి ఉంచిన వేదాలను తీసుకుని వస్తుండగా రాక్షసుడు ఎదురై పోరు సలిపెను. ఆ విధంగా ఆ యుద్ధంలో రాక్షసుడను సంహరించి వేదాలను బ్రహ్మకు అందించినవాడు హయగ్రీవ స్వామి. హయగ్రీవ స్వామి సకల విద్యాది దేవత. విద్య, జ్ఞానం కావాలన్నా హయగ్రీవ స్వామిని ఆరాధించాలి. సుప్రసిద్ధమైన మహా పండితులు, వేదాంత దేశికులు అనే వారు గరుడ మంత్రాన్ని జపించగా గరుత్మంతుడు ప్రత్యక్షమై వేదాంత దేశికులకు హయగ్రీవ మంత్రమును ఉపదేశించెను. ఆ మంత్రమును జపం చేసి హయగ్రీవ సాక్షాత్కారాన్ని పొంది ఆ స్వామి అనుగ్రహంతో అద్భుతమైన కావ్యములు, స్తోత్రములు రచించి ప్రసిద్ధి పొందారు. ఒకానొక సందర్భంలో వేదాంత దేశికులు రాత్రి 11 నుంచి తెల్లవారు జామున 4 లోపు స్వామివారి పాదుకల పైన ‘పాదుకా సహస్రం’ అని వెయ్యి శ్లోకములను అందించెను. ఇంతటి విజ్ఞాన, కవితా, మేధా వైభవం, వాగ్వైభవం హయగ్రీవ స్వామిని ఆరాధించినచో కలుగును. *జ్ఞానానంద మయం దేవం* *నిర్మల స్ఫటికా కృతం* *ఆధారాం సర్వ విద్యానాం* *హయగ్రీవ ముపాస్మహే!! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 #తెలుసుకుందాం #om sri gurubhyo namaha #లక్ష్మీ హయగ్రీవ స్వామి #హయగ్రీవ స్వామి
11 likes
5 shares
గురువారం పరిహారం.........!! పిల్లలు భవిష్యత్తు అభివృద్ధి కోసం పిల్లల తో గణపతి సరస్వతి పూజ సూర్యనమస్కారం హయగ్రీవ స్తోత్రాలు చేయిస్తుండాలి, అదే పిల్లల భవిషత్తు బాగుండటం కోసం వారు క్రమశిక్షణ తో మంచి అలవాట్లు ఆలోచన విద్య బుద్ది కోసం తల్లిదండ్రులు దక్షిణామూర్తిని ఆరాధించాలి ముఖ్యంగా గురువారం రోజు , గురువారం రోజు శివాలయంలో పసుపు రంగు వస్త్రం పైన బియ్యం పిండి తో రెండు చిన్న ప్రమిధలు పెట్టి నేతి దీపాలు పెట్టి దక్షిణామూర్తి స్త్రోత్రం చేయాలి నానబెట్టిన పచ్చి సేనగలు దండ మూర్తికి వేయాలి 9 ప్రదర్శనలు చేయాలి ఇలా 9 గురువారాలు చేయాలి కాలేజ్ సీట్ కోసం వీసా కోసం ఉద్యోగం కోసం అలాగే పిల్లలు మొండి తనంతో ఇబ్బందులు పడే తల్లిదండ్రులు ఇలా చేస్తే వారిలో మార్పు వస్తుంది పిల్లల కోసం తల్లి ఈ పూజ చేయవచ్చు ఎవరి కోసం చేస్తారో వారి షర్ట్ భుజాన వేసుకుని చేయవచ్చు. అలాగే 9 గురువారాలు కొబ్బరిచిప్పలో దీపారాధన చేయడం నానబెట్టిన సేనగలు ఆవుకి తినిపించడం కుక్కకు చపాతీలు పెట్టడం వల్ల ఉద్యోగం లో ఆటంకాలు తొలగుతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అవకాశం వస్తుంది ప్రమోషన్ ఆటంకాలు తొలగి పోతుంది, రాబోయే గండం తప్పుతుంది పిల్లలు యొక్క మానసిక పరివర్తన లో మార్పువస్తుంది ఇది వ్యాపార సమస్యలు కూడా తీరుతుంది. ఇది చేయడం ఖర్చు లేదు శ్రమ లేదు నమ్మకంతో భక్తితో చేయాలి ఎంతో మందికి గొప్ప ఫలితం ఇచ్చింది. దత్త పారాయణ చేయడం దత్త ప్రదర్శన దత్తాత్రేయ స్తోత్రం పాలు నైవేద్యం పెట్టి చేయడం వల్ల అనేక కుటుంబ సమస్యలు ఆర్ధిక ఇబ్బందులు తొలిగిపోతుంది.. గురువారానికి లక్ష్మీ వారం అని పేరు గురువు అనుగ్రహంవల్ల ఆరాధన వల్ల లక్షి కటాక్షం కలుగుతుంది. గురువారం గో పూజ విశేష ఫలితం ఇస్తుంది. #తెలుసుకుందాం #🔯దోష పరిహారాలు🔯 #om sri gurubhyo namaha
9 likes
13 shares
గురువు..లభించడానికి.........!! పౌర్ణమాస్యాం తథా దర్షే న రాత్రౌ భోజనం చరేత్! ఈ శ్లోక భావం ఏమిటి అంటే.. పౌర్ణిమ,అమావాస్యలలో రాత్రి పూట భోజనం చేయకూడదు. అలాగే జగద్గురువుల సాన్నిధ్యం లభించడానికి పౌర్ణమి రోజున చేసే ధ్యానం అత్యుత్తమమైంది. ఎందుకంటే, "పౌర్ణమి రోజు చంద్రుడు గురు శిష్యుల ముఖ్య ముఖద్వారంగా వుంటాడు" అని వేదాలు ఉద్భోధిస్తున్నాయి. భూలోకంలో జీవించే జీవరాశులకు సూక్ష్మశరీరం లోనూ, మనోమయ శరీరంలోనూ, ఆనందమయ శరీరంలోనూ పౌర్ణమి రోజులలో విశ్వశక్తి అత్యంత అధిక పాళ్ళలో నిబిడీకృతం అవుతుంది. పౌర్ణమి రోజున మనస్సు ధ్యానానికి అనుకూలంగా వుంటుంది. అధిక సంఖ్యలో ధ్యానులు సామూహిక ధ్యానం చేస్తే ఊర్ధ్వలోకాలలోని పరమగురువులు సమాయత్తమయి ధ్యానసాధకులకు దివ్యశక్తినీ, దివ్యజ్ఞానాన్నీ అందిస్తారు. ముఖ్యంగా చెప్పాలి అంటే పౌర్ణమిరోజు ధ్యానం చేయడం వల్ల పూర్ణాత్మతో అనుసంధానం లభిస్తుంది. (ఈ విషయంపై ప్రతీ ధ్యానసాధకుడు దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది). పౌర్ణమి- అమావాస్య రోజులలో ధ్యానం చేయడం వలన"దివ్యశక్తులు" మరియు"దివ్యసూక్తులు" సాధకులు ఊర్థ్వలోకాల గురువుల నుంచి పొందటానికి చక్కటి సదవకాశం లభిస్తుంది. ఈ రెండురోజుల్లో భూలోకంలోని ధ్యానసాధకుల ఊర్ధ్వలోకాలలోని గురువుల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత బలపడతాయి. #తెలుసుకుందాం #om sri gurubhyo namaha
9 likes
15 shares