#📰సెప్టెంబర్ 28th అప్‌డేట్స్📣 మూసీ ప్రాజెక్టు వద్దన్నందుకు రేవంత్ కుట్ర చేశారు:
KTR
TG: మూసీ ప్రాజెక్టును తాము వద్దన్నందుకే ఇవాళ నదీ పరీవాహక ప్రాంతాలు మునిగేలా CM రేవంత్ కుట్ర చేశారని మాజీ మంత్రి KTR ఆరోపించారు. 'భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించినా చెరువులను ఖాళీ చేయలేదు. 15 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసి పేదల ఇళ్లు మునిగేలా చేశారు. ప్రాజెక్టు పేరిట రూ.1,50,000 కోట్లు దోచుకోవాలని చూస్తున్నారు. చరిత్రలో తొలిసారి MGBSలోకి వరద చేరింది' అని తెలంగాణ భవన్లో వ్యాఖ్యానించారు
#📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🏛️రాజకీయాలు