తిరుమల వైభవం
54 Posts • 15K views
PSV APPARAO
590 views 6 days ago
#తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 2025 #తిరుమల వేంకటేశుని వైభవం #తిరుమల వైభవం #తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలుకి ప్రత్యేకంగా శ్రీవిల్లి పుత్తూరు నుండి మాలలు 💮💐🙏 #టీటీడీ.. సమాచారం 👆 *తిరుమల శ్రీవారికి శ్రీవిల్లి పుత్తూరు మాలలు* తిరుమల, 2025 సెప్టెంబర్ 27: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవిమాలలు శనివారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద గ‌ల‌ శ్రీ పెద్దజీయ‌ర్‌ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత‌రం ఆలయ మాడవీధుల గుండా మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. *రెండు కుటుంబాల వారీగా ఆండాళ్ మరియు శిఖామణి మాలలు :* ఆండాళ్ మాల – మాల అని కూడా పిలువబడే రెండు శిఖామణి దండలు పెద్ద బుట్టలలో ఉంచి, తిరుపతికి 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరుకు చెందిన రెండు కుటుంబాల పూల తయారీదారులు సమర్పిస్తున్నారు. *భూదేవి అవతారం గోదాదేవి* శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్‌ పుష్పకైంకర్యం చేసేవార‌ని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేవార‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్‌ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించార‌ని పురాణ క‌థ‌నం. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని భావిస్తారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు దేవాదాయశాఖ జాయింట్ మారియప్పన్, ఈవో శ్రీ చక్కరై అమ్మాళ్ శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, శ్రీవిల్లిపుత్తూరు ఆల‌య స్థానాచార్యులు శ్రీ రమేష్ రంగరాజన్, త‌దిత‌రులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
7 likes
10 shares
PSV APPARAO
516 views 6 days ago
#అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి బ్రహ్మోత్సవాలు #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 #తిరుమల వేంకటేశుని వైభవం #తిరుమల వైభవం #తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు 🙏క‌ల్ప‌వృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ మలయప్ప క‌టాక్షం 🙏 తిరుమల, 2025 సెప్టెంబరు: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శ‌నివారం ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో క‌ల్ప‌వృక్ష వాహనంపై భక్తులకు క‌టాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. *క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఐహిక ఫ‌ల ప్రాప్తి* క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీ‌వారు ద‌ర్శ‌న‌మిచ్చారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స‌ర్వ‌భూపాల వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు. వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,  ప‌లువురు బోర్డు స‌భ్యులు, సివిఎస్వో శ్రీ ముర‌ళికృష్ణ‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.
16 likes
11 shares
PSV APPARAO
478 views 7 days ago
#తిరుమల శ్రీ వేంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు 🕉️ శ్రీవారి వాహన సేవలు🔯 భక్తీ ముక్తిదాయకం 🙏 #ముత్యపు పందిరి వాహనం పై కాళీయ మర్ధనుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప స్వామి🙏 #తిరుమల వేంకటేశుని వైభవం #తిరుమల వైభవం #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS 👆 *ముత్యపు పందిరి వాహనంపై కాళీయ మర్ధనుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప* తిరుమల, 2025 సెప్టెంబరు 26: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శుక్ర‌వారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి కాళీయ మర్ధనుడి అలంకారంలో  దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు స్వామివారిని వాహ‌న‌సేవ‌లో ద‌ర్శించుకున్నారు. *ముత్యపుపందిరి వాహనం* శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది. వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ మురళి కృష్ణ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
11 likes
14 shares
PSV APPARAO
620 views 10 days ago
#తిరుమల వైభవం: తిరుమల శ్రీవారి దివ్య ఆభరణాలు #తిరుమల వేంకటేశుని వైభవం #తిరుమల వైభవం #తిరుమల వేంకటేశ్వర స్వామి వైభవం 👆 *శ్రీవారికి అష్టలక్ష్మీ చంద్రవంక కంఠి విరాళం* తిరుమల, 2025 సెప్టెంబర్ 23: తెలంగాణ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తిరుమల శ్రీవారికి రూ.60 లక్షలు విలువైన 535 గ్రాముల అష్టలక్ష్మీ చంద్రవంక కoఠి ని మంగళవారం విరాళంగా అందించారు. ఈ మేరకు ఆయన శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలకు ఆభరణాన్ని అందజేశారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
15 likes
5 shares