దీపావళి పండుగ ప్రాముఖ్యత🕍
గోపాల బాలుని మురళి రవళి ...జనపాళి ఎదమీటు తొలి జావళి! పాపల నరకుని పరిమార్చుకేళి లోకాన జరిగే దీపావళి!! సత్య సత్యయుద్ద రంగమందు ముందు కురికె పుడమిపట్టి మట్టు బెట్ట ధనువు ఎక్కు బెట్టె..ఎలనగవుతో హరి సత్యను చూచి మెచ్చికొనెను అలసిన అలివేణినంత గుచ్చి కౌగిలించెను క్రీడారసవర కేళిని కృష్ణుడు విహరించెను మెురకు వోని సుదర్శనము మెురటు నరకు ద్రుంచను తిరుగులేని సుదర్శనము శిరసునుత్తరించెను పాపాలు పండగా నరకుడస్తమించెను!! అమావాస్య చీకటులు అలముకొన్ననాడు జగమంతా దీపావళి జరుపుకొన్నన్నాడు పెనుచీకటి కవ్వల కనరాకుండిన జ్యోతి కోటీందు ప్రభుల వెలుగుకిదే నమస్కృతి!!!
#

దీపావళి పండుగ ప్రాముఖ్యత🕍

దీపావళి పండుగ ప్రాముఖ్యత🕍 - SUN V Core Cell - ShareChat
1.1k వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
#

దీపావళి పండుగ ప్రాముఖ్యత🕍

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ | దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే || దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలొ దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది. దీపాలపండుగ అయిన దీపావళి[1] రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వెేస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.
893 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post