🌾జాతీయ రైతు దినోత్సవం
అతడు అన్నదాత ఈ ప్రపంచానికే భుక్తి ప్రధాత.. వాడి చెమట చుక్కే పంటపొలాలకు ఔషధ మట.. ఎండకు వానకు జడవని వీర జవానతడు.. మట్టి తల్లి ని ముద్దాడిన ప్రేమ కిసాన్ అతడు.. వానకురిసినప్పుడు ఆనందంతో తడిసి ముద్దవుతాడు వాడు.. ఆ నీళ్లు తాగిన నేలమ్మ పసిడిపంటలు ఇస్తుంది చూడు.. నాగలి భుజాన పెట్టి, కొడవలి చేతపట్టి.. పుడమికి పచ్చనిరంగద్దే పరబ్రహ్మతడు.. పంటను కోసి తెచ్చి, ధాన్యం రాసి పోసి.. పళ్లెంలో అన్నం గా మార్చే పరంధాముడు.. సాయం కోసం ఆశించని వ్యవసాయదారుడు.. స్వేదం తోనే సేద్యం చేసే అపర భగీరథుడు.. ధాన్యం, కూరగాయలు, పండ్లు పాల ధారలు.. ఇవన్నీ వాడు చిందించిన నెత్తుటి ధారలు.. పిజ్జా, బర్గర్లు, బాస్మతి బిర్యానీ ముద్దలు.. పేద రైతు పెద్దోళ్లకు పెట్టిన గోరుముద్దలు.. వాడి కష్టాలు నిత్యం ఎగసే కడలి కెరటాలు.. అప్పు తీర్చడానికి ఆలి పుస్తెనైనా అమ్ముతాడు.. అవసరమైతే పట్నం సైతం వలసెలతాడు.. పరువు కోసం ప్రాణాలైనా వదిలేస్తాడు.. కానీ కష్టం వచ్చిందని క్రాప్ హాలిడే కూడా తీసుకోడు.. అందరికీ అన్నం పెట్టే అన్నదాత ఈ ప్రపంచానికే ప్రాణదాత.. #🌾జాతీయ రైతు దినోత్సవం
#

🌾జాతీయ రైతు దినోత్సవం

🌾జాతీయ రైతు దినోత్సవం - రైతు . . . మన్నించు అతని ఆవేదన ను రాయలేక అక్షరం ఆత్మహత్య చేసుకుంది అతని కష్టాన్ని చూడలేక పదం ప్రాణం కోల్పోయింది అతని వ్యధను వర్ణించలేక వాక్యం వేదనకు వేలాడింది . కలం కలతలపాలైంది కవి మది మాయమైంది ఏ పిచ్చోడన్నాడో అతన్ని రాజని దేశానికి వెన్నెముకని అతనెప్పుడూ ఆశలను మట్టిపాలు చేసుకుని నిరాశపాలై అప్పుల కుప్పపై నిలబడి చీడవురుగులకు హారమవుతున్న అల్పజీవే కదా . . . వరదలకు ఆశలను దళారులకు తన కూతురిని త్యాగం చేస్తున్న అతనికి రైతు దినోత్సవ శుభాకాంక్షలు ఇదేనయ్యా అర్భకమైనా ఈ కలం చేసేది అందుకు మన్నించు రైతు . . చీడ వురుగులకు కష్టాలను - ShareChat
119 వీక్షించారు
2 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post