మీ ఓటు మీ స్వచ్ఛమైన పాలన
ఆశీర్వదించిన ఆచార్యులకు అభివాదములు : ఆడారి కిషోర్ కుమార్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ముందంజ విశాఖపట్నం, మార్చి 22, 2019 (DNS Online): ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ నియోజక వర్గం ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించిన ఆచార్యులు, ఉపాధ్యాయులు అందరికీ అభ్యర్థి ఆడారి కిషోర్ కుమార్ అభివాదములు తెలియచేసారు. శుక్రవారం జరుగుతున్న ఈ ఎన్నికల తీరును ఆయన ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ప్రయిమరీ పాఠశాల కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వివిధ విభాగాల ప్రభుత్వ అధ్యాపకులు, ట్రైబల్ వెల్ఫేర్ టీచర్లు, ఫీజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఆంధ్ర విశ్వ విద్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాలలు, జూనియర్ కళాశాలలు తదితర ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి తనకు ఓటు వెయ్యడం జరిగిందన్నారు. విశాఖ నగరం తో పాటు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఓటింగ్ సజావుగా సాగుతోందని తన గెలుపు ఆశాజనకంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అంతకు ముందు గాజువాక, కేంద్రాన్ని కూడా ఆయన పరిశీలించారు. సంఘీభావం ప్రకటించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : తన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తనకు మద్దతు ప్రకటించిన మార్పు బాలకృష్ణమ్మ నాయకత్వంలో ఏర్పడిన ఎపిటిఎఫ్ (1938 )  అధ్యక్షులు కె. వెంకటేశ్వర రావు నేతృత్వంలోని సంఘం, బహుజన టీచర్స్ సంఘం, పీఆర్టీయూ, పిఈటీ ల సంఘం, పాలిటెక్నీక్ కళాశాలలు, ఐటిఐ, ఆంధ్ర యూనివర్సిటీ టీచర్ల సంఘం,  మోడల్ స్కూల్స్ టీచర్ల సంఘం, ప్రయివేట్, ట్రైబల్ వెల్ఫేర్ టీచర్ల సంఘం, తదితర అత్యధిక సభ్యులు కల్గిన ఉపాధ్యాయ సంఘాల సభ్యులందరికీ కిషోర్ కుమార్ ధన్యవాదములు తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తా : తనపై ఉపాధ్యాయ వర్గాలు పెట్టుకున్న నమ్మకాన్ని సంపూర్నంగా నెరవేరుస్తానని తెలిపారు. తానూ ఇచ్చిన హామీలను రూ.100 బాండు పేపర్ పై ప్రకటించి ఎన్నికల కమిషన్ కు ఒక ప్రతిని, మరొక ప్రతిని జిల్లా కలెక్టర్ - ఎన్నికల రిటర్ణింగ్  అధికారికి కూడా అందించినట్టు తెలిపారు.  లాంగ్వేజ్ పండిట్ ల అప్ గ్రేడ్ కోసం కృషి చేస్తానని, జిల్లా పరిషత్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లలో ప్లస్ 2 ను ప్రవేశ పెట్టేవిధంగా కృషి చేస్తాన్నన్నారు. తద్వారా అక్కడ పనిచేసే టీచర్లకు పదోన్నతులు లభిస్తాయన్నారు. ప్రతి ఒక్కరికి వైద్య సదుపాయం, జిల్లా కేంద్రాల్లో క్యాంటిన్ సదుపాయం, ఆర్ధిక వెసులుబాటు, ప్రోత్సాహం కొరకు మ్యూటువల్ ఎయిడెడ్ సొసైటీ ద్వారా సహకారం అందించే ఏర్పాటు చేస్తానన్నారు.  ఎన్నో ఏళ్లుగా వీరు ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యలకు ఆమోదయోగ్యమైన పరిష్కరాలను చూపిస్తానన్నారు.  1 . ఆర్థిక పరంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుదిబండగా మారిన  CPS విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా రద్దు చేసి, 1980 పెన్షన్ రూల్సుని CPS ఉద్యోగులకు యధాతధంగా అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు.   2 . రాష్ట్ర ప్రభుత్వం  2004 లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల లను CPS విధానంలోకి తీసుకు వస్తూ విడుదల చేసిన ఉత్తర్వులు GO MS no 653, 654,655 లను తక్షణమే రద్దు చేయాలన్నారు.  3 . ఉద్యోగి జీతంలోనుంచి తగ్గిస్తున్న 10% ను తక్షణమే ఆపాలని, ప్రతీ ఉద్యోగికి జిపిఎఫ్ అకౌంట్ ను ఓపెన్ చేయాలని డిమాండ్ చేసారు.  4 . రాష్ట్ర ప్రభుత్వం ఎన్ ఎస్ డి ఎల్  చేసుకున్న ఒప్పందం తక్షణమే రద్దు చేసుకోవాలని, ఇవి కాక మరే ఎటువంటి ప్రత్యమ్నాయలను  cps ఉద్యోగులకు న్యాయం చేయవన్నారు.  5 . తక్షణమే cps విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేసారు.  ప్రధానంగా సీపీఎస్ విధానం పాత విధానమే అందుబాటులోకి రావాలనే డిమాండ్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటాలకు తానూ అన్ని వేళలా మద్దతు ప్రకటించి, ప్రత్యక్షంగా నిరసనల్లో సైతం పాల్గొన్నట్టు తెలిపారు.
#

మీ ఓటు మీ స్వచ్ఛమైన పాలన

మీ ఓటు మీ స్వచ్ఛమైన పాలన - ShareChat
9k వీక్షించారు
8 నెలల క్రితం
#

మీ ఓటు మీ స్వచ్ఛమైన పాలన

169 వీక్షించారు
8 నెలల క్రితం
#

మీ ఓటు మీ స్వచ్ఛమైన పాలన

182 వీక్షించారు
8 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post