👆మీ ఓటే మీ ఆయుధం
#

👆మీ ఓటే మీ ఆయుధం

Sri(My Sweetest cute Sri)
#👆మీ ఓటే మీ ఆయుధం "గడ్డి నీలం రంగులో కదా ఉండేది?" అని ఒక గాడిద పులిని అడిగింది. దానికి పులి, "నీ మొహం! గడ్డి నీలం రంగులో ఉండడం ఏమిటి?.. ఆకుపచ్చ రంగులో ఉంటుంది" అని జవాబిచ్చింది.. గాడిద "ఏడ్చావులే! గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అని వాదించింది.. అలా అలా గాడిదకు పులికి వాగ్వివాదం పెరిగింది... ఎవరి మాట సరైందో తేల్చుకోవడానికి అవి రెండూ అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకొన్నాయి.... దట్టమైన అడవి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో సింహం హూందాగా కూర్చొని ఉంది. అక్కడికి చేరుకోగానే పులికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా గాడిద "వన రాజా! వన రాజా!... గడ్డి నీలం రంగులో కదా ఉండేది.. అవునా కాదా? మీరే చెప్పండి " అంది. "అవును! గడ్డి నీలం రంగులోనే ఉంటుంది" అంది సింహం అది విని గాడిద ఇంకా రెచ్చిపోతూ ... "చూడండి మహారాజా! అలా అని నేను ఎంత చెప్పినా ఈ పులి ఒప్పుకోవడం లేదు, అలా కాదని నాతో వాదిస్తుంది, దీనికి తగిన శిక్ష పడవలసిందే" అంది "అవును, పులికి తప్పకుండా శిక్ష పడవలసిందే.. పులిని ఒక సంవత్సరం పాటు జైలులో ఉంచండి!!" అని ఆదేశించింది సింహం పెల్లుబికిన ఉత్సాహంతో రంకెలేసుకుంటూ అడవంతా పరిగెత్తడం మొదలెట్టింది గాడిద .. పులి నీరసంగా సింహం దగ్గరకు వెళ్ళి " అదేమిటి మహారాజా! గడ్డి ఆకుపచ్చ రంగులో కదా ఉండేది?" అంది "అవును గడ్డి ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది!" అంది సింహం "మరి నాకెందుకు శిక్ష విధించారు మహారాజా?" అంది పులి దానికి సింహం "గడ్డి నీలం రంగులో ఉంటుందా? లేక ఆకుపచ్చ రంగులో ఉంటుందా? అనే విషయం గురించి నిన్ను శిక్షించడం జరగలేదు. బుద్ధిలేని ఒక గాడిదతో వాదించి, మరలా దానికి తీర్పు ఇవ్వమని నా దగ్గరకు వచ్చినందుకు నీకు శిక్ష పడింది.." అంది ☝నీతి - 2019 ఎన్నికలలో ఉత్తమమైన అభ్యర్ధులకే ఓటెయ్యండి.. గాడిదలతో వాగ్వివాదాలు పెట్టుకోకండి.. లేకపోతే ఐదేళ్ళు శిక్ష పడుతుంది..!
194 వీక్షించారు
11 నెలల క్రితం
#

👆మీ ఓటే మీ ఆయుధం

--------------------- ఓటర్ అనే నేను., శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడడానికి, ఒక #ఓటరు గా, నా కర్తవ్యమైన "ఓటు"ను శ్రద్దతో, అంతఃకరణ శుద్దితో, భయంగాని,పక్షపాతంగాని,రాగద్వేషాలు గాని లేకుండా, నోటుకు, మద్యానికి, కులానికి, మతానికి, సంక్షేమ పథకాల ఎరకు కూడా లొంగకుండా వివేచనా, విచక్షణా జ్ఞానంతో రాజ్యాంగం నాకు కల్పించిన అత్యద్భుతమైన అవకాశమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటానని రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నాను.💐💐 🙏🙏🙏
1.3k వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post