#రాధాకృష్ణ భట్ మనసులోని భావాలు #🙏శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు🙏 #🙏🏼🙏🏼శ్రీకృష్ణ జన్మాష్టమి 🙏🏼🙏🏼 #శ్రీకృష్ణ జన్మాష్టమి💐🎂 #శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు *కృష్ణ అంటే...*
కృష్ణ అంటే పరమాత్మ స్వరూపం!
కృష్ణ అంటే ఒక దేహం కాదు. కృష్ణ అంటే ఒక విగ్రహానికి పరిమితం కాదు. కృష్ణ అంటే ఒక కాలానికి పరిమితం కాదు. కృష్ణ అంటే ఒక ప్రదేశానికి పరిమితం కాదు. కృష్ణ అంటే ఒక చైతన్యం! సర్వ వ్యాప్తి, కాలాతీతుడు, శక్తిమంతుడు, ఐశ్వర్యవంతుడు, వ్యాకరణం, ఒక ఇంజనీర్, ఒక వైద్యుడు, ఒక న్యాయ మూర్తి, ఒక రైతు, ఒక కాపరి, ఒక సైన్యం, ఒక చక్రవర్తి, ఒక మార్గదర్శి, ఇంకా ఎన్నో ఆయనే....
ముఖ్యంగా ‘పరమాత్మనే నేను!’ అని చెప్పిన వాడు.
‘నేను అంతటా ఉన్న వాడిని నీలోని నాలోని ఉన్నది నేనే!’ అని చెప్పినవాడు. నేనే అంటే పరమాత్మే అని చెప్పినవాడు. ‘అర్జునా నేను అది తెలుసుకున్నాను నీవు తెలుసుకోలేదు, నీవు నేను ఒక్కటే! అది నీవు కూడా తెలుసుకో. అది జ్ఞానం ద్వారా దివ్య జ్ఞానం ద్వారా మాత్రమే. నీకు ఆ దివ్య జ్ఞానాన్ని తెలుపుతున్నాను.’ అని భగవద్గీతను అర్జునుడికి బోధిస్తున్నట్లు సర్వ మానవాళికి అందించిన ప్రేమ స్వరూపుడు.
కృష్ణ(పరమాత్మ స్వరూపం రూపం) అందరిలోనూ, అన్నిటిలోనూ, అంతటా వ్యాపించి ఉన్నవాడు. కృష్ణ అంటే కృషి చేయవాడు. అంటే వ్యవసాయం చేయువాడు. మన హృదయాలలో ఉన్న చీకటి అనే అజ్ఞాన మాలిన్యం తొలిగించి వెలుగు అనే జ్ఞానాన్ని ప్రకాశింప చేసేవాడు.
కృష్ణ అంటే చీకటి. నలుపు అందులోనుండి వచ్చిన వెలుగే ఈ ప్రకాశం.
ఎవరైతే తమలో ఉన్న నేను అనే అజ్ఞానాన్ని పార ద్రోలుకుంటారో వారిలో జ్ఞానమై తిష్ట వేసుకుని కూర్చుంటాడు.
కృష్ణడు పూజలకు, స్తోత్రాలకు, భజనలకు జపాలకు, కీర్తనలకు, ద్యానాలకు, తపస్సులుకి, దాన ధర్మాలకు, క్షేత్ర దర్శనాలకు లభ్యం కాడు. తాను చెప్పినది అర్థం చేసుకున్నవాడు, తాను చూపిన మార్గంలో నడిచిన వాడు, ఎవరైతే కర్మ చేస్తూ కర్మ మార్గంలో ఉంటూ నిష్కామ మార్గాన్ని అవలంబించి, నేను చేస్తున్నాను అన్న భావనని విడిచి పెడతారో, ఎవరైతే తన మార్గంలో ఉంటూ ఎవరైతే తమ హృదయాల్లో కోపం, ద్వేషం, అసూయ, డాంభికం, దర్పం, ఈర్ష్య, పగ ప్రతీకారం, గర్వం, అహంకారం మొదలగు మాలిన్యాలను లేకుండా ఉంటారో, ఎవరైతే అన్నిటిలోనూ, అందరిలోనూ, సర్వ జీవులలో, సర్వ జీవ జాతులలోనూ, పసుపక్ష్యాలలోనూ, సర్వ మానవాళిలోనూ తననే చూసుకుంటారో, నేను శరీరం కాదు ఆత్మ స్వరుపం అని తెలుసుకుంటారో, ఎవరైతే నిరంతరం ఆనంద స్వరూపంగా ఉంటారో ఇంకా ఉన్నాయి... వారికి కృష్ణుడు లభ్యం అవుతాడు.
ఆయన బాటలో నడుస్తూ భగవద్గీతా పఠనం చేద్దాం. మనం ఉద్ధరింపపడదాం.
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.*
మిత్రులకు , ఆత్మీయులకు , శ్రేయోభిలాషులకు
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు