🦚 Little krishna🪈
1K views • 2 months ago
(No.142)_ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
💞Rohit Rithika creations💞
🕺ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి
మేఘసందేశం మేఘసందేశం
💞Rohit Rithika creations💞
వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని
కడిమివోలే నిలిచానని
ఉరమని తరమని ఊసులతో
ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి
విన్న వేదన నా విరహ వేదన
ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా
మెరిసేటి ఓ మేఘమా
💞Rohit Rithika creations💞
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని
శిథిల జీవినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో
రుధిర భాష్పజల దారలతో
ఆ..ఆ..ఆ..ఆ
విన్నవించు నా చెలికి
మనోవేదన నా మరణయాతన
ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి
మేఘసందేశం మేఘసందేశం
ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి
మేఘసందేశం మేఘసందేశం
💞Rohit Rithika creations💞
చిత్రం : మేఘసందేశం (1982)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : కె.జె.ఏసుదాస్
#✨మ్యాజిక్ జంక్షన్✨ #🎧మ్యూజిక్ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #telugu songs lyrics #sad song
18 likes
9 shares

