కార్తీక దామోదరాయ నమః
37 Posts • 47K views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
642 views 2 months ago
#పూజలో ఎలాంటి విగ్రహాలుండాలి.......!! అనేక రకాల లోహాలతో తయారుచే సిన విగ్రహాలు చూస్తూవుంటాము. వాటిలో వేటిని పూజలో పెట్టుకో వచ్చు, వేటిని పూజించకూడదు అని కొన్ని సందేహాలొస్తూ వుంటాయి. అయితే, అందంగా వున్నాయి కదా అని మార్కెట్ లో దొరికే చెక్క విగ్రహాలు, మట్టి విగ్రహాలు నిత్య పూజకి వినియోగించ కూడదు. మరి మట్టి విగ్రహాలని గణపతి నపరాత్రులలో, దసరాలలో పూజిస్తాం కదా మరి నిత్య పూజలో ఎందుకు పెట్టుకోకూడదంటారా? మట్టి విగ్ర హాలకు పగుళ్ళు వస్తాయి కదా, మరి అలాంటివాటిని పూజించ కూడదు కదా. గణపతి నవరాత్రులలో, దస రాలలో కేవలం ఆ నవరాత్రులలో పూజించి తర్వాత ఉద్వాసన చెప్పి నిమ జ్జనం చేస్తారు కానీ, ఎక్కువకాలం పూజ చెయ్యరు కదా. బంగారం, వెండి, ఇత్తడి, కంచు లోహాలతో తయారయిన విగ్రహాలను పూజలో పెట్టవచ్చు. అయితే ఈ విగ్రహాలు చిన్నవిగా వుండాలి. రాగితో తయారు చేసినది కేవలం గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించవచ్చు. స్పటిక విగ్రహాలు విశేష ఫలితాన్నిస్తాయి కానీ అవి పగలకుండా చాలా జాగ్రత్త వహించాలి. అలాగే ఉగ్ర స్వరూపం వున్న విగ్రహాలను, చాలా తేజస్సుతో, భయంక రంగా వున్న విగ్రహాలను పూజించకూడదు. పూజాసమయంలో మన దృష్టి దానిమీద వున్నప్పుడు మనకు ప్రశాంతత తగ్గే అవకాశం వున్నది. చిన్ము ద్రతో, అభయ హస్తంతో ఆశీర్వదిస్తున్నట్లుండే విగ్రహాలను పూజిస్తే మనం నమస్కారం చేసి కళ్ళు తెరవగానే ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు, మనవంక శాంతంగా, చిరునవ్వుతో చూస్తున్నట్లు వుంటే మనకి ఎనలేని ప్రశాంతత,ఎక్కడలేని ధైర్యం లభిస్తాయి. అంతకన్నా మన పూజకి పర మార్ధం ఏముంటుంది. 🌼☘️🌹🌻🍃🌺🌸🌷🌹🌻 #తెలుసుకుందాం #కార్తీక దామోదరాయ నమః #om Arunachala siva🙏 #శ్రీవిష్ణు రూపాయ నమః శివాయ #🕉️హర హర మహాదేవ 🔱
10 likes
10 shares
🌟 కార్తీక మాసం చివరి రోజు దేవాలయానికి వెళ్లడం – మహా పుణ్యప్రదం 🔱 1. కార్తీక వ్రతం ఫలితం రెట్టింపు అవుతుంది కార్తీక మాసం మొత్తానికి చేసే 🕯️ దీపారాధన 🌿 తులసి పూజ 🙏 శివార్చన ఈ రోజుతో పూర్తవుతుంది. దేవాలయానికి వెళ్లితే ✨ వ్రతం సంపూర్ణ ఫలం వస్తుంది. 🕉️ 2. శివుని కరుణ నేరుగా అందుతుంది కార్తీకం అంటే శివుడికి అత్యంత ప్రియమైన మాసం. ఆఖరి రోజు ఆలయ దర్శనం చేస్తే 🔱 “సంవత్సరం మొత్తం రక్షణ” 🙏 “కుటుంబ శాంతి” 🩶 “ఆరోగ్య ఆశీర్వాదం” లభిస్తాయని శివ పురాణం చెప్పుతుంది. 🌿 3. పాపపరిహారం – పాత కర్మలు కరిగిపోవడం ఈ రోజున స్వామి దర్శనం చేస్తే 🔥 మునుపటి పాపాలు, బాధలు, దోషాలు తగ్గుతాయి. ఇది దీపసమర్పణ పుణ్య సమాప్తి రోజు కాబట్టి 🕯️ ఒక్క చూపు స్వామివారి దృష్టి పడితే చాలు ➡️ మనసు తేలిక అవుతుంది ➡️ ఇంట్లో శుభం పెరుగుతుంది. 🌸 4. దంపతులకు ప్రత్యేక మంగళం ఈ రోజు దేవాలయానికి కలిసి వెళ్ళిన దంపతులకు 👩‍❤️‍👨 సౌహార్దం 🍼 సంతాన భాగ్యం 💛 కుటుంబ శాంతి కలుగుతాయని పురాణాల్లో స్పష్టంగా ఉంది. 🙌 5. కోరికలు తీర్చే ఉత్తమ దినం కార్తీకం చివరి రోజును ✨ కోరికలు నెరవేర్చే దేవ దర్శన దినం అంటారు. ఇప్పటి వరకు మనసులో పెట్టుకున్న 📌 ఉద్యోగం 📌 ఆరోగ్యం 📌 కుటుంబ సమస్యలు ఏవైనా ఉన్నా — ఈ రోజు ప్రార్థన చేస్తే 🙏 శుభ ఫలితం త్వరగా వస్తుంది. 🌼 6. దీపారాధన ఫలితాలు దేవాలయంలో రెట్టింపు దేవాలయంలో వెలిగించే ఒక్క దీపం కూడా 🕯️ ఇంట్లో 100 దీపాలు వెలిగించిన ఫలితంతో సమానం అని అగ్నిపురాణం చెబుతుంది. కాబట్టి ఆలయంలో 🕯️ గర్భగుడి ముందు 🌿 తులసి వద్ద 🌸 నందీ వద్ద ఒక్క దీపం పెట్టడం అత్యంత శుభం. 🪔 7. పితృశాంతి – ఇంటి శుభాంశాలు పెరుగుదల ఈ రోజు ఆలయ దర్శనం చేస్తే 👼 పితృదేవతల ఆశీర్వాదం 🏠 ఇంట్లో శాంతి 💰 ఆర్థిక శ్రేయస్సు పెరుగుతాయి. 🧘‍♀️ 8. మనసు ప్రశాంతం – నెగటివిటీ తొలగింపు దేవాలయ శబ్దం, ఘంటారావం, నైవేద్య ధూప సువాసనలు ✨ మనసులోని నెగటివ్ ఎనర్జీ ని తొలగిస్తాయి. ఇది సంవత్సరంలో అత్యంత పవిత్ర వాతావరణం. 🪔 సింపుల్ గా చెప్పాలంటే “కార్తీక మాసం చివరి రోజున దేవాలయంలో ఒకసారి స్వామి చూపు పడితే— అది వచ్చే సంవత్సరం మొత్తం మనకు కాపాడే ఆశీర్వాదం అవుతుంది.” #కార్తీక దామోదరాయ నమః #శ్రీవిష్ణు రూపాయ నమః శివాయ #om Arunachala siva🙏 #🙏ఓం నమః శివాయ🙏ૐ #🛕శివాలయ దర్శనం
11 likes
14 shares
భగవద్గీత పారాయణవల్ల కొన్ని ఫలాలు కలుగుతాయని చెపుతారు. ఇవి అందులో ఉండే విషయాలను అర్థం చేసుకోవడం వల్ల కలిగేవి కావు. నియమంతో పారాయణ చేస్తే దావివల్ల పాపాలు పోయి పుణ్యం కలగడంవల్ల కలుగుతాయి. ఇవి వాటి వివరాలు. భగవద్గీత అధ్యాయాల పారాయణ ఫలాలు: 1. అర్జునవిషాదయోగం – దీన్ని చదవడంవల్ల మానవుడికి పూర్వ జన్మస్మృతి కలుగుతుంది. 2. సాంఖ్యయోగం - దీని వల్ల ఆత్మన్వరూపం గోచరిస్తుంది. 3 కర్మయోగం – దీన్ని ఎవరైనా -పారాయణం చేస్తే, ఆత్మహత్య వగైరాల ఎల్ల చనిపోయి, ప్రేతత్వం పోకుండా ఉండే జీవులక్కడ ఉంటే వారికి ప్రేతత్వం నశిస్తుంది. 4–5. జ్ఞానయోగం – కర్మసన్న్యానయోగం - ఈ అధ్యాయాలు వింటే చెట్లు, పశువులు, పక్షులు గూడ పాపం నశించి, ఉత్తమగతిని పొందుతాయి. 6. ఆత్మసంయమయోగం – పారాయణచేస్తే సమన్త దానాల ఫలితం కలిగి విష్ణుసాయుజ్యం కలుగుతుంది. 7. విజ్ఞానయోగం – ఈ అధ్యాయాన్ని వింటే జన్మరాహిత్యం కలుగుతుంది. 8. అక్షరపరబ్రహ్మయోగం – ఈ అధ్యాయం వింటే స్థావరత్వం, బ్రహ్మరాక్షనత్వం తొలగిపోతాయి. 9. రాజవిద్యా రాజగుహ్యయోగం - దీన్ని చదివితే ఇతరుల దగ్గర ఏదైనా వస్తువు తీసుకున్నందువల్ల మనకు వారినుంచి సంక్రమించిన పాపం నశిస్తుంది. 10. విభూతియోగం - ఆశ్రమధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏపుణ్యం కలుగుతుందో అది లభిస్తుంది. జ్ఞానం బాగా ఏర్పడుతుంది. 11. విశ్వరూప సందర్శనయోగం - దీన్ని పారాయణం చేయడంవల్ల చనిపోయిన వారు కూడా తిరిగి జీవిస్తారు. 12. భక్తియోగం - దీనివల్ల ఇష్టదేవతా సాక్షాత్కారం కలుగుతుంది. చనిపోయిన వారు కూడా దీనివల్ల బ్రతుకుతారు. 13. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం - దీన్ని పారాయణం చేస్తే చండాలత్వం వశిస్తుంది. 14. గుణత్రయ విభాగయోగం - దీనివల్ల స్త్రీహత్యాపాతకం, వ్యభిచారదోషం నశిస్తాయి. 15. పురుషోత్తమ ప్రాప్తియోగం - ఇది భోజనానికి ముందు చదవతగింది. దీనివల్ల ఆహారశుద్ధి కలుగుతుంది. మోక్షం సిద్ధిస్తుంది. 16. దైవాసుర సంపద్విభాగయోగం - దీనివల్ల బలపరాక్రమాలు, నుఖం లభిస్తాయి 17. శ్రద్ధాత్రయవిభాగయోగం - దీనివల్ల ఎన్నో తీవ్రమైన వ్యాధులు నశిస్తాయి. 18 మోక్షసన్న్యానయోగం - దీనివల్ల సమస్త యజ్ఞాచరణఫలం కలుగుతుంది. ఉద్యోగం లభిస్తుంది. కృష్ణం వందే జగద్గురుం 🙏 #తెలుసుకుందాం #కార్తీక దామోదరాయ నమః #భగవద్గీత🙏 #🙏🏼భగవద్గీత #🙏కృష్ణం వందే జగద్గురుమ్🙏
24 likes
19 shares