🪔శ్రీ దక్షిణామూర్తి స్వామి🕉️🚩
69 Posts • 1K views
nvs subramanyam sharma
720 views 9 days ago
🌼🌿దక్షిణామూర్తి స్వరూపం🌼🌿 "దక్షిణామూర్తి" విగ్రహాన్ని పరిశీలిస్తే "కుడిచెవి"కి "మకరకుండలం"... ఎడమ చెవికి "తాటంకం' అలంకారాలుగా కనిపిస్తాయి. "మకరకుండలం" పురుషుల శ్రవణాలంకారం. "తాటంకం" స్త్రీల అలంకృతి... దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది "శివశక్తుల" సమైక్య రూపమేనని తెలియజేస్తాయి... ఈ రెండు అలంకారాలు. సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే... ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా.. ఈ విషయాన్నే "లలితాసహస్రం"లో దక్షిణామూర్తి రూపిణీ సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ" అని వివరిస్తోంది. స్వామి ఉత్తరాభిముఖులై ఉంటారు. ఉత్తరం జ్ఞానదశ.... ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి.... వెనుక భాగాన ( పృష్ట భాగాన ) దక్షిణ దిశ. అంటే యమ (మృత్యు) దిశ. దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో... వారు యముని ( మృత్యువుని ) చూడరు. యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు 'నిఘా', వేస్తుంది. ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి' యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి దక్షిణ' అంటే 'దాక్షిణ్య భావం'. ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనం అవుతుందో ఆ 'దయ'ను 'దాక్షిణ్యం' అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం)... భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే... "దక్షిణామూర్తి" అన్ని దుఃఖాలకీ కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖ విమోచనం. ఆ అజ్ఞానాన్ని (అవిద్యను) తొలగించే...జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే "దక్షిణామూర్తి" గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ:🙏 "దక్షిణామూర్తి" సకల జగద్గురు మూర్తి కనుక స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. ఐహికంగా బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను ఆనుగ్రహించే ఈ స్వామి... పారమార్థికంగా తత్త్వ జ్ఞానాన్ని ప్రసాదించే దైవం. . #☀️శుభ మధ్యాహ్నం #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🪔శ్రీ దక్షిణామూర్తి స్వామి...🕉️ #🪔శ్రీ దక్షిణామూర్తి స్వామి🕉️🚩
14 likes
16 shares
Rochish Sharma Nandamuru
973 views 16 days ago
శ్రీ దక్షిణామూర్తి ద్వాదశ నామ స్తోత్రం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిథయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః ప్రథమం దక్షిణామూర్తి నామ ద్వితీయం వీరాసనస్థితం తృతీయం వటవృక్షనివాసంచ చతుర్ధం సనకసనందనాదిసన్నుతం పంచమం నిగమాగమనుతంచ షష్ఠం బ్రహ్మజ్ఞానప్రదం సప్తమం అక్షమాలాధరంశ్చ అష్టమం చిన్ముద్రముద్రం నవమం భవరోగభేషజంశ్చ దశమంకైవల్యప్రదం ఏకాదశం భాషాసూత్రప్రదంశ్చ ద్వాదశం మేధార్ణవం || సర్వం శ్రీ మేధాదక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు 🌿🌼🙏ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః🙏🌼🌿 #☀️శుభ మధ్యాహ్నం #🌷గురువారం స్పెషల్ విషెస్ #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🪔శ్రీ దక్షిణామూర్తి స్వామి...🕉️ #🪔శ్రీ దక్షిణామూర్తి స్వామి🕉️🚩
24 likes
17 shares