👆ఏపీ ఎన్నికల వివరాలు
#

👆ఏపీ ఎన్నికల వివరాలు

246 వీక్షించారు
9 నెలల క్రితం
#

ఏపీ ఎన్నికల వివరాలు

ఏపీ నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తులు కోట్లలో ఉన్నాయి. బాలయ్య చిన్నల్లుడు భరత్ ఆస్తుల విలువ రూ.190 కోట్లు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి రఘు రామ కృష్ణ రాజు ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. హైలైట్స్ ఏపీ నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తులు కోట్లలో ఉన్నాయి. బాలయ్య చిన్నల్లుడు భరత్ ఆస్తుల విలువ రూ.190 కోట్లు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి రఘు రామ కృష్ణ రాజు ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ నుంచి వందల కోట్ల ఆస్తులున్న అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ విశాఖ నుంచి టీడీపీ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.200 కోట్ల పైమాటే. నర్సాపురం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న రఘురామ కృష్ణ రాజుకు రూ.300 కోట్లకుపైగా ఆస్తులున్నాయి. 2014-15లో భరత్ వార్షికాదాయం రూ.5 లక్షలు కాగా.. 2018-19 నాటికి ఆయన వార్షికాదాయం రూ.23 లక్షలకు చేరింది. ఆయన భార్య తేజస్విని వార్షికాదాయం 2014-15లో రూ.10 లక్షలు ఉండగా.. 2018-19 నాటికి అది రూ.57 లక్షలకు చేరింది. భరత్‌‌కు గుర్గావ్‌లో ఫామ్ హౌస్ సహా రూ.190 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య పేరిట రూ.27 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. సిద్దేశ్వర్ పవర్ జనరేషన్, వీబీసీ రెన్యూవబుల్ ఎనర్జీ, నేచురల్ శాండ్స్, బసిల్ ఇన్‌ఫ్రా.. తదితర సంస్థల్లో భరత్ రూ.5.52 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. ఆయన భార్య తేజస్వినికి మెడ్‌విన్‌లో కంపెనీలున్నాయి. ఆమె దగ్గర ఉన్న బంగారం, వెండి, వజ్రాభరణాలు, బ్యాంకు డిపాజిట్ల విలువ రూ.7.26 కోట్లు. భరత్-తేజస్విని దంపతులకు ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. ఆ పసివాడి పేరిట రూ.2.26 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ తరఫున నర్సాపురం లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న రఘు రామకృష్ణ రాజు, ఆయన భార్య పేరిట రూ.324 కోట్ల విలువైన స్థిరచరాస్తులు ఉన్నాయి. వీరికి రూ.101 కోట్ల మేర రుణాలున్నాయి. రాజంపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి, ఆయన భార్య ఆస్తులు రూ.67 కోట్లు ఉన్నాయి. ఇప్పటి దాకా నామినేషన్ వేసిన వారిలో.. అసెంబ్లీ బరిలో దిగుతున్న గౌతమ్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి దగ్గర కూడా భారీగా ఆస్తులున్నాయి
11k వీక్షించారు
10 నెలల క్రితం
పత్రికా ప్రకటన చిత్తూరు, మార్చి 21: చిత్తూరు ఎలక్షన్స్ ది బెస్ట్ ఎలక్షన్స్ గా అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పి.ఎస్.ప్రద్యుమ్న పేర్కొన్నారు.గురువారం స్థానిక జిల్లా సచివాలయంలో సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి ఆద్వర్యంలో జిల్లా నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకొనే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెట్టాలని తెలిపారు. నేడు సెక్టోరల్ అధికారులు పోలింగ్ స్టేషన్ లకు వెళ్లి మౌలిక వసతులను పరిశీలించాలన్నారు. సెక్టోరల్ అధికారులకు మరో విడత శిక్షణా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో విభిన్న ప్రతిభావంతులు నూటికి నూరు శాతం తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలని విభిన్న ప్రతిభావంతుల ఏ.డి.శ్రీధర్ రెడ్డి ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ.వి.ఎం ల రాoడమైజేషణ్ జరుగుతూ ఉందని చెప్పారు. ఈ సారి సార్వత్రిక ఎన్నికలు ఒకే విడతలో జరుగుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు. అబ్సర్వర్లు ఎన్నికలకు సంబంధించి ఏ విషయం గురించి అడిగిన అందుకు ఆర్.ఓ లు విపులంగా సమాదానాలను తెలియజేయాలన్నారు. జిల్లాలో ఏ పోలింగ్ స్టేషన్ లో కూడా సమస్య అనేది ఉత్పన్నం కాకూడదన్నారు.బ్యాంకులలో లక్ష రూపాయల లావాదేవీలు జరుగుతూ ఉంటే వాటి పై బ్యాంకు అధికారులు నిఘా ఉంచాలని తెలిపారు. 1950 కాల్ సెంటర్ ను అలాగే సి-విజిల్ యాప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీష ,జే.సి.2 కమల కుమారి ,డి.ఆర్.ఓ గంగాధర గౌడ్ ,జిల్లా స్థాయి ఎన్నికల నోడల్ అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.
#

ఏపీ ఎన్నికల వివరాలు

ఏపీ ఎన్నికల వివరాలు - ShareChat
9.6k వీక్షించారు
10 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post